మత్స్య మహా పురాణము
49 - పూరువంశము
(*దాయదస్తన్యచాప్యాసీద్దూందుర్నామ.)
ఈ విషయమున వివరణము అనుబందములో చూడుడు
సూతుడు పూరువంశ వృత్తాంతమును ఋషులకు ఇట్లు చేప్పెను: పూరునకు జనమేజయుడు అతనికి తూర్పు దెస నంతటిని పాలించిన ప్రాచీన్వతుడు అతనికి మనస్యుడు అతనికి వాతాయుధుడు - అతనికి శంకుడు అతనికి బహు విదుడు అతనికి సంపాతి అతనికి అహంవాది అతనికి భద్రాశ్వుడు అతనికి ఘృతాచియను అప్పరసయందు ఋచేపు విలేపు క షేపు ఘృతేపు విచేపు స్థండిలేపు బలేపు ధర్మేపు సంతతేపు. పుణ్యేపులను పదిమంది కుమారులు. వీరిలో ఋచేపునకు తక్షక పుతియగు ,జ్వలనయందు అంతీకారుడు ఆతనికి మనస్వినీ అను భార్యయందు వీరుడగు అంశుడను నరపతియు ధార్మికు డగు శ్రీహనుడును గౌరియను కన్యయు కలిగిరి. ఈ గౌరి మాంధాతృని తల్లి యయ్యెను. అంశునకు ఉపదా నయను పత్ని యందు బ్రహ్మవిదులగు రుష్యంతుడు దుష్యంతుడు ప్రవీరుడు ఆనఘుడు అను కుమారులు కలిగిరి. అతనికి యుద్ధ విజయయగు భరతుడు అను . చక్రవర్తి కలిగెను. ఈతని పేరుననే ఈ వంశము వారికి భారతులను పేరు వచ్చెను. శకుంతల ఈతని తల్లి. శకుంతలను దుష్యంతుడు తిరస్కరించినపుడు) అశరీర వాణి దుష్యంతుని ఉద్దేశించి 'ఇట్లనెను: “దుష్యంతా:- తల్లి వస్తువులను దాచు.) తోలుతిత్తి వంటిది. కుమారుడు తండ్రికి చెందినవాడు. అతడు. తాను ఎవరివలన పునో అత డే. కాని వేరు కాదు. కనుక- కుమారుని వదలుట తన్ను తాను వదలుకొనుటయే యగును. కనుక “నీవు ఈ కుమారుని భరించుము. శకుంతల సత్యమే చెప్పినది. తనకు జన్మకారణముగా 'రేతస్సును (శుక్రమును-గర్భమును) నిలి పిన తండ్రిని యమలోకమునందలి బాధలనుండి సుతుడు కాపాడును..దుష్యంతో! (శకుంతలయందు) గర్బము. నిలిపిన వాడవు నీవు. ఈ శకుంతలను అవమానించకుము." (ఈతనిని భరించుము. అని చెప్పబడినవాడు కనుక భరతుడు.)
పూర్వము భరతుని కుమారులు తమ తల్లి కోపమునకు గురియై ఒకేమారు అందరును నశించగా మరుత్తులు (దేవతలు) బృహస్పతి పుత్రుడగు భర ద్వాజుని ఈ భరతునికి పుత్రునిగా సంక్రమిం పజేసిరి.
భరద్వాజోత్పత్తి సత్స నతిశ్చ
(*గతా సా తు గతాయం సోపి తం త్యజత్)
ఋషులు నూతు నిట్లు ప్రశ్నించిరి: “మారుతులు భరతునికి పుత్రునిగా భరద్వాజు నెట్లు సంక్రమింపజేసిరో తెలుప వేడెదము.”
సూతు డిట్లు చెప్పెను: ఉతచధ్యుడు తన భార్య మమత గర్భవతిగా ఉండగా మరణించెను. అతని తమ్ముడు బృహస్పతి మమతను చూచి "సుందరీ! నీవు చక్కగా అలంకరించుకొని నాతో కలియుటకు సిద్దవు కమ్ము. నీవు నా కేమియు కట్టుబాటు మాటలు (నీతులు) నేర్పవలదు." అనేను. మమత “ప్రభూ! నేను గర్భవతిని. గర్భము పరిణతమయి (ప్రసవము నకు సిద్ధమయి) యున్నది. ఆ శిశువు వేదమును చెప్పుచున్నది. నీవును వ్యర్థముకాని, వీర్యము కలవాడవు. ఇటువంటి ధర్మము నిందిత మయినది.” అనెను. కాని “నీవు నాకు సత్పవర్తనము నుపదేశించ నక్కరలేదు.” అని బృహస్పతి ఆమెను బలవంతముగా లాగి మైథునము నారంభించెను. అంతట గర్బము (శిశువు) బృహస్పతిని మందలించుచు “బృహస్పతీ! నేను ముందుగా ఇక్కడ ప్రవేశించితిని. నీవును అమోఘ రేతస్కుడవు. ఇక్కడ ఇద్దరకు తావు లేదు.” ఆనెను. శిశువుతో బృహస్పతి “సర్వభూతములకు (ఆనందకర) హితకరమగు ఇటువంటి సమయమున నన్ను ని షేధించి తివి. కావున దీరమగు తమస్సును (గుడ్డితనమును) ప్రవేశింతువు.” అనెను. అంతట అతడు తన కామమును ఆనంద మును కూడ మరలించుకొనెను. ఆతని వీర్యము భూమి పై పడి వెంటనే శిశువయ్యెను. సద్యోజాతుడగు (వెంటనే పుట్టిన) ఆ శిశువును చూచి మమత బృహస్పతితో “నేను నా ఇంటికి పోవుచున్నాను. వీనిని భరించుము.” అని పోయెను. బృహ సృతియు ఆ శిశువును వదలిపోయెను. ఇట్లు తల్లిదండ్రు లిద్దరును వదలిన శిశువును చూచి మరుత్తులు జాలి చెంది తీసి కొనిరి. వాయువులచే భరింపబడినందున అతడు భరద్వాజుడనబడెను. (భరత్-వాయు భరత్-వాజు> భరద్వాజ) ఆ కాలమునందే భరతుడు పుత్రులను కోరి కామ్యములును నైమిత్తిక ములు నగు యజ్ఞములతో దేవతల నారాధించెను. కాని అతనికి సంతతి కలుగలేదు. అంతట నతడు 'మరుత్తోమము' అను యజ్ఞము నాచరించి దానియం దతడు మరుత్తులను స్తుతించెను. దానికి ప్రీతులై వారు భరద్వాజుని తెచ్చి భరతునకు పుత్రునిగా ఇచ్చిరి. ఇతడు ఇట్లు వాస్తవమున ఆంగిరః పుత్తడగు బృహస్పతికి కుమారుడు.
తనకు పుతుడుగా లభించిన భరద్వాజునితో భరతుడు “విభూ! నాకు హితకరుడవగు నీవు లభించుటచే కృతార్థుడ నయితిని.” అని అతనిని ప్రశంసించెను. తనకు కుమారులు కలుగుట వితథము (వ్యర్థము-అసత్యము) అయి ఉన్నప్పుడులభించినందున భరత, డీతనికి అవితథుడు (అసత్యము కానివాడు) అని పేరుంచి అతనిని తన రాజ్యమున పట్టాభిషిక్తుని చేసి తాను వనమునకు పోయెను. *ద్వ్యాముషాయణుడగు ఈ భరద్వాజుని వంశ మున పుట్టినవారు కొందరు బ్రాహ్మణులును మరికొందరు క్షత్రియులు - ఇట్లు రెండు విధములవారు లేదా ఈ రెండు జాతుల ధర్మముల ననుసరించువారు) జనించిరి.
ఈ అవితథుని కుమారుడు భవమన్యుడు. అతనికి వాయ్వాది మహాభూతములతో తుల్యులగు నలుగురు కుమారులు బృహతతుడు మహావీర్యుడు నరుడు గర్గుడు అనువారు కలిగిరి. నరునకు సంకృతి అతనికి గురుడు రంతిదేవుడు కుమా రులు. ఈ గర్గుని కుమారుడు విద్వాంసుడగు శిబి. ఇతని కుమారులు శైబ్యులు గార్డులు అను పేరున క్షత్రియ ధర్మము పాటించు బ్రాహ్మణు లయిరి. వీరిలో ఆహార్యునికి తరకుకుడు ఆతనికి విశాల అను భార్యయందు త్ర్యూషణుడు పుష్క రుడు కవి అనువారు కలిగి బ్రాహ్మణు లయిరి. కొవ్యులు అను పేర ప్రసిద్దులలో ఈ మువ్వురును మహర్షు లయిరి. గర్గులు సంకృతులు కావ్యులు వీరందరును క్షత్రధర్మముతో వర్తించు బ్రాహ్మణులు. వీరిలో సంవృతాంగిరుడు అను నతని కుమారుడు బృహత్ క్షత్తుడు. అతని కుమారుడు హస్తి. అతని పేరుతోనే హస్తినాపురము నిర్మితమయ్యెను. ఇతనికి అజామీఢుడు వ్యుమీడుడు పురుమీఢుడు ఆను ముగ్గురు కుమారులు. అతనికి వంశోద్దారక లగు నీలిని భూమిని కేశిని అను ముగ్గురు భార్యలు. అతడు మహాతపస్సు చేసి తన వార్ధకమున భరద్వాజుని అనుగ్రహమున దేవవర్చసులగు ముగ్గురు కుమారులను పొందెను.
(*ఒకరికి జన్మించి మరొకరికి దత్తుడై కాని మరొక హేతువుచే కాని ఇద్దరు తండ్రులకు కుమారుడుగా ఐన ఒకే వ్యక్తి.)
వీరి వంశ విస్తరమును చెప్పెదను వినుడు: అజమీడునకు కేశినియందు కణ్వుడు అతనికి మేధాతిథి కుమారు లయిరి. వీరికి కాణ్వాయనులని వ్యవహారము.
ఈ అజమీడునకు ధూమినియందు బృహద్వాన్ అతనికి బృహత్ - అతనికి బృహన్మనసుడు అతనికి బృహ : ధనువు అతనికి బృహదిషుడు అతనికి జయద్రథుడు. అతనికి అశ్వజిత్ అతనికి సేనజిత్ అతనికి రుచిరాశ్వుడు కావ్యుడు దృఢరథుడు అవ ని జనపద రాజగు వకుడు అను నలుగురు కుమారులయిరి. రుచిరాశ్వునకు - పృథు సేనుడు అతనికి " పొరుడు అతనికి నీపుడు అతనికి నూటొక్కమంది కుమారులు కలిగిరి. వీరిలో సమరుడు అను నతడు నీపుల వంశమును కీర్తిని వృద్ధి చేయు వాడయ్యెను. అతనికి చరుడు భానుడు సుదర్శుడు కలిగిరి. పారునకు పృథుడు అతనికి సువ్రతుడు ఆత, నికి విశ్రాజుడు ఆతనికి శుకుని అల్లుడును కృత్వా అను నామెకు భర్తయు అగు' అణుహుడు అతనికి బ్రహ్మదత్తుడు అతనికి యుగదత్తుడు. అతనికి. విష్వక్సేనుడు కలిగిరి. ఇతడు సుకృతవశమున మరల జన్మించిన విభోజుడు" అని. కీర్తి పొందెను. విష్వక్సేనునకు ఉద క్సేనుడు అతనికి పాలాయనుడు అతనికి జనమేజయుడు. కలిగెను. - ఇతని నిమి త్తమయి ఉగ్రాయు ధుడు , అనునతడు నీపులనందరను నశింపజేసెను.
ఋషులు ఇట్లడిగిరి: “ఉగ్రాయుధుడు ఏ వంశమున ఎవరి కుమారుడై జన్మించెను? ఏల అతడు నీపుల నంద రను నశింపజేసెను?”
సూతుడు ఇట్లు చెప్పేను: ఉగ్రాయుధుడు సూర్యవంశజుడు. అతడు ఉత్తమమగు ఆశ్రమమున స్థాణు భూతు డై (కొయ్యవలే కదలక) వేయి ఏండ్లు తపస్సు చేసెను. నీవవంశీయుడగు జనమేజయుడు ఇతనిని తనకు కుమారుడగునట్లు వేడు కొని తన నీవవంశ రాజ్యము నతని కిత్తునని వాగ్దానము చేసెను. ఇందులకు ప్రతికూలత చూపవలదని అతడు నీపు లను మంచినూటలతో బ్రతిమాలి తాను వనమునకు పోయేను కాని నీపులు ఊరకుండక ఈ ఉగ్రాయుధ జనమేజయుల నిద్దరను చంపవచ్చిం-కొట్టసాగిరి. అపుడు ఉగ్రాయుధుడు వారితో “మీరు అకారణముగా మమ్ములను చంపుచున్నారు. ఈ జనమేజయుడు నన్ను ఆశ్రయించినవాడు. అతనిని కాపాడదలచి చెప్పుచున్న నా మాట విని ఇతనిని.జనమేజయుని ఏడు “వుడు.” అనెను. 'పొ రదీ వినలేదు. అంతట - అతడు “మీరు నా మాట వినుటలేదు. కావున మిమ్ములను శపించుచున్నాను. నేను చేసిన తపః ఫలము ఏమయిన ఉన్న చో యముడు మిమ్ముల నందర నశింపజేయుగాక ?” అనెను. వెంటనే వారి నందరను యముడు ముందునకు లాగికొని పోసాగేను. అది చూచి జాలిపడి ఉగ్రాయుధుడు “వీరు తెలియనివారు. ఈ వీరులు నా వారుగా భావించి వీరిని రక్షింప వేడుచున్నా ను." ఆని జనమేజయునితో పలికెను. వెంటనే జనమేజయుడు యమకింకరు లతో “పాపులగు దురాచారులారా! మీరు ఈ ఉగ్రాయుధునకు కింకరులు కండు.” అని చెప్పి కింకరులగు వ్యాధులు నార కీయులగు పొపులు మొదలగు వారితోపాటుగా యమునితో పోరాడి వారి నందరను జయించి ఉగ్రాయుధునకు అప్ప గించెను. అది చాల ఆశ్చర్యకరమగు విషయముగా నయ్యెను.
జనమేజయుని శక్తికి మెచ్చి యముడు అతనికి ము క్రీజ్ఞానమును వరముగా నిచ్చెను. తత్ఫలితముగా అంద రును తగినట్లు ధ్యానమును పూని అవ్యయుడగు కృష్ణుని చేరిరి. ( మోక్షము పొందిరి.)
ఈ ఉగ్రాయుధ జనమేజయ నీపుల ఆఖ్యానమును గ్రహించినవారు అపమృత్యువు పాలు గారు. ఇహపర సుఖ ముల నందుదురు.
అజామీఢునకు నీలినీయందు యవీరుడు అతనికి ధృతిమాన్ అతనికి సత్యధృతి అతనికి దృఢనేమి అతనికి సుధర్మన్ ఆతనికి సార్వభౌముడు (ఇది ఇతని బిరుద నామము) అతని వంశమున మహాపౌరపుడు (ఇది ఇతని బిరుద నామము) అతనికి రుక్మరథుడు అతనికి సుపార్శ్వుడు అతనికి సుమతి అతనికి సన్న తిమాన్ అతనికి కృతుడు కలిగిరి. ఇతడు కోసల దేశీయుడు మహాత్ముడు నగు హిరణ్యనాభిన్ అను మునికి శిష్యుడై సామ సంహితలను ఇరువది నాలుగు శాఖాభేదములతో ప్రవచించెను. ఆతని కుమారులకు ప్రాచ్యసామన్'లు అని ప్రసిద్ధి. వారిలో కార్తి అను నాతడు ప్రసి దుడు. ఆతనికి ఉగ్రాయుధుడు. ఈతనికి మహాపౌరవవర్గ నుడు అని బిరుద నామము-(పూరువంశము వృద్ధి చేయువారిలో చాల గొప్పవాడు అని అర్థము.) ఈతడు తన విక్రమముతో పాంచాలాధిపతియు బలశాలియు వృషస్తుడు అను ప్రసిద్ధ రాజునకు పితామహుడు నగు నీలుడు అను నతనిని ఓడించి ఈ బిరుదము నందెను. ఇతనికి క్షేమ్యుడు ఇతనికి సుస్టీథుడు అతనికి నృపంజయుడు కలిగేను. ఇతని వంశీయులకు నృపంజయులు అనియు విరథులు అనియు ప్రసిద్ధి. ఇది పౌరవవంశము.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున చంద్రవంశాను వర్ణనమున పూరువంశ వర్ణనము అను నలువది తొమ్మిదవ అధ్యాయము.
Summary of chapter 49 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya details the primary royal branch of Puru, known as the Paurava-vaṁsha, which held the central sovereign throne of Bhārata. The chronicle traces the lineage through Rantineya, Anila, and King Dushyanta, who married Shakuntalā who was the daughter of Sage Vishvāmitra and Menakā in a Gāndharva marriage. Their illustrious son was Emperor Bharata, a paramount sovereign who conquered the entire subcontinent from sea to sea, performed countless Ashvamedha sacrifices, and after whom this sacred land was named Bhāratavarsha. Finding his own biological sons lacking in royal virtue, Emperor Bharata named Bhumānyu, who was the son of Bharadvāja, as his heir, demonstrating that royal succession must prioritize moral character and competence over mere biological inheritance.