మత్స్య మహా పురాణము
250 - అమృతమథనము - దేవాసుర యుద్ధము
అట్లు దేవతలు తమకీప్సితమగు అమృతమంతయు త్రోవుచుండ రాహువు మాత్రము అను దానవుడయ్యు దేవరూపుడై ఆది శ్రావెను; ఆది వాని కంఠమును చేరునంతలో దేవహితార్థమయి చంద్రసూర్యులీ విషయము (నారాయణునకు) తెలిపిరి. అంతట ఆ భగవానుడలంకృతమగు వాని శిరము వాడమృతము త్రోవుచున్నపుడే ఆయుధో త్తమమగు చక్రముతో ఖండించెను; చక్రముతో ఉత్కృత్త (ఖండితమై ఆదానవుని మహాశిరము పర్వతశిఖర మువలే వసుధాతల మును కంపింపజేయుచు పడెను; అప్పటినుండి ఈరాహు ముఖము చంద్రసూర్యులతో శాశ్వతమగు వైరబంధము పెట్టు కొనెను; అందుచేతనే ఆది ఇప్పటికిని వారిని బాధించుచున్నది; హరి భగవానుడు.ను అతులమగు ఆ స్త్రీరూపమును వదలి నానాయుధములతో దానవులను కంపింపజేయసాగెను; ఆ యసురులును చక్ర ఖడ్డ శ క్తిగదా నిర్బిన్న దేహులయి బహు రక్తమును క్రక్కుచు ధరణీతలమున పడిరి; తప్తకాంచన మాల్యయుతములగు ఆ దానవ శిరములు ఆ దారుణయుద్ధమున పట్టసాయుధములతో భిన్న ములయి ఎడ తెగక పడుచుండెను; మహాసురులందరును ర కలిపాంగులై గేక ధాతువులతో రక్త వర్ణములగు పర్వత శిఖరములవలె క్రింద పడుచుండిరి. ఆంతలో రవి య స్తమించు సమయమాసన్న మయి ఆత డెర్రనగుచుండెను. ఇనుప పరిఘలను విసరివేయుటలతోను దగ్గర నున్న వారిని పిడికిళ్ళతో గ్రుద్దుటతోను యుద్ధమున పరస్పరము కొట్టుచున్న వారి ధ్వనులు ద్యులోకమును తాకుచున్నవో యనునట్లుండెను; నరకుము- చీల్చుము-పరువెత్తుము- పడవేయుము-తొలగుము-ఇట్టి మహా ఘోర శబ్దములు అందంతటను వినబడుచుండెను.
ఇట్లు మహాభయంకరతుముల యుద్దము జరుగుచుండ నర నానారాయణ దేవులా యుద్ధమునకు వచ్చిరి: ఆందు దానవ హంతయగు విష్ణుభగవానుడు నరుని దివ్య ధనువును చూచి తానును చక్రమును స్మరించెను. చింతీత మాత్రమున మహాప్రథాయు క్తమును శత్రునాశకమును రవి సమానమును అమోఘ విక్రమమును భయంకరమును నహింపనలవి కానిదియు ఉత్తమమును జ్వలించుచున్న అగ్ని వలె తేజోవంతమును నగు చక్రము వెంటనే వచ్చెను. గజహస్త సమాన భుజుడా యచ్యుతుడు భయంకరమును మహా ప్రభమును దొనవదైత్యదారణమును ఉజ్వల జ్వలన సమాన రూప మునునగు ఆ చక్రమును వదలెను; ప్రళయాగ్ని సమాన తేజోవంత చక్రము వేగవంతమయి వచ్చిపడి పురుషోత్తముని చేయందు ధరించబడుచుండునది కావున ఆ శ క్తితోనే వేలకొలదిగ దైత్యులను ఆహవమున సంహరించుచుండెను; ఆది వాయువుతోడయి మండు అగ్ని వలే అసురగణములను నరకును కాల్చుచునుండెను; ఆది అత్యంతము పేరితమయి మాటి మాటికంతరిక్షమందును భూమియందును లేచుచు పడుచు దైత్యర క్షమును పిశాచమువలె త్రోవుచు ర క్తమయమయి కనబడు చుండెను; అదీన (ధీర) మనస్కులగు అసురులును మరల మరల విజృంభించుచు సురగణములను కొండలతో పిండిచేయు చుండిరి. జలమును సవించు మేఘములవలే ప్రకాశించు మహా పర్వతములనేకములు వేలకొలదిగ దానవ పేరితములయి ఆకాశమునందు కనబడుచుండెను. క్రింద పడుచు ఆవి అంతరిక్షమునకు నడుమనే తమయందలి వృక్షములతో కూడిన వయి మేఘ రూపములును భయ జనకములును నయి కనబడుచుండెను. ఆ మహాద్రులు తమ సానువులు జారిపడు చుండ శీఘ్రముగ పరస్పరము దగ్గరకు చేరుచు మండుచు ప్రకాశించుచుండెను.
ఆ సమయమున భూమి తనయందు పర్వతములతో అరణ్యములతో కూడ ప్రచలితమగుచుండెను; అన్ని వైపు లను పర్వతములును వాయుహతములయి కంపించుచుండెను; ఇట్లు ఆ రణరంగమున మిగుల భయంకర యుద్దము ప్రవ రిల్లుచుండ పరస్పర ఘాతధ్వనులతో ఆది అభిగర్జితమయి మేఘరాశీవలే నుండెను. అంతట నరుడు మేలిమి బంగరు ఆభర ణములతో భూషితములయిన బాణములతో గగనమావరించెను; అతడా మహాభయంకర సురాసుర యుద్ధమునందు తన బోణములతో గిరి శిఖరములను కూడ చీల్చివేయుచుండెను; అందు అసురులు దేవతలచే ఇట్లు బాధితులై భూమియందును లవణ సముద్రమందును ప్రవేశించిరి; జ్వలితాగ్ని సమాన కాంతియగు సుదర్శనము పరీకుపిత మయి ఆంతరిక్షమందు కన బడుట చూచి వారు భయమందిరి; పారిపోయిరి; ఇట్లు విజయమందిన దేవతలును మందరమును మిగుల పూజించి (స్తుతించి) దాని స్వస్థానమందు నిలిపిరి. మేఘములును గర్జితములతో అంతరిక్షమును ధ్వనింపజేయుచు తాము వచ్చిన
Summary of chapter 251 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya initiates the sacred exposition of Vāstu-vidyā, revealing to King Vaivashvata Manu the cosmic origin of Vāstu Purusha during the ancient battle between Mahādeva and Andhakāsura. As drops of perspiration fell from Mahādeva's forehead onto the earth, a giant cosmic being manifested, consuming the energy of the battlefield and covering the sky. Alarmed by his immense size, the assembled Devas and Prajāpatis pinned the giant face-down upon the earth, with Bhagavān Brahmā and forty-five Deities residing upon various limbs of his body. Bhagavān Brahmā blessed this cosmic entity as Vāstu Purusha, ordaining that no house, temple, palace, or city can be constructed without first worshipping him and making appropriate oblations to the presiding Deities of the Vāstu grid, ensuring structural stability, health, and spiritual harmony for all inhabitants.