మత్స్య మహా పురాణము
267 - వాస్తు శాంతి
ఎల్లరకును బంగారమును బ్రాహ్మణున(ల)కు పాడియవును ఈయవలయును. రాక్షసీజనమునకు . ఎటువంటి బలినీయవలయునో తేలి పెదను వినుము; 1. ఈశానదిశ యందలి 'చరకి'కి మాంసాన్న మును నేతిని పద్మకేసర మును రక్తమును 2. ఆగ్నేయమునందలి విదారి'కి మత్స్యాన్న మును రక్తమును హరి దాన్న మును 3. నైరృతమునందలి 'పూతన'కు దధ్యన్న మును రక్తమును ఆస్థి ఖండములను 4. వాయవ్యమందలి 'పాపరాక్షసి'కి మత్స్యమాంసమును. సురాజఓసవమునుగాని పాయసమునుగానీ ఆయా దేవతల నామముల నుచ్చరించుచు (ఆ నామమును చతుర్థీ వీథ క్యంతముగా మార్చి) ప్రణవాదిగా 'నమః' శబ్దము చివరకు వచ్చునట్లుగా పలుకుచు ఈయవలెను; తరువాత యజమానుడు. నర్వౌషదీ స్నానమును జరిపించుకొనవలయును; ద్విజులను ఇంటికి వచ్చిన ఇతరులను భక్తితో సంపూజించవలయును; ఈ విధమగు 'వాస్తు శాంతిని' జరిపిన తరువాతనే గృహ ప్రాసాదాది నిర్మాణాది కార్యము నారంభించవలయును.
ప్రాసాదములు భవనములు ఉద్యానములు ఆరంభము చేయునపుడును ముగించునపుడును పురప్రవేశాదులందును. సర్వదోష పరిహారమునకై రక్షోఘ్న (రాక్షస బాధానివారకమగు) పవమానసూక్త పారాయణముతో కూడ - భవ నాది నిర్మాణ జీర్ణోద్ధారాది కార్యములనుద్దేశించి నృత్య మంగళ వాద్యాదికము జరుపవలయును; బ్రాహ్మణులచే న్వ స్తివాచనము. జరిపించవలయును; దీని నెరిగి ప్రతి సంవత్సరమందును ఈ విధానముతో గృహమందుగాని దేవాలయమునందుగాని వాస్తు కొంతిని జరిపించుకొను వానికి దుఃఖములు ఏవియు కలుగవు. అతనికి వ్యాధి భయ-బంధు జనక్షయములు కలుగవు; అతడు సమగ్రముగ నూరేండ్లు జీవించును; కల్పకాలముస్వర్గసుఖమందును.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున వాస్తు శాంతి విధానమను రెండు వందల ఆరువది ఏడవ అధ్యాయము.
Summary of chapter 267 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya details the elaborate ceremonial bathing procedures known as Snāpanādhivāsana conducted during major temple consecrations and annual festivals. Bhagavān Matsya specifies using one hundred and eight consecrated pots filled with river water, herbal extracts, fruit juices, milk, curd, honey, sugar, ghee, sandalwood paste, and water infused with sacred gems and flowers. Priests chant Vedic hymns from the Ṛg, Yajur, and Sāma Vedas while bathing the installed Deity, purifying the temple environment, warding off negative forces, and bestowing divine blessings upon the surrounding community.