మత్స్య మహా పురాణము
53 - పురాణ సంఖ్యానుక్రమము-పురాణ దాన వ్రతము
పురాణముల గ్రంథ సంఖ్యను వాటిని దానము చేయుట అను వ్రత విధానమును సవిస్తరముగా నిరవశేషముగా మాకు దెలుపుమని ఋషులడుగ సూతుడు ఈ విషయమును పురాణ పురుషుడగు మత్స్యరూప జనార్ధనుడు మనువునకు చెప్పిన విధముననే మీకు తెలి పెద నని ఇట్లు చెప్పనారంభించెను:
మత్యుడు మనువునకు ఇట్లు చెప్పెను: బ్రహ్మ(కు గల ఐదు ముఖములలో ఊర్ధ్వ) ముఖమునుండి సర్వ శాస్త్రములకు ఆది భూతమగు పురాణము వెలువడెను. పిమ్మటనే మిగిలిన) ముఖములనుండి వేదములు వెలువడేను. పూర్వక ల్పమున మొదట పురాణము ఒక్కటియే యుండెను. అపుడది శతకోటి గ్రంథ పరిమాణము కలది (ముప్పది రెండక్షరముల సముదాయమునకు గ్రంథమని వ్యవహారము.) లోకములు నిశ్శేషముగ దగ్గమైన తరువాత (ప్రళయా నంతరము నేను హయ (గ్రీవ రూపమున (ఆరు) వేదాంగములు నాలుగు వేదములు పురాణములు న్యాయవిస్తరము మీమాంస.ధర్మశాస్త్రము(లు) అను పదునాలుగు విద్యలను శబ్దాత్మక నిత్య తత్వమును) పరిగ్రహించి నాస్వాధీనము చేసికొంటిని. మరల కల్పాదియందు మహా ప్రళయ సముద్రమున మత్స్యరూపమున నేను నీటియందేయుండి పలుక గా విని చతుర్ముఖుడు మునులకును అవి దేవతలకును ప్రవచించేను. ఇట్లు సర్వశాస్త్ర రూపమగు పురాణము లోకమున ప్రవర్తిల్లెను. కాని కాలక్రమమున దానిని జనులు సులభముగా గ్రహింపలేక పోవుట చూచి నేను ప్రతి మహా యుగమునందలి ద్వాపరయుగమునను వ్యాసరూపుడనై చతుర్లక్ష గ్రంథ పరిమాణమునకు సంగ్రహించి ఈ మొ త్తమును పదునెనిమిదిగా విభజించి లోకమున ప్రకాశింపజేయుదును. దేవలోకమున మాత్రమది ఇప్పటికిని శత కోటి గ్రంథ పరిమితముగానే యున్నది. వాని వివరణమును వాటిని విభజించి దానము చేయవలసిన వ్రతవిధానమును తెలిపేదను.
(*విష్ణ్వాఖ్యమష్టసాహస్రంతత్పురాణంవిదుర్భుధాః)
(*చతుర్వింశతిసాహస్రంపురాణం)
(చతుర్వింశతిసాహస్రం)
బ్రహ్మ మరీచికి ప్రవచించినది బ్రాహ్మపురాణము. దీని గ్రంథ పరిమాణము పదివేలు. దీనిని లిఖించి వైశాఖ పూర్ణిమనాడు జలధేను సహితముగా దానమిచ్చినచో బ్రహ్మలోక ప్రాప్తి యగును.
జగత్తు అంతయు జలమయమై పద్మముగా జలస్థానముగా). నున్నప్పుడు బ్రహ్మ ప్రవచించినది పద్మ పురాణము. దీని గ్రంథ పరిమాణము ఏబది ఐదువేలు. దీనిని లిఖించి జ్యేష్టమాస పూర్ణిమనాడు సువర్ణ కమలముతోను తిలల తోను దానము చేసినచో అశ్వమేధ ఫలము లభించును.
పరాశరుడు వారాహ కల్ప వృత్తాంతము నాశ్రయించి అఖిల ధర్మములను ప్రవచించినది విష్ణు పురాణము. దీని గ్రంథ పరిమాణము ఇరువదిమూడు వేలు. దీనిని లిఖించి ఆషాఢ పూర్ణిమనాడు ఘృత ధేనువు తో దాన మిచ్చినచో విష్ణు లోకము ప్రాప్తించును.
వాయు దేవుడు శ్వేత వరాహ కల్ప వృత్తాంతము నాశ్రయించి రుద్రమాహాత్మ్య ప్రధానముగా ప్రవచించినది వాయు పురాణము. దీని గ్రంథ సంఖ్య పండ్రెండు వేలు. దీనిని లిఖించి శ్రావణ పూర్ణిమనాడు పెరుగుతో బెల్లముతో
ధేనువుతో కుటుంబియగు బ్రాహ్మణునకు దానము చేసినవాడు శివలోకమున ఒక కల్పకాల ముండును.
గాయత్రీ తత్వము నాశ్రయించి వృతాసుర వధతో కూడ సారస్వత కల్ప వృత్తాంత ప్రధానముగా ధర్మ విస్తరమును వర్ణించినది భాగవత పురాణము. దీని గ్రంథ పరిమాణము పదునెనిమిదివేలు. దీనిని లిఖించి భాద్రపద పూర్ణిమనాడు బంగారు సింహముతో కూడ దానము చేసినచో పరమపదమును పొందును.
నార దుడు బృహత్కల్పాశ్రయములగు కథలను ప్రవచించినది నారద పురాణము. దీని గ్రంథ ప్రమాణము ఇరువది యెదువేలు. దీనిని లిఖించి ఆశ్వయుజ పూర్ణిమనాడు ధేనువుతో కూడ దానమిచ్చినచో పునరావృత్తి లేని దుర్ణభ మగు పరమ సిద్ది నందును.
పక్షులను ఆశ్రయముగా చేసికొని ధర్మానుష్టాన పరములగు పక్షులు జైమినికి ధర్మాధర్మ విచారణమును వ్యాఖ్యానించినట్లు మార్కండేయుడు ప్రవచించినది మార్కండేయ పురాణము. దీని గ్రంథ పరిమాణము తొమ్మిదివేలు. దీనిని లిఖించి సువర్ణ గజముతోకూడ కార్తిక పూర్ణిమ నాడు దానమిచ్చినచో యజ్ఞఫలము లభించును.
ఈశాన కల్పము నాశ్రయించిన వృత్తాంతములను అగ్ని వసిష్ఠునకు ప్రవచించినది. ఆగ్నేయ పురాణము. దీని గ్రంథ పరిమాణము పదునారువేలు. దీనిని లిఖించి బంగరు పద్మముతో కూడ తిల ధేనువుతో కూడ మార్గ మనాడు దానము చేసినచో సర్వకతు ఫలము లభించి : సుఖములందును.
బ్రహ్మ మనువునకు ఆదిత్య మాహాత్మ్యము నాధారముగా చేసికొని ఆ ఘోర కల్ప వృత్తాంతమును భూత సమూహ లక్షణమును ప్రాసంగికముగా జగత్ స్థితిని విశ్లేషించి భవిష్య వృత్తాంతమును చెప్పినది భవిష్య పురాణము. దీని గ్రంథ పరిమాణము పదునాలుగువేల ఐదువందలు. (ప్రకృతము లభించు భవిష్య పురాణమున ఇంచుమించుగా ఇరువది ఏడువేల శ్లోకములున్నవి.) దీనిని లిఖించి పుష్యమాస పూర్ణిమనాడు విమత్సరుడై గుడ ధేనువుతో దానము చేసినచో అగ్ని షోమ యాగఫలము లభించును.
సావర్ణి మనువు నారదునకు రథంతర కల్ప వృత్తాంతమును ఆశ్రయించి ఉత్తమమగు కృష్ణ మాహాత్మ్యమును బ్రహ్మ వరాహ చరితమును చెప్పినది బ్రహ్మ వైవర్తపురాణము. దీని పరిమాణము పదునెనిమిది వేలు. దీనిని లిఖించి మాఘ పూర్ణిమనాడు కుటుంబియగు బ్రాహ్మణునకు భవనముతో కూడ దానము చేసినచో బ్రహ్మలోక ప్రాప్తియగును.
మహేశ్వరు డగ్ని లింగమధ్యముననుండి ఈశాన కల్ప వృత్తాంతము నాశ్రయించి ప్రవచించినది లైంగ పురాణమని బ్రహ్మ స్వయముగా చెప్పెను. దీని పరిమాణము పదునొకండు వేలు. దీనిని లిఖించి ఫాలున పూర్ణిమనాడు తిలలతోను నూవులతోను అర్ధ నారీశ్వర దేవుని ప్రతిమతోను దానము చేసిన చో శివసాయుజ్యము కలుగును.
విష్ణువు భూమికి మానవకల్పము నాశ్రయించి మహా వరాహ మాహాత్మ్యమును చెప్పినది వారాహ పురాణము. దీని పరిమాణ మిరువదినాలుగువేలు. దీనిని వాసి చైత్ర పూర్ణిమనాడు కుటుంబియగు బ్రాహ్మణునకు బంగారు గరుడునితో తిలలతో ధేనువుతో కూడ దానము చేసినచో వరాహదేవుని అనుగ్రహమున విష్ణు లోకము ప్రాప్తించును.
తతు రుషకల్పవృత్తాంత మాశ్రయించి మా హేశ్వర ధర్మములను షణ్ముఖుడు (స్కందుడు ప్రవచించినది స్కాందపురాణము. దీని గ్రంథ పరిమాణము లక్ష పై ఒక వేయి శ్లోకములు. దీనిని వ్రాసి బంగరు శూలముతో కూడ దానము చేసిన మానవుడు బంధముక్తుడై శివలోకము నందును.
త్రివిక్రమ మాహాత్మ్యము సాధారముగా గొని కూర్మ కల్ప వృత్తాంతమును పురుషార్థములను బ్రహ్మ ప్రవ చించినది వామన పురాణము. దీని గ్రంథ పరిమాణము పదునాలుగు వేలు. దీనిని వ్రాసి విషువ దినమున రాత్రింబగళ్ళు సమముగానుండు దినమున) దానమిచ్చినవారు విష్ణుసాన మందుదురు.
కూర్మరూపు డగు జనార్ధనుడు ఇంద్రపన్ని ధియందు మునులకు ఇంద్రద్యుమ్ను ని ప్రసంగము మూలముగా లక్ష్మీ కల్ప వృత్తాంతములతో నాలుగు పురుషార్థముల మాహాత్మ్యమును ప్రవచించినది కూర్మ పురాణము. దీని గ్రంథ పరిమాణము ఆరువేలు పదునెనిమిదివేలని మరియొక మతము.) దీనిని వ్రాసి ఆయన ప్రవేశ పుణ్యకాలమున బంగరు కూర్మముతో కూడ దానమిచ్చిన మానవునకు వేయి గోవుల దానము చేసినంత ఫలము కలుగును."
కల్పాదియందు మత్స్యరూపుడగు జనార్దనుడు సత్యవ్రత మనువునకు సప్త (ఋషి) కల్ప వృత్తాంత మాధార ముగా వేదముల ప్రవర్తిల్లజేయుట కై (కాలరూపుడగు) పురుషోత్తమ తత్వమును వర్ణించి చెప్పినది మత్స్యపురాణము. దీని గ్రంథ పరిమాణము పదునాలుగున్నర వేలు లోగడ చెప్పబడిన) యుగాది దినమున బంగారు మత్స్యముతో ధేనువుతో అన్ని అమరిక లు కల కాంస్య పాత్రముతోను కూడ దీని వ్రాతప్రతిని బ్రాహ్మణునకు అనేక భూషణములతో అతని నలంకరించి దానము చేసినచో భూమినంతటిని దానము చేసినంత ఫలము కలుగును.
గారుడ కల్పమున బ్రహ్మాండమునుండి గరుడు డుద్బవిల్లిన వృత్తాంతమును విష్ణువు ప్రవచించినది గారుడ పురాణము. దీని పరినూణము పందొమ్మిదివేలు. దీనిని లిఖించి బంగారు హంసతో కూడ దానము చేసినచో సాలోక్య ము క్తిగా శివలోకము లభించును.
బ్రహ్మ బ్రహ్మాండ వృత్తాంతము నాశ్రయించి భవిష్య కల్ప వృత్తాంత విస్తరమును ప్రవచించినది బ్రహ్మాండ పురాణము. దీని పరిమాణము పండ్రెండువేల రెండువందలు. దీనిని లిఖించి వ్యతీపాత యోగమున ఉన్ని వస్త్రములతో బంగారముతో కూడ దానము చేసినచో వేయి రాజసూయముల ఫలము లభించును.
(నందీశ్వరుడు ఋషులకు శివుని సృష్టి సంహార కర్తనుగాను దేవాసుర సంగ్రామ వృత్తాంతమునుకూడ ప్రవ చించినది శివ పురాణము. దీని గ్రంథ పరిమాణము ఇరువది నాలుగు (ఇరువదియైదు) వేలు. దీనిని లిఖించి మాఘ కృష్ణ చతుర్దశి (మహాశివరాత్రి నాడు గంధాది ద్రవ్యములతో భోజనములతో కూడ దానము చేసినచో సంపూర్ణముగా నూరు మన్వంతరముల కాలము రుద్రలోక నివాసము సిద్ధించును.)
ఆశ్చర్యకర కర్మలు చేయ సమర్దుడగు వ్యాసుడు నేటికిని దేవలోకమునందు శతకోటి గ్రంథ పరిమాణము గల ఈ పురాణ (సముదాయమును లోక హితమునకై సంగ్రహించి నాలుగు లక్షల పరిమాణము గలదిగా చేసెను. దీనిని అతడు మాతండ్రికి చెప్పగా అతడు నాకు ప్రవచించగా నేను మీకు ప్రవచించితిని.
లోకమునందు ప్రతిష్ఠితములై యున్న ఉప పురాణముల సంఖ్య ప్రవచింతును. పొద్మ పురాణమునందు ప్రవచింపబడిన నరసింహ విషయ వర్ణనము కలది. నారసింహ పురాణము. దాని పరిమాణము పదునెనిమిదివేలు. కుమార స్వామీ నందునకు (శివ) మాహాత్మ్యమును ప్రవచించినది నందా పురాణము. సాంబుని గురించి భవిష్యోపాఖ్యాన రూపమున ప్రవచించినది సాంబ పురాణము. ఇట్లే ఆదిత్య పురాణమును గలదు. ఇట్లే అష్టాదశ పురాణములలో దేనికి సంబంధించిన వేరొక పురాణము కనబడునో అది ఈమూల పురాణమునుండి ఏర్పడిన ఉపపురాణమని ఎరుగ వలయును.
ఇది కాక పురాణములకు ఉండవలసిన పంచలక్షణములను పెద్దలు చెప్పియున్నారు. అవి.సర్గము - (ఆదిసృష్టి ప్రతినర్గము-(భూత పంచక సృష్టి వంశము (ప్రజాపతుల సృష్టి) మన్వంతరములు.వంశానుచంతము (ప్రజాపతుల నుండి కొనసాగిన ఆయా రాజరాజర్షి మహర్యాది పరంపర ); ఇట్లే పంచలక్షణములుకల పురాణములందు బ్రహ్మ విష్ణు రుద్ర సూర్యుల మహిమమును భువన సృష్టి సంహారములును ధర్మార్థ కామమోక్షముల ప్రకారములును ప్రవచింపబడును. అన్ని పురాణములయందును (శాస్త్రములకు ప్రతికూలముగా నడచిన దుష్టులకు) ఏతద్విరుద్ధ ఫలము కూడ (ఉదాహర ణములతో) చెప్పబడును. (పురాణములు సాత్వికములు రాజసములు తామసములు మిశ్రములునని నాలుగు విధములు) సాత్విక పురాణములందు విష్ణు మాహాత్మ్యము రాజసపురాణములందు బ్రహ్మ మహిమము తామసపురాణములందు అగ్ని శివుల మాహాత్మ్యము మీ శ్రములయందు సరస్వతీ మహిమ పితృదేవతా మాహాత్మ్యములు చెప్పబడును. ఈ అష్టాదశ పురాణాను క్రమమును దేవతా కార్యములందు పఠించినచో విష్ణులోక ప్రాప్తియగును.
వ్యాసుడు పదునెనిమిది పురాణములు రచించిన పిమ్మట వాటి యుపబలముచే కూర్చబడిన భార తేతిహాసమును లక్ష గ్రంథ పరిమాణముతో రచించెను. అది వధప్రధానమైనది. శతకోటి గ్రంథ పరిమాణముతో బ్రహ్మ రచించిన రామాయణ మును నారదుడు బ్రహ్మ నుండి ఎరిగి వాల్మీకికి బోధించగా దాని నొ ఋషి ధర్మార్థ కామ మోక్ష సాధకముగా రచించెను. ఇట్లు ఈ పురాణ వాజ్మయము సపాదపంచ లక్ష (525000) గ్రంథ రూపమయ్యెను. ఉదరము (అభ్యుదయము)ను కలి గించు పురాతన వృత్తాంతమునకు సంబంధించినది కావున ఈ వాజ్మయము ‘పురాణము' అనబడు చున్నది.
ఈ పురాణాను కమము ధన్యతను యశమును ఆయువును కలిగించునది. దీనిని చదివినను వినినను పరమ పదము లభించును. ఇది పవిత్రము కీర్తికి మూలము పితృప్రీతికరము. దేవతలకును అమృతమువలె ప్రీతికరము. మానవు లకు మహారోగహరము.
ఇది శ్రీ మత్స్యమహాపురాణమున మత్స్యమను సంవాదమున ఫురాణ సంఖ్యానుక్రమ పురాణదాన వ్రతములను ఏబది మూడవ అధ్యాయము.
Summary of chapter 53 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya reveals the sacred history, enumeration, and supreme spiritual merit of compiling and distributing the eighteen Mahāpurāṇas. The Lord explains that Bhagavān Brahmā originally remembered a single, vast Purāṇa spanning one billion verses, which was subsequently summarized into four hundred thousand verses divided into eighteen distinct scriptures by Maharshi Vedavyāsa in every Dvāpara Yuga to suit human capacity. The text enumerates each of the eighteen Mahāpurāṇas along with their exact verse counts, including Brahma, Padma, Vishṇu, Śiva, Bhāgavata, Nārada, Mārkaṇḍeya, Agni, Bhavishya, Brahmavaivarta, Liṅga, Varāha, Skanda, Vāmana, Kūrma, Matsya, Garuḍa, and Brahmāṇḍa, noting that the Matsya Purāṇa contains fourteen thousand verses. The chapter outlines the incomparable spiritual rewards earned by transcribing these holy scriptures onto palm leaves, adorning them with gold and fine garments, and donating them to learned, self-controlled Brāhmaṇas during auspicious astrological conjunctions such as the full moon of Jyeshṭha.