మత్స్య మహా పురాణము
288 - మహాభూతఘటదాన విధానము.
శ్రీమత్యుడు మనువునకు ఇట్లు చేప్పెను: ఇప్పు డిక మహాపాతక నాశనమును మహోత్తమమునగు మహాభూత ఘటదానమును వివరింతును; పుణ్యకరమగు పర్వదినమందు తులాపురుష దానమందువలెనే బ్రాహ్మణులచే పుణ్యాహ వాచనమును జరిపించుకొనవలెను. అట్లే ఋత్విజులను మండపమును సంభారములను వస్త్రభూషణాదులను సమకూర్చు కొనవలయును; లోకపాలావాహనమును జరుపవలయును; ప్రాదేశ పరిమాణమునకు తక్కువకానిదియు నూరంగుళములకు మించనిదియునగు మహార త్న ఖచిత సువర్లమటమును చేయించి దానిని పాలతోనో నేతితోనో నింపి దానితో కల్పవృక్ష మును కూడ జతపరచవలయును; పద్మాసనగతులగు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తమ తమ వాహనములయందు మహేంద్రాదిలోకపాలురను వరాహదేవునిచే ఉద్ధరించబడి పంకజముతో కూడియున్న పృథివిని మకరము పై కూర్చుండి యున్న వరుణుని మేషారూఢుడగు అగ్ని ని నల్లని ఇర్రి పై కూర్చున్న వాయువును మూషక స్థుడు అగు కోశాధిపతియైన వినాయకుని కూడ బంగారుతో చేయించవలెను.
వీటిని వేదపంచకముతో కూడ ఘటపు నడుమ నుంచవలయును; ఋగ్వేదమునకు అక్షసూత్రమును యజుర్వేద మునకు పద్మమును చేతులందును సామవేదమునకు వీణ సమీపమందు కుడివైపునను ఆథర్వవేదమునకు సుక్సువ కమల ములు కరములందును పురాణవేదమునకు అక్షసూత్రకమండలువులును వరదముద్రయు కరములందును ఉండవలయును; చుట్టుప్రక్కలందు సర్వధాన్యములు చామరములు ఆసనములు అద్దము పాదుకలు పాదరక్షలు ఛత్తము దీపికయు భూష ణములును శయ్యయు జలకుంభములును ఐదు వన్నెల వితానకమును ఉంచవలయును.
స్నానము చేసి దేవతాద్యుపాసనము జరిపి ఈ మంత్ర ముచ్చరించవలయును.
“ఈ చరాచర ప్రపంచమునందు సర్వభూతములకును ఆధార భూతులును మహాభూతములకు ఆదిదేవులును నగు మీకు నమస్కారము; ఇట్టి మీ దయవలన నాకు శాంతియు శివ శుభ)మును కలుగును గాక! మహా భూతముల ప్యా ప్తిలేని తత్వము బ్రహ్మాండమునందలి సర్వభూతములయందును ఏ యొక దానియందును లేదు; కావున పొనికి మూలభూతులగు ఈ దేవతల కృపచే నాకు అక్షయశ్రీ కలుగుగాక!”
ఇట్లుచ్చరించి మహాభూతఘటదానము చేయువాడు సర్వపాప వినిర్ముక్తుడే పరమగతి నందును; ఉత్తమ దేవతా శ్రీలచే స్తుతింపబడుచు పితృదింధు సమన్వితుడగుచు వైష్ణవ స్థానమును పొందును. ఎవడి షోడశ మహాదానముల నాచ రించునో ఆ మానవుడు ఇహలోకమునందు పునరావృత్తి నందడు.
ఎవడు ఈ విధముగా నున్న ఈ షోడశ మహాదాన కల్పమును వాసుదేవ సన్నిధియందు పఠించునో సుతకలత పుత్రసహితుడై లెస్సగ వినునో అతడు మురాసురశతుడగు విష్ణుని భవనమందు రవిసమాన తేజః కాంతులతో నిండి అమరపుర స్త్రీలతో కూడి సదా మోదము నందును.
ఇది శ్రీ మత్స్య మహాపురాణమున షోడశ మహాదానాను కీర్తనమున మహాభూతఘట ప్రదానికమను రెండు వందల ఎనుబది ఎనిమిదవ అధ్యాయము.
Summary of chapter 288 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya details the procedure for Kalpalatā-dāna, the fourteenth Mahādāna featuring ten golden wish-fulfilling creepers adorned with golden leaves, flowers, fruit clusters, and bird icons. Bhagavān Matsya describes arranging the golden creepers upon a sanctified wooden altar, worshipping them as the embodiments of divine grace and prosperity. The donor presents the golden creepers along with garments, copper vessels, and ritual honorariums to pious Vedic scholars, securing continuous family prosperity, artistic mastery, and eternal joy in heavenly realms.