మత్స్య మహా పురాణము
78 - కమల సప్తమీ వ్రతము
ఈశ్వరుడు బ్రహ్మతో ఇట్లు చెప్పెను: ఇపుడిక ఇట్టిదే యగు కమల సప్తమీ వ్రతమును తెలి పెదను. దానిని కీర్తించినంతనే ఆదిత్యుడు సంతసించును. వసంత (చైత్ర వైశాఖములలో నేదైన) శుక్ల సప్తమినాడు తెల్లని ఆవల (పిండితో నూనె)తో స్నానము చేసి నూవుల పల్లెరమునందు నూతన వస్త్రయుగ్మమునుంచి దాని పై బంగారు కమలముంచి గంధపుష్పాదికముతో సమర్చించవలెను. కమలహస్తుడు.విశ్వధారి దివాకరుడు-ప్రభాకరుడు (పగటిని.ప్రకా శమును కలిగించువాడు అగు రవీ! నీకు వందనము. అని నమస్కరించవలెను. పిమ్మట వికాల సంధ్యా సమయమున విప్రుని వస్త్రమాల్య విభూషణములతో సంపూజించి ఈ సామగ్రితో సువర్ణ కమలమును ఉదకుంభమును శక్తి యున్నచో సాలంకారముగ క పిలగోవును విధానానుసారము దానమీయవలెను. సప్తమినాడుపవసించే అష్టమినాడు యథాశ క్తిగ భుజింపజేసి తానును భుజింపవలెను. సప్తమినాడు మాత్రము తైలము లేని ఉపాహారము తినవలెను.
ఇట్లు ప్రతిమాసమున ధ:ముండియు లోభి చక శుక్ల సప్తమినాడు సంవత్సరము పొడవున చేయుచు పోవల యును. వ్రతాంతమున (ఉద్యాపనముగా) బంగారు కమలము తో పాటు సర్వోపసరములతో శయనము (మంచము పడ కలు) బంగారు కొమ్ములు అలంకరించిన పాడి కపిల గోవును పాత్రలు పీఠములు ఆసనములు దీపములు మొదలగు ఇష్ట సామగ్రిని కూడ ఈయవలెను.
ఇట్లు కమల సప్తమీ వ్రత మాచరించినవాడు అనంతమగు లక్ష్మిని పొందుటయే కాక సూర్యలోకమున సుఖిం చును. కల్పమునకు ఒకటి చొప్పున ఏడు ఊర్వలోకములకు క్రమశః పోయి అచ్చట నెల్ల అప్సరసలతో పూజలందుకొని సుఖించి తుదకు ముక్తి నందును.
దీనిని సమగ్రముగా భ క్తితో వినినను తెలిపినను ఇహమున స్థిరమగు ఐశ్వర్యము ననుభవించి పరమున విద్యా ధర లోకమున సుఖించును.
ఇది శ్రీ మత్స్య మహాపురాణమున కమల సప్తమీ వ్రతమను డెబ్బది ఎనిమిదవ అధ్యాయము.
Summary of chapter 78 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya describes the Kamalā-Saptamī-Vrata, observed on the seventh lunar day during the spring solstice, dedicated to the joint adoration of Sūrya Deva and Goddess Lakshmī. The practitioner creates a large eight-petalled lotus design using golden powder or colored grains, placing a golden icon of the Sun God at the center surrounded by lotus flowers. The devotee worships the divine Lord with fresh lotuses, fragrant oils, incense, and milk-based sweets, maintaining deep devotional absorption throughout the day. The ritual concludes with presenting the golden lotus icon, garments, and food to a virtuous Brāhmaṇa, securing permanent residency of Goddess Lakshmī in the worshipper's home, abundant wealth, freedom from debts, and ultimate spiritual liberation.