మత్స్య మహా పురాణము
24 - బుధోత్పత్తి - పురూరవో - రజి - యయాతి వృత్తాంతములు
సూతుడు ఋషులతో ఇంకను ఈ విధముగా చెప్పెను: సంవత్సరము గడచిన తరువాత తారా గర్భము నుండి కుమారుడు జనించెను. అతడు పండెండు మంది ఆదిత్యుల తేజస్సులను పోలిన తేజస్సుతో దీపించుచుండెను. దివ్యమగు పీతాంబరమును ధరించియుండెను. దివ్యములగు ఆభరణములతో అలంకరించుకొని యుండెను. రూపమునందు చంద్రుని పోలియుండెను.
అతడు అర్థ శాస్త్రమును సమగముగా ఎరిగినవాడు. చాల బుద్ధిశాలి. సర్వశాస్త్రములను ప్రవర్తిల్లజేసినవాడు. రాజ పుత్రీయము అను పేరున సిద్దమయియున్న గజ వైద్యశాస్త్రము ఈ తారా పుత్త్రడు పవరిల్లజేసినదే. సోమునకు (చంద్రునకు) రాజు అనియు పేరుగలదు. చంద్రుని కుమారుడగుటచే ఇతడు రాజపుత్రుడు. అతడు పవ రిల్లజేసిన శాస్త్రము కనుక రాజ పుత్రీయము అని దానికి పేరు వచ్చెను. సర్వశాస్త్రముల నెరిగిన పండితుడు కావున బుధుడని అతనికి పేరు ప్రసిద్ధమయ్యెను.
అతడు పుట్టుక తోనే లోకములందలి సకల తేజస్సులను తన తేజస్సుతో జయించువాడును బలశాలియు నయి యుండెను. ఈతని జనన సమయమున బ్రహ్మదేవుడును దేవతలును దేవ ఋషులును బృహస్పతి గృహమునకు వచ్చిరి. అచ్చట వారందరును పుట్టిన కుమారునకు జాత కర్మమును జరుపుటకు పూనుకొనిరి. ఆ దేవతలందరును ఈ కుమారుడు ఎవరి వలన కలిగినవాడు ? అని తారను అడిగిరి. ఆమె సిగ్గుపడి ఏమియు మాటాడక యూర కుండెను. వారును మరల మరల అదే ప్రశ్నము నడుగసాగిరి. ఆ ఉత్త్రమాంగన సిగ్గుపడుచు చందుని కుమారుడే అని చాల సేపటి తరువాత సమాధానము ఆచ్చెను. అంతట ఆ కుమారుని చందుండు తీసికొనెను. అతడు ఆతనికి బుధుడు అని నామకరణము చేనేను. భూలోకమునందు రాజ్యమును కూడ ఇచ్చెను. తరువాత అతనిని యువరాజునుగా చేసి అభి షేకము జరిపెను.
తరువాత బహ్మ బహరులతో కూడి ఆలోచించి బుధునకు గృహత్వమును ఇచ్చి సర్వ లోక ములును చూచుచుండ ఆచ్చటనే అంతర్ధానమునందెను.
బుధునకు లోగడ తెలిపినట్లు ఇలాగర్భమున కుమారుడు కలిగేను. అతడు పురూరవసుడు అను పేర ప్రసిద్ధుడయి సర్వలోక జనుల నమస్కారములను అందుకొను వాడయ్యెను. తన ప్రతాపముతో అతడు సమగముగా నూరు అశ్వమేధ యాగములు చేసెను.
ఆ పురూరవుడు మనోహరమగు హిమవత్పర్వత శిఖరమునందు (తపస్సు చేసి) శ్రీ మహావిష్ణుని మెప్పించేను. జనార్దనుని వరపభావమున లోకేశ్వరుడయ్యెను. భూలోకమునందలి సప్త ద్వీపములకును అధిపతి అయ్యేను. ఈతడు కేశి మొదలగు కోట్లకొలదిగా రాక్షసులను చం పెను. ఆతని రూపమును చూచి మోహితురాలయి ఊర్వశి అతనికి భార్య అయ్యెను. అతడు సర్వలోక ములహితమును కోరి సప్త ద్వీపములతోను పర్వతములతో కాననముల (చిన్న అడవుల లేదా చెట్ల తోపుల) తోను కూడిన భూమిని అంతటిని ధర్మానుసారముగా పాలించేను. కీర్తి అతనికి వింజామరను పట్టి వీచెడి సేవిక గా ఒడలు పట్టెడి సేవకురాలుగా అయ్యెను. విష్ణుని అనుగ్రహ ప్రభావమున దేవేంద్రుడు అతనికి తన ఆర్గాసనమును ఇచ్చెను. ధర్మము అర్థము కామము అనెడి మూడు పురుషార్ధములను ధర్మానుసారము సమభావముతో అతడు పాలించేను. పూర్వము ఒకానొకప్పుడు ధర్మార్థ కామములకు మూవురకు ఈతడు మనలను ముగ్గురను ఎట్లు సమానముగా చూచుచున్నాడో పరీక్షింపవలెనని కుతూహలము కలిగెను. అందుచే వారు ఆతని నడువడిని తెలిసికొనగోరి ఆ పురూరవుని కడకు వచ్చిరి. రాజపుడు బంగారు తొడుగుతోను అలంకారములతోను కూడిన దివ్యములగు పీఠములను తెప్పించి వారిని వాటి పై కూర్చుండ బెటెను. భక్తి పూర్వకముగా అర్యము పాద్యము మొదలగు వానితో వారిని పూజిం చెను. వారిని పీఠముల పై కూర్చుండ బేటి పూజించుటలో ఆ రాజు ధర్మమునందు అధికము అగు భ కిని చూపేను. దానిచే కోపించి అరము నీవు లోభము చేత నశింతువు. అని పురూరవుని శపించెను. కామమును గంధమాదన పర్వతమున కుమార వనమునందు ఊర్వశితోడి వియోగము కారణముగా నీకు ఉన్మాదము కలుగును. అని అతనిని శపించెను. ధర్మము అతనితో ఇట్లు పలికెను : “నీవు దీర్ఘాయువవును ధార్మికుడవును అయ్యెదపు. నీ సంతానమును చంద్రార్క నక్షతములు ఉన్నంత వరకును నూరుల కొలదిగా వృద్ధి పొందుచుండును. అది ఎన్నటికీని భూలోకమునందు నశించదు. ఇట్లు పలికి ధర్మార్థ కామములు మూడును అంతర్థానము నందెను. ఆనాటి నుండియు ఆ పురూరవుడు రాజ్యమును ధర్మానుసారముగా అనుభవించెను.
రాజరాజగు ఆపురూరవుడు ప్రతి దినమునను స్వర్గమునకు పోయి దేవేంద్రుని దర్శించి వచ్చుచుండెడివాడు. అట్లు జరుగుచుండ ఒకనాడు ఆ రాజు దక్షిణాయన గతిలోనున్న సూర్యునితో పాటు దక్షిణపు ఆకాశ ముస సంచరించు చున్న తన రథమును ఆరోహించి పోవుచు దానవరాజగు కేశియను వాడు ఊర్వశిని చిత్రలేఖను కొని పోవుచుండుట చూచెను. బుధ పుత్రుడగు ఆపు రూరవసుడు ఇంద్రుని కూడ జయించియుండిన ఆ కేశి పై వాయ వ్యాస్త్రమును ప్రయోగించి వానీని జయించెను. ఇట్లతడు యుద్ధమున కేశి రాక్షసుని జయించి వానిని తన హ స్తముతో పట్టివే నేను. తరువాత ఆ రాజు ఊర్వశిని ఇంద్రునికి ఒప్పగించెను. ఈ కారణముగా ఆతడు ఇంద్రాది దేవతలతో మైతిని సంపాదించేను. ఆనాడు మొదలుకొని దేవేంద్రుడు పురూరవునితో మైత్రిని అంగీక రించుటయే కాక అతని పయి పీతి చెంది అతనికి సర్వ లోకాధికుడుగా నుండునట్లును బలమును సామర్థ్యమును యశస్సును ఐశ్వర్యమును శోభను భరతునిచే గానముచే కీ ర్తింప బడుటను వరముగా ఇచ్చెను. ఆ ఊర్వశియును నోటి నుండి పురూరవుని పూజ్యచరితమును పాడుచు ప్రీతి కలిగించు చుండెడిది. ఇట్లుండ ఒక నాడు దేవేంద్రుడు ఊర్వశీ మేనకా రంభలను భరతుడు రచించి ప్రవర్తిల్ల జేసిన లక్ష్మీ స్వయం వరమను నృత్య రూపకమును నృత్యమున నభినయించవలసినదిగా ఆజ్ఞాపించేను. ఆనృత్యాభినయ ప్రసంగములో ఊర్వశి లక్ష్మీ రూపము ధరించి లయను గుణముగా నాట్యము చేయుచుండెను. ఆమె పురూరవసుని చూచుచు నాట్యము చేయుచు కామపీడితురా లయ్యెను. ఈ హేతువుచే నా మే తనకు భరతుడు ఉపదేశించి యుండిన అభినయము అంతయు మరచెను. భరతుడును అందులకు కోపించి ఈ రాజుతోడి వియోగమున నీవు భూలోకమున మీగుల సన్నని తీగవై ఉండుమని ఊర్వశిని భూలోకమునందే ఊర్వశి తీగయె యున్న పరిసరములందే పిశాచమయియుండునని పురూ రవసుని శపించెను. వెంటనే ఊర్వశియును శాపానుసారము భూలోకమున శావకాలమంతయు లతగా నుండి చాల కాలము నకు శాపము తీరి ఆ పురూరవసుని తన పతిగా చేసి కొనెను. శాపావసానమున ఆమెకు పురూరపనునివలన ఎనమండు కుమారులు కలిగిరి. వారు ఆయువు దృఢాయువు ఆశ్వాయువు ధనాయువు ధృతిమతి శుచి శతాయువు అను వారు. వీరందరును వీర లును దివ్యములగు బలమును సామర్థ్యమును కలవారు. వీరిలో ఆయువు అనునతనికి నహుషుడు వృద్ధశర్మ రజీ-రసుడు విప్మా అను వారు కుమారులై రి. వారు ఐదుగురును మహారథులు అగు వీరులు. వారిలో రజికి నూరుగురు కుమారులు కలిగిరి వీరి కందరకును రాజేయులు అని ప్రసిద్ధి.
రజి పాపనాశకుడగు నారాయణుని ఆరాధించెను. అతని తపమునకు మెచ్చి నారాయణుడు ఆ మహీపతికి వరము నిచ్చెను. తత్పరిభావమున అతడు దేవతలను అసురులను కూడ జయించగలవాడయ్యెను.
ఇట్లుండ గొంత కాలమునకు దేవాసురులకు యుద్ధము సంభవించేను. అది మూడు నూరుల సంవత్సరములు ప్రవర్తిల్లెను. ప్రహ్లాదునకును ఇందునకును జరిగిన యుద్ధములో ఎంతకాలమునకును ఎవరికిని గెలుపు కలుగక యుద్దము సాగుచునే యుండెను. అపుడు దేవాసురులు ఇరువురును చతుర్ముఖునికడకు పోయి మాలో ఎవరికి గెలుపు కలుగునని ప్రశ్నించిరి. ఈ ఇక వురిలో ఎవరు జయింతురు అని చెప్పగలను? రజి జయించును. అని బహ్మ పలి కెను. దైత్యులు రజి కడకు పోయి నీవు మాకు సహాయుడపు కమ్ము. అని అతనిని ప్రార్థించిరి. జయించిన తరువాత నేను మీకు అధిపతిగా ఉండుటకు అంగీకరించిన చో నేను మీకు యుద్ధమున సాయము చేయుదునని రజి పలికెను. అది రాక్షసు లంగీరింపలేదు. దేవతలు అందులకు ఒప్పుకొనిరి సీపు యుద్ధమున మా శత్రువుల నశింపజేయుము. తరువాత నీవే మా అధిపతిఏ కమ్ము . అ దేవత లనిరి. ఆంతట రజి అంతవరకును వజపాణియగు దేవేంద్రునకును అవధ్యులుగా నుండిన రాక్షసులనందరను నశింపజేసెను. రజి తమకు చేసిన ఈ సాహాయ్యకృత్యమునకు మెచ్చి ఇందుండు తానతనికి కుమారుడుగా ఉండ సంగీకరించెను. అంత రజియును తన రాజ్యము నంతయు దేవేంద్రున కప్పగించి తాను తపస్సునకు పోయెను.
రజిపుత్తులు నూరుమందియు, సద్గుణములును బలమును కలవారు. వారు తమ తండ్రి తపోవనమునకు పోయిన తరువాత ఇంద్రుని వైభవమును యజ్ఞభాగమును కూడ హరించిరి. ఇట్లు రజిపుత్తులచేత విశేషముగా, బాధింపబడి ఇంద్రుడు రాజ్యభ్రష్టుడై పోయెను. అతడు తన గురువగు బృహస్పతి దగ్గరకు పోయేను. నేను రజిపుత్తులచేత మిగుల పీడింపబడియున్నాను. నాకిపుడు రాజ్యము లేదు. యజ్ఞభాగమును లేదు. అవి రెండును ఇప్పుడు రజి కుమారుల కే చెందియున్న వి. నీవు బుద్దిమంతులలో ఉత్త్రముడవు. నాకు మరల నారాజ్యము లభించుటకై యత్నము చేయ ప్రార్థించు చున్నాను. అని ఇంద్రుడు గురుని ప్రార్థించెను.
బృహస్పతి తన నీతి బలమునను మంత్రబలమునను ఇంద్రుని మరల బలదర్పితునిగా జే నెను. శాస్త్రవిధానము ననుసరించి ఆతడు గ్రహశాంతిని పౌష్టిక కర్మలను ఆచరించెను. అంతేకాక ఆ బృహస్పతి పోయి తన బుద్ధిబలమున రజిపుత్తులను మోహ పెట్టెను. వారి బుని నూర్చెను. దానిచే వారు వేదబాహ్యమగు అధర్మమును ఆశ్రయించిరి. ఇట్లు పండిత శ్రేష్ఠుడును వేదవే త్రయు అగు బృహస్పతి రాజేయులను వేద మార్గమునుండి పరిశ్రమలనుగా చేసెను. వారందరును వేద బాహ్యులుగా హేతువాదపరులుగా ఐరి. ఇది ఎరిగిన దేవేంద్రుడు ధర్మమార్గ బహిష్కృతులగు ఆ రజిపుత్రులనందరను చంపెను.
ఇక నహుషుని కుమారులను పేరుకొందును. వారు యతి యయాతి సంయాతి ఉద్బవుడు పాంచి సయాతి మేఘ సంయాతి అను వారేడుమంది. వీరు ధార్మికులును వంశవృద్ధికరులును. యతి అను నాతడు చిన్న తనమునందే యోగియే వానప్రస్థుడయ్యెను. యయాతి ధర్మమునకు తాను ఆశ్రయమై ధర్మమును తానాశ్రయించి రాజ్యమును పొలించేను. వృష పర్వుడను దానవరాజు కుమార్తెయగు శర్మిష్టయు శుక్రుని కూతురగు దేవయాని యు ఆతని భార్యలు. యయాతికి దేవయానివలన యదువు తుర్వసుడు అనువారును శర్మిష్టవలన ద్రుహ్యుడు అనువు పూనుడు ఆనువారును మొ త్త్రము ఐదు మంది కుమారులు కలిగిరి. వీరై దుమందిలోను యదువు పూరుడు అనువారు ఇద్దరును వంశవృద్ధికరు లయిరి.
నహుషపుత్రుడగు ఈ యయాతి రాజుగా సత్యపరాక్రముడై (ధర్మము మొదలగు సత్ర్పవృత్తులయందు పూనిక కలిగి) భూమిని పాలించేను. వివిధములగు యజ్ఞములతో దేవతల నారాధించేను. అతిభ క్తితో ప్రయతుడయి (శరీరమునందును చిత్త్రమునను శుచియై) పితరులను దేవతలను కూడ అర్చించేను. అటువలెనే ప్రజలను అందరను శత్రువులవలన ఓటమి నెరుగని ఆయయాతి దృఢ బుద్దితో పాలించేను.
ఇట్లు ఆ యయాతి ధర్మానుసారము ప్రజలను పాలించుచుండ మహా ఘోరమును సౌదర్యమును దేహ దార్థ్యమును నశింపజేయునదియు నగు వార్ధకము ఆతనిని ఆదేశించెను. ముసలితనము తను క్రమ్ముకొనగా నాతడు తన కుమారులగు యదుపూరుతుర్వసు ద్రుహ్య్వనువులను పిలిచి ఇట్లు పలికెను. “యౌవనముతో మీరు అనుభవించు కామ సుఖముల ననుభవింపవలెనను కోరికతో నున్నాను. కుమారులారా! నాకు ఈ విషయమున సాహాయ్యము చేయుడు.” అనగా దేవయానీ జ్యేష్ట కుమారుడగు యదువు-యావనముతో మేము మీకు చేయదగిన సాహాయ్యము ఏమి? అని ప్రశ్నించెను. యయాతి కుమారులతో ఇట్లు పలికెను. “నావార్ధకమును మీరు తీసికొనవలయును. మీ మౌవనముతో నేను విషయ సుఖములను అనుభవింతును. నేనింతవరకును దీర్చ సత్రయాగములు (దీర్ఘ కాలము దీక్ష వహించి ఆచరించ . వలసిన సత్రయాగములు) అనేకములు ఆచరించుచుండుటతోను శుక్ర మహాముని ఇచ్చిన శాపముతోను ఈ వయఃపరిణామము (ముసలితనము) కలిగినది. “ఐనను అది ఇంకను కామ సుఖములను కోరుచున్నది. నాయనా! నేను ఈ హేతువు తపించిపోవుచున్నాను. కనుక మీలో నేవరైన ఒకరు ఈ నా వార్ధకమును తన శరీరములో గ్రహించి స్వాధీనపరచుకొన వలెను. నేను సరికొత్త్ర శ రీరమును పొంది దానితో పడుచువాడనై కామములను అనుభవింతును.”
కాని యదువు మొదలగు కుమారులెవ్వరును తమ తండ్రియగు యయాతి యొక్క వార్ధకమును స్వీకరించలేదు. ఆ హేతువుచే ఆ రాజర్షి యదుతుర్వసు ద్రుహ్య్వనువులు అను నలుగురను శపించెను. అని పరంపరలో వినబడుచున్నది.
కాని వారిలో ఐదవ వాడగు పూరుడు సత్యవిక్రముడు (ధర్మ ప్రధానమగు ప్రవృత్తికి సత్యమని పేరు. దానియందు తన శక్తిని ప్రయోగించి ప్రవర్తిల్లు వాడు సత్య విక్రముడు.) కావున అంతట తన తండ్రితో “తండ్రి! నా అభినవ యౌవనమును నీవు తీసికొని సుఖములను అనుభవించుము. నీ ఆజ్ఞానుసారముగా నీవారక మును గ్రహించి నీ అనుమతితో రాజ పదమునందు నిలిచియుందును. (రాజ్యమును పాలించుచుందును,) అనేను.
పూరుడు ఇట్లు చెప్పగానే రాజర్షియగు యయాతి తన తపసామర్థ్య బలమును ఆధారముగా చేసికొని తన దేహమునందలి ముసలితనమును మహాత్ముడు (ఉన్నతమగు మనస్సు కలవాడు) అగు పూరుని శరీరమునందు వ్యాపింప జేసెను. పూరుని వయస్సును తాను గ్రహించి యౌవనమును పొందెను. యయాతినుండి గ్రహించిన వార్ధకముతో పూరుడు రాజ్యమును పాలించెను.
ఇట్లు వేల కొలది సంవత్సరములు గడచెను. మహా పరాక్రమ శాలియగు యయాతి కామ సుఖముల విషయమున తృప్తి పొందలేదేమో! అనున జై యుండి తన కుమారుడగు పూరునితో ఇట్లు పలికెను. “నేను నీ మూలముననే పుత్రులు కలవాడ నయితిని. నా వంక మును నిలు ) ఇమానుడవు నీవే. ఈ వంశమునకు లోకమున పౌరవవంశము అను ఖ్యాతి కలుగును.”
ఇట్లు పలికి ఆ రాజ శేష్టుడు పూరుని రాజ్యమున అభి షేకించేను. చాల కాలము జీవించి అతడు యయాతి కాల ధర్మము నందెను.
ముని శ్రేష్టులారా! ఇక మీదట పూరు వంశ మును మీకు వివరించి తెలుపుదును. వినుడు. భరత వంశమును వృద్ధి చేయు థారతులు అనబడు పాండవ కౌరవులు ఆవంశమునందే కదా జన్మించిరి!
ఇది శ్రీమత్స్యమహా పురాణమున మత్స్యమను సంవాదమున చంద్రవంశాను వర్ణనమున
బుధోత్ప తి మొదలగు వృత్తాంతములు అను ఇరువది నాలుగవ అధ్యాయము.
Summary of chapter 24 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya narrates the history of King Purūravas, the son of Budha and Ilā, who was renowned for his extraordinary beauty, valour, and generosity. Enchanted by his nobility, the celestial nymph Urvashī departed from Svarga to live with him on earth under three specific conditions regarding her pet rams and his physical appearance. They lived in profound marital happiness for sixty years until the Gandharvas, desiring Urvashī's return to heaven, stole her rams at night; when King Purūravas leaped out of bed in darkness to rescue them, a flash of lightning revealed his unclothed form, violating one of her conditions and causing Urvashī to instantly vanish. Heartbroken, King Purūravas wandered the earth until he reunited with her at Kurukshetra, where she granted him divine boon rituals to generate sacrificial fire using Araṇi wood, enabling him to attain the state of a Gandharva and be reunited with her permanently; from their union were born six heroic sons led by Āyu.