మత్స్య మహా పురాణము
5 - దక్షసృష్ట్యా ది వివరణము
ఋషులు సూతు నిట్లు ప్రశ్నించిరి: సూతా! దేవతలు దానవులు గంధర్వులు నాగులు రాక్షసులు మొదలగువారి ఉత్పత్తిని ఇక మీదట మాకు విస్తరించి చెప్ప వేడుచున్నాను.
సూతుడు ఇట్లు చెప్పనారంభించెను: దక్ష ప్రజాపతికంటే ముందు వారు చేసిన సృష్టి సంకల్పమున దర్శన మాత్రమున స్పర్శనము వలన జరిగెడిది. ప్రాచేత సుడగు: దక్షుని మొదలుకొని సృష్టి స్త్రీపురుషుల సంయోగమువలన సంతా నోత్పత్తి జరుగుటతో ఆరంభమయినది. స్వయంభువుని ఆజ్ఞానుసారము దక్షుడు సృష్టి జరిపిన విధము తెలిపేదను వినుడు. అతడు జరిపిన సృష్టిలో దేవతలు ఋషులు నాగులు మొదలగు వారందరును అన్ని ప్రాణులును మైథునము (స్త్రీ పురుషుల కూడిక) వలన జనించి వృద్ధి పొందిన విధమును తెలిపేదను. దమునకు మొదట ఏబదివేల మంది కుమారులు కలిగిరి. వారు వివిధ ప్రజలను సృష్టింపదలచియుండుట చూచి నారదుడ వారితో ఇట్లు పలికెను. ఋషి సత్తములారా! మీరు మొదట భూమి పరిమాణమెంతయో పూర్తిగా తెలిసికొని పిమ్మట దానియందు సరిపోవునంత మంది ప్రజలను సృష్టించుడు. వారు ఆ మాట విని అందులకై బయలు దేరి అన్ని వైపులకు వెళ్ళిరి. సముద్రములోనికి పోయిన ''నదులు మరలిరానట్లు హర్యక్షుడు మొదలగు ఆ దముని కుమారులు ఇప్పటికిని మరలి రాకున్నారు. అంతట దక్షుడు వైరిణి అను భార్యయందు వేయిమంది కుమారులను క నేను. శ బలులు అను పేరుగల ఆ దక్షపుతులు సృష్టికి హేతుభూతులై యుండిరి. నారదుడు వారీకడకును వచ్చి మొదటి వలెనే ఇట్లు పలికెను. ఋషులారా! మీరు పోయి భూప్రమాణమును మీ అన్నల జాడను కూడ తెలిసికొనివచ్చి పిమ్మట సృష్టిని విశేషముగ ఆరంభించుడు. అనగe -విని వారును అన్ని దిక్కులకును పోయిరి. కాని మరలి రాలేదు. అందుచేతనే లోకములో తప్పిపోయిన అన్నల జాడ కనుగొనుటకు తమ్ములు పోరు. అట్లు ఒక వేళ వేద కుటకు పోయినచో కీడు కలుగును. కనుక అట్లు చేయరాదు. శ బలులు కూడ ను మరలి రాకపోగా ప్రాచేతసుడగు దక్షుడు వై రిణి యను భార్యయందు ఆరువదిమంది కూతుండను కనెను. వారిలో పదిమందిని ధర్మునకును పదుముగ్గురను కశ్యపునకును ఇరువది ఏడుమందిని సోమునకును నలుగురను అరిష్ట నేమికిని ఇద్దరను భృగు పుత్రునకును ఇద్దరను కృశాశ్వునకును ఇద్దరను అంగిరసునకును ఇచ్చెను. ఈ దేవమాతల వలన జరిగిన ప్రజా విస్తరమును ఆదినుండి చెప్పెదను. వినుడు. మొదటి పదిమందియును మరుత్వతి వసువు జామి- రేవా భానువు అరుంధతి సంకల్ప ముహూర్త సాధ్యా విశ్వ అను వారు ధర్ముని భార్యలు.
విశ్వకు విశ్వదేవులు సాధ్యకు సాధ్యులు మరుత్వతికి మరుత్వతులు వస్తువునకు వసువులు భానువునకు భాను వులు ముహూర్తకు ముహూర్తగణము రేవకు ఘోషులు అను దేవగణములు జామికి నాగవీథ్యాదులు అరుంధతికి పృథివీ తలమునందలి ప్రాణి సమూహము సంకల్పకు సంకల్పుడు అను వారు పుట్టిరి.
వీరిలో వసువుల సృష్టిని తెలి పెదను వినుడు. వీరు జ్యోతిష్మంతులు (ప్రకాశము కలవారు. అన్ని దిక్కు లందును వ్యాపించువారు. అంతట వ్యాపించి వసించువారు కనుక నే వారికి వసువులు అని వ్యవహారము. వారి పేరులు ఆపుడు ధ్రువుడు సోముడు ధరుడు అనిలుడు అసలుడు ప్రత్యూషుడు ప్రభాసుడు అనునవి. వీరిలో ఆపునకు శాంతుడు దండుడు సాంబుడు మణివ కుడు అను నలుగురు కుమారులు. వీరు యజ్ఞరక్ష కు అధికారులు. ధ్రువునకు కాళుడు సోము నకు వర్చసుడు ధరునకు కల్పానీకుడు ద్రోణుడు అనువారు అనిలుసకు రమణుడు శిశిరుడు అను ఇద్దరు అనలునకు శాఖుడు విశాఖుడు కార్తికేయుడు కృత్తికలయందు) అను ముగ్గురును ప్రత్యూషునకు దేవలుడు అను సమర్థుడగు ఋషి ప్రభాసునకు విశ్వకర్మయను ప్రజాపతియగు దేవశిల్పియు కుమారులు. ఈ విశ్వకర్మ ప్రాసాదములు భవనము లు ఉద్యాన ములు ప్రతిమలు ఆభరణములు గృహములు ఆరామములు కూపములు మొదలైన వాని నిర్మాణములలో దేవతలకు వడ్లంగి.
ధర్ముని సంతానమే యగు అజైకపాద్ అహిర్భుధ్యుడు విరూపాక్షుడు రైవతుడు హర్యశ్వుడు బహురూపుడు ప్రబకుడు సురేశ్వరుడు సావిత్రుడు జయంతుడు పినాకి అనువారు ఏకాదశ రుద్రులు. వీరు గణ దేవతలు. వీరి బలగము ఎనుబదికోట్ల మంది కలరు. వీరు వారికి అధిపతులై అన్ని దిక్కులయందు నుండి లోకరక్ష చేయుదురు. గర్భము నుండి జనించిన ఆది సంతానరూపమగు ప్రజాపతి పుత్ర పౌత్తుల వివరణము ఇది.
ఇది శ్రీ మత్స్య మహా పురాణమున దక్షసృష్టికథనమను పంచమాధ్యాయము.
Summary of chapter 5 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya details the creation of secondary divine beings who administer the cosmic order, beginning with the birth of Rudra from the anger of Bhagavān Brahmā. To assist in cosmic governance, Rudra multiplied into eleven radiant manifestations known as the Ekādasha Rudras, who were assigned dominion over the winds, directions, and cosmic forces. The chapter further details the lineage of Dharma, who married ten daughters of Daksha Prajāpati, giving birth to the eight Vasus named Āpa, Dhruva, Soma, Dhara, Anila, Anala, Pratyūsha, and Prabhāsa, who govern physical elements and luminous phenomena. The divine genealogy expands to describe the forty-nine Maruts born from Diti and modified by Indra with his thunderbolt, transforming their destructive potential into protective cosmic winds under divine dispensation.