మత్స్య మహా పురాణము
130 - దానవులచే బాధితులగు దేవతలు మహేశుని స్తుతించుట
బ్రహ్మదర్శనార్థం ఆదిత్యాదిదేవతానాం సత్య లోకగమనమ్
ఆంతవరకును సుశీలురుగా నుండిన త్రిపుర దుర్గ స్థులగు దైత్యులు దానవులు ఇట్లు దుష్టులును దురాత్ములు నయిరి. వారు లోకములను నాశము చేయసాగిరి. తపోధనుల తపోవనములను పెకలింపసాగిరి. దైత్యుల సింహనాద ముతో ప్రాణులు భయభీతములు కాసాగేను. త్రైలోక్యమును భయముతో సమ్మోహిత మే చీకటిలో కన్నులు ఈనబడ నట్లయ్యెను. అంతట ఆదిత్యులు వసువులు సాధ్యులు పితరులు మరుద్గణములు భీతులయి లోక ప్రపితామహుడగు బ్రహ్మను శరణు వేడ బోయిరి. వారు సువర్ణ కమల పీఠమున ఆసీనుడయి యున్న ప్రపితామహుని సమీపించి దర్శించి అందరు నొక్కటిగ నమస్కరించి ఇట్లు పలికిరి: దేవా! నీ వరములచే దర్పించి ఈ త్రిపుర దుర్గావాసులగు దానవులు ప్రభువులు తమ సేవకులను బాధించినట్లు మమ్ముల బాధించుచున్నారు. వారి భయమున మేము సింహములకు భయపడు మృగముల వలే పృథివి యందంతట తిరుగుచున్నాము. వారి భయముతో తిరుగు మాకు మా పత్నీ పుత్తుల పేరులు కూడ ఆ పిలో లేకుండ పోయినవి. లోభమోహాంధులు పాపబుద్ధులు నయి వారు దేవాలయములను దేవతా భవనములను ఆ శమములను నాశము చేయుచున్నారు. దానవుల ఉపద్రవముల నుండి నీవు మమ్ము కాపొడనిచో త్వరలోనే జగమున దేవతలు కాని మానవులు కాని ఒక్క డును లేక పోవుట నీవే చూడగలవు.
ఇట్లు పలికిన చంద్రుని వంటి ముఖ కాంతులుగల దేవతల వచనములు విని పద్మ భపుడగు బ్రహ్మ వారితో ఇట్లనెను: దేవతలారా! మీరును గొప్ప బుద్ధిమంతులు కదా! ఆలోచింపుడు. నేను వారితో వరప్రదాన సమయమున పలికి నట్లు వారి సొశమునకు ద్వార భూత మగు సమయము దగ్గరకు వచ్చినది. కాని నే ననినట్లు వారి తిపుర దుర్గ మును. ఒకే బాణముతో కొట్టగలవారు పరమేశ్వరుడు తప్ప మీలో నొక ్కరును నున్నట్లు నాకు కనబడుట లేదు. జగత్పతియు మ హే శ్వరుడు మహాదేవుడు నగు శివునకు తప్ప ఇతరులకు ఈ త్రిపుర దుర్గమును ఒకే బాణముతో ఒకే మారు ఆత్మ వీర్యముతో పడగొట్టుట శక్యమా?
బ్రహ్మాదిదేవకృతమహాదేవస్తుతి
కనుక మీరందరు సరే ఆనినచో మనమందరమును పోయి క్రతు విధ్వంసియగు హరుని వేడుకొందము. అతడు త్రిపుర దుర్గ మును నశింపజేయును. ఆ మయుడు త్రిపురములను తను ఒకే ప్రహారముతో కొట్టుట శక్యము కాకుండునట్లు ఒక్కొక్క పురపు విష్కంభముగాని ఒక పుర మునకు మరియొక పుర ముసకు అంతరము కాని నూరేసి యోజనములుండునట్లు వానిని నిర్మించినాడు. వాడు మౌనినీ పుష్యయోగమున నిర్మించెను. త్రిలోచనుడగు శిపుడే నచో ఒకే బాణమును పుష్యయోగమునందే అన్నిటి నొకేమారు క్షణమున దహించగలడు. (విష్కంభము = నడిమి కొలత)
దైత్యభయ దుఃఖితులగు దేవతలును “అట్లే పోదము' అనగా బ్రహ్మయు వారితో కలిసి శివుని కొలువునకు పోయెను. వార చట శివుని దర్శించిరి. ఆదేవుడు భూతభవ్వేశుడు; జగత్సంహారకర్త; ఉమతో నందితో కూడి అగ్ని వర్ణమయ దేహముతో అగ్ని రాశీ సమాననందునములతో ఆగ్ని వర్ణ విభూషణములతో వేలకొలది అగ్నులవలె సూర్యులవలె ప్రకాశీ చు చు చంద్రుని అవయవ లక్షణములు చంద్రునివలె సౌమ్యమగు ముఖము కలిగియుండెను. అతడు అగమ్యుడు ఆజుడు ప్రకాశ మానుడు మదన శత్రువు త్రినేత్రుడు ఎల్లరకు ఎల్ల కోరికల తీర్చువాడు సుఖకరుడు సర్వలోక పతి పార్వతీపతి.
ఇట్టి శివుని దర్శించి దేవత లా దేపు నిట్లు స్తుతించిరి. ఇది మాతృకా సంఖ్యతో ఏకపంచాశ నామాత్మక మగు సో తము భక్తులకు శుభకరుడు పాపులకు హింసకుడు బాధల తొలగించువాడు వర ములొసగువాడు జీపుల కధిపతి భయంకరుడు జ జైరాగటధారి ముహాదేవుడు దుషులకు భయంకరుడు తినే తుడుచఛాధిపతి ఈశ్వరుడు భగుడ సు ఆదిత్యుని కొట్టినవాడు అంధకుని చంపినవాడు నీలకంఠుడు సూర్యాగులచే కూడ భయముతో పనులు చేయించు వాడు లోకకర్తలకును క ర్తలకును అధిపతి కుమారస్వామికి శత్రువులగు వారి నశింపజేయువాడు కుమారస్వామికి తండ్రి వి శేషముగా జటాజూటమున ఎర్రనివాడు దూమ్రవర్ణుడు లోకముల ధరించువాడు పాపుల నరకుపొడు నీల కేశుడు శూలధారి దివ్య శయనుడు ఉరగభూషణుడు సునేతుడు హిరణ్యము వసువు రేతస్సుగాగల అగ్ని స్వరూపుడు ఆచింత్యుడు అంబికా భర్త సర్వదేవస్తుతుడు వృషభధ్వజుడు దుష్టుల విషయమున కోపి జటాధారి బ్రహ్మచారి జలములందుండి తపమాచరించు చుండువాడు బ్రహ్మత త్వవేత్త ఆజితుడు విశ్వ స్వరూపుడు విశ్వసష్ట విశ్వమందావరించియుండువాడు దివ్యుల సేవలందు కొనువాడు సర్వసంపదలకు ప్రభువు ఆశయింపదగినవాడు కోరికలు వేడదగిసవాడు ఎల్లపుడు పనిలో మునిగియుండు వాడు భక్తాను కంపి జన్మమునకు తగిన ఉత్తమగతి నిచ్చువాడునగు దేవా నీకు నమస్కారము.
ఇందు దేవతాకృత శివస్తుతి మాతృకా (ఏకపంచాశత్) సంఖ్యాకముగానున్నది. ఇందలి మూల భూత భావనను ఇట్లు ఊహించవచ్చును : వాజ్మయమంతయు ఏకపం చాశ న్మాతృకా (వర్ణసమామ్నాయ మయము. అ-నుండి ఆ వరకు పదునారు; క-నుండి-మ-వరకు ఇరువదియైదు; య-ర-ల-వ-శ-ష-స హళ --పది; మొ త్తము ఏబదియొకటి. కావుననే శబ్దబ్రహ్మరూపయగు శ్రీదేవిని మాతృకారూపనుగా ఉపాసింతురు. కావున ఇట్లు మాతృకా సంఖ్యాక నామములతో స్తుతించుట సమస్త వాజ్మయముతో స్తుతిం టయు శబ్ద రూపయగు పర మేశ్వరికిని పరమేశ్వరునకును అర్థ (సమస్త జగద్) రూపుడగు ఆభేదమును భావనచేసి సకల బ్రహ్మతత్వమునుపాసించుటయునగును. ఇది సాధకులకు సకలార్థ సాధకము.
ఆ నామావళి ఈ విధముగ నున్నది :
ఓం భవాయనమః వేధసాం పతయే వృషధ్వజాయ
శర్వాయ కుమారశతురినిఘ్నాయ చండాయ
రుద్రాయ కుమార జననాయ జటినే
వరదాయ విలో హితాయ బ్రహ్మ చారిణే
పశూనాంపతయే ధూమాయ సలిలే తప్యమానాయ
ఉగ్రాయ ధరాయ బ్రహ్మణ్యాయ
కపర్దినే కథనాయ అజితాయ
మహాదేవాయ సిలశిఖండాయ విశ్వాత్మనే
భీమాయ శూలీనే విశ్వసృజే
త్యంబకాయ ద్యీ శాయినే విశ్వం ఆపృత్య తిష్ఠతే
విశాంపతయే ఉరగాయ దివ్య సేవ్యాయ
ఈశ్వరాయ సునే తాయ సర్వసంపదాం ప్రభవే
భగమ్నాయ హిరణ్యరేతసే అబీగమ్యాయ
ఆంధకఘాతినే వసు రేతసే కామ్యా య
నీలగ్రీవాయ అచింత్యాయ సర్వదా సహ్యాచారాయ
భీమాయ అంబికాభ ర్త్రే భక్తానుకంపినే
వేధసే సర్వదేవస్తుతాయ జన్మనః-గతిం-దిశ తే తుభ్యం నమః.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున త్రిపురోపాఖ్యానమున బ్రహ్మాది దేవతలు మహేశుని
స్తుతించుటయను నూట ముప్పదియవ అధ్యాయము.
Summary of chapter 131 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya describes the intense, unshakeable penance performed by Tārakāsura, standing amidst five fires and subsisting on air for thousands of years. Pleased by his austerity, Bhagavān Brahmā appeared before him and offered boons. Tārakāsura arrogantly requested invincibility against all living beings, specifying that his death could occur only at the hands of a seven-day-old infant born from the divine energy of Mahādeva, believing such a birth to be impossible as Mahādeva was absorbed in eternal celibate meditation.