మత్స్య మహా పురాణము
69 - కల్యాణ భీమ ద్వాదశీ వ్రతము
మనువు మత్స్యనారాయణు నిట్లడిగెను: దేవేశ్వరా! దేవా! మానవులకు స్వల్పమగు తపస్సుతోనే ఆనంతమగు ఆరోగ్యము ఐశ్వర్యము మోక్షము కలుగు నుపాయమును తెలుపుము. నీకు తెలియని దేదియు లేదు. అనగా నారాయణు డిట్లతనికి తెలి పెను. పూర్వము రాథంతర కల్పమున మందర పర్వతమున నున్న పినాక ధారియగు మహాదేవుని భగ వానుడు సాక్షాత్ బ్రహ్మదేవుడు ఈ విషయమును అడుగగా అతడతనికి మనకి ప్రీతి కారకమగు ఈ విషయము ఇట్లు చెప్పెను: బ్రహ్మా! ఇప్పుడు జరుగుచున్న ఈ రథంతర కల్పమునుండి ఇరువది మూడవ కల్పమున వారాహకల్పము వచ్చును. దానిలో ఏడవదగు వైవస్వత మన్వంతరమున ఇరువది ఏడవ ద్వాపరయుగపు తుదలో మిగుల మహా తేజస్కుడు వాసు దేవుడు నగు (సర్వమునందు తానుండుచు సర్వమునందు తానుండు) జనార్దనుడు విష్ణువు లోక (భూ) భారమును ఉంచుటకు మూడుగానై ద్వైపాయనముని బలరాముడు కృష్ణుడు. అని ముగ్గురుగా అగును. కృష్ణుని కే కేశవుడు కంసారి కేశి మథనుడు అని ప్రసిద్ది, ఆ మహానుభావుడు క్లేశముల నన్నిటిని నశింపజేయువాడు.
దివ్యములగు అనుభావములుకల ఈనాటి (మత్స్యనారాయణుడు మనువునకు ఈ విషయమును చెప్పిన కాలమునందలి) కుశ స్థలిపురీని జగత్పతియగు నాయాజ్గచే (దేవశిల్పి) త్వష్ట శార్ణ ధనుర్ధారియగు శ్రీకృష్ణడగవానుని నివానమునకై ద్వాగవతీ పురియను పేర నిర్మించును. కైటభాంతకుడగు శ్రీకృష్ణుడు ఒకానొక సమయమున ఆ ద్వారక యందు సభయందాసీనుడు అగును. అమిత ప్రకాశుడగు ఆయనను తన పత్నులును. వృషైజాతీయులగు క్షత్రియులును మిగుల ప్రియులగు మిత్రులును కురు వంశీయులగు క్షత్రియులును దేవతలును గంధర్వులును దేవ గంధర్వులును పరివేష్టించియుందురు. ఆసభలో పురాణములును ధర్మమున క నుకూలములగు కథా ప్రవృత్తులును సాగుచుండ మాటలనడుమ ప్రతాపవంతుడగు శ్రీకృష్ణుని భీమ సేనుడు ఇపుడు నన్ను (మత్స్యనారాయణుని) నీపు (మనువు) అడిగిన ఈ రహస్యమును భేదించు ప్రశ్న మును ప్రశ్నించును. తరువాత ఆ భీమ సేనుడే ఈ ధర్మము (వ్రతము) ను ఆచరించు వాడును ఆధర్మమును లోకమున ప్రవర్తింపజేయువాడును అగును.
ఆ భీమ సేనుడు పాండు రాజకుమారుడు మహాబలుడు; ఆ ధర్మాత్మునకు నేను వృకము అను పేరుగల జత రాగ్ని ని ఇత్తును. అందుచే అతనికి వృకోదరుడను పేరు ప్రసిద్ద మగును. అతడు బుద్ధిశాలియు దానశీలుడును పదివేల ఏనుగుల బలమంత బలముగల గొప్పవాడును వార్తకము మొదలగు లోపములు లేనివాడును సాక్షాత్ రూపొందిన మన్మథుని వంటివాడును; ఐనను అతడు ధార్మికుడై ఉండియు తీవ్రమగు జఠరాగ్ని దీప్తి కలవాడగుటచే ఉపవాసము చేయుటకు శ క్తిలేని వాడు.
అతనికి విశ్వాత్ముడును లోకగురుడును అగు వాసుదేవుడు (శ్రీకృష్ణుడు) అన్ని వ్రతములలో గొప్పదియగు ఈ వ్రతము తెలుపును. ఇది సమస్త యజ్గముల ఫలము నిచ్చునది.సర్వపాపరాసుల నశింపజేయునది ఆ శేష దుఃఖముల శమింపజేయునది-సకల దేవతల పూజలనందుకొనునది. పవితములగు వానిలో పవితమును - శుభములగు వానిలో శుభ మగునదియు భవిష్యములగు వానిలో భవిష్యము (ఇంకముం దేంత కాలమువర కైన లోకమున ప్రచారములో నుండునది) పురాతనములగు వానిలో పురాతనమయినది (ఎంతో కాలమునుండి లోకమున ప్రచారమునందున్నది.
వాసుదేవుడు భీమసేనునకు ఇట్లు చెప్పెను: నీవు అన్ని అష్టమీ ద్వాదశీ చతుర్దశీ తిథులయందును ఇతరములగు శుభ నక్షత్ర తిథులయందును ఉపవసించి వ్రతము అనుష్టించుటకు శక్తి లేని పొడవయినచో ఈ పాప ప్రణాశక మగు మాఘ శుక్ల దశ మ్యే కాదశీ ద్వాదశీ తిథుల యందయిన ఈ చెప్పబోవు విధానమున వ్రతము చేసినచో విష్ణుస్థానము నందగలవు.
శ్రీకృష్ణుడు భీమసేనునకు ఇట్లు చెప్పెను: (ఈవ్రతము మూడునాళ్ళు-మాఘ శుక్ల దశ మ్యేకాదశీ ద్వాదశి తిథులయందు-దీక్షతో నుండి చేయవలసినది. అందు మొదట దశమి నాటి కృత్యము) మాఘ శుక్ల దశమినాడు నేతితో అభ్యంజనము చేసికొని నూవుల (పిండి)తో స్నానము చేయవలెను. ఈ చెప్పబోవు మంత్రములతో విష్ణుని పూజించ వలయును. మొదట విష్ణుని పాదములను పూజించవలయును. పిమ్మట 1. సర్వాత్మనేనమః శిరః పూజయామి; 2. వైకుంఠాయనమః కంఠం పూజయామి; 8. శ్రీవత్సధారిణేనమః ఉరః పూజయామి; 4. దామోదరాయనమః ఉదరం పూజయామీ; 5. పంచశ రాయనమః మేడ్రం పూజయామి; 6. సౌభాగ్యనాథాయనమః ఊరూ పూజయామి; 1. భూత ధారిణేనమః జానునీ పూజయామి; 8. ఆతులాయనమః జంఘే పూజయామి 9. విశ్వసృజేనమః పాదౌ పూజయామి.
ఈ మంత్రములతో నారాయణుని ప్రతియొక అవయవమును పూజించవలెను. ఈ పూజకు ముందుగా శంఖినే నమః చక్రిణేనమః గదినేనమః వరదాయనమఃఇత్యాది మంత్రములతో విష్ణుని ఆవాహనము చేయవలెను.
శ్రీదేవ్యైనమః-శాంత్యైనమః.ల వ్యైనమః - శియైనమః - పు ష్యైనమః -తు ష్యైనమః-ధృత్యైనమఃఇత్యాది మంత్రము లతో లక్ష్మిని పూజించవలెను.
విహంగనాధాయనమః వాయువేగాయనమః పక్షిణేనమః. విషప్రమథ నాయనమః- ఇత్యాది మంత్రములతో గరుడుని పూజించవలెను.
ఇట్లు గోవిందుని (లక్ష్మిని-గరుడుని) శివుని వినాయకుని నానావిధ గంధమాల్య ధూపదీప భక్ష్యములతో పూజించవలయును. ఆవుపాలతో పండిన పులగమును నేతితో మౌనముగా భుజించవలేను. నూరడుగులు నడువవలెను. సాయంకాలము కాగానే మర్రి ఊడను కాని చండ్రపుల్లను కాని ఉపయోగించి - దంత ధావనము చేసి తూర్పుగానో ఉత్తరముగానో తిరిగి కూర్చుండి ఆచమించవలెను. పిమ్మట సూర్యాస్తమయము కాగానే సాయం సంధ్యను ఉపాసించ వలయును. నమో నారాయణాయ. అహం త్వాం శరణంగత:-(నేను నిన్ను శరణు చొచ్చుచున్నాను. ) అని ప్రార్థించి భూమి పై నిద్రించవలెను.
(ఏకాదశీ దినకృత్యము) ఏకాదశినాడు నిరాహారుడై యుండి లెస్సగా కేశవుని అభ్యర్చించవలెను. (పిమ్మట విష్ణుని ఇట్లు ప్రార్థించవలెను.) “నేను ఈ రాత్రియంతయు గడపి (రేపుదయము) స్నా సమాడుదును. పాలతోగాని నేతితో గాని (నిన్నుద్దేశించి) హోమము చేయుదును. బ్రాహ్మణులతో కూడ క్షీరముతో భోజనము చేయుదును. ఇట్లు నియత మనస్కుడనై నీ వ్రతము చేయుదును. ఆ వ్రతమును నిర్విఘ్నము చేయుము.” అని ఇట్లు ప్రార్థించి కడపట ఇతి హాస కథను విని భూమి పై పరుండవ లేను.
(ద్వాదశీ దిన కృత్యము) ద్వాదశినాడు ఉదయమున నదికిపోయి -మృత్తికతో స్నానము చేసి వేద బాహ్యుల నెవరిని చూడక తాకక వారితో మాటలాడక సంధ్యావందనమును పితృ తర్పణమును చేయవలెను. నారాయణుని సూర్యుని ఈశ్వరుని నమస్కరించవలెను. ఇంటిముందు యథాశక్తిగ మంటపమును (పందిరిని) ఎనిమిది మూరలు కాని పది మూరలు కాని భుజముండునట్లు చతురస్రముగా నిర్మించి దాని నడుమ నాలుగు మూరల కొలత తో చతురస్రా కారపు చక్కని వేదిక (అరుగు) నిర్మించవలెను. అంతే కొలతగల తోరణమును కూడ దాని పై చుట్టును కట్టవలయును. ఆ వేదిక నడుమ పైనుండి వేలాడునట్లు జలపూర్ణ మై మినుప గింజంత రంధ్రముకల కడవను వేలాడదీయవలయును. దానినుండి పడు ఉదక ధారను రాత్రియంతయు యజమానుడు కృష్ణాజినముపై కూర్చుండి తన తల పై పడునట్లు చేసికొనవలెను. ఇట్లు అనేక జలధారలు పడుటచే విస్తారమగు ఫలము కలుగునని వేదవేత్తలు చెప్పుదురు. అట్లే వ్రత దిన మున విష్ణుని శిరము పై ఈ కలశము నుండి గోక్షీర ధారపడునట్లు చేయవలెను.
పిడిమూర కొలతతో చతురసపు కుండమును దానిచుట్టును మూడు మేఖలలను (అంచులను) చేయవలెను. దాని ముందు యోనిచక్రమును ఏర్పరచవలయును. బ్రాహ్మణులు విష్ణు దైవత్యములగు మంత్రములతో ఏకాగ్ని విధాన మున విష్ణుని ఉద్దేశించి ఆజ్యాహుతులను వేయవలయును. హోమమునకు. యవలు నేయి తిలలు ఆవుపాలతో నేతితో వండిన చరువును ఉపయోగించవలయును. ఆహుతులు మినుప గింజంత పరిమాణముతో ఉండవలయును. హోమస్థానము నందు పదుమూడు జలకలశములను నిలుపవలయును. వాటి పై నానా విధములగు భక్ష్యముల నుంచవలయును. పంచ రత్నములతో మేడి చిగురాకులతో తెల్లని కొత్త వస్త్రములతో వాటినలంక రించవలయును. నలుగురు ఋగ్వేదీయులు ఉత్తరముఖులై కూర్చుండి హోమము చేయవలయును. నలుగురు యజుర్వేదీయులు రుద్రమంత్ర జపము చేయవలయును. నలుగురు సామవేదులు విష్ణుదేవతాక సామమంత్రములు పఠించుచుండవలయును. వీరందరు శుభ లక్షణములు శుభ వస్త్ర ధారణము కలిగి శుభద్రవ్యములు దగ్గర నుంచుకొని యుండవలయును.
ఇట్లు పూజా-జప-హోమ-ప్రక్రియ ముగిసిన తరువాత వస్త్ర-మాల్య - గంధానులేపనములతోను స్వర్ణాంగుళీయ కటక. హేమభూషణములతోను మంచములతో పడకలతోను శ క్తికి లోపము రానీయక ఆ పండ్రెండు మంది విప్రులను పూజించవలెను. ఆచార్యునకు మాత్రము ఋత్విక్కులలో ఒక్కొక్కరికి ఇచ్చిన దానికి రెట్టింపు దక్షిణాదికము ఈయవలెను.
తరువాత ఆ రాత్రి గీత వాద్యవినోదములతో గడుపవలెను. తెల్లవారిన తరువాత (త్రయోదశినాడుదయ మున) ఈ పదుముగ్గురకును (గాని మరి పదుముగ్గురు బ్రాహ్మణులకుగాని) పదుమూడు పాడియావులను దాన మీయవలేను. అవి బంగారు కొమ్ములు వెండి గిట్టలు పాలు పిదుకుటకు కంచుపాత్రలు నూతన వస్త్రపు కప్పడములు కలవై పొడువక తప్పిపోక మంచి స్వభావము కలవై యుండవలెను. వాటిని చందనముతో అభిషేకించి దానము ఈయవలెను. పిమ్మట వారిని భక్ష్యభోజ్య సమన్వితముగా భుజింపజేసి తానును ఉప్పు పులుపు కారము లేని యాహారము భుజించి వారిని వీడ్కొని తన భార్యాపుతులతో కూడ ఎనిమిది అడుగులు కూడ వెళ్లి వారిని సాగనంపవలయును. “కేశముల నశింపజేయువాడును దేవేశుడు నగు కేశవుడు నేను జేసిన ఈ వ్రతముచే ప్రీతి నొందుగాక! శివుని హృదయ(తత్వ)ము విష్ణువు-విష్ణుని హృద య(తత్వ)ము శివుడు; ఇట్లు పా రిరువుర నడుమ నేను అభేదమును భావన చేయుచున్నాను. కావున నాకు శుభమగు ఆయువును శుభములును కలుగుగాక!” అని పలుకుచు ఆ కుంభములను గోపులను శయనీయములను వస్త్రములను ఆయా బ్రాహ్మణుల ఇండ్లకు పంపవలయును. శ క్తిలేని యజమానుడు అందరకును (బ్రాహ్మణులకు) కలిసి ఒకే శయ్యనైన సామగ్రులతో అలంకరించిన దానిని ఈయవలెను.
ఆ దినము అంతయు ఇతిహాస పురాణ కథాశ్రవణముల తో గడుపవలయును. ఇట్లు చేసినచో విపులమగు సంపత్ భాగ్యములు కలుగును.
కావున భీమ సేనా! నీవు మత్సరములేక ఇతరులతో పోటీ చేయు తలంపులేక సత్వగుణము నవలంబించి లేన్సగా ఈ వ్రతము నాచరింపుము. ఈ వ్రత మతి రహస్యమయినను నీ యందలి స్నేహముచే నేను నీ కిది తెలిపితిని. నీవు దీని ననుష్ఠించుట చేత సర్వపాప ప్రణాశనమగు ఈ వ్రతమునకు భీమ ద్వాదశీ వ్రతమను పేరు ప్రసిద్ద మగును. పూర్వ కల్పములందు కల్యాణి నీ వ్రతమని ప్రసిద్ధమయి ఇష్టవరప్రదమగు దీనికి నీవు ఈ వారాహ కల్పమున ఆదికర్తవు మొదట చేసినవాడవు) కావలయును. ఏలయన ఈ వ్రతకల్పము అంతయు కీర్తించినను స్మరించినను అతడు కూడ దేవేంద్రుడగును. కుతూహలముతో దీనిని చేసినచో ఏ ఫలము కలుగునో చూతమని ఒకానొక ఆభీర ఆ హీరులను గోపాలకుల ! కన్య జన్మాంతరమునందు ఈ వ్రతము చేసి దేవవేశ్యలలో శ్రేష్టయగు ఊర్వశి యయ్యెను. ఒకానొక వైశ్య కన్య దీని నాచరించి మరియొక జన్మమున పులోముని కూతురై ఇం దుని భార్యయగు శచి యయ్యెను. . ఆ జన్మమున ఆ మేకు పరిచారిక గా నున్న యామె ఇపుడు నా భార్య సత్యభామగా నే నది. పూర్వము ఈ శుభ తిథియందు సహస రంధ్రములుకల కలశపు జలధారలతో స్నాన మాడిన పుణ్యపు ప్రభావమున సూర్యుడు వేదాత్మక శ రీర రూపమగు తేజో మయ మండలమును పొందగలిగెను.
ఇపుడు మహేంద్రుడుగా వస్తువులుగా గణదేవతలుగా దేవకోటులుగా రాక్షస శేషులుగా నున్న వారు కూడ ఒకప్పుడు ఈ వ్రతము నాచరించినవారే.
నోటియందు పదివేల కోటుల నాలుకలున్న ను దీని మహిమము చెప్పుట సాధ్యము కాదు. ఇది కలికలుష నాశ కము. ఆనంత పుణ్యప్రదము. అని ఇట్లు శ్రీకృష్ణుడు భీమ నేనునకు చెప్పును.
దీని నాచరించినవారు తమ పితరులను ఆంగరను నరకమునుండి ఉద్ధరించినవా రగుదురు. సకలార్థపదమగు ఈ ద్వాదశీ వ్రత మహిమమును వినినవాడును చదివి ఇతరులకు పరోపకార బుద్దితో వినిపించిన వాడును బ్రహ్మత్వమును పొందును.
పూర్వ కల్పములందు కల్యాణినీ ద్వాదశీ వ్రతమను పేర బ్రహ్మదేవునిచే లోకమున ప్రవర్తిల్ల చేయబడిన ఈ వ్రతము వాసుదేవుని ఉపదేశ ముచే భీమసేనునిచేత చేయబడి అనంత పుణ్యప్రదమయి భీమ ద్వాదశీ వ్రతమని ప్రసిద్ధ మగును.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున కల్యాణినీ భీమ ద్వాదశీ వ్రత కథనమను ఆరువది తొమ్మిదవ అధ్యాయము.
Summary of chapter 69 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya expounds upon the Bhīma-Dvādaśī-Vrata, a powerful vow observed on the twelfth lunar day of the bright fortnight in the month of Māgha, celebrated for bestowing extraordinary physical strength, moral courage, and spiritual liberation. The practitioner fasts on Ekādaśī and performs comprehensive worship of Bhagavān Vishṇu in His Nārāyaṇa manifestation on Dvādaśī using fragrant white flowers, tulasi leaves, incense, and lamp offerings. The devotee spends the night engaged in spiritual discourse, meditation, and devotional singing, avoiding sleep and worldly distractions. At daybreak, the practitioner feeds pious Brāhmaṇas and gifts gold, cows, and land, earning immense merit that frees the soul from all worldly bondages and grants permanent residence in Vaikuṇṭha.