మత్స్య మహా పురాణము
59 - ఆరామప్రతిష్ఠావిధానము - వృక్షారోపణమహిమము
వృక్షములను నాటి ఉద్యానవనము (ఆరామము)లను ప్రతిష్టించు (ప్రజల వినియోగమున కై నిలుపు) శాస్త్ర విధానమును దానివలన కలుగు ఫలమును తెలుపుమని మునులడుగ సూతుడిట్లు చెప్పనారంభించేను: వినుడు. తటాక ప్రతిష్ణా విధానమునందు వలెనే సర్వ సం భారములను సమకూర్చుకొనవలెను. ఋత్విక్కులను ఆచార్యుని అట్లే నియమించు కొనవలెను. అట్లే పూజాలంకరణ సామగ్రితో వారిని ఆలంకరించి పూజించవలెను.
ప్రతిష్టించ-ప్రజలకు దత్తము చేయ-బోవు ఉద్యానమునందలి వృక్షములను సర్వౌషధుల-నర్వసుగంధముల. జలములతో తడుపవలేను. కొమ్మల చివరలను పూలమాలలతో వస్త్రములతో అలంకరించవలెను. బంగారు తీగతో చెవులు కుట్టవలెను. బంగారు కడ్డిలతో కాటుక పెట్టవలెను. ఏడెనిమిది బంగారు ఫలములను చేయించవలెను. అన్ని చెట్లను స ప్రధాన్యములయందు అధివాసము (మిశ్రిత ధాన్యములందు నిలుపుట) చేయవలెను. వస్త్రములతో గంధాను లేపనములతో అలంకరించి పొగవేసి తామ పాత్రములందు నిలుపవలేను. అన్ని చెట్ల దగ్గరను నీటితో కడవలను బంగారును ఉంచి వాటి కన్నీటికిని ఇంద్రాది దేవతల నుద్దేశించి బలిని నివేదించవలెను. వనస్పతి దేవతలకును విప్రులచే హోమము జరిపించవలెను. తెల్లని వస్త్రముతో కప్పినది బంగారు శిరోలంకారము కలది బంగారు కొమ్ములు కలది పాలు పిదుకుటకు కంచుపాత్ర కూడ కలిగినదియగు పాడియావును ఉత్తరా ముఖముగా చెట్ల నడుమగా విడువవలేను. .
తరువాత బ్రాహ్మణులు ఋగ్యజుస్సామ వేదములనుండి వరుణ దేవతాకములైన ఆభి షేక స్నాన మంత్రము లతో మంగళ వాద్య ధ్వనుల నడుమ యజమానుని స్నానము చేయించగా అతడు తెల్లని మడుగు వస్త్రములు ధరించి ఋత్విజులనందరను శ్రద్ధతో యథాశ క్తిగా గోవులతో దక్షిణలతో బంగారుతో చేసిన చేతి మురుగులు ఉంగరములు పవిత్రములు వస్త్రములు సర్వసామగ్రితో కూడిన పరుపులు మంచములు పాదుకలు.ఇట్టి వానితో పూజించును. వారికి నాలుగు దినములవరకు పొలతో భోజనము పెట్టవలెను. నాలుగు దినములును ఆవలతో యవలతో నల్లని నూవులతో పలాశ సమిధలతో హోమము చేయవలెను. నాలుగవ దినమున ఉత్సవపు వేడుకలు జరుపవలేను. ఋత్విక్ బ్రాహ్మణులకు మరల యథాశక్తిగ దక్షీణలను తనకు తోచిన మరేదై న నీయవలెను. ఆచార్యు (ప్రధాన ఋత్విక్ )నకు మాత్రము ఒక ఋత్విక్ కు ఇళ్చినదానికి రెండింతలీయవలెను. అతనిని క్షమాపణము వేడుకొనవలెను. .
ఈ విధానమున వృక్ష ప్రతిపోత్సవమును జరుపు వివేకి కి అన్ని కోరికలు తీరును. అనంత ఫలము కలుగును. (ప్రజల నిమితమయి) ఒక వృక్షము నాటినను అతడు ముగ్గురింద్రుల జీవిత కాలము స్వర్గమందు సుఖించును. తనకు పూర్వపు-అనంతరపు తరములవారిని తాను నాటిన చెట్లంత మందిని తరింపజేయును. పునరావృత్తి రహితమగు మోక్షమును పొందును.
ఈ కల్పమును వినిన వినిపించిన వాడు కూడ దేవతలచే పూజలందుకొనుచు బ్రహ్మలోక మున సుఖించును.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున వృక్షారోపణ మాహాత్మ్య కథనమను ఏబది తొమ్మిదవ యధ్యాయము.
Summary of chapter 59 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya details the ritual procedures and spiritual fruits of the Ānanda-Dvādaśī-Vrata, a holy vow observed on the twelfth lunar day of the bright fortnight in the month of Mārgaśīrsha to attain unshakeable inner peace and material prosperity. The practitioner worships Bhagavān Janārdana using twelve distinct divine names corresponding to the twelve months, presenting offerings of fresh flowers, incense, lighted lamps, and delicious food preparations free from salt. The devotee spends the night in spiritual vigil, listening to divine chronicles and chanting sacred mantras dedicated to Bhagavān Vishṇu. By completing this vow with sincere devotion, the practitioner eradicates all accumulated karmic suffering, experiences unbroken joy in present earthly life, and ultimately ascends to the imperishable spiritual realm of Vaikuṇṭha.