మత్స్య మహా పురాణము
227 - రాజధర్మము-దివ్యాంతరిక్ష భౌమోత్పాత శాంతి.
[ఆకస్మిక ముగా జరుగు ప్రకృతి విపరీతములు (ప్రాకృతికోపద్రవములు) ఉత్పాతములు; వీనినే అద్భుతములు. ఆశ్చర్యకరములగు అసాధారణ సంఘటనలు - అనియు వ్యవహరింతురు. ఇవి 1. భౌమములు. భూమితో సంబంధించి నవి; 2. ఆంతరిక్షములు. అంతరిక్షముతో - సంబంధించినవి; 3. దివ్యములు - నక్షత్ర గ్రహాది జ్యోతిర్గోళములతో సంబంధించినవి. అని మూడు విధములు.]
కేశవా! దివ్యములు ఆంతరిక్షములు భౌమములు నను మూడు విధములగు మహోత్పాతములలో నేవి యేవి సంభవించినపుడు ఏ ఏ శాంతులు జరుపవలేనని శాస్త్రము విధించుచున్నదో తెలియ వేడెదననిన మత్సుడు మనువుతో ఇట్లనెను: నీకిక మీదట వివిధములగు ఆద్బుతములును ఉత్పాతములును సంభవించినపుడును విశ్లేషించి భౌమాంతరిక్ష దివ్వములనబడు ఇవి సంభవించినపుడును ఏయేంతీ వీధించబడినదో తెలి పేదను వినుము; పరులను జయించి వారి నంపదల తానందగోరువాడును పరులకంటే తానధికుడుగా నుండగోరువాడును ఇతరులు తన విషయమున (తన రాజ్య విషయమున) చేసిన ఆభిచార క్రియలకు పాత్రుడయిన వాడును శత్రువుల నశింపజేయదలచిన వాడును మహాభయములు సంప్రాప్తించిన వాడును జరుపవలసిన శాంతికి 'అభయా'శాంతి అని పేరు; ఇది ఆంతరిక్షోత్పాతములను శమింప జేయునది.
రాజయక్ష్మ వ్యాధి (క్షయవ్యాధి)చే బాధనందువాడును గాయములతో బాధనందుచు కృశించినవాడును యజ్ఞముల నాచరింపగోరువాడును ‘సౌమ్యా’ శాంతినాచరించుట ప్రశస్తము; భూకంపములు అన్న పుకొరత అతివృష్టి, అనావృష్టి మిడు తల భయము పిచ్చివాడవలనను దొంగలవలనను ఉపద్రవములు కలిగినచో ‘వైష్ణవీ'శాంతి చేయవలెను; పశునరమరణము భూతదాహము సంభవించినచో ‘రౌద్రీ' శాంతి తగును; వేదనాశము నాస్తిక వృద్ధి అపూజ్యులను పూజించుట జరుగునపుడు 'బ్రాహ్మీ'ణాంతి ఉచితము; రాజ్యాభి షేక సమయమందును పరచక్ర భయము కలుగునపుడును స్వరాష్ట్రమున కల్లోలము లేర్పడునపుడును శత్రువధార్ధమును 'రౌద్రీ'శాంతి చేయవలెను; మూడు దినములకు అధిక కాలము రూక్షమును సర్వప్రాణులకు సహింపరానిదియునగు గాలి వీచుచున్న పుడును వాత వ్యాధులు చెలరేగినపుడును ‘వాయవ్యా” శాంతి చేయవలెను; అనావృష్టి భయ-వృష్టి వికార.జలాశయవికారములు కలుగునపుడు 'వారుణీ' శాంతి జరుపవలెను; శాపభయము కలుగుచో ఓ ‘భార్గవీ’ శాంతి ప్రసవములందు విపరీతములు (వికృత శిశు జననము ఒక ప్రాణి కడుపున మరియొక ప్రాణి జననము) సంభవించుచో 'ప్రాజాపత్య శాంతి' ఉపస్కర (పనిముట్ల) వికృతి సంభవించినచో ‘త్వాష్టి' శాంతి బాలుర క్షేమమున కై 'కౌమారీ' శాంతి అగ్ని వై కృతము జరిగినపుడును ఆజ్ఞాభంగములు భృత్య నాశాదికము జరుగునపుడును ‘ఆగ్నేయీ' శాంతి జరుపవలెను.
అశ్వములకు వికృతి ఏర్పడినపుడు అవిశ మించుటకై ‘గాంధర్వీ' శాంతియు గజములయందు వికృతి ఏర్పడి నపుడు ఆది శమించుటకును రాజ్యమును వృద్ధి నందించుకొనగోరినపుడును 'ఆంగీరసీ' శాంతియు పిశాచాది భయము శాంతించుట కై "నైరృతీ’ కొంతీయు అపమృత్యుభయమును దానిని సూచించు దుస్స్వప్న ములును నరక భయమును సంభ వించునపుడు 'యామ్యా ' కోంతియు ధన నాశమునందు “కౌబేరీ' శాంతియు వృక్షములందును ధనమునందును వైకృత మేర్పడి నపుడును భూమి నధికముగా కోరినపుడును 'పార్థివీ' శాంతియు పగలు గాని రాత్రియందు కాని మొదటి జామునను హస్త స్వాతి చిత్రా పునర్వసు అశ్విని ఉత్తర ఫల్గుని మృగశిర నక్షత్రములందును ఉత్పాతములు సంభవించినచో ‘వాయవ్యా’ శాంతిని దీనరాత్రి ద్వితీయ యామమునందును పుష్యమి కృత్తిక విశాఖా మఖాభరణీ నక్షత్రములందును ఉత్పాతములు సంభవించినచో 'ఆగ్నే యీ' శాంతిని పగటగా ని రాత్రియందుగాని మూడవజామునను రోహిణి శ్రవణము ఉత్తరాభాద్ర ధనిష్ట జ్యేష్ట అనూరాధ. ఈ నక్షత్రములందును ఉత్పాతములు సంభవించినచో ‘ఐంద్రీ' శాంతిని పగటకొని రాత్రియందుగాని నాల్గవజామునను ఆ శ్లేష రేవతి ఆర్గ ఉ త్తరాభాద్ర శతభిషము మూల-ఈ నక్షత్రములందును ఉత్పాతములు సంభవించి నచో ఓ పొరుణి' శాంతిని జరుపవలేను; రవి మండలపు అంచులందు ఉత్పాత నిమి త్తములు కనబడినచో (ఆథయా. సౌమ్యా) రెండు డొంతులు జరుపవలయును. నిమి త్తములు కనబడనపుడు జరిపిన శాంతి నిమి త్తములు కనబడిన కాలము నాటికి ఉపయోగపడవు; కావున నిమిత్తములు కనబడినపుడు మాత్రమే శాంతి జరుపవలయును. కవచములు శిరస్త్రాణములు మొదలగు రక్షణ సాధనములు ధరించిన వీరునకు యుద్ధమున బాణము మొదలగు ఆయుధ)పు దెబ్బలు తగులన ట్లే ధర్మాత్ములై ఆవశ్యక ములయిన శాంతులు జరుపుకొనుచుండు రాజుల రాజ్యములందు ఉత్పాతాదుల భయములును పీడలును ఉండవు.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజధర్మమున అద్భుత (ఉత్పాత) శాంతి విధియను రెండువందల ఇరువది ఏడవ అధ్యాయము.
Summary of chapter 228 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya details specialized planetary pacification rituals known as Graha-shānti, performed specifically for the royal family to ensure state stability and victory. Bhagavān Matsya outlines the construction of specific geometric altars, preparation of planetary offerings, and chanting of solar, lunar, and planetary mantras to neutralize malicious astrological transits affecting the king. Conducting these royal pacification rites ensures physical vitality, clear decision-making, and protection against hidden political conspiracies.