మత్స్య మహా పురాణము
7 - మరుదుత్పత్తి - మదన ద్వాదశీ వ్రతము
ఋషులు సూతు నిట్లు ప్రశ్నించిరి. దితి కుమారులు దేవతలకు సవతి తల్లి కుమారులును వారితో శత్రుభావము కలవారును కదా ! అట్టి దితి కుమారులు అగు మరుతులు దేవతలకు ప్రీతిపాత్రులై వారితో మిగుల మేలయిన స్నేహము నేట్లు చేసిరి ?
సూతు డిట్లు చెప్పెను : పూర్వము దేవాసుర యుద్దమున హరి ప్రయోగించిన శరములతో దైత్యులు మరణించిరి. తన కుమారులును మనుమలును మరణించినందున దితి మిగుల దుఃఖించెను. ఆమె “కార్తురాలయి ఉత్తమమగు భూలోక మునకు పోయేను. శుభమగు సరస్వతీ నదీయెడున శమంతపంచక మను తీర్థమున ఉండి ఆస క్తితో శ్రద్ధతో భర్త నారా ధీంచుచు భయంకరమగు తపస్సు ఆచరించెను. ఆమే ఋషులందరవలె ఉత్తమ వ్రత నియమములను పాటించుచు కృచ్చము చాంద్రాయణము మొదలగు ఆహార నియమములు పూని ఫలములే ఆహారముగా ఉండియు దేవతలకును భయమును కలిగించు తపస్సు ఆచరించెను. సమగ్రముగ నూరేండ్లు ఆమె ఇట్లు తపస్సు సాగించెను. జ్వరము చేతను భయము చేతను ఆకులురాలై తపస్సు వేడిమిచే తప్తురాలై వసిష్ఠుడు మొదలగు మహర్షులను ఇట్లడిగెను: . తాము నాకు పుత శోక వినాశకరమును ఇహపర లోకములందు సౌభాగ్య ఫలము నిచ్చునదియు అగు వ్రతమును నాకు ఉపదేశించుడు. అనగా వసిష్ఠాది మునులు ఆమెకు మదన ద్వాదశీ వ్రతమును తెలిపిరి. దాని ప్రభావముననే ఆమెకు పుత్రశోకము లేకుండ పోయెను, అనగా విని శౌనకాదులు సూతుని ఇట్లడిగిరి : సూతా ! దితి మరల నలువది తొమ్మిది మంది కుమారులను పొందగల ఫలమునిచ్చిన మదన ద్వాదశీ వ్రతమును వినవేడుచున్నాము. అనగా సూతుడిట్లనెను : వసిష్ఠాది మహర్షులు పూర్వము దితికి చెప్పియు.డిన మదన ద్వాదశీ వ్రతమును విస్తరముగా చెప్పెదను; నా నుండి వినుడు.
చైత్ర మాసమున శుక్ల పక్షమున ద్వాదశి తిథినాడు వ్రత నియమములను పూని రంధ్రములు లేని కడవను తెల్లని, బియ్యముతో నింపి. నిలువవలెను. (స్థాపనము) దాని పై రాగి పళ్లెరమును, ఉంచవలెను. దాని పై తెల్లని గంధము పూయవలెను. తెల్లని వస్త్రముల జతతో దానిని కప్పవలెను. దానియందు నానా విధములగు ఫలములను చెరకు ముక్క అను. నానా విధములగు. భక్ష్యములను ఉంచవలెను. యథాశ క్తిగ బంగారము కూడ ఉంచవలెను. నడుమ బెల్లము. నుంచి దానిపై అరటి అకులు పరచి వానిపై మన్మథుని శక్తి రూపలగు దేవతలతో కూడిన రతీదేవిని అతనికి ఎడమ ప్రక్కను ప్రతిష్ఠించవలెను. అతనికి గంధ దీపధూప నైవేద్యముల నర్పింపవలెను. ఇట్టివి అన్నియు సంభవము కాని యెడల మన్మథ విష్ణువుల ప్రతిమలను సిద్ధపరచవలేను. కాముని పేరితోనే హరి ప్రతిమను గంధజలముతో స్నానము చేయించ వలేను. తెల్లని పూలతో అక్షతలతో నూపులతో పూజించవలెను. ఆ మంత్రములు:కామాయ నమః-పాదౌ పూజయామి; సౌభాగ్యదాయ నమః-జం ఘే పూజయామి; స్మరాయ నమః ఊరూ పూజయామి; మన్మథాయ నమః కటిం పూజయామి; స్వచ్చోదరాయ నమః-ఉదరం పూజయామి; పంచశ రాయ నమః బాహూ పూజయామీ; సర్వభూతాయ నమః హృదయం పూజయామి; అనంగాయ నమః-ఉరః పూజయామీ; పద్మముఖాయ నమః-ముఖం పూజయామి; ప్రసూనధను షే నమః-భువే పూజయామి; సర్వాత్మనే నమః-మౌళిం పూజయామి; అని ఇట్లు కామ నామమున విష్ణుని పూజించవలెను.
రెండవనాటి ఉదయమున ఆ కులభమునంతటిని బ్రాహ్మణునకు దానమీయవలెను. పిమ్మట బ్రాహ్మణులను భుజింపజేసి యజమానుడు తానును లవణము లేని ఆహారమును భుజించవలయును. తరువాత ఈ యర్ధమునిచ్చు మంతముచ్చరించుచు బ్రాహ్మణునకు దక్షిణనీయవలెను. “ఈ వ్రతాచరణముచే కాముని రూపమున నున్న పోడును సర్వ భూతముల హృదయము లందునుండి ఆనందరూపుడని చెప్పబడువాడునగు విష్ణువు ప్రీతి నందుగాక!” సూర్యోదయ మయిన తరువాత స్నానము చేసియే ఈ దానము జరుపవలేను. ద్వాదశినాడు ఒక ఫలమును మాత్రము ఆహారముగ తిని నేలమీద పరుండి త్రయోదశి నాడు ఇట్లు విష్ణుని పూజింపవలేను.
ఈ విధానమున ప్రతి మాసమునందును పం డెండు మాసములు జరుపవలేను. పదుమూడవ మాసమున నేతితో ధేనువుతో కూడ సర్వోపకరణములతో ఉపస్కరములతో కూడిన శయ్యను మన్మథునకు అర్పించవలెను. ఎట్లన బ్రాహ్మణ దంపతులను పూజించి ఆభరణములను వస్త్రములను ధరింపజేసి బంగారముతో చేసిన మన్మథుని ప్రతిమను తెల్లని పాడి యావును పై దెల్పిన శయ్యను నేతిని ఆవును వారికి 'ప్రీయతాం కామ రూపో హరిః' అని చెప్పుచు దానమీయవలెను. తెల్లని శుద్దమేన నూవులతో 'కామాయ స్వాహా' అని చెప్పుచు హోమము చేయవలెను. ధర్మవేతయై యజమానుడు ధన వ్యయమునకు వెనుకాడక ఆవు నేతితో పాయసముతో బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. తరువాత వారికి చేయకు గడలను పూలమాలలను యథాశక్తి ఈయవలేను. ఈ విధానమున మదన ద్వాదశీవ్రతము నాచరించినవాడు మహా పాతకముల నుండీ ముక్తుడయి విష్ణు సారూప్యమును పొందును. ఈ లోకమునందు శ్రేష్టులగు పుత్రులను సౌభాగ్యమును శుభమును పొందును. కామరూపియగు ఈ విష్ణువు ఆనందాత్ముడగు మహేశ్వరుడును కావున సుఖమును పొందగోరువారు మన్మథ రూపముతోనున్న ఈశ్వరుని స్మరించి పూజించవలెను.
ఇది విని దితి ఈ వ్రతమునంతయు ఏమాత్రమును లోపము లేకుండ జరి పెను. వ్రత మాహాత్మ్యమువలన కశ్యపుడు ఆమె కడకు మీగుల సంతోషముతో వచ్చెను. చిక్కిపోయిన ఈమెను మరల ఎప్పటివలే రూప యావనములు కలదానినిగా చేసెను. వరము కోరుకొమ్మనెను. ఆమెయు ఇట్లు మేలైన వరమడిగేను. ఇంద్రుని చంపగల సమర్థుడును అమిత బలము కలవాడును మహాత్ముడు దేవతలందరను గూడ నశింపజేయువాడును అగు కుమారుడు నాకు కలుగవలెను. అని ఆమె కోరగా కశ్యపు డిట్లు పలి కెను. నీవు ఎట్టి క్లిష్టమగు వ్రతముల నయినను అనుష్టించగలదానవు. నీవు చేసిన ఈ వ్రత మహిమతోనే నీకు ఇంద్రుని చంపు కుమారుని ఇచ్చు చున్నాను. కాని నీవు మరియొక పని చేయవలయును. ఆప స్తంబునిచేత ఇందుల కై ఇష్టిని జరిపించుము. పిమ్మట నీ గర్భమును ఇంద్రుని చంపగల దానినిగా చేయుదును. అట్లే ఆపస్తంబుడు అధిక ద్రవ్యము వెచ్చించి పు తోషిని జరి పెను.. అతడు ఇంద్రశ తుని కుమారునిగా పొందుము. అని సవిస్తరముగా హోమము చేసెను.
అంతట కశ్యపుడు దితికి గర్భము కలిగించెను. ఆమెతో పిమ్మట అతడిట్లు పలికెను. నీవు ఈ గర్భము విషయమున యత్నము పూనవలసినది. నీవు తపోధనురాలవయి ఈ తపోవనమునందే యుండి ఒక నూరు సంవత్సరముల పాటు ఈ నియమములను పాటించవలేను. ఏమన-గర్బిణిశ్రీ సంధ్యా సమయమునందు భుజించనేదు. ఎట్టి సమయము నందును చెట్ల మొదళ్ళ దగ్గరకు పోరాదు. రోలు రోకలి మొదలగు ఉపక రణముల పై కూర్చుండ రాదు. నీట మునుగరాదు. శూన్య గృహములలోనికి పోరాదు. పుట్టల పై కూర్చుండ-నిలుచుండరాదు. మనస్సున భయమును ఆవేశమును పొందరాదు. గోళ్ళతో బొగ్గులతో బూడిదతో భూమిని గీయరాదు. మంచముల పైని కూర్చుండరాదు. వ్యాయామము చేయరాదు. ధాన్యపుపొట్టు బొగ్గులు-బూడిద - ఎముకలు-పు రేలు_వీని పై కూర్చుండ రాదు. ఒడలు విరుచుకొనుట కలహించుట తగదు. ఎట్టి సమయమునం దును జుట్టు విరియబోసికొని కాని అశుచియె కాని ఉండరాదు. ఉత్తరమునకు పడమటకు తల పెట్టి నిదురించ రాదు. వివస్త్రగా గాని భయావేశములతో గాని తడి కాళ్ళతో గాని ఉండరాదు. అశుభములు మాటలాడ రాదు. అధిక హాస్యములాడరాదు. ఎల్లప్పుడు శుభ లక్షణములతో నుండి పెద్దలను సేవించుచుండవలెను. అన్ని ఓషధులతో వేడినీటితో స్నానమాడవలెను. తన దేహర క్ష చేసికొనుచు చక్కని ఆభరణములు ధరించి శ్రద్దతో గృహ పరిసరముల నలంకరించి ఉంచుకొనుచు గృహ దేవతల పూజించుచు సంతుష్టి చేందిన ముఖము కలదై భర్తకు ప్రీతి హితము కలిగించునవే ఆలో చించుచు మాటలాడుచు చేయుచు ఉండవలెను. దానములను చేయుచు శుక్లపక్ష తృతీయాదినమున గౌరిని పూజించుచు నక వ్రతమును ఆచరించవలెను. ప్రతి స్త్రీయు ఇట్టే యుండవలెను. విశేషించి గర్భిణి ఇట్లు ఉండవలెను. ఆమెకు కలుగు కుమారుడు మంచి శీలము ఆయుర్వృద్ధి కలవాడగును. లేనిచో గర్భపతనము కలుగు నవకాశము గలదు. కనుక నీవు ఇట్లు నడచుకొనుచు గర్బము విషయములో ప్రయత్న పరురాలవై యుండుము. నీకు శుభమగును. వెళ్ళివత్తును. అని కశ్యపుడు పలుకగా దీతీయు 'సరే' అనెను. అంతట సర్వభూతములు చూచుచుండ గానే కశ్యపు డచ్చటనే అంతర్ధానము నందెను.
అప్పటి నుండి దితియును కశ్యపుడు చెప్పిన విధమున నడుచుకొనుచుండెను.
తన శత్రువగు బలాసురుని చంపినవాడగు ఇంద్రుడును అట్టి తలంపుతోనే తన స్వర్గలోక మును విడిచి దీని సేవింపగోరి ఆమె కడకు వచ్చెను. ఆమెలో ఏదయిన దోషము ఎప్పుడు కలుగునో యని అతడు గమనించుచుండెను. అందులకై అతడు బయటికి మాత్రము ప్రశాంత ముఖము కలవాడు ఏ ఇతర విషయముల పై మనస్సు నుంచనివాడు వినయము కలవాడునై యుండెను. ఆమె ఇచ్చిన ప్రతియొక ఆజ్ఞను అనుసరించుచు త్రికరణములతోను మంచి పనినే చేయుచు ఉండెను. ఇట్లు మూడునాళ్ల తక్కువగా నూరు సంవత్సరములు గడచెను. దితియు తాను కృతార్థురాలయినట్లు భావించుచు ప్రీతురాలయి మనస్సులో ఆశ్చర్యము నంద సాగేను. అట్టి స్థితిలో నిదొ భారము తను ఆక్రమించగా పర వశురాలై కాళ్లు కడిగి కొనవలసి యున్నను కాళ్లు కడుగుకొనక యే జుట్టు విరియబోసికొని ఒకానొక చోట పండుకొనెను. అంతట ఈ అవకాశము దొ కిసదే చాలునని ఆ దేవరాజు దితి గర్భములో ప్రవేశించెను. వజ్రముతో ఆమె గర్భమును ఏడుగా చీల్చెను. దానిచే సూర్యునివలె వర్చస్సు కల కోమలులయిన చిన్న పిల్లలు ఏడు మంది ఏర్పడిరి. ఆ బాలురు ఏడువ సాగిరి. ఏడువ వద్దనుచు ఇంద్రుడు వారిని నిషేధించెను. ఐనను వారు ఏడ్చుచునే ఉండిరి. వృత్రాసురుని చంపిన వాడగు ఆ ఇంద్రుడు ఇంకను దితి గర్భమునందే ఉండి వారిని. ఒక్కొక్కరిని ఏడేసి ముక్కలుగా నర కేను. ఇట్లు నలు వది తొమ్మిది మందిగా చీల్చబడిన ఆ శిశువులు ఇంకను ఏడ్చుచునే ఉండిరి. ఏడువ వద్దు (మా-రుదధ్వం) అని ఇంద్రుడు వారిని మాటి మాటికి వారింపసాగేను. ఇది ఏమి ? ఏ ధర్మానుష్టానము చేసిన మాహాత్మ్యము వలన ఇట్లు జరిగినది ? ఎంత చీల్చినను వీరు చావ రే : అని ఇంద్రుడాలోచించెను. అతడు ధ్యానయోగ బలమున ఇది మదన ద్వాదశీ వ్రతఫలమని తెలిసికొనెను. ఇది నిశ్చయముగా విష్ణు పూజనము వలన కలిగిన ఫలమే. ఇట్టి కృష్ణానుగ్రహము కలవారు వజ్రముతో దేబ్బ తీనీయును నాశము పొందరు. గర్భమునందలి శిశువు తానొక డై యుండియు అనేక ఖండములుగా చీల్చబడియు మరణించలేదు. వీరందరును మరల చీల్చబడియు చావక అవధ్యులై యున్నారు. అందువలన వీరు దేవతలుగా అగుదురు. బారు ఏడ్చుచుండగా ఏడువవద్దు (మారుద) అని గర్భమునందే ఉన్న ఈ శిశువులు వారింవబడినారు. కనుక వీరు “మారుత' అను పేరితో ప్రసిద్ధులే దేవత లై) యజ్ఞాంశములను అనుభవింతురు. అని ఇంద్రు డనెను.
తరువాత ఇంద్రుడు మరల మరల దితిని తను క్షమించు మని వేడుకొని ఆమెను అనుగ్రహింప జేసికొనెను. నేను శాస్త్ర విరుద్ధముగా నడచినందున ఆ దుష్కృతమునకు ఫలితముగా నేనే ఈ అవకాశము చేసికొన్న దాన నైతినని దితి తలచేను. ఇం దుడును మారుతులకు దేవతలతో సమానత్వమును కలిగించేను. దీతీనీ ఆమె కుమారులన ఎక్కించి స్వర్గమునకు తీసికొని పోయెను. ఈ విధముగా మారుతులు అను దితి కుమారులు దేవతలై యజ్ఞ భాగములను (హవిస్సులను) అనుభవించగలవా రైరి. దేవతలతో సమానులై 6. దేవతలకు ప్రీతిపాత్రులు నైరి.
ఇది శ్రీ మత్స్య మహాపురాణమున మరుత్తుల ఉత్పత్తి యందు మదన ద్వాదశీ వ్రతము అను సప్తమాధ్యాయము.
Summary of chapter 7 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya instructs King Vaivashvata Manu on the sacred ritual of Madana-Dvādaśī-Vrata, a holy vow dedicated to Bhagavān Vishṇu in the form of Kāmadeva to obtain marital harmony, righteous progeny, and ultimate spiritual liberation. The rite is observed on the twelfth lunar day of the bright fortnight in the month of Chaitra, requiring devotees to maintain bodily purity, perform ritual bathing, and construct a golden icon of Kāmadeva alongside Rati placed upon a copper vessel filled with water and aromatic herbs. The practitioner offers fragrant flowers, incense, sweet delicacies, and white garments while reciting sacred mantras dedicated to Bhagavān Janārdana. The observance concludes with generous gifts of cows, land, and food to learned Brāhmaṇas, ensuring the removal of all past sins and the attainment of residency in the realm of Vishṇu.