మత్స్య మహా పురాణము
63 - రసకల్యాణ తృతీయావ్రతము
ఈశ్వరుడు పార్వతికి ఇట్లు చెప్పెను: పాపనాశక మగు మరియొక తృతీయా వ్రతమును తెలి పెదను. పురా ఇములందు రసక ల్యాణినీతృతీయావతమని దీనికి పేరు.
మాఘ శుక్ల తృతీయా తిథినాడు ఉదయమున ఆవుపాలతోను నూవుల (నూవు పిండి- నూవులనూనె)తోను స్నానము చేయవలయును. దేవిని తేనేతో చెరకు రసముతో పన్నీటితో స్నానమాడించి కుంకుమముతో పూజించవలెను. పూజను పాదాది శిరోరతముగా మొదట కుడి ఆద్వయవములను తరువాత ఎడమ అవయవములను పూజించవలెను.
పూజామంత్రము: 1. లలితాయైనమః (దక్షిణ) పాదం పూజయామి: దక్షిణ గుల్పం పూజయామి; 1. ఈశాన్యై నమః-దక్షిణ జంఘం పూజయామీ; దక్షిణ జాను పూజయామి. 3. శియకమః-దక్షిణేరుం పూజయామీ; 4. మదాలసాయే నమః దక్షిణ కటిం పూజయామి; 5. అపర్ణాయనమః-దక్షిణోదరం పూజయామి; 6. మదనవాసిన్యైనమః దక్షిణ స్తనం పూజయామి; 7. ప్రమదాయైనమః దక్షిణ కంధ రాం పూజయామి; 8. మాధవ్యైనమః దక్షిణ భుజాగ్రం పూజయామి; వామ భుజాగ్రం పూజయామి; 9. కమలాయైనమః దక్షిణ ధ్రువం పూజయామి; వామభువం పూజయామి; 10. చంద్రార్ధ ధారిత్యైనమః - క్షణనేత్రం పూజయామి; వామనేత్రం పూజయామి; 11. రుష్యైనమః ముఖం పూజయామి; 12. ఉత్కంఠిన్యైనమః పామకంఠం పూజయామి; 13. అమృతాయైనమః-పామ స్తనం పూజయామి; 14. అభయాయై నమః దక్షిణ బాహుం పూజందూమి; పొమ బాహుం పూజయామీ; 15. విశోకాయైనమః దక్షిణకరం పూజయామీ; వామ కరం పూజయామీ; 16. మన్మథ ధాయైనమః - హృదయం పూజయామి; 17. పాటలాయైనమః-వామోదరం పూజ యామి; 18. సురత వాసిన్యైనమః వామక టిం పూజయామి; 19. త్ర్యంబక ప్రియాయై నమః వామోరుం పూజయామి; 20. గౌర్యైననుః -వామజాను-వామ జంఘాంచ పూజయామీ; 21. గాయత్యై నమః-పొమగుల్పం పూజయామి; 22. ధరా ధరాయనమః-వామపాదం పూజయామి; 23. విశోకాయైనమః-(మూలములో అంగ పూజా మంత్రములకు కొన్నిటికి హిమ దక్షీణాంగములకు వేరువేరుగా మంత్రమున్నది. కొన్ని టికిలేదు. లేనిచోట్ల రెండు పార్శ్వములకును ఓ కే మంత్రమును అనువాదకుడు ఇచ్చుట జరిగినది.) శిరః పూజయామి;
భవాని-కామిని-వాసుదేవి-జగచ్చీ-ఆనందదా నందా-సుభద్రా-శబ్ద వాచ్యురాలగు దేవికి నమస్కారము; అని ఇట్లు యథావిధిగ దేవిని పూజించి ఏప్రదంపతులను ఆదరించవలెను. - మత్పరము మొదలగు - భావవికారము లేవియు లేకుండ చిత్తశుద్ధితో వారికి మధురములగు ఆన్న పానీయములను లడ్డులను ఉదక కలశము కు రెండు తెల్లని వస్త్రము లను ఈయవలయును. బంగారు కమలమును గంధమాల్యములను ఆర్పించి అర్చిచవలయును. దానము నిచ్చునపుడు ‘కుముదా ప్రియమ్’ ఆను మంత్రమును చెప్పవలెను. లవణ వ్రతమును (ఉప్పులేని ఆహారమును తినుట) పాటించ వలెను. ఈ విధానముతో దేవిని ప్రతిమాసమునను ఆర్చించుచుండవలెను.
ఆయా మాసములందు విడువవలసిన ఆహారములు: మాఘముస లవణమును ఫాలునమున బెల్లమును చైత్రమున తవరాజమును (యవలు మొదలగు వానినుండి తీసిన చక్కెర) వైశాఖమున తేనెను. జ్యేష్ట మున పానకమును ఆషాఢమున జీలకర్రను శ్రావణమున పొలను భాద్రపదమున పెరుగును ఆశ్వయుజమున నేతిని కార్తికమున పుట్ట తేనెను మార్గ శిరమున ధనియాలను పుష్యమున చక్కెరను విడువవలెను.
వ్రత విధాన పూజ కాగానే ప్రతి మాసమునను నిండు కరకమును (గరిగ ఆనేడు ఒక విధమైన మట్టిపాత్ర) భక్ష్య పొతమును ఆనాటి సాయం సంధ్యా కాలమున దానము ఈయవలెను. ఎట్లనగా కరకము పైని భక్ష్యపాత్రను ఉంచవలెను. ఆ భక్ష్య పాత్రయందు మాఘమాసమున లడ్డులు. ఫాల్గునమున శోకవర్తులు చైత్రమున సంయావము (గోధుమ రవ్వను పొలతో చక్కెరతో ఉడికించిన వంటకము) వైశాఖమున పూరీలు జ్యేష్ఠమున ఘటికలు ఆషాఢమున ఘృతపూరము (బాదుషా అని ఈనాటి పేరు). శ్రావణమున బూరెలు . భాద్రపదమున మండిగలు (గోధుమతో చేయు పిండివంట) ఆశ్వయుజమున పాలు కార్తికమున ఆకుకూర మార్గశిరమున పెరుగన్నము పుష్యమున శోకము లేని ఇండు అను వంటకము-ఇవి నింపవలెను. (వీటిలో శోకవర్తికలు శోకము-ఇండు-ఘాటికలు అనునవి ఈనాడు అంతగా తెలి యనివి. ఆయా దేశ భాగములలో వేరువేరు పేరులుండవచ్చును. పెద్దలవలన తెలిసికొనవలెను. తెలియనిచో వీటికి మారుగా మరేదై న మధుర పదార్థము ఉంచవచ్చును.)
దానము ఇచ్చునపుడు మాఘమున ‘కుముదా ప్రీయతాం’- ఫాల్గుణమున ‘మాలతీ ప్రీయతాం’ చైతమున ‘గౌరీ పీయతాం’ వైశాఖమున ‘రంభా ప్రీయతాం’ జ్యేష్టమున ‘భద్రా ప్రియతాం’ ఆషాడమున ‘జయా ప్రీయతాం’ శ్రావణమున. ‘శివా ప్రీయతాం’ భాద్రపదమున ‘ఉమా ప్రీయతాం’ ఆశ్వయుజమున ‘రతిః పీయతాం’ కార్తికమున ‘సతీ పీయతాం’ మార్గ శిరమున ‘మంగళా ప్రీయతాం’ పుష్యమున రతిలాలసా ప్రీయతాం’ అను మంత్రమును చెప్పవలెను.
అన్ని మాసములందును వ్రతదినమున పంచగవ్యము ఆహారముగా ఉపవాస ముండవలెను. శ క్తి లేనివారు పగలు ఉపవసించి నక్షమున (రాత్రి కాగానే) భుజించవచ్చును.
(ఇట్లు మాఘమాసము మొదలు పుష్యమాసము వరకు చేసిన తరువాత) మరల మాఘమాసము రాగానే ఈ చేప్పబోవు విధమున దానము చేయవలెను. బొటన వేలి పరిమాణముతో బంగారు గౌరీ ప్రతిమ చేయించవలెను. దానికి పంచరత్నములు తాపటము చేయవలెను. జపమాలయు కమండలువును ప్రతిమకు చేతియం దుండవలెను. చతుర్భుజ ములు శిరమున చంద్ర రేఖ తెల్లని వస్త్రపు మేలిముసుగు ఉండవలయును. కరక(గరిగ) పాత్రలో చక్కెర పోసి పాత్ర పై భాగమున ఈ గౌరీ ప్రతిమ నుంచవలేను. అట్లే గోమిథున (ఆవు-ఎద్దు) ప్రతిమను తెల్లని రంగుతో (వెండితో) చేయించి బంగారు అలంకారములు తెల్లని వస్త్రపు పైకప్పడముతో చేయించవలయును. వస్త్రములను పాత్రములను వీటికి తోడుగా చేర్చవలయును. ఇవి అన్నియును ‘భవానీ పీయతామ్’ అను మంత్రముతో ఆచార్యునకు దానము చేయవలయును.
ఈ విధానముతో ఈ రసక ల్యాణినీ తృతీయావ్రతమును చేయువాడు తత్ప్రణమున సర్వపాపములనుండి ముక్తు డగును. తొమ్మిదివేల అర్బుదముల సంవత్సరముల కాలము ఏ దుఃఖముల నెరుగక సుఖించును. వేయి. అగ్ని ప్రోమముల వలన కలుగు ఫలము నందును. స్త్రీలలో కూడ కన్యగాని సువాసినీ కాని విధవ కాని అమాయకురాలు కాని ఎవరు చేసి నను ఇంత ఫలమును పొంది సౌభాగ్యారోగ్య సంపన్న యే గౌరీలోకమున ఆచరపాతమే సుఖించును.
దీనిని చదివినను సకల కలుష ముక్తుడై గౌరీలోకము చేరును. ఉత్తమ జ్ఞానము పొందును. దేవతలకును నాయకుడై ఎల్లర కును ఆజయ్యు డగును.
ఇది శ్రీమత్స్య మహాపురాణము న రసకల్యాణినీ తృతీయావ్రతమను ఆరువది మూడవ అధ్యాయము.
Summary of chapter 63 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya detail the procedures for the Saubhāgya-Snapana-Vrata, an auspicious ritual bath and worship performed on the seventh lunar day of the bright fortnight to secure enduring marital happiness and prosperity. The practitioner uses sanctified water stored in golden or copper vessels, mixed with seven types of holy earth, aromatic herbs, saffron, and crushed jewels, to perform ceremonial ablutions while reciting Vedic hymns. Following the bath, the devotee worships Sūrya Deva and Goddess Lakshmī with red flowers, incense, and sweet delicacies. The Lord declares that this sacred ablution purifies the subtle body, removes past karmic blemishes affecting family welfare, and bestows unbroken prosperity upon the devotee's family.