మత్స్య మహా పురాణము
169 - మధుకైటభుల ఉత్ప త్తి-వారి వధముచే సృష్టి విఘ్న నివారణము॥
శ్రీ మత్యుడు మనువున కిట్లు చేప్పెనని సూతుడు ఋషుల కిట్లు చెప్పసాగెను॥ శ్రీ మహావిష్ణువు ఏకార్ణవ జలమున నిద్రించుచుండ మధు కైటభులను మహాసురులు జనించిరి॥ *వారిద్దరును రజస్తమోగుణప్రధానులయి తామసగణములలోని వారుగా రజస్తమోగుణములందలి దోషములుగా) జనించి ముందు భగవానుడు జరుపనున్న) సృష్టికి విఘ్న భూతులుగా నుండిరి॥ వా రేకార్లవ జలరూపమున నున్న జగత్తు నంతటిని తమ మహాబలముతో క్షోభింపజేయుచుండిరి॥ ప్రకా శించు ర క్షవస్త్రములను ధరించి తెల్లగ ప్రకాశించు కోరలు కలిగి, కిరీట కేయూర (భుజుకీ రి) వలయ (చేతికంకణములతో ప్రకాశించుచు మహావిక్రములు రక నేతులు పీనవకులు మహాభుజులునై మహాగిరివంటి దృఢశ రీర నిర్మాణము కలిగి సంచ రించు పర్వతములవంటివారయి తోలుకరి మేఘములవలెను మెరపులవలేను మెరయుచు గదలతో భయంకరములగు కర ములతో మరింత భీషణులుగా నుండిరి॥ వారు తమ పాదవిన్యాసములతో అర్ణవమును ఎగుర గొట్టుచున్నారేమో శయనించిన వాడును మధునీ కైటభుని) చంపనున్న హరినీ కూడ కంపింపజేయుచున్నారేమో - అనునట్లు సర్వతోముఖముగా నున్న ఆ ప్రళయార్లవపుష్కరము (పద్మమను వ్యవహారముకల జలము) నందు విచరించుచు పోయిపోయి ప్రకాశించుచుండు తమకు దగ్గరలో ఎదుట నున్న యోగి శేష్టుని చూచిరి॥ అతడు నారాయణుని లేస్సయగు ఆజ్ఞతో సకల ప్రజలను అనగా సకల దేవతలను మానస ఋషులను అసురులను సృష్టించబోవుచుండెను॥ అచ్చట ఆ ఆసురోత్తములు ఇద్దరును ఒకేమారుగా మిగుల కుద్దులును రోషముతో కలవరపడు కన్నులు కలవాగును ॥॥ఆగుచు బ్రహ్మతో ఇట్లనిరి: పుష్కర(పద్మమందు ఉండి తెల్లని తల పొగ ధరించి నాలుగు మోములు కలిగి అజ్ఞానముతో నియమము పూని అప్పటికి ఏ సంతాపమును లేక యున్న నీవేర వు? రమ్ము! రమ్ము! కమలోద్భవుడా! మాకు యుద్ద మీమ్ము! మిగుల ఈశుల సమర్థుల)మగు మా కంటె నీవసమర్థుడవు; ఇట్టి నీకు జన్మకారణు డేవరు? ఎవరు నీన్ను (ఈ పనికై) నియోగించినారు? నిన్ను సృష్టించినవా రేవ్వరు? రక్షించువా రెవ్వరు? ఏ పేరున వ్యవహరింపబడుదువు? అనగా “( ఆందరను సృష్టించువాడును రక్షించువాడును) ఒక్కడే
(*భగవానుడు జరుపు సృష్టి స్థితిలయములలో సృష్టికి రజోగుణమును స్థితికి సత్త్వగుణమును లయమునకు తమో గుణమును హేతువులైనను అవి శురూపముననుండక మాలిన్యమును పొందినచో ఆయాప్రక్రియలలో విఘ్న మేర్పడును॥ మధు కైటభులు అట్టి రజ స్తమో॥ మాలిన్యరూపులు॥)
యనియు ఆతడు ఇట్టివాడని ఊహింపరానివాడును వేయి కన్నులుగలవాడును (అన్నిటిని చూచు శుద్ధసాక్షి చైతన్య స్వరూ పుడు) అనియు లోకములచే చెప్పబడుచున్నాడు కదా! ఆతడే నన్ను సృజించువాడు రక్షించువాడు ఈ పనికి నియోగించిన వాడు కూడ; మరి ఆది కాదని వేరుగా ప్రశ్నించు మీ రిరువురును ఎవరో తెలుపుడు॥” అని బ్రహ్మ పలికెను॥
మధు కైటభు లిట్లనిరి: మహామునీ! లోకమున మమ్ముల మీంచిన దేదియులేదు॥ మేము రజ స్తమో గుణములతో విశ్వమును కప్పివేయుదుము॥ మేము రజ స్తమోమయుల ము; ఋషులకును ఆవలంబనము మేమే; ఐనను మేము మరుగుపడి యుందుము; ధర్మశీలుర ము; ప్రాణు లేవ్వరును మమ్ము దాటిపోలేరు; ఎవరును ఏమియు చేయనలవికాని మేమే ప్రతియుగ మందును లోకమును నడపుచుందుము; మానవాదులు కోరు ఆర్థము కామము యజ్ఞము స్వర్గము సంతోషప్రదమగు సుఖము శ్రీకీర్తులు ఇవి అన్ని యు మేమేయని ఎరుగుము॥ అన విని బ్రహ్మ ఇట్లనేను: నేను నా యత్నము వలనను యోగత త్వజ్ఞు డగు హరి కరుణాదృష్టితోను ఇంతకుముందే యోగ ఫలమును సమర్జించియుంటిని॥ గుణవంతమగు ఆ ఫలము నాధా రముగా చేసికొనీ నేను న త్వగుణ మాశ్రయించియున్నాను॥ కనుక రజస్తమో రూపులగు మీకు నేను యుద్ద మీయదగను; ఎవరు అందరకం టే అన్నిటికంటే పరుడో యోగతత్వ జ్ఞానవంతుడో యోగమను పేరుకలవాడో సత్వరూపుడో రజస్తమ ములకును జనకుడో విశ్వసృష్ట్యాది హేతువో ఆతని నుండియే సాత్త్విక ములును ఇతరములును రజస్తమో గుణ ప్రధా నములును) - ఆగు భూతములన్ని యు జనించును॥ సర్వగుణ వశకర్తయగు ఆ దేవుడే మీ నాశమునకును సమర్థుడు; కావున మిమ్మతడు చంపును అనేను॥
ఆంతలో పరబ్రహ్మరూపుడు శ్రీమంతుడు (పూజ్యుడునగు నారాయణుడు స్వమాయతో తన బాహువులను బహుయోజన దీర్ఘములుగా చేసెను॥ బాహుశాలియగు ఆ హరి లాగుచుండ వారు బలిసిన పనులపలే జారిపోవుచునే సంచరించుచు దగ్గరకు వచ్చిరి॥ సనాతనుడు పద్మ నాభుడు హృషీ కేశుడునగు ఆ దేవుని సమీపించి పారాతని నమస్క రించి ఇట్లనిరి: విశ్వజన్మ కారణుడగు పురుషోత్తముడు నీవొక్కడవేయని మేమెరుగుదుము; నీవు మమ్ము రక్షించుము చంపుము); ఇది సహేతుకము; దీనివలన మేము శుద్దులమగుదుము; నీవు సత్యముగా వ్యర్షము కాని దర్శనము కలవాడవు; శాశ్వతుడవు ఆని ఎరిగి నిన్ను సమగ్రముగ దర్శింపగోరి నీయొద్దకు వచ్చినాము; శత్రునాశ కా! అమోఘదర్శనొ! యుద్ద విజేతా! నీకు వందనము; నీవు మాకు వరమీయ ప్రార్ధించున్నా ము; అనగా భగవానుడు “ఈ అద్బుతమే మోయీ! నన్ను వర మేల అడుగుచున్నారు? నా వలన ఆయువు వర ముగా పొంది మరల రహస్యముగా బ్రదుక గోరుచున్నారు గదా! ఆనేను॥ మధు కైటభులును ప్రభూ! దేవా! మహావ్రతాః ఉత్తమ కర్మలాచరించువాడా!)॥ ఇదివర కేవరును మరణించి యుండనిచోట మమ్ము చంపుము॥ ఇదియే మాకు నీవిచ్చు వరము॥ అనిరి॥ “సరే! ముందొక కాలమున మీరు గొప్పవారగుదురు॥ నందియములేదు; నేనీ చేప్పునది సత్యమే యగును॥ అని హరి వారికి వరము ఇచ్చి అంతట సనా తనుడును విశ్వ శేషుడును సురో తముడును ప్రభుడును అగు నారాయణుడు ఈ రజ స్తమోగుణ జాతులయి వానికి ఆశ్రయములయిన ఆ కవల(జంట)ను తన తొడల పై నలుగగొట్టెను॥
ఇది శ్రీమత్స్యమహాపురాణమున మధు కైటభవధముచే పద్మనాభుడు బ్రహ్మకు సృష్టియందు విఘ్న మును నివారించుటయను నూట అరువది తొమ్మిదవ అధ్యాయము॥
Summary of chapter 170 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya provides a detailed philosophical explanation of the emergence of the cosmic lotus from the navel of Bhagavān Nārāyaṇa. The text explains that the lotus stalk represents the cosmic axis, its petals symbolize the mountain ranges and continents of the universe, and its pericarp contains the divine throne of Bhagavān Brahmā. Understanding this cosmic lotus symbol reveals the intimate relationship between the physical universe and the Supreme Unmanifest Source.