మత్స్య మహా పురాణము
3 - బ్రహ్మనుండి వేదాదికము ఉత్పత్తి చెందుట
మనువు ఇట్లడిగెను: లోక పితామహుడగు బ్రహ్మ ఏల చతుర్ముఖు డయ్యెను? బ్రహ్మ (వేద)వేత్తలలో శ్రేష్ఠుడు అగు బ్రహ్మ లోకములను ఎట్లు సృష్టించేను?
మత్స్యము ఇట్లు చెప్ప నారంభించెను: దేవతలకును పితామహుడగు బ్రహ్మ మొదట తపస్సు ఆచరించెను. అంతట ఆంగములతో ఉపాంగములతో పదములతో క్రమముతో ఘన జట మొదలగు వానితో) కూడ వేదములు అతనికి సాక్షాత్కరించెను. నిత్య శబ్దమయమును పుణ్యకరమును శతకోటి గ్రంథ (32 అక్షరములు గ్రంథము అని పరిభాష) విస్తరము కలది అగు పురాణమును ధర్మశాస్త్రములతోకూడ మొదట బ్రహ్మ స్మరించి పూర్వ కల్పములందు తనకు తెలిసిన వానినే కొనెను. తరువాత అతని ముఖముల నోళ్ల నుండి వేదములును ఎనిమిది (ప్రత్యక్షము అనుమానము ఉపమానము ఆగమము అర్థాప త్తి అసంభవము ఐతిహ్యము పురాణము ) ప్రమాణములతో కూడ న్యాయ విద్యలు బయటకు వచ్చెను. వేదములను ఆవృతము చేయుచునే యున్న వాడును ప్రజలను సృష్టింప సంకల్పించిన వాడు నగు అతని మానసమునుండి సంకల్పముచే మొదట సృష్టింపబడిన పుత్రులు మానస పుత్రులైరి. వారు వరునగా- మరీచి అత్రి అంగిరుడు పులస్త్యుడు పులహుడు క్రతువు ప్రచేతుడు వసిష్ఠుడు భృగువు నారదుడు. వీరందరును జీవ పుత్తులు తమ నుండి పుత్తులనుత్పన్ను లను చేసి జీవింప జేసినవారు. వీరిలో నారదుని విషయ మాలోచింప వలెను.) ఆత్మ హీనులు (దేహము లేనివారు అగు బ్రహ్మ పుత్రుల దేలి పెదను. బ్రహ్మ కుడి బొటన వేలినుండి దక్షుడు (ఇతడు మాత్రము దేహము కలవాడు. సృష్టిని కొనసాగించి ప్రజాపతి ఐనవాడు.) నాభినుండి ధర్మము హృదయమునుండీ మన్మథుడు కనుబొమ్మల నడుమనుండి క్రోధము క్రింది పెదవినుండి లోభము బుద్ధినుండి మోహము అహంకారమునుండి మనస్సు చెవినుండి ప్రమోదము సంతోషము) కన్ను లనుండి మృత్యువు అను కుమారులును అంగజ అనేది కన్యయు కలిగిరి.
(*రూపం గంధగుణా క్ష్మాతు పరేషాం యా బలీయసీ)
మనువు మరల ఇట్లడిగెను: బుద్ధికుమారుడు మోహము అహంకారపుత్రుడు మనస్సు ఆంటిరి. బుద్ధి అనగా ఏమి? అహంకార కుమారుడగు మనస్సు అనగా ఎట్టిది?
మత్స్యము ఇట్లు పలి కెసు: సత్వము రజస్సు తమస్సు అనునవి మూడు గుణములు. వీటి మూడిటి సమత్వస్థితిని ప్రకృతి ప్రధానము అవ్యకము అందురు. ప్రకృతి ఈ మూడు గుణములతోనే సృష్టి జరుపును. సృష్టిలోని పదార్థముల పరిణమింప జేయును. లయముకూడ పొందించును. క్షోభము (స్పందము) పొందిన మూడు గుణములనుండి ఒ కే మూర్తి యగు ప్రకృతినుండి ముగ్గురు దేవతలు జనించిరి. వారే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వికారము నొందని ప్రధానమునుండి మహత్తత్వము పుట్టును. దాని మూలముననే లోకములకు మహాన్ దృష్టికి గోచరమగునంత పెద్ద పరిమాణము కలవి) అను ప్రసిద్ది ఏర్పడును. మహత్ నుండి మానగర్వమును వృద్ధి చేయు అహంకారము దానినుండి బుద్ది వశములగు, ఐదు జ్ఞానేంద్రియములు - త్వక్చకుః శ్రోత్ర జిహ్వాక్రణములును కర్మ వశములగు ఐదు వాక్పాణిపాద పాయూపస్థములను కర్మేంద్రియములును జనించెను. వరుసగా స్పర్శము రూపము శబ్దము రసము గంధము అనునవి. జ్ఞానేంద్రియములకు గోచరములగు విషయములు. వచనము ఆదానము గతి ఉత్సర్గము ఆనందము (ఆనందింప చేయుట) అనునవి కర్మేంద్రి యములు చేయు పనులు. ఈ ఇంద్రియముల జ్ఞాన కర్మ లక్షణములుగల మనస్సు వీనితో పదునొకండవది. విద్వాంసులు మాత్రము దర్శింపగల సూక్ష్మములగు ఇంద్రియావయవములు పంచతన్మోత్రలను పంచభూత సూక్ష్మాంశములను) ఆశ్ర యించి ఉండును. అందుచేత ఈ ఇంద్రియ తన్మాత్రల సంఘాతము శరీరము అనబడును.
ప్రకృతి ఆపరమేశ్వరుని సృష్టి సంకల్పముచే పేరింపబడినదగుచు పరమేశ్వరుని మనస్సు ప్రకృతిని పరిణ మింప జేయును. శబ తన్మాతనుండి శబ గుణము కల ఆకాశమును అది పరిణమించగా శ బస్పర్శ గుణములుగల వాయు వును అది పరిణమించగా శబ్ద స్పర్శరూప గుణములు కల అగ్నియు అది -పరిణమించగా శబ్ద స్పర్శ రూపరసములుగల జలమును అది పరిణమించగా శబ్ద స్పర్శ రూప రసగంధములు గుణములుగాగల పృథివియు ఉత్పత్తి పొందెను. వీటి అన్నింటిలో బుద్ది శ్రేష్టమయినది. ఐదు మహాభూత సూక్ష్మములు అహంకారము బుద్ది అవ్య క్తము మనస్సుతో కూడ పదునొకండు ఇంద్రియములు ఇంద్రియ విషయములు అను ఇరువదినాలు తత్వములకు అతీతుడగు(ఇరువది ఐదవపురుషుడు (జీవుడు) ఈ ఇరువది నాల్గింటిచే సాధింపబడిన సుఖదుఃఖాదులను అనుభవించుచుండును. అంతర్యామి అగు ఈశ్వరునకు వాచకుడనియు జలాత్మ అనియును పేరులు. ఇతడిరువదియారవవాడు. అందుచే మానవశ రీరము నా శ్రయించి చేయుత త్వ విచారణమును షడ్వింశక మందురు. ఇట్లు ఇది సంఖ్యా రూపము కావున దీనిని సాంఖ్యము అని కపిలుడు మొదలగు వారందురు. (సంఖ్యా అనగా జ్ఞానము అని అర్థము.)
(*తతః పున స్సమభవత్పఞ్చమం)
బ్రహ్మ ఇట్లు షడ్వింశత్ తత్వరూపమయిన జగత్తును సృష్టించిన తరువాత దేవతలను జనింపజేసెను. అతడు లోక సృష్టి జరుపు సంకల్పముతో సావిత్రీ తత్వమును హృదయమున నిలుపుకొని సమాధిస్థితుడయ్యెను. ఆ విద్యను జపించుచుండిన అతని దేహము నిష్కల్మషమయి సగము స్త్రీరూపమును సగము పురుష రూపమును ఆయ్యెను. ఆ స్త్రీరూప మునకే శతరూప సావిత్రి సరస్వతి గాయత్రి అని వ్యవహారము. తన దేహమునుండి ఉత్పన్న యేన ఆమెను అతడు తన కుమార్తె (ఆత్మజ) అనియు ఆయనయే వ్యవస్థ చేసెను. ఐనను ఆదేపుడు ఆమెను చూచిన తత్తణమే కామబాణములచే బాధనొంది ఎటువంటి రూపము! ఎటువంటి సౌందర్యము! అని ఆశ్చర్యముతో పలి కెను. వసిష్ఠుడు మొదలగువారు అక్కా! అని అరచిరి! కాని బ్రహ్మ ఆమె మొగమును చూచు ఆసక్తి లో అది ఏమియు చూడ లేదు. మాటిమాటికి ఎంత సౌందర్యము: అని పలుకసాగెను. అంతలో తనముందు తనకు నమస్కరించు ఆసక్తితో ఉన్న ఆ సావిత్రి అతనికి కనబడెను. అంతట ఆ ఉత్తమ స్త్రీ తన తండ్రికి ప్రదక్షిణము చేసెను.
అమెసౌందర్యమును చూడదలచియు తన కొడుకుల ఎదుట ఆపని చేయుటకు సిగ్గుపడుచున్న ఆ బ్రహ్మకు వెంటనే వెలవెల పోవుచున్న చెక్కిళ్లు కల దక్షిణ ముఖమును ఆశ్చర్యముతో వణకుచున్న పెదవులు కల పశ్చిమ ముఖ మును మన్మథ బాణములచే బాధపడుచున్న (కామ పరవశమయిన) నాలుగవదగు ఉత్తర ముఖమును కలిగేను. అత డపు డట్లు కామానుచరుడగుట వలన అది చూచి ఆ సావిత్రి పైకి గంతువేయుచు ఇదే మను కుతూహలముతో పైకి ఆకాశము వైపు చూచుచుండగా ఆ బుద్ధిశాలియగు బ్రహ్మకు ఐదవదగు ఊర్ధ్వ ముఖము ఉత్పన్నము అయ్యెను. అట్లు ఆ ప్రభువు నకు అక్కడకక్కడనే మరొక ముఖము (ఐదవది) కూడ మొలచెను.
కాని తన కుమార్తెనే పొందగోరుటవలన ఆయన అంతవరకు సృష్టి చేయగోరి ఆచరించిన పర మదారుణమగు తపస్సంతయు నాశము నందెను. అది చూచి కలవరపడుచున్న తన (మానస) పుత్తులతో బ్రహ్మ మీరందరును కూడి దేవా సురమానవులు మొదలగు ప్రజలను సృష్టించుడు. అని ఆజ్ఞాపించెను. ఆ మాట విని వారందరును వెళ్ళి వివిధ ప్రజలను సృష్టించిరి.
మరీచి మొదలగు ప్రజాపతులు సృష్టి చేయుటకై వెళ్ళగానే వినయముతో మిగుల వంగిన ముఖముతో నున్న దే ఏ దోషమును లేని పవిత్రురాలగు ఆశతరూపను విశ్వమునకు ఆత్మభూతుడగు ఆ బ్రహ్మ వివాహమాడెను. అతడు (లోక) విభు డయియును ఆమె విషయమున కామముచే బాధపడినవా డయ్యెను. ఆ దేవుడు. సామాన్యమానవునివలె నూరేండ్లపాటు తన స్థానమగు పద్మపు నడుమ అనెడి గృహమునందే సిగ్గుపడుచున్న ఆమెను అనుభవించెను. చాలకాలమునకు బ్రహ్మకు ఆమెయందు తన వంటి వాడే అగు మనువు కుమారుడుగా పుట్టెను. ఆతని కే 1. స్వాయంభువుడు అనియు 2. విరాట్ అనియు పేరులు మనకు అను శ్రుతముగా వినవచ్చుచున్నవి. ఇతని రూపమును- గుణములును బ్రహ్మరూప గుణములతో సమానముగా ఉండుటచే అతనికి 8. అధిపూరుషుడు అనియు పేరు. [1. స్వయంభూ యొక్క కొడుకు. . 2. వివిధ రూపములతో ప్రకాశించువాడు 8. మొదటి పురుషుని నుండి పుట్టిన మరొక పురుషుడు.) ఈ స్వాయంభువునినుండి స్వారోచిషుడు ఉత్తముడు మొదలగు పదునాలుగు మంది మనువులు బ్రహ్మతో సమానముగా రూప- గుణములు కలవారు ఉత్పన్ను లైరి. ఇపుడు వారిలో ఏడవ మనువు పాలించుచున్నాడు.
ఇది శ్రీ మత్స్య మహా పురాణమున బ్రహ్మనుండి వేదాదికము జనించుట అను తృతీయాధ్యాయము.
Summary of chapter 3 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya expounds upon the eternal truth of primary creation to King Vaivashvata Manu, describing how prior to the manifestation of space and time, the unmanifest Supreme Brahman existed in complete equilibrium as an unillumined expanse. When the divine will initiated creation, the Supreme Lord activated the three Guṇas of Sattva, Rajas, and Tamas and created the cosmic waters, depositing a brilliant golden egg known as Hiraṇyagarbha that shone with the brilliance of ten thousand suns. Within this divine egg, Bhagavān Brahmā, the primary creator of the universe, resided for a full cosmic year before dividing the shell into two halves to form the upper celestial firmament and the lower earth. From the residual elements emerged the vast oceans, mountain ranges, cardinal directions, time divisions, and the mind-born sons of Brahmā, including Marīchi, Atri, Aṅgiras, Pulastya, Pulaha, Kratu, Prachetā, Vashishṭha, Bhṛgu, and Nārada. Bhagavān Brahmā then projected from his divine form the exquisite goddess Śatarūpā, whose divine splendour initiated the process of material diversification.