మత్స్య మహా పురాణము
129 - త్రిపుర దుర్గమున దైత్యదానవులు ప్రవేశించుట
(*త్వాసురే దుర్గే మయేనాసురశిల్పినా)
(*స్వనశ్చ శజ్ఖభేరీణాం వీణావేణురవా అపి)
(*పురణాగానశబ్దాశ్చ)
అసుర శిల్పియగు మయుడు నిర్మించిన త్రిపుర దుర్గపు నిర్మాణము పూర్ణమయ్యేను. ఆది పరస్పరము బద్ద వై రులగు సురలకును అసురులకును దుర్గత్వమును పొందెను. సురలకు అది దుర్గమము చొరరానిది - ఆయ్యెను. అసురులకు అది దుర్గ ముర క్షణ స్థానము - ఆశ్రయము అయ్యెను. యమునివంటి అసురులెందరో తమ కళత్రములతో పుత్తులతో శస్త్రములతో మామయావిష్టములగు ఆయా గృహములందు ప్రవేశించిరి. వనమనేక సింహములతోవలెను మహా సముద్రమనేక నకములతో వలెను వీరులు అతి పౌరుషములతో వలెను శరీరము రోమములతో వలేను త్రిపుర దుర్గము బలశాలురగు దేవాసురులతో అధిష్టితమయి వ్యాప్తమయ్యేను. అది నూరులకోట్ల దైత్యులతో దట్టమయి కల్లోలిత మయి కనబడెను. ఆయా పర్వతములందుండు పోరును దానవాలయమగు పాతాళ భేదమయిన సుతలమందుండువారును అగు దానవులందరును ఈ అంతరిక్ష దుర్గము నాశ్రయించిరి.
ఈ త్రిపుర దుర్గమును చేరిన వారిలో ఎవరు ఏదికోరిన వారికి అదెల్ల అనుయుడచట మాయతో అమర్చు చుండెను. చంద్రుడు వెలుగుచుండు ప్రదోషములందును పద్మములు వికసించిన సరస్సులందును మామిళ్ళు అందగించు ఆరామములందును తపోవన సదృడవనములందును అసురులు చందసములు పూసికొన్న ఒడళులతో నలుపు తెలుపు మచ్చలు కనబడు మదపుటేనుగులవలే కొనవచ్చుచు శుద్దము లగు అభరణములు వస్త్రములు మాలలు మేయి పూతలు దాల్చి కామసమేతలే ప్రియుల పొంఛించుచు హావభావముల ప్రకటించు ప్రియురాండ్రగు స్త్రీలతో కూడి ముదీతులగుచు దానవులందు సతతము ఆనందించుచుండిరి. మహాబలులగు ఆ ఆసురులు మయ నిర్మితమగు ఆ స్థానమున మోదించుచు తమ మతులను ధర్మార్థ కామములందు నిలిపి ప్రవర్తిల్లుచుండిరి. ఇట్లు పురుషార్థ త్రితయమున ప్రవర్తిల్లుచుండు. ఆమర వై రులకు ఆత్రిపుర దుర్గమున చాలకాలము స్వర్గమందువలే గడ చేను. పుతులు తండులను పత్నులు పతులను యత్న పూర్వకముగా శుశ్రూష చేయుచు కలహములు లేక పర స్పరము సానురాగులై యుండిరి. ఆత్రిపుర దుర్గ వాసులలో అధర్మము కాని అనృతముకాని లేకుండెను. వారు ఆలయములందు హరునర్చించుచుండిరి. ఎల్లయెడల ఎల్లవేళల విప్రుల పుణ్యాహు ధ్వనులును ఆశీర్వాద శబ్దములును వినబడుచుండెను. మంజుల మంజీర రవములును వీణావేణు స్వనములును విహరించు వరనారీ జనులయు -దానవేంద్రులయు -హాసధ్వనులును వినవచ్చుచుండెను.
లోభాదీనాం త్రిపుర ప్రవేశః
(*స్వప్నే భయావహాన్ దృష్ట్వా విమృశ స్తిస్మ దానవాః)
(*ఆసీనః కాఞ్చనగిరేశ్శృజ్గే తోయదరో యథా)
(*చతస్రఃప్రమదా సత్ర త్రయోమర్యాభయావహాః)
(* యుష్మాభిస్సాగరామ్భసిమజ్జితమ్.)
ఇట్లు త్రిపుర దానవులు దేవతల నర్చించుచు బ్రాహ్మణుల నమస్కరించుచు ధర్మ కొమార్ధాసక్తులై ప్రవర్తించు చుండ చాలకాలము గడచెను. ఇట్లుండ ఒకానొక సమయమున ఒ కేమారు లోభము క్రోధము కలహము అనేడు కలి లక్షణములు తీపుర దుర్గమును ప్రవేశించెను. పొగు అసురా వాసమగు ఆ త్రిపుర దుర్గమును సంధ్యాకాలమున ప్రవేశించి ఆది మొదలు వ్యాధులు శరీరమును వలె ఘోరరూపుల జనుల బాధింపసాగి,
వేకువ సమయమున త్రిపుర దుర్గమందలి అసురులకును దానవులకును ఎల్లర కును ఉత్పాతములు కననయ్యెను. పారవి తమలో తాము చెప్పుకొని విమర్శించుకొససాగిరి. అంతలో సూర్యోదయమయ్యేను. రవి తన శుభకర తేజస్సు లతో వెలుగుచుండెను. పద్మము రవి తేజస్సును పలే మయుడు సభను ప్రవేశి. చేను. అతడు మేరుపర్వత శృంగము వంటి సువర్ణ భూషిత పీఠమున సజలమగు మేఘమువలే కూర్చుండెను. మదపుటేనుగునకు రెండువైపుల రెండు గున్న ఏనుగులువలె అతనికి రెండు వైపుల సమీపమునందు తార కా.:ుడును విద్యున్మాలియు కూర్చుండిరి. అంతంతలలో అమరారులును శిష్టులును సమరాంగణమున విశిష్టులుగువారు ఠీవిగా ఉపవిష్టులయిరి. వారినడుమ ఆ మయుడు దేవతల నడుమ దేవరాజువలేనుండెను.
దానవేంద్రు లందరును సుఖాసన గతులయిన యనంతరము మాయాజనకుడగు మయుడు వారితో నిట్లనెను. ఖేచరులగు దైత్యరాజులారా! దానవ సతము లారా! అసురులారా! రాక్షసులారా! దాక్షాయణీ దితి సుతులారా! నేను గాంచిన భయావహస్వప్నము వినుడు. మహాబలము మహాక్రోధము ఉగ్రముఖము కల ముగ్గురు పురుషులును ముగ్గురు స్త్రీలును పగలే త్రిపుర దుర్గమున ప్రవేశించిరి. అతులవికములగు వారు రోషావిష్ణులే బహుశ రీర ములు దాల్చి ఇచటి వారి శరీరములందు ప్రవే శించిరి. త్రిపుర సగర మంతయు మీరే కాదు.ఇంట్లే కాదు.రథాశ్వగజములే కాదు.అంతయు చీకటితో నిండి పోయేను. (గుడ్లగూబ ముక్కుకల దిసమొల శ్రీ గాడిద నెక్కి కొందర స్త్రీలతో కూడి నవ్వుచు (అందరను) ముద్దు పెట్టుకొనుచుండెను. చంద్రుని తిలకముగా ధరించిన త్రిలోచనుడు. చతుష్పాదుడుసగు పురుషు డొకడు స్త్రీని పోలినవాడు కనబడెను. పోడు బహుశ ఆ స్త్రీని చూచియుండును. అతడే నన్ను మేలుకొలిపెను. నా కిట్టి మహా భయంక రియగు స్త్రీ కనబడినది.
(*అలక్ష్మిర్హ్రీఃకలిఃక్రోధానూయాప్రాప్తాస్తథాసురాః)
నా కిట్టి కల రాత్రివేళ వచ్చుటకు ఫలముగా పెట్టి నీచమగు అసుఖము మనకు సంభవించునో ఎరుగజాలను. మీకు నేను. తగిన రాజననియు నేను చెప్పు ఈ మాట మీకు హితకరమనియు భావించినచో మీరు మంచి మనస్సులతో నా వచనమును గ్రహించుడు. దానియందు దోషములు పట్టుకొనవలదు. మీరు అందరును మనస్సులను నియమములందు నిలిపి కామమును రోషమును ఈర్యను వదలి సత్య శమ డమములందును ముని వచనములందును మనస్సు లుంచుడు. గొంతు లాచరించుడు. మహేశ్వరు నర్చించుడు, నేను ఇట్లు చెప్పుచున్నానే కాని ఈ స్వప్నమునకు ఇట్లు కూడ ఉపశాంతి జరుగ చేమో! అసురులారా! ఈ త్రిపుర దుర్గమున నిరంతరముగా ఇట్టి ఉత్పాతములే కనబడుచుండుట బట్టి చూడగా దేవదేవు డగు త్రిలోచనుడే మన పై అలిగినట్లున్న ది. ఏమయినను మీరు కలహము విడిచి ఋజుప్రవర్తన మవలంబించి స్వప్న శాంతి జరిపి ఆ శాంతి ఫలమును కాని ఆభ్యుదయకరకాలమును గాని ఎదురు చూచుచుండుడు.
దైత్యులు మయుని ఈ మాటలు విని క్రోధవ్యాకులిత నేరులును శిష్టాచార వినాశకులు సయిం. అలక్ష్మీకాలము చేరువయేనందునను నాశ ము దాపురించినందునగు వారందరును మయుని చూటలు సహించక క్రోధముతో కను లేర్ర జేసి పరస్పరము చూచుకొనిరి. తత్ క్షణము వా కి డైవము ప్రతికూలించెను; త్రిపుర దాసపు లెల్లరును సత్వధర్మములను విడిచి అకార్యములు చేయ సంకల్పించి వాని నారంభించిరి.
(*భార్యాంగత్వానశుద్ధ్యంతిరహోవృత్తిషు)
నాటినుండి త్రిపుర దానవులు బ్రాహ్మణుల ద్వేషించసాగిరి. దేవతల నర్చించుట మాని. పెద్దల నవమానింప సాగిరి. పరస్పరము క్రుద్ధులగుచుండిరి. కలహాసక్తులగుచుండిరి. అధర్మము లాచరించి ఆనందించుచుండిరి. పరస్పరము సిందించుకోనుచుండిరి. సదా అ పియములు పలుకుచుండిరి. గురుపులతో బిగ్గరగా మాటలాడుచుండిరి. పూజ్యులతో (ఆదరముతో కాదు - మొద లే) మాటలాడకుండిరి. ఆకస్మికముగా తహతహపాటు చేంది కన్నీరు కార్చుచుండిరి. రాత్రు లందు పెరుగుతో సత్తువును (పేలపిండిని) త్రిపుచు వెలగపండు తినుచు నుండిరి. (ఇవి రాత్రులందు తినుటయు త్రాగు టయు నిషిద్ధము) ఎంగిలిగా ఉండీయే ఆహారము తినుచు సిండు ముసుగుతో పండుకొని నిద్రించుచు ఉండిరి. మూత్ర విసర్జనమయిన తరువాత ఉదకోపస్పర్శనము చేయకయే కాళ్లయిన కడుగుకొనకయే శౌచము కాని సదాచారము కొని పాటించకయే శ్వశ్యులపయి నిద్రించుచుండిరి. పిల్లులనిన పక్షులు ముడుచుకొని పోవునట్లు ఏ కొంచెము భయకారణమున కును ముడుచుకొని పోవుచుండిరి. పత్నులు పతుల నిందించుచుండిరి. పతులు పత్నులయందు నిర్దయులయిరి. త్రిపుర వాసి దానవు లొకప్పుడు సుశీలురుగా నున్న వారే ఇపు డిట్లు దుశ్శీలు రయిరి. దేవతలను తపోధనులను బాధించుచుండిరి, రాక్ష సులకు వినాశము దాపురించినందున వారు యజ్ఞములకు విఘాతములను బ్రాహ్మణులకు విప్రియములను ఆచరించుచు విప్రులతో కలహించుచుండిరి. పై భ్రాజక చైత్రరథాశోక వరా శోక సర్వరుక వనములను తపోధన వనములను బలాన్వితులగు దానవులు కుద్దులగుచు ధ్వంసము చేయు చుండిరి.
వారిట్లు దేవాలయములను ఆ శమములను ధ్వంసము చేయగా దేవాలయ ధ్వజములను యూప స్తంభములను విరుగ గొట్టగా జగత్తు అతయును -ఆమర రాజావాసమగు స్వర్గము కూడ దేవ శత్రువులచే ఉపద్రవముల పాలయ్యెను.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున త్రిపురోపాఖ్యానమున దాసపుల త్రిపుర దుర్గ ప్రవేశ ము-దుఃస్వప్న దర్శనము దానవుల దుర్వ రసమును నూట ఇరువది తొమ్మిదవ అధ్యాయము.
Summary of chapter 130 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya initiates the epic narrative of the Tārakāmaya Devāsura Saṅgrāma, detailing the rising power of the formidable Asura monarch Tārakāsura. Born in the lineage of Kaśyapa and Diti, Tārakāsura accumulated immense power through severe austerities performed in the forest, disturbing the equilibrium of the three worlds and causing deep concern among the Devas.