మత్స్య మహా పురాణము
206 - వృషోత్సర్గ వృషలక్షణము.
భగవన్! వృషోత్సర్గమున వదలవలసిన వృషభపు లక్ష మును వృషోత్సర్జన విధానమును దాని మహాఫలమును వినగోరుదుననిన మనువుతో మత్సుడిట్లు చెప్పెను: మొదట ఆ వృషభమునకు తల్లియగు ధేనువును పరీక్షించవలయును; ఆ ధేనువు సుశీల యు గుణవతియు అంగవైకల్యము లేనిదియు నలిగి చిక్కి పోనిదియు పుట్టిన దూడలన్ని యు బ్రదికి యున్నదియు రోగములు లేనిదియు నున్న ని వన్నె యు గిట్టలును కొమ్ములును కలదియు మనోహరాకృతి కలిగి సౌమ్యయై సరియగు ప్రమాణముతో నుండి పొగరులేనిదిగా నుండవలయును; దాని కుడివైపు సుడులు కుడివైపునకును ఎడమవైపు సుడులు ఎడమవైపునకును తిరిగియుండవలెను; విశాలమగు మలుగు (జఘనము) మెత్తనై దట్టమగు ఎర్రని పెదవులు ఎర్రని మెడ కలిగి చక్కగ ఒప్పుచుండవలయును; ఆ ధేనువు కొంచెము చామనచాయ కలిగి దేహమున ముడుతలు లేక విప్పారిన ఎర్రని నాలుకయు విశాలములు నిర్మలములు ఎరనివీ వైడూర్యపు వన్నె యే తేనేవన్నె యో కలవి నీటి బుడగల వలె ఎత్తుగా కనబడునవి ఎర్రని కనుపాపలు కలవి నున్న నివి అగుకన్నులును ఒత్తయిన గట్టి గిట్టలును ఏడు కానీ పదు నాలుగు కాని దంతములును చామనచాయ గల లో దౌడలును కలిగి యుండవలయును; ఆరు ఉన్న తములయి చక్కని పార్శ్వములు తొడలు కలిగి. విశాలమయి ఐదు సమములు ఆయతములునయి ఎనిమిది ఆయతములయిన తలయు మెడయు ఉన్న ధేనువులు మంచి లక్షణములు కలవి; ఆనగా మనువు - భగవన్! షడున్న తములు పంచనమాయతములు ఆష్టాయతములు ఆననేవేవి? ఆవి యుండుట ధేనువులకు శుభకర మంటిరిక దా! తెలుపుడన మత్యుడిట్లు పలికెను: ఉరము వీపు శిరము పొట్ట పిరుదులు రెండు. మొత్తమీయారును ఉన్న తములయి యున్న ధేనువులు మంచివని పండితులు ప్రశంసింతురు; రెండు చెవులు రెండు కన్నులు లలాటము ఈ ఐదును నమములై పొడవై యుండవలెను. తోక గంగడోలు రెండు తొడలు నాలుసనములు ఈ ఎనిమిదియు వీనితో పాటు శిరము కంఠము కలిసి మొ త్తము పదియు పొడవయి యుండవలెను.
తరువాత ఆ ధేనువునకు కుమారుడగు వృషభమును పరీక్షించవలెను; ఆది లక్షణవంతము కావలెను; దాని మూపును మూపుర మును ఎత్తుగా తోక యు గంగడోలును వంకరలేక ఉండవలెను; ఆది పెద్దకటి స్థలము మూపులు వైడూర్యమణి వంటికన్ను లు పవడము వంటి కొమ్ముల కొనలు చెవుల కొనలు - చాల పొడవై విశాలమగు తోక కుచ్చు తొమ్మిది కానీ పదునెనిమిదికాని వాడి మొనలుగల చక్కని దంతములు కలిగియుండవలెను; మల్లె మొగ్గలవంటి . కన్ను లుకల దానిని వదలిన చో వదలినవాని ఇంట ధనధాన్య వృద్ధియగును; ఎర్రని కపిల వర్ణపుది తెల్లనిది రాగివన్నెది నల్లనిది గౌరవన్నె ది. పాటల వర్ణపుదీ (తెలుపు ఎరుపు సమముగ కలిసినవన్నె ది) లావు కొమ్ములు ఎర్రనీ వీపు ఐదు వన్నె లు కలిసిన తోక కుచ్చు వెంట్రుకలు విశాలములగు చెవులు విశాలములగు మూపులు దట్టములై నున్న నైన రోమములు ఎర్రని కన్నులు కల కపిల వృషభము ఎర్రని , కొమ్ముల పైవన్నె తెల్లని పొట్టనల్ల డొక్కలు కల పృషభమును బ్రాహ్మణులు, విడువవలయును; చిక్కని ఎరుపు. వన్నె కలది. క్షత్రియులు విడువదగినది; బంగరువన్న ఎద్దును వైశ్యులు నల్లని దానిని శూద్రులు విడువవలయును;. ముందువై వునకు వంగి పొడవై కనుబొమల వైపునకు చూచుచున్న కొమ్ములు కలది సదా సర్వవర్ణముల వారును విడువ దగినది. (వృషభముల లక్షణములబట్టి నామ విశేషములు కలవు; ఎట్లన-) పిల్లి పాదముల వంటి పాదములు కపిలవర్ణము - కపిల పింగళ వర్ణము - కలదియు తెల్లనిదై మార్జాల పాదనహితము మణులవంటి కన్నులు కలదియు పింగళ వర్ణము తెల్లని పాదము - సర్వత్ర తెల్లని పాదములు - తెల్లని రెండు పాదములు కలదీ యు - ఇట్టి కోడెదూడలను ధన్యజాతి అందురు; చెవి మొదళ్లయందు తెలుపు కలిగి ప్రకాశించు మొగము ర క్తవర్ణ ముఖము -శరీరమంతయు రక్తవర్ణము - కల కోడెను నందీ ముఖమందురు; శరీర మంతయు ఎక్కువ భాగము ఎర్రనై పొట్టయు వీపును తెల్లగా నున్న కోడెదూడను సముద్రము అందురు; ఇదియు వంశ వృద్దిక లిగించును; మల్లెపూవువలె నుండియు పలువన్నె లు కలదియు పద్మమువలే నుండియు పలువన్నె లు కలదియు భాగ్యవృద్ధి కలిగించును; అవిసిపూవన్నె కలదియు మరియు ధన్యతరము; ఈ చెప్పిన వన్నియు ధన్య వర్గమునకు చెందినవి; (మేలయినవి); ఇక అధన్యములు: నల్లని దౌడలు పెదవులు దంతములు బిరుసు కొమ్ములు గిట్టలు అస్పష్ట వర్ణము కలవియు పొట్టివి పులివలే సింహమువలె కనబడునవి పులివన్నె గ్రద్దవన్నె కలపి ఎలుకవన్నే కలవి చాల నల్లనివి మెల్లకంటివి కొంకికొళ్ళవి ఓర చూపులవి ఎగుడుదిగుడైన తెల్లని పాదములు కలవి గ్రుడ్లు త్రిప్పునవి మీడిగ్రుడ్లవి ఇట్టి వృషభములను విడువరాదు; ఇంటనుంచు కొనరాదు; వృషోత్సర్గమున విడువదగినవీయు - ఇంటనుంచు కొనదగి నవియు నగు వృషభముల లక్షణమును మరల జెప్పెదను; వినుము.
స్వస్తికాకారపు కొమ్ములు ఉరుమువంటి కంఠధ్వని పెద్ద కొలత మదపుటేనుగునడక వలె నడక వేడలుపు రోమ్ము పెద్ద ఎత్తు మహాబల పరాక్రమములు కలవియు శరీరమంతయు తెల్లనై తల-చెవులు. లలాటము తోక కుచ్చు-పాదములు. కన్నులుడొక్కలు నల్లగా నుండినవియు తోక వెంట్రుకలు నేలకు తాకుచు వ్రేలాడుచుండ తోక మాత్రము లావై ముందుకు సాగినట్లుండునవియు ప్రళ స్తములు; రోమ శ్రేణియందు శక్త్యాయుధమును.ధ్వజమును (పెద్ద జెండా) పతాకను (చిన్న జెండాను) పోలిన గుర్తులుకలవియు మరలించినపుడు కుడివైపుగా మరలునవియు చాల ఎత్తగు తలయు మెడయు కలవీయునగు కోడెలు వృద్ధిని పలువిధములగు సిద్దులను జయమును కలిగించును; శరీరమంతయు తెల్లనై కొమ్ముల కొనలు కన్నులు మాత్రము ఎర్రనై పగడములవంటి గిట్టలు కల వృషభముకంటే మేలగునది మరి ఏదియును ఉండదు; ఇట్టివానిని వదలినను ఇంట ఉంచుకొనినను మంచిదే; ఇవి ధనధాన్య వృద్ధికరములు; పాదములు ముఖము తోక తెల్లనే శరీరమంతయు ఎర్రనే న దానిని నీల వృషభమందురు; దీనిని వృషభముగా విడువదగునేకాని ఇంట ఉంచుకొనదగదు; దీని విషయముననే పురాతనమగు గాథ (గీతము) ఇట్లు కలదు; చాలమంది పుత్తులు కావలెనని గృహస్థులు కోరుకొన వలెను; వారిలో ఒక డైన గయకు పోవునేమో! గౌరియగు (రజస్వల కాక ముందు) కన్యకు వివాహము చేయునే మో! నీల వృషోత్సర్గము చేయునేమో!
రాజా! ఇట్లు సల్లక్షణము గల వృషభమును తన ఇంట పుటిన దానినేకానీ కొనిన దానిని కాని ఉత్సర్గము (వదలుట) చేసినవాడు తన మరణ విషయమున శోకింపవలసిన పనియుండదు; అట్టి మహాత్ముడు తుదకు ము క్తికూడ పొందును; ఇందువలననే నేనిది ఇంత గా చెప్పుచున్నాను.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున మను మత్స్య సంపాద రూపమగు వృషోత్సర్గ వృషభ లక్షణమను రెండువందల ఆరవ అధ్యాయము.
Summary of chapter 207 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya details the procedural mandates and immense spiritual merit acquired by planting and nurturing sacred botanical groves and trees. Bhagavān Matsya outlines the consecration ceremony for planting revered species such as Ashvattha, Vaṭa, Nimba, Āmalakī, Bilva, Champa, and Bakula, complete with sacred thread ceremonies and water oblations. Reaffirming the famous Purāṇic principle that a single sacred tree equals ten righteous sons, Bhagavān Matsya declares that whoever provides shade, fresh oxygen, blossoms, and fruits to travelers and wildlife earns continuous merit that lasts as long as the tree stands on earth.