మత్స్య మహా పురాణము
12 - ఇలుని వెదుకుటకు ఇక్ష్వాకు ప్రభ్రుతులు శరవణమునకు పోవుట
సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పెను: అనంతరము వైవస్వత మను కుమారులగు ఇళుని సోదరులు ఇక్ష్వాకుడు మొదలగు వారు రాజగు ఇళుని వెదకుచు శరవణోద్యాన సమీపమునకు వెళ్ళిరి. వారు అందరకు అచ్చట తమ ఎదుట ఒక ఆడు గుర్రము కనబడెను. దాని మేను రత్న ములు తాపటము చేసిన పల్యాణము జీను)తో ప్రకాశించు చుండెను. ఆ బడబ చాల ఉ త్త్రమ మయినది. ఉ తమ లక్షణములు కలది. వారు ఆ పల్యాణమును గుర్తించిరి. అది తమ. రాజగు ఇళుని అశ్వమునకు సంబంధించినదే. అని తెలిసి వారాశ్చర్యపడిరి. ఇది ఆ మహాత్ముని (ఇళుని) చంద్రప్రభమను పేరు గల గుర్రమే. ఇది ఉత్త్రమ మగు బడబగా మారినది. ఇందుకు హేతువు ఏమి ? అని ఆలోచించిరి. తరువాత వారు తమ పురోహితుడగు వసిష్ఠునికడకు పోయి "అయ్యా! మీకు యోగవే తలలో । శేషులు. ఎందువలన ఈ విచిత్రము జరిగేనో తెలుపుడు ” అని వేడిరి.
వసిష్ఠుడును తన జ్ఞానమయ నేత్రముతో చూచి ఇట్లు చెప్పెను: “ఈ శరవణమున ప్రవేశించిన పురుష స్రాణి స్త్రీత్వమును పొందును. అని పూర్వము పార్వతి ఈ ఉద్యానము విషయమున వ్యవస్థ : నెను. దాని చేతనే .(దీనిలో ప్రవేశించినందున) రాజుతో పాటుగానే ఈ. అశ్వము . గూడ స్త్రీత్వమును పొందినది. కుబేరునితో సమానుడగు ఈ ఇళ రాజు మరల పురుషుడగు సట్లుగా యత్నము చేయవలసి యున్నది. ఆందులకై పర మేశ్వరుని ఆరాధించి, అనుగ్రహింప జేసికొనవలసి యున్నది."
అంతట ఆమను పుత్రులు మహేశ్వరుడు ఉన్న చోటికి పోయిరి. పార్వతీ పరమేశ్వరులకు వివిధ స్తోత్రములతో స్తుతించిరి. వారు వీడితో ఇట్లు పలికిరి. "ఈ వ్యవస్థ దాటరానిది. కాని ప్రస్తురమున ఇట్లు చేయుడు. ఇక్ష్వాకుడు అశ్వ మే ఫము చేసి, దాని ఫలమును మాకు అర్పణ, చేయవలయును. దాని వలన ఇళ మరల పురుషుడై) కింపురుషుడుగా అగును.”
ఆ మాట విని ఆ మనుపుత్రులందరును అట్లేయని వెళ్ళిరి. ఇక్ష్వాకుడు అశ్వమేధము చేసి తత్పలమును పార్వతీ పర మేశ్వరులకు అర్పించెను. ఇళ (ఇళుడు) కింపురుషుడయ్యెను. తరువాత ఆ వీరుడు ఒక మాసము పురుషుడుగా ఒక మాసము స్త్రీగా అయ్యెను. ఇళుడు ఇళగా బుధుని గృహమున ఉన్న కాలములో ఆమె గర్భము ధరించెను. ఆమెకు అనేక సద్గుణములు గల ఒక కుమారుడు కలిగేను. ఇట్లు {ఇళా గర్భమున ! ఒక కుమారుడు కలిగిన తరువాత బుధుడు మరల స్వర్గ లోకమునకు పోయేను. ఇళ పేరట ఆ దేశ భాగమునకు ఇళావృత వరమను పేరు వచ్చెను. ( ఇది బహుశ : నేటి మంగోలియా) ఇట్లు ఇళ కుమారుడగు ఐళుడు చంద్ర సూర్య వంశముల రెంటి నుండియు పుట్టిన వాడై ఆ వంశములకు వృద్ధిని (ఆ భివృద్ధిని శుభమును కలిగించు వాడయ్యెను. అతని పేరు పురూరవసుడు. అతడు చంద్ర వంశమును వృద్ధి చేయువాడయ్యెను. ఇక్ష్వాకుడు సూర్యవంశకర్త అయ్యెను.
ఇళుడు కింపురుషుడుగా ఉన్న సమయమున అతనికి సుద్యుమ్నుడు అని పేరు. ఆ సుద్యుమ్ను నకు శత్రువులచే ఓటమి నేరుగని వీరులగు ముగ్గురు కుమారులు కలిగిరి. వారిలో ఉత్కలుడు ఉత్కల దేశములకు గయుడు గయకు హరి తాశ్వుడు కురు జన పదములతో కూడిన తూర్పు దేశమునకు రాజులైరి.
ఇళుడు స్త్రీత్వమున తన కుమారుడగు పు హరవసుని ప్రతిష్టానము అను నగరము రాజధానిగా (ఆర్యావర 4 గమునకు) రాజుగా అభి షేకించి తాను కంద మూల ఫలములాహారముగా వానప్రస్థ వతమును ఆనుష్ఠించుట క్రే వనము నకు ఏగేను.
ఇళుని సోదరుడగు ఇక్ష్వాకుడు మధ్య దేశమునకు (హిమాలయము ఏంధ్యము వినశనము ప్రయాగ ఈ నాలుగు ఎల్లలకు నడుమ ఉండు దేశమునకు) రాజయ్యెను. నరిష్యంతుని కుమారుడు శఫుడు. నా భాగుని కుమారుడు అంబరీషుడు. ధృష్టునకు ధృష్ట కేతుడు చిత్రనాథుడు రణధృష్ణుడు అనువారు ముగ్గురు కుమారులు. ఆనర్హుడను కుమారుడును దారికా అను కన్యయును శర్యాతి సంతానము. ఆనరుని కుమారుడు ప్రతిషశాలియగు రోచమానుడు. అతని దేశము ఆన రము, అతని రాజధాని కుశస్థలి. ఆనర్సు : మారుడు రేవుడు. అతని కుమారుడు రైవతుడు. అతని కే కుద్మోన్ అనియు పేరు. ఇతడు దేవుని కుమారులు సూరుమందిలో జ్యేష్టుడు రైవతుని కూతురు రేవతి బలరాముని భార్యగా ప్రసిద్ధురాలు. కరూశునకు చాలమంది కుమారులు కలిగిరి. వారు కారూశులు అను పేర ప్రసిద్ధులు. వృషధ్రుడు (పృషదశ్వుడే మో?) గోవధమువలన తసగురుని శాపముచే శూద్రత్వమును పొందెను.
ఋషిణ తములో రా! ఇక్ష్వాకు వంశమును చెప్పబోవుచున్నాను వినుడు. ఇక్ష్వాకునకు కుక్షి కుక్షి కి వికుక్షి అను రాజ శ్రేష్టుడు కలిగేను. ఇతడు కుక్షి పుత్రుల నూరుగురలో పెద్దవాడు. వికుక్షి కుపూరులలో పదునై దుమందియే పర్వతపు టు తర దేశమునకు ప్రభువులైరి. (ఇచ్చట ఇక్ష్వాకు కుమారుడే వికుక్షీయని కొన్ని ప్రతులలో కలదు. వీరుకాక ఇంకను నూట పదునాలుమంది వికుక్షి కుమారులు మేరువునకు దక్షిణపు దేశ ... ను పాలించిరి. వీరిలో పెద్దవాడు కకుత్తుడు. అతని కొడుకు సుయోధనుడు. అతని కొడుకు పృథువు. అతని కొడుకు విశ్వశాఖుడు. అతని కొడుకు ఇంద్రుడు. అతని కొడుకు యవనాశ్వుడు. అతని కొడుకు శావస్తుడు. అతని కొడుకు వత్సకుడు. శ్రావసుడు గౌడ దేశములో తన పేర శ్రావ స్త్రీ నగరము నిర్మించెను. వత్సుని కొడుకు విహర కుడు. అతని కొడుకు కులాదుడు. ఆతడు దుందు అను వానిని చంపి నందున దుందుమారుడని ప్రసిద్ధి పొందేను. అతనికి దృఢశ్వుడు దండుడు కపిలాశ్వుడు అను ముగ్గురు కుమారులు. దృఢశ్వుని కుమారుడు ప్రయోదుడు. అతని కుమారుడు హర్యశ్వుడు. అతని కుమారుడు "నీకుంభుడు. అతని కొడుకు సంహతాశ్వుడు. అతనికి అకృతాశ్వుడు రణాశ్వుడు అను ఇద్దరు కుమారులు. రణాశ్వుని కుమారుడు 'యవనాశ్వుడు. అతని కుమారుడు మాంధాత. అతని కుమారులు పురుకుత్సుడు-ధర్మ కేతుడు - ముచుకుందుడు శత్రుజిత్ అను వారు నలుగురు. పురుకుత్సుని కుమారుడు వసుదుడు. అతడు నర్మదకు పతి. అతని కొడుకు సంభూతి. అతని కొడుకు తధన్వుడు. అతని కుమారుడు తైయారుణుడు. అతని కుమారుడు సత్యవ్రతుడు. అతని పుత్త్రడు సత్యరథుడు. అతని సుతుడు హరిశ్చంద్రుడు. అతని తనయుడు లోహితుడు. అతని కుమారుడు. వృకుడు. అతని కొడుకు బాహుడు.. . అతని వుత్తుడు సగరుడు. అతడు పరమ ధార్మికుడు. అతనికి ప్రభ భానుమతి అను ఇద్దరు భార్యలు. వారు పుత్రులను కనగోరి ఔర్వమునిని ఆరాధించిరి. అతడు మెచ్చి వారికి కోరిన వరములని ఇచ్చేను. ఆ వరప్రభావమున ప్రభకు అరువది వేలమంది కుమారులు కలిగిరి. భానుమతికి అసమంజుడు అను ఓ కే కుమారుడు కలిగెను. వారిలో ఆువదివేలమందియు భూమిని తప్వుచు కపిలరూపుడగు) విష్ణునిచే దగ్గులేరి. అసమంజుని కుమారుడు అంశుమంతుడని ప్రసిద్ధినొందెను.
అంశుమంతుని కుమారుడు దిలీపుడు. అతని సుతుడు భగీరథుడు. అతడే తపస్సుచే గంగను భూమికి తెచ్చే . క “.కనే గంగ భాగీరథినది. అతని కోడుకు సౌభాగుడు. అతని కుమారుడు అంబరీషుడు. అతని కుమారుడు సింధు ద్వీపుడు. అతని సుతుడు అయు తాయుడు. అతని పుత్రుడు ఋతుపర్ణుడు. అతని కొడుకు కల్మషపాదుడు. అతని కుమారుడు సర్వకల్పుడు. అతని కొడుకు అనరణ్యుడు. అతని కుమారుడు నిఘ్నుడు. అతనికి అనమిత్రుడు రఘువు ఆ ఇద్దరు కుమారులు. రఘుని కుమారుడు దిలీపుడు. అతని కుమారుడు అజుడు. అతని సుతుడు దీర బాహువు. అతని పుత్రుడు అజపాలుడు. అతని కుమారుడు దశరథుడు. అతనికి నారాయణుని అంశ వలన నలుగురు కుమారులు కలిగిరి. వారిలో జ్యేష్టుడు రాముడు. రావణుని అంతమొందించినవాడు అతడే. ఆయన రఘువుల వంశమునకు సమృద్ధిని శుభమును కలిగించినవాడు. భృగువంశ శేష్టుడగు వాల్మీకి అతని చరితమును రచి ను. ఇక్ష్వాకు వంశ వర్గ నులగు లవకుశులను ఇద్దరు అతని కుమారులు. కుశుని కుమారుడు అతిథి. అతని కుమారుడు నిషధుడు. అతని కుమారుడు నళుడు. అతని కుమారుడు నభుడు. అతని కుమారుడు పుండరీకుడు. అతని కొడుకు నే మధన్వుడు. అతని కుమారుడు వీరుడు ప్రతాప వంతుడునగు దేవానీకుడు. అతని కొడుకు అనగుడు. అతని కుమారుడు సహస్రాశ్వుడు. అతని కొడుకు చంద్రవ లోకుడు. అతని కుమారుడు తారాపీడుడు. అతని కుమారుడు చంద్రగిరి. ఆతని సుతుడు. భానుచితుడు. అతని పుత్రుడు శ్రుతాయువు. భారతయుద్ధమున మరణించిన శ్రుతాయువు ఇతడే. కశ్యపవంశ మున పుట్టి ప్రసిద్ధినొందిన నళులు ఇద్దరు. వారిలో ఒకడు వీర సేనునీ కుమారుడు. మరియొకడు నిషధుని కుమారుడగుటచే నైషధుడనబడిన నళుడు.
వివస్వంతుని సూర్యుని వంశమున జన్మించి బంగారునాణెములనే బంగారమునే అనేక విధ ద్రవ్యములనే దక్షిణలుగా ఇచ్చి భూరిదక్షిణలు యజముల నాచరించి ప్రసీదులయి లోకములకు మేలు చేసి ఇక్ష్వాకు వంశమున జన్మించిన వారే ప్రధానముగా ఇచట పేర్కొనబడినారు. (అనమిత్రుడు కృతయుగమున రాజగును.)
ఇది శ్రీమత్స్య మహాపురాణమున మత్స్యమను సంవాద ముప సూర వంశ వర్ణనమను ద్వాదశాధ్యాయము.
Summary of chapter 12 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya details the royal lineage of Ikshvāku, the eldest son of King Vaivashvata Manu, who established his capital at Ayodhyā and became the primary progenitor of the Solar Race. The chapter chronicles notable sovereigns including Vikukshi, his valiant son Kakutstha who rode the bull form of Indra during the war with Asuras, Pṛthu, Śrāvasta who founded the city of Śrāvastī, Kuvalāshva who earned the title Dhundhumāra by slaying the fiery subterranean demon Dhundhu, Māndhātā who became a universal emperor born from his father Yuvanāshva's drinking of consecrated water, Trishanku, Harishchandra, Sagara who performed ninety-nine horse sacrifices and whose sixty thousand sons dug the ocean, Bhagīratha who brought the holy river Gaṅgā down to earth, and Rituparṇa, concluding with the foretelling of future righteous rulers leading to Bhagavān Rāmachandra.