మత్స్య మహా పురాణము
81 - విశోక ద్వాదశీ వ్రతము - గుడ ధేన్వాదిదానములును
మనువు మత్స్యనారాయణుని ఇట్లడిగేను: ఇష్ట వియోగమువలన శోకము కలుగకుండ చేయునదియు కలిగిన అట్టి శోకమునుండి ప్రాణులనుద్దరించునదియు విభవములను కలిగించునదియు సంసార నాశకమునునగు ఉపవాస పూర్వకమగు వ్రత మేది? అనగా మత్యుడిట్లు చెప్పసాగెను. నీవడిగిన ఈ ప్రశ్నము జగత్రియము; దేవతలకును దుర్ణభము; గొప్పది; దేవ దానవ మానవులకును గుహ్యమగునది. ఐనను నీవు భక్తుడవు అడిగితివి కావున చేప్పేద ను. ఆశ్వయుజ మాసమున చేయు విశోక ద్వాదశీ వ్రతము ఇట్టి పుణ్యకరము.
దశమినాడు లఘు భోజనము చేసి సంప్రదాయమెరిగి. నియమముతో వ్రతమారంభించవలెను. ఏకాదశినాడు పలు దోముకొని స్నానాదికము నేర వేర్చి నిరాహారుడై ఉత్తరాముఖుడో ప్రాజ్ముఖుడో అయి కేశవుని లక్ష్మిని యథావిధిగ అర్చించి ద్వాదశినాడు పారణ చేయవలయును. ఎట్లన ద్వాదశినాడు ఉదయమున లేచి సర్వౌషధులతోను పంచగవ్య సహిత జలముతోను స్నానమాడి తెల్లని పుష్పములను వస్త్రములను ధరించి కలువపూలతో విష్ణునర్చించవలయును.
(పూజా మంత్రము:) 1. విశోకాయనమః పాదౌ పూజయామి; 1. . వరదాయనమః జంఘే పూజయామి ; 8. శ్రీశాయనమః జానునీ పూజయామి; 4. జలశాయినేనమః - ఊరూ పూజయామి; 5. కందరాయనమః-గుహ్యం పూజ యామి; 6. మాధవాయనమః కటిం పూజయామి; 7. దామోదరాయనమః ఉదరం పూజయామి; 8. విపులాయ నమః పార్శ్వే పూజయామీ; 9. పద్మనాభాయనమః నాభిం పూజయామి; 10. మన్మథాయనమః హృదయం పూజయామి; 11. శ్రీధరాయనమః,వక్షః పూజయామి; 12. మధుభిదేనమః కరౌ పూజయామి; 18. చ కిణేనమః.వామబాహుం పూజ యామి; 14. గది నేనమః_దక్షిణ బాహుం పూజయామి; 15. వైకుంఠాయనమః కంఠం పూజయామి; 16. యజ్గముఖాయ నమః-ఆన్యం పూజయామీ; 11. అశోకనిధయేనమః నాసాం పూజయామి; 10. వాసుదేవాయనమః అక్ష్మిణీ పూజయామి; 19. వామనాయ నమః లలాటం పూజయామి; 20. హరయేనమః భుజౌ పూజయామి; 2. మాధవాయనమః ఆలకోన్ పూజయామి; 22. విశ్వరూపిణేనమః-కిరీటం పూజయామి; 28. సర్వాత్మనేనమః శిరః పూజయామి; ఇట్లు అంగపూజ జరిపి పిమ్మట గంధ ధూపమాల్యములతో విష్ణుని పూజింపవలెను.
మండపము ఏర్పరచి దానియందు పిడిమూర కొలత భుజముతో చతురసము మనోహరమగు సన్నని అరుగు ఉత్తరపు విలువలతో చేసి దానిచుట్టును మూడు ప్రాకారములు చేయవలెను. వానిలో బయటిది మూడంగుళముల ఎత్తు నడుమది రెండంగుళముల ఎత్తు లోపలిది ఎనిమిదంగుళముల ఎత్తు ఉండవలెను. ఏటి ఇసుకతో లక్ష్మీ ప్రతిమ చేసి చేటలో ఉంచవలెను. ఆ చేట నరుగ మీద ఉంచి లక్ష్మిని పూజించవలయును.
(లక్ష్మీ పూజా మంత్రములు: 1. దేవ్యై నమః-2. శాంత్యై నమః-6. లక్ష్మ్యై నమః-4. శ్రియై నమః-5. పుష్యే నమః 6. తుష్యై నమః.7 వృష్యై నమః-8. హృష్యై నమః.9. విశోకాయై నమః-10. దుఃఖనాశాయై నమః అను నప్ లక్ష్మీ పూజా మంత్రములు. వీనిలో ఆమెను పూజించి ఈ ఆర్ఘ్యము నిచ్చు మంత్రములతో ప్రార్థించవలెను. శ్లోకములు లేకుండ జేయు లక్ష్మీ దేవి నాకు వరముల నిచ్చునది యగుగాక ! విశోకయగు లక్ష్మి సంతానము కలిగించుగాక ! ఉన్న సంతతికి యోగ క్షేమముల నిచ్చు గాక! పిమ్మట ఆ చేటను తెల్లని క్రొత్త వస్త్రములతో.. చుట్టవలెను. దానిని నానా విధ భక్ష్యములతో ఫలములతో పూజించి దేవికి సువర్ణ కలశము నర్పించవలెను. రాత్రులయందు దర్భలు వేసి ఉంచిన ఉదకమును త్రాగి ఉండవలయును. రాత్రింబంతయు నృత్యగీతాదికముతో గడుపవలెను.
- అందునను రాత్రి మూడవ జాము గడచిన వెంటనే ఆరంభించి.యథాశక్తిగా ముగ్గురనుగాని ఒకరినికాని వీప్ర దంపతులను స్వయముగా వారి కడకు పోయి పిలుచుకొనివచ్చి వారిని--చారికి దాన మీయ సిద్దపరచిన శయనాది సామగ్రిని కమముగా వస్త్రమాల్యాదికముతో అగ్చించవలెను. పూజయందు 'జలశాయినే నమః' అను మంత్రమును వినియోగించ వలెను.
ఇట్లు గీత వాద్యాదులతో రాత్రి ముగియు వరకు గడపి జాగరణము ముగించి ఉదయము స్నానమాడి దంప తుల నర్చించి వారికి శయనాదిక మీయవలెను. యథాశ క్తిగా ధన. శాఠ్యము లేక గ్రాహ్మణ సంతర్పణము చేసి తానును భుజించి పురాణ శ్రవణముతో ఆనాడు గడుపవలెను.
ఇట్లు ప్రతి మాసమునను సంవత్సరము ముగియు వరకు) జరిపి.. వతాంతమున గుడ ధేనువు.దీండ్లు.పరపులు మొదలగు పరికరములు-దుప్పటి మొదలగునవి, వీనితో కూడ మంచము లను చైటతో కూడ లక్ష్మీదేవిని విప్రున(ల)కు దానమీయవలెను. దీనిచే సర్వ శుభములున్లు కలుగును.
పూజ కై 1. కలువ తెలుపు-ఎరుపు-నీలము. ఏదైనను) 2. కర వీరము (ఎర్రగన్నేరు-దానిపంటి "ఆకులుగల చెట్టు నకే పూ పైడి తెల్లని పూవులును కరవీర .) 8. తెల్లుపూవు-4. పొడని గన్నేరు. 6. కుంకుమపూ పు. 6. మొగలి '8. పేం కణము. 8. మల్లె.9. సంపెంగ.10. మంకెన 11. కడిమి.12. మాలతీ పుష్పములు వరుసగా పండ్రెండు మాసములందును ప్రశ స్తములు లేదా ఇవి ఎప్పుడును పూజకై మంచివి.
విశోక ద్వాదశీ కల్పమున ప్రాసంగికముగా పేర్కొనిన , గుడ ధేనుదానము అనునది ఏమి? దాని స్వరూపమును విధానమును దానమున వినియోగించు మంత్రమును తెలుపుమని మను వడుగగా మత్స్య నారాయణు డిట్లు' చెప్పెను: సర్వ పాప వినాశనమగు గుడ ధేను స్వరూపమును దాన విధానఫల వినియోజ్య మంత్రములను తెలి పెదను; వినుము.
నాలుగు మూరల పొడవుగల కృష్ణాజినము(నల్లని మచ్చలుగల ఇజ్జీచర్మమును గోమయముతో అలికి నాలుగు వైపుల దర్భలను పరచిన ప్రదేశమున తూర్పు మొగము అగునట్లు పరచవలెను. అట్టి ప్రదేశముననే ఉత్తరమునకు మొగ మగునట్లు చిన్న కృష్ణాజినము కూడ దానికి దగ్గరగా పరచవలెను. (మొదటిది ఆవుకొరకును- రెండవది దూడ కొరకును.)
గుడముతో ఆవును దూడను చేసి , తూర్పు మొగముగా , ఆవును ఉత్తరపు మొగముగా దూడను నిలుపవలెను. యథాశ క్తిగా ఆవును నాలుగు ‘బారువ'లు దూడను ఒక బారువ-ఇదే వంతున ఆవును రెండు బారువలు. దూడను ఆర బారువ-ఆవును ఒక బారువ దూడను పావు బారువ తూకముగల బెల్లముతో చేయవలెను. వీనికి ము తైపు చిప్పలతో చెవులు --చెరకుగడతో కాళ్లుము తైములతో కండ్లు" - తెల్లని దారములతో నాడులు.తెల్ల కంబళితో గంగడోలు-పలుచని రాగి రేకుతో మొగము-వీపు. తెల్లని చామరముతో తోక కుచ్చు-పగడములతో కనుబొమలు - వెన్నతో చన్నులు - పట్టుదారముతో తోక కాడ - కంచుపాత్రతో పొదుగు - ఇంద్రనీలముతో కనుగుడ్లు - బంగారు కొమ్ములు వెండి గిట్టలు "సం పెగ పూలతో ముక్కులు' అమర్చవలెను. వానిముందు నానా ఫలములుంచవలెను. ఇట్లు సిద్దపరచిన ఆ ఆవును , దూడను గంధ' ధూప దీపాదిక ముతో నైవేద్యముతో అర్చించవలెను.
పిమ్మట ఈ ఆర్థమునిచ్చు మంత్రముతో వాటిని ప్రార్థించవలెను. (మంత్రార్థము:). సర్వ భూతములందును సర్వదేవతలయందును సర్వదేహములందును ఉన్న దియై శంకరుని ప్రియురాలగురు దాణిగా విష్ణుని వక్షసునందు లక్ష్మిగా అగ్నియందు స్వాహాగా చంద్ర రవి నక్షత్ర తారలయందు కాంతిరూపయగు లక్ష్మిగా " చతుర్ముఖునందు వాణిగా కుబేరునందు ధనముగా లోకపాలుకయందు ఆందూ రూపములతో లక్ష్మిగా పితృదేవతలయందు స్వధారూపగా నున్న లక్ష్మియే 'ధేను రూపముననుండి నాపాపమును పోగొట్టుగాక! సర్వపాపహరయగు దేవీ: లక్ష్మీ! ఇట్టి నీవు నాకు శాంతిని ఇమ్ము.
ఇట్లు ఆగుడ ధేనువు, నామంత్రించి, దానిని బ్రాహ్మణునకీయవలయును.
పాపహరములగు ధేనువులు ఇట్టివి గుడ-ఘృత-తిల-జల.రస-ధాన్య-శర్కరా.లవణ-రశ్న - స్వరూప (గోరూవ) ధేనువు లనునవి పది కలవు. సువర్ణ నవనీత తైల ధేనువులను కూడ కొందరు మహర్షులు చెప్పి వారు. వీటిలో ద్రవ ధేనువులను అవి నింపిన మట్టి కడవలతో చిన్న పాత్రలతో కాని) అమర్చవలెను. గట్టి ద్రవ్యములైనచో రాసులుగా అమర్చవలయును. అన్ని టి విషయమునను ఇదే విధానము; ఇవే మంత్రములు. ఆవాహనాది పూజలతో ఆయా పర్వము లందవి ఈయవలయును. గుడ దేను ప్రసంగమున ఇవి చెప్పుటయైనది. ఇవి అన్నియు సర్వపాపహరములు; అనేక యజ్గ ఫలప్రదములు.
విశోక ద్వాదశీ వ్రతము వ్రతములలో నెల్ల ఉత్తమమయినది. దానికి అంగ భూతము ఈ గుడ దేను దానము.
ఈ ధేను దానములు ప్రత్యేకముగా ఈయవలెనని (ఉత్తర దక్షిణ) అయనములు విషువ (రాత్రింబవళ్ళు సమముగా ఉండు) కాలము వ్యతీపాత యోగమున్న దినము. ఇట్టివి తగిన కాలములు.
ఈ విశోక ద్వాదశి పుణ్యప్రదము-సర్వపాపహరము -శుభకరము; ఈ దినమున ఉపవాసము ముక్తిప్రదము. దీనిచే ఇహమున ఆయురారోగ్య సౌభాగ్యములు -మరణ కాలమున (ఇది చేసినవారికి) హస్మరణ మాత్రమున విష్ణులోక ప్రాప్తి కలుగును. ఇరువది ఏడు వేల ఆర్బుదముల సంవత్సరములపాటు దారిద్ర్యమును తీవ్ర దుఃఖములును " లేక సుఖింతురు. నృత్తగీతాది పూర్వకముగా నియమముతో ఈ వ్రతము చేసిన శ్రీ కిని ఈ ఫలము కలుగును. కనుక హరి ఎదుట నృత్తగీతములు భక్తితో చేయుట కర్తవ్యము. దానిచే సకల సంపదలును ము క్తియు లభించును.
ఈ వ్రతమును వినినను చదివినను ఇతరులకు తెలిపినను చూచినను కలకాలము ఇంద్రలోకమున దేవ పూజితుడే సుఖించును.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున విశోక ద్వాదశీవ్రత -గుడ ధేన్వాది దాన కథనమను
ఎనుబది యొకటవ అధ్యాయము.
Summary of chapter 81 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya expounds upon the Vishokadvādaśī-Vrata, a holy vow observed on the twelfth lunar day of the bright fortnight in the month of Āshāḍha, dedicated to Goddess Lakshmī and Bhagavān Vishṇu for total removal of life's sorrows. The practitioner fasts on Ekādaśī and establishes a consecrated altar on Dvādaśī, worshipping Goddess Lakshmī with fresh lotuses, red silk garments, fragrant unguents, and sweet delicacies. The devotee maintains a night vigil, listening to divine lore and chanting sacred mantras of the Divine Mother. At daybreak, the practitioner presents gifts of golden icons, fine clothes, and food to pious Brāhmaṇas, ensuring that sorrow never enters the household, while bestowing perpetual financial stability, inner contentment, and spiritual liberation.