మత్స్య మహా పురాణము
237 - ప్రాసాద పతనాది దుర్నిమిత్తశాంతి.
గర్గుడు ఆత్రితో ఇట్లు చెప్పెను: మేడలును పుర ద్వారములును బురుజులును ద్వారములును ప్రాకారములును మహాగృహములును గట్టిగనున్న వియు ఆకస్మిక ముగ పడుట రాజమృత్యు సూచకములు; దిక్కులు ధూళులతో పొగలతో అకారణముగ వ్యా ప్తమయినను ఆదిత్యచంద్ర తారలు వివర్లములయినను రాష్ట్ర భయమును సూచించును; రాక్షసులు కనబడుట బ్రాహ్మణులు తమ ధర్మము తప్పుట ఋతుధర్మములు వ్యత్యాసమందుట జనులు అపూజ్యులను పూజించుట నక్ష త్రములు ఎడ మెడ ముగా కనబడుట మహాభయ సూచక ములు; ధూమకేతువులు కనబడుట చంద్ర సూర్య గ్రహణములు తరచగుట చంద్ర సూర్య మండలములు రంధముతో కనబడుట గ్రహ నక్ష త్ర వైకృతము స్త్రీలు అకారణముగ అధికముగ కలహించుట బాలురు బాలురతో కలహించుచు కొట్టుచుండుట ఉచితక్రియలు జరుగక విచ్చిన్నములగుట శాంత్యాది కర్మములందు హోమము చేయుచుండగా అగ్ని జ్వలించక పోవుట చీమలును మాంసాహారి మృగ పక్ష్యాదులును ఉత్తరముగా పోవుచుండుట నిండు కడవలు ఆకారణముగా కారుట హవిస్సు లు ప్రమగుట అన్ని వైపులనుండియు శుభవాక్కులు వినబడ కుండుటజనులలో జలుబు బాధ ఎక్కువగుట అకారణముగ నవ్వులు అరపులు అధికమగుట దేవ బ్రాహ్మణులను సరిగా ఆదరించక పోవుట వాద్యములను మోగించగా అవి సరిగా ! మోగక పోవుట జనులు గురువులను మిత్రులను ద్వేషించుట శత్రువులను పూజించుట బ్రాహ్మణులను సుహృదులను మాన్యులను అవమానించుట శాంతికృత్య మంగళకృత్య హోమ కృత్యముల విషయమున నా సికతా భావము ప్రబలుట. ఇటీవి రాజమరణమును దేశ నాశమును రాజునకు నాశమున నూచిం చును. మృత్యువు దాపురించినచో రాజును బ్రాహ్మణులను ద్వేషించును; బ్రాహ్మణులకు తాను ద్వేష్యుడగును; వారీ ధనములు హరించును; వారిని చంపగోరును; పనులు పడినపుడును వారిని తలచుకొనడు; వారు యాచించినచో కోపించును; వారిని నిందించుచో సతోషించును; ప్రశంసించినచో మేచ్చడు.నొచ్చుకొనును; జనుల పై కొత్త కొత్త పన్నులు వేయును; ఇట్టి సందర్భములలో బ్రాహ్మణదంపతుల నర్చించవలేను; జాహ్మణ సంతర్పణములును దేవతా బలులును జరుపవలయును; సజ్జనులను విప్రులను పూజించవలయును - వారికి దానమీయవలెను; బ్రాహ్మణులకు గోవస్త్ర రత్న గృహ దానములు చేయవలయును; హోమములును దేవతా పూజలును జరుపవలయును; దీనిచే దోష శాంతియగును.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజధర్మమున ప్రాసాద పతనాది దుర్నిమిత్త శాంతియను రెండు వందల ముప్పది ఏడవ అధ్యాయము.
Summary of chapter 238 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya outlines the daily routine, personal hygiene, dietary regulations, and health maintenance protocols for a monarch. Bhagavān Matsya details the structured division of day and night into eight watches, allocating specific time blocks for governance, intelligence reviews, judicial hearings, meals, exercise, religious worship, and rest. Following this disciplined routine preserves physical vitality, sharp mental clarity, and emotional balance required for effective state governance.