మత్స్య మహా పురాణము
263 - దేవతా ప్రతిష్టా విధి - కుండ మండప వేదుల లక్షణము
ఋషులు సూతునితో నిట్లనిరి: సూతో! ఈ దేవతల ఉత్తమమగు ప్రతిష్టా విధిని కుండ మండప వేదుల ప్రమాణ ములను ఏమియు వదలక యథాక్రమమునను యథాన్యాయముగను (శాస్త్ర సంప్రదాయానుసారముగను యుక్తి యుక్తముగను) తెలుపుము. అన సూతుడు వారికిట్లు చెప్పెను :
మీరు అవి తెలిసికొన జిజ్ఞాసువులయి యున్నారు. కావున ఉత్తమమగు ప్రతిష్ణా విధానమును కుండ మండప వేదికల లక్షణమునుకూడ యథా శాస్త్ర విధానాను సారముగ తెలిపెదను.
కాలము
ఎల్ల దేవతల ప్రతిష్టలకును చైత్ర వైశాఖ జ్యేష్ట మాఘ ఫాల్గున మాసములు ప్రశస్తములు; శుక్ల పక్షమును ఉత్తరాయనమును మంచివి; తిథులలో ద్వితీయా తృతీయా పంచమీ సప్తమీ దశ మీ త్రయోదశీ పూర్ణిమలు మంచివి; ఈ చెప్పిన వానియందు యథావిధిగ ప్రతిష్ఠ జరిపినచో బహు ఫలము లభించును.
నక్షత్రములలో పూర్వాషాడోత్తరా షాఢలు-మూలోత్తర ఫల్గున్యుత్తరాభాద్రలు జ్యేష్ఠ శ్రవణము రోహిణి పూర్వా బాద్ర హస్త ఆశ్విని రేవతి పుష్యమి మృగశిర అనూరాధ స్వాతి- ఈ నక్షత్రములు మంచివి; బుధ బృహస్పతి శుక్రులు అను మూడు గ్రహములనేవి కాని చూచుచుండు లగ్న మును నక్షత్రమును ప్రశస్తములు.
గ్రహ బల తారా బలములను చూచికొని గ్రహపూజను జరిపి ప్రశ స్తమగు నిమిత్తమును శకునమును చూచికొని అద్భుతములు మొదలగు క్రూరములగునవేవియు జరుగని సమయమున శుభయోగమున క్రూర గ్రహములు లేని శుభ స్థానమున (రాశియందు) శుభలగ్నమునందు శుభ నక్షత్రమునందు ఆయన పుణ్య కాల విషువ పుణ్యకాల షడశీతి ముఖ పుణ్య కాలములందు శాస్త్ర విధానమునందు చెప్పిన ఆయా కర్మలననుష్ఠించుచు దేవతా ప్రతిష్ఠ జరుపవలయును.
ముహూర్తముల విషయమున-ప్రాజాపత్యముహూర్తమునందు దేవతార్చామూర్తి శయనమును శ్వేత ముహూ రమునందు ఉత్థాపనమును బ్రాహ్మముహూర్తమునందు స్థాపనమును (ప్రతిష్టాపనమును) జరుపవలయును.
మండపాది లక్షణము
ప్రాసాద (దేవాలయ)మునకు ఉత్తరమందుకొని తూర్పునకాని (హోమాది ప్రక్రియలకు) మండపముండవల యును; ఆది పదునారుకాని పండ్రెండు కానీ హస్తముల (మూరల) ప్రమాణముకల నాలుగు భుజములతో చతురస్రాకృతితో నుండవలయును; దాని నడుమ వేదిక యుండవలయును; ఈ మండపము చుట్టును ఆంచుకట్ట మొదలగు అవధి జ్ఞాపి కలు ఉండవలయును. ఈ వేదిక నాలుగుకొని ఐదుకోని ఏడు కాని మూరల భుజములతో చతురస్రముగా నుండవలయును; ఈ మండపము చతుర్ముఖమై నాలుగు వైపులను నాలుగు తోరణములతో (ద్వారములతో) నుండవలయును; ఈ ద్వారములలో తూర్పు ద్వారము జువ్వి కొయ్యతో దక్షిణ ద్వారము మేడి కొయ్యతో పశ్చిమ ద్వారము రావి కొయ్యతో ఉత్తర ద్వారము మర్రి కొయ్యతో చేయవలయును; ఈ ద్వారముల నిలువు కమ్ములు ఐదు మూరల పొడవుతో చేయవలయును; ఆందు ఒకమూ రేడు ముక్క భూమిలోనికిపోగా నాలుగు మూరలు భూమి పై నుండును.
మండప మందలి భూతల మంతయు చక్కగా అలికి కంటికి ఇంపుగా నుండునట్లు చేయవలయును; దానినంత టీని నానా విధ వస్త్రములతోను పుష్పములతోను పల్లవములతోను అలంకృతమునుగా చేయవలయును; ఇట్లు మండపమును శోభింపజేసిన తరువాత నాలుగు ద్వారములందును ఒక్కొక్క ద్వారపు రెండేసి నిలువు కమ్ముల దగ్గరను రెండేసి చొప్పున మొత్తము ఎనిమిది కలశములను ఉంచవలయును; వానికి రంధ్రములు సొట్టలు మొదలగునవి యుండరాదు; వానియందు ప్రకాశించు పదారు వన్నె బంగారు ఉంచవలయును; మామిడి చిగుళ్లతో వానిని కప్పవలయును; రెండేసి నూతన వస్త్ర ములు చుట్టవలెను; నానా పుష్ప ఫలములనందుంచవలెను; ఇట్టి ఈ కలశములను చందనోదకముతో నింపవలయును; ఆ మండపాంతర్భాగమునందు ఇవియన్నియును నిలిపి వానికి గంధ ధూపొదికముతో ఆర్చనలు జరుపవలయును; తరు వాత మండవము పై అన్ని వైపులను ధ్వజములను (జెండాలను) ఎక్కించవలెను. ఇవికాక అన్ని దిక్కులందును ఆయా దిక్పాలకులకు చెందిన ధ్వజములనుకూడ ఎక్కించవలయును; మండపపు పై భాగమున నట్టనడుమ మేఘమువంటి ధ్వజ మును ఒక దానినికూడ ఎక్కించవలయును; వానికి ఆయా దేవతా మంత్రములతో గంధ ధూపాదికముతో యథాక్రమ ముగ అర్చనలు జరుపవలయును; వారి వారి మంత్రములతో లోకపాలురకు బలులుకూడ అర్పించవలయును; బ్రహ్మకు అంతటిలో పై భాగమందును శేషునికి వాసుకికి అంతటిలో క్రింది. ప్రదేశమందును పుష్ప గంధాదికమును అర్పించవల యును; ఆయా దేవతలకే ఏయే మంత్రములు శ్రుతియందు చెప్పబడి యున్నవో ఆయా లోకపాలురకు ఆయా మంత్రము లతో పూజయును జరుపవలయును. ఇట్లు తోరణ నపాతముగా ఆధివాననశాలను ఏర్పరచిన తరువాత దేవతా మూర్తులకు ఒక రాత్రిని మూడు రాత్రులు కాని ఐదు రాత్రులు కాని ఏడు రాత్రులుకొని ఆధివాసనము జరుపవలసియుండును.
ఈ ఆధివానన మండపమునకు ఉత్తరమున ఈ మండలపు కోలతలో సగము కోలతతో కానీ మూడవవంతు కొలతతో కాని నాలుగవంతు డోలతతోకాని స్నానమండపమును నిర్మించవలయును. లింగమునో అర్చామూర్తినో (ప్రతిష్ఠించవల సినదానిని) తెప్పించిన తరువాత ఆ తెచ్చిన శిల్పులను వారి పరిచారకులను కూడ యజమానుడు ఆయా విషయములను సంప్రదాయములను ఎరిగి వస్తాథర జాదికముతో పూజించవలయును. తరువాత క్షమించుడని అతడు వారిని ప్రార్థించవలయును.
నేత్రోన్మీలన విధానము.
[ఈ చేప్పబోవు ప్రక్రియను నేత్రోన్మీలనము-నేత్రోద్దరణము (కనురెప్పలు పైకెత్తుట కనులు తెర చుటకనులకు చూపు వచ్చునట్లు చేయుట కనులకు ప్రకాశమును జ్యోతిస్సును కలిగించుట) మొదలగు పదములతో ఇందు వ్యవహరించి యున్నారు. దేవతా ప్రతిష్టాప్రక్రియయందీది ముఖ్యాంశము.]
నేత్రోన్మీలనవిధిః.
దేవుని అర్చామూర్తిని (లింగమును) దర్భలు మొదలగు వానితో ఏర్పరచిన ప్రస్తరణము పై పొన్పు పైడించి ఆ మూర్తికి నేత్ర జ్యోతిస్సును ప్రకల్పింప (ఏర్పరచవలయును; సంక్షేపముగా ఈ అత్యుద్ధరణ ప్రక్రియను (ఆక్షి+ ఉద్దరణము = అత్యుద్ధరణము-కనులు పైకెత్తుట-మూతను తెరచుట-ఆని యర్థము) తెలి పెదను - వినుడు; మూర్తిని తెల్లని పూవులతో అలంకరించి నేతితోను గుగ్గులుతోను ధూపమిచ్చి ఆర్చించవలయును; తెల్లని ఆవలతోను నేతి పాయసముల తోను మూర్తికి బలి (నివేదనము) జరుపవలయును: విప్రులనుకూడ ఆర్చించవలయును; యథాళ కిగ వారికి గోవునో
Summary of chapter 263 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya presents a specialized guide on the architectural design, proportions, and construction of stone and wooden pedestals known as Pīṭhikās or Altar Bases upon which divine icons are installed. Bhagavān Matsya categorizes pedestals into distinct structural types such as Śrīvatsā, Skandapīṭha, Bhadrapīṭha, Mahāpīṭha, and Padma-pīṭha based on their molded tiers, drainage channels known as Praṇālas, and base dimensions. The text emphasizes that the pedestal must match the exact proportions of the installed icon to ensure proper drainage of ritual bathing liquids and spiritual stability.