మత్స్య మహా పురాణము
210 - సావిత్రి యమ సంవాదము - సావిత్రికి ద్వితీయ వరప్రాప్తి.
సావిత్రి యమునితో ఇట్లనెను: సత్పురుషులకు సజ్జనులతో సమాగమము లభించిన తరువాత క్లేశము ఎక్కడిది? దుఃఖము ఎక్కడిది? సత్పురుషులు సదాసజ్జనులకును అసజ్జనులకును గతి యగుదురు; కాని అసజ్జనులు మాత్రము సజ్జనులకుగాని ఆసజ్జనులకుగాని కడకు తన కేకాని గతి (ఉపకార కులు) కారు; అకారణముగనే లోకమునకు అపకారము చేయు (శత్రువులగు) ఖలుల వలన భయముండునట్లు విషము వలన కానీ అగ్ని వలన కాని శత్రువుల వలన కాని శస్త్రముల (ఆయుధముల) వలనకాని భయముండదు; సజ్జనులు తమ ప్రాణముల వదలియైనను పరార్థమును (పరోపకారమను. ఆర్తము ప్రయోజన మును) చేయుదురో అట్లే అసజ్జనులును తమ ప్రాణములు పోగొట్టుకొని యైనను పరపీడ కలిగించుటలో ఆసక్తులయి యుందురు; సజ్జన లోకము సమూహము) పర లోక సుఖసాధనమునకై ప్రాణములనైన గడ్డిపోచవలె వదలు కొన సిద్దమగునో దానిని పరాకార సమర్థులగు అసజ్జనులు తృణమువలెనే వదలుదురు; ఆయా జనసమూహము లందున్న ఆసజ్జనులను దండించుట కై బ్రహ్మతానై రాజును ఏర్పరచి సృష్టించెను; రాజు నరులను పరీ-క్షించవలయును; అసజ్జనులను నిగ్రహించ దండించ వలయును; లోక మందు ఇట్టివాడే లోక య(సుఖములను)మును జయించు వారందరలో ఉత్తముడు; ప్రజలు తమ రక్షణమును బీజర క్షణమును లోకరక్షణమును చేసికొనుటకై ఎట్లు ధాన్యమును పరీక్షించి మంచి దాని నుంచుకొని చెడుదానిని వదలి ఆ మంచి ధాన్యమును మరల పేరువేసి వృద్ధి పర తురో అట్లే రాజు కూడ సజ్జనులను పరిపాలించుచు అసజ్జనులను నిగ్రహించుచు ప్రజలను వర్దిల్ల చేయవలయును. స్వర్గమును పొందగోరు రాజు చేయదగినది ఇంత మాత్రమే; జగత్తులకు పతి అగు ధర్మరాజా! లోకములందు రాజు చేయదగిన కృత్యము ఇంతకంటే ఇతరము ఏదియు లేదు; ఇట్లు అసజ్జన నిగ్రహముతోను సజ్జన పరిపాలనముతోను రాజు శాసింపలేని అసజ్జను లను కూడ శాసించు పొడవు నీవు; ఆ హేతువుచే దేవులందరకంటే నీవు అధికుడవగు దేవుడవు అని నాకు తోచుచున్నది; లోకము సరిగా నడు చునట్లు చేయుచు దానిని నరియగు వ్యవస్థయందు నిలుపువారు సజ్జనులే; అట్టి సజ్జనులలో శ్రేష్టుడవు నీవు; ఆ హేతువుచే నేను నీ వెంట (ఎంత దూరము) వచ్చు చున్న ను క్ల మము (శ్రమము) లేదు; అనవిని యముడు “విశాలాక్షి! ధర్మ సంబద్ధములగు నీ వచనములను విని నీ విషయమున తుష్టుడనయితిని; నత్యవంతుని ప్రాణములను తప్ప మరే దయిన వరమును శీఘ్రమే కోరుకొనుము;” న సావిత్రి “విభూ! నాకు నూరుమంది సహోదరులగు నా తల్లి కడుపుననే జన్మించిన) భ్రాతలు వర ముగా (కోరుకొనుచున్నాను;) ఇమ్ము; ఇంతవరకును (పుత్తులు లేమిచే) ఆనపత్యుడుగానున్న మా తండ్రి పుత్రలాభము వలన ప్రతినందునట్లనుగ్రహించుము;” అనెను.
అంతట యముడా మెతో నిట్లనెను: అనిందితా! (నిర్మల స్వభావా!) నీవు వచ్చిన త్రోవను పొమ్ము; నీ భర్తకు జరుపవలసిన ఔర్ధ్వ దే హిక కార్యముల విషయములలో యత్నము చేయుము; అంతేకాని లోకాంతర గతుడగు ఇతనిని నీవు వెంటనంటజాలవు; భద్రా! నీవు నీ గురువులకు (అత్త ఇంటి పెద్దలగు అత్తమామలకు)ను ముఖ్యగురు డేయగు సత్యవంతునకును చేసిన శుశ్రూష చేత నీవు మహాపుణ్యమును సమర్జించితివి; ఆ హేతుపుచేతనే (నాదూతలను పంపక) నేను స్వయముగా వచ్చి ఇతనిని తీసికొనిపోవుచున్నాను. వరవర్ధినీ! విజ్ఞానవంతుడు అగు పురుషుడు ఆచరించవలసిన కర్తవ్యము తల్లిని తండ్రిని గురుని శుశ్రూషించుట అనునది మాత్రమే; వనమందుండియు నిరంతరమును సత్యవంతుడు ఈ మువ్వురను పూజించెను; సంతోషపర చెను; శుభరూపా! ఇట్లు ఇతడు చిర కాలము అనుభవించదగినంత స్వర్గమును జయించినవాడయినాడు; శుభా! తపముచే బ్రహ్మచర్యము చే గురు ( పెద్దల) శుశ్రూషచే అగ్ని శు శూషచే పురుషులు స్వర్గ నుఖ ప్రాప్తులగుదురు; ఎవ రేకాని-వి శేషించి. విప్రుడు ఆచార్యుని తన తండ్రిని తల్లిని అన్నను అవమానించ (అలక్ష్యపరచ) రాదు; ఆచార్యుడు బ్రహ్మరూపుడు; తండ్రి ప్రజాపతి రూపుడు; తల్లి పృథివీరూప: అన్న స్వయముగ తమ్ముడగు) తన రూపమే ); మానవులు జన్మించుటలో వారి తల్లిదండ్రులు పుట్టుకతోనే మహా క్లేశ మనుభవింతురు: నూరేండ్లకయినను వారి ఋణము తీర్చుకొనుట శక్యము కాదు; కావున పొరికిని ఆచార్యునకును సర్వదా ప్రీతి కలిగించవలయును; ఈ మువ్వురును సంతుష్టులయిన చో సర్వ తపస్సులును సమాప్తములగును; ఈ మువ్వుర శుశ్రూష యే పరమ తపమని పెద్దలందురు; వారి యనుమతి లేనిదే ఇతర ధర్మమేదియు ఆచరించరాదు; వారు మూవు రే మూడు పృథివ్యంత రిషద్యు) లోకములు; మూడు (డ్రహ్మచర్య గార్హస్య వానప్రస్థ ఆశ్రమములు; మూడు (ఋగ్యజుస్సామ) వేదములు; మూడు (దక్ష్మి గార్హపత్యా హవనీయ) అగ్నులు; తండ్రి గార్హపత్యాగ్ని; తల్లి దక్షిణాగ్ని; గురుడాహవనీ యాగ్ని; ఈ అగ్ని త్రయము అన్ని టికంటెను గొప్పది; ఈ మూడిటి విషయమున గృహస్థుడు పొరపడరాదు; అట్లున్న వాడు పైజెప్పిన లోకత్రయ (సుఖ) మును జయించును; ప్రకాశించు (తేజోమయమగు) తన శరీరములో కూడి దేవునివలెనే డ్యు స్వర లోకమున సుఖించును; భద్రా! కల్యాణీ! నీకోరికలు నెరవేరినవి; కావున నీవు మరలుము; నీవనీన ఈ విషయమంతయు జరుగును; ఇంకను నీవు నన్న నున రించుటచే నాకు ఆటంకమును నీకు శ్రమమును అగును; అందుచే . ఈమాట ఇట్లు చెప్పుచున్నాను.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున సావిత్ర్యుపాఖ్యానమున సావిత్రీయమ సంవాదమును యమునివలన సావిత్రికి ద్వితీయ వర లాభమునను రెండు వందల పదవ ఆధ్యాయము.
Summary of chapter 211 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya addresses King Vaivashvata Manu on the deep philosophical query regarding the relationship between human effort known as Purushakāra and destiny or fate known as Daiva. Bhagavān Matsya clarifies that Daiva is nothing other than the accumulated fruit of past human efforts performed in previous births, while Purushakāra is the present action executed in this life. Bhagavān Vishṇu forcefully rejects fatalism, declaring that present righteous effort is like the primary seed, while destiny is like the soil; just as a seed cannot sprout without soil, destiny cannot manifest without active human effort.