మత్స్య మహా పురాణము
111 - భూగోళ వర్ణనారంభము
[ భగవ తత్వమును అంతర్యామిగా- కాలరూపునిగా - దేశ రూపునిగా - దేశ కాలో భయరూపునిగా ఉపాసించవల యును. వీనినే ఆధునికులు కేవలము ప్రకృతియందలి అంశములుగా Time, Space and Time-Space అను చున్నారు. కాల పరిమాణ వ్యవస్థయు-యుగ. మహాయుగ కల్పాది రూపములును ఆయా యుగములందుండెడి ధర్మాధర్మ ప్రవృత్తియును భగవంతుని కాలరూపునిగా ఉపాసించుటకు తోడుపడును.
భూగోళ వ్యవస్థ విజ్ఞానము. భగవానుని దేశ రూపునిగా ఉపాసించుటకు ఉపకరించును. జ్యోతిర్లోళ వ్యవస్థ విజ్ఞాసము భగవానుని దేశ కాలోభయరూపునిగా ఉపాసించుటకు సాయపడును. ఇది ఎరిగి పురాణములను చదువుట సార్థక మగు పని.
-అనువాదకుడు]
ఋషులు సూతు నిట్లడిగిరి: మత్స్య నారాయణుడు మనువునకు భువన విస్తారము ఎట్లు చెప్పేనో అది ఉన్నది ఉన్నట్లు ఏ మాత్రమును విడువక) మాకు తెలుపుము. అని ఆడుగ వారికి సూతు డిట్లు చెప్పెను: మత్స్యరూపుడగు విష్ణువు భానుపుత్రుడగు వైవస్వత మనువునకు భూమండల(స్వరూపమును సముద్రములతో ద్వీపములతో కూడిన భూగోళ స్వరూ పమును దాని వివరణమును) తెలి పెను. ముని పుంగవులారా! ఆదియంతయు చెప్పెదను; వినుడు. నేను భూగోళ విషయమును మీకు చెప్పగోరి మొదట దేవేశ్వరుడును విశ్వేశ్వరుడును కారణరూపుడును నగు విష్ణుని దోసిలియొగ్గి నమస్కరించి చెప్ప నారంభింతును.
మనువు మత్స్య నిట్లడిగెను: భగవన్! భూమండలమునుగూర్చి విస్తరముగా వినగోరుచున్నాను. దాని విస్తా రము (వైశాల్యము)ఎంత? ద్వీపములు ఎన్ని ? సముద్రములు ఎన్ని ? దానియందు మేరువు ఎట్లున్నది? కేశవా! ఇది యంతయు నాకు తెలుపుము. ఆన శ్రీమత్స్య డిట్లు చెప్పెను. భూమండల(స్వరూపమును (దానియందుగల) సప్త ద్వీప ముల(విషయమును సప్త సముద్రముల(విషయమును యథాతథముగా చెప్పెదను, ధరాతలము ఏబదికోట్ల యోజనముల
విస్తారము కలది. అది సప్త సముద్రములతో సప్త ద్వీపములతో ఆవరింపబడియున్నది. లవణేకు సురాసరిగ్గధి క్షీర జల సముద్రములు ఏడు. జంబూ ప్లక్ష శాల్మలీ కుశ క్రౌంచ శాక పుష్కర ద్వీపములు ఏడు.
ఏబదికోట్ల చదరపు యోజనములు=32000000000000000 చదరపు (బ్రిటిషు) గజములు.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున భూగోళ వర్ణనారంభమను నూట వదునొకండవ అధ్యాయము.
Summary of chapter 112 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya describes the various elevated spiritual realms attained by devotees according to their level of devotional absorption and righteous deeds performed at Prayāga. Bhagavān Matsya details how those who perform regular worship and charity attain the realm of the Vasus, Rudras, or Ādityas, while those who maintain lifelong devotion and die within Prayāga achieve Sālokya liberation, residing in the divine realm of Bhagavān Vishṇu. The text emphasizes that the spiritual rewards earned at Prayāga are permanent and imperishable, elevating the soul above the transient cycles of material existence.