మత్స్య మహా పురాణము
147 - యుద్ధమునకై దేవాసురులు బలముల కూర్చుకొనుట॥
తపఃకరణార్థం తారకస్య పారియాత్ర పర్వతగమనమ్॥
తారకుడిట్లు పలికెను: మహాబలులగు అసురులారా! అందరును నా మాట వినుడు॥మీరందరును కార్యాచరణ మందు మిగుల స్థిర బుడి నిలుపుడు, దానవులారా! దేవతలు మనకు వంశ క్షయకరులు॥ మనకు జాతిధర్మముగా పారితో అక్షయమగు వైరము నేలకొని యున్నది॥ మనము ఇపుడు సురలదండించుటకుగా స్వభుజ బలము సర్వమును అవలంబ నముగా చేసికొని పోవుదము, ఇందు సందేహము వలదు॥ కాని తపస్సు లేక దేవతలతో సంగరము యుక్తము కాదను కొందును॥ దితిసుతులారా! మొదట నేను ఘోర తపమొనరింతును॥ తరువాత దేవతలను జయింతము; జగతం యమును అనుభవింతము॥ స్థిరోపాయముగల పురుషుడే స్థిర శ్రీని పొందును॥ చపలుడనయియుండి నేను సహజ చపల యగు లక్ష్మిని కాపాడ జాలను॥ అనగా దైత్యదాతనవు లందరును ఆ తారకాసురుని వచనమువిని విస్మయమంది 'బాగు బాగ’నిరి॥ తారకుడును పారియాత్ర గిరి గుహకు పోయేను॥ అది ఉత్తమము॥ సర్వఋతు కుసుమములతో వ్యా ప్తము;
తారకుని మాటవిని అతని సేనాపయగు గ్రసనుడను దానవుడు తన సేనతో కూడి అదేవిధముగా చేసెను॥ అతడు గంభీరమగు భేరిని మోగించి త్వరితముగా దైత్యులను యుద్ధమునకై పిలిచేను॥ వేయి గుర్రములు ఎనిమిది చక్రములు శుక్ల వస్త్రాలంకార ములు నానా క్రీడాగృహములు మనోహర గీత వాద్యపు ఏర్పాటులు కలిగి చతుర్యోజన వైశాల్యము కలిగి దేవపతియు శతక్రతుడునగు ఇంద్రుని విమానమో యనునట్లున్న రథమును సిద్ధపరచెను॥ దైత్యు లలో చండ విక్ర ములును పది కోట్ల దైత్యులకు నాయకులును అగు అసురులును సంసిద్దులైరి॥ వారందరును నానా శస్త్ర ములతో యుద్దము చేయగలవారు; నానా శస్త్రాస్త్ర విద్యాపారంగతులు॥
వారిలో తారకుని ధ్వజము రౌద్రమయి పద్మాలంకృతమయి యుండెను॥ గ్రసనుడు మకరధ్వజము దాల్చెను॥ జంభుని ధ్వజము అయోమయమయి పిశాచముఖమయి యుండెను॥ కుజంభుని ధ్వజమందు తోక ఆడించుచున్న గాడిద ఉండేను॥ మహిషుని ధ్వజమందు బంగారు నక్క యుండెను॥ శుంభుని అత్యున్నతమగు ధ్వజమిందు అయోమయమగు కాకి యుండెను॥ ఇతర దానవుల ధ్వజములును అనేకాకార చిహ్న ములతో నుండెను॥
గ్రసనుని రథము శీఘవేగము కలవి బంగరుమాలికలు కలవియగు నూరు పులులు పూంచినది॥ జంభుని రథము చిరుగజైల సమూహముల మాలికలుకల నూరు సింహములను పూంచినదై దుర్జయమయినది॥ పిశాచముఖములు గల గర్గభములు కుజం భుని రథమును లాగుచుండెను॥ మహిషుని రథమును ఉష్ట్రములును గజుని రథమును తురంగము లును మేఘుని రథమును భయంకరములగు చిరుతపులులును కాలనేమి రథమును ఏనుగులును లాగుచుండెను॥ ఆ మదపుటేనుగులు పర్వతములవలే దృఢములయి ఎత్తయి నాలుగు దంతములు కలవయి మదము కార్చుచు సుశిక్షితము లయి మేఘములవలె భయంకరములయి యుండెను॥ వానికి తోడుగ నూరు మూరల ఎత్తయినవి బంగరు సొమ్ములుగల నల్లని గుర్రములునుం డేను॥ కాలనేమి తెల్లని చందనము పూసికొనిన మనోహర దేహముతో నానా పుష్పమాలలతో ప్రకా శించుచున్న వాడయి తెల్లని చామరములతో ప్రకాశించుచు దక్షిణదిశకు బయలుదేరెను॥
మథనుడను దేత్యేందుడు పాశ్సహస్తుడే ప్రకాశించేను॥ జంభకుడు చిరుగంటల రాసుల మాలలుగల ఒంటే నెక్కెను॥ శుంభ దానవుడు నల్లని తెల్లని పెద్దగొర్రె పొట్టేలు నెక్కెను॥ ఇతరులగు దానవ వీరులును నానా హహన గాగాములయి భయంకర చిత్రకృత్యములు చేయుచు కవచములు దాల్చి కుండలములు తలపొగలు సొమ్ములుగా నానా విదో తరీయములలో నానామాల్య విభూషణములతో సౌనా సుగంధములతో నానాసోత్ర పాఠకుల స్తోతములతో నానా వాద్యముల మోతలతో మహారథులు తమముందు నడువగా నానా బీరాలా పములాడుచు॥ ఇట్లా మహాసురులు ఆ సేన యందుండిరి॥ ఇట్లా దైత్యసింహుడగు తారకుని సేన భయంకర రూపముతో ఒ ప్పెను॥ అది భయంకరములగు మదపు టేనుగులతో ప్రమత్తులగు రథికులతో సంకుల మయి అనేక పదాతులతో జెండాలతో దేవతలతో యుద్ధమునకు బయలు దేరెను॥
ఇంతలో దేవదూతయగు వాయువు అంతరిక్ష ప్రదేశ మందుండి దానవ బలమును చూచి ఇంద్రునకు తెలుపుటకు పోయెను॥ అతడు మహాత్ముడగు ఇంద్రుని దివ్య సభకు పోయి దేవతల నడుమ ఉన్న అతనితో ఈ యుద్ధము సంప్రాప్తించినమాట తెలిపేను॥ అది విని మహా భుజుడగు దేవరాజు కనులు మూసికొని ఆలోచించి తగిన సమయమున బృహస్పతితో ఇట్లనెను: దేవతలకు దానవులతో ఈ మహాయుద్దము వచ్చిపడినదిగదా! ఇందు నీత్యుపాయముతో కూడిన కార్యము ఏది తెలుపుము॥ మహేంద్రుని ఈ వచనము విని వాక్పతియు మహాబుద్ధిశాలియు అగు మహాభాగుడు బృహస్పతి ఇట్లనెను:
ఇంద్రస్య బృహస్పతి కృత సామాద్యుపాయ వ్యవస్థా॥
వరుణుని ధ్వజము భయంకరమగు ధూమముతో కూడిన అగ్ని ॥ కుబేరుని ధ్వజము పద్మరాగ మహా రత్నముతో చేసిన మొక్క॥ అది మిగుల ఎత్తయి ఆకాశ ములోనికి పోగోరుచున్న ట్లుండెను॥ యముని ధ్వజము ఇనుప తోడేలు॥ నిరృతి ధ్వజము పేతముఖము॥ రవిచంద్రుల ధ్వజములు అమిత కాంతిగల బంగరు హంసలు॥ అశ్వి దేవతలధ్వజము ఎర్రనిదై వింత వన్నెలు గల కడవ, బంగారుతో చేయబడి మిశ్రిత రత్న ములతో చేయబడి తెల్లని వింజా మరలతో ఆలంకృత మైన ఏనుగు ఇంద్రుని ధ్వజము॥ నాగ యక్ష గంధర్వ మహోరగ నిశాచరులతో అమరిన ఆ ఇంద్ర నేన త్రిలోక ములందును దుర్జయమయి యుండెను॥ ఆదేవ సేనయందు ముప్పదిమూడుకోట్ల దేవతలునుండిరి॥
మంచుకొండవంటిదై తెల్లని కర్ణచామరములు బంగరు తామరలతో కూర్చిన ఆమల సుందర హారములు ఎర్రని కుంకుమపూవుపూత కపోలములందు క్రీడించు తుమ్మెదల గుంపులు కలిగిన ఐరావతమునందు మహాబలశాలియు చిత్ర వస్త్రాభరణధారియు విశాల వస్త్రపు కిరణములతో ఏర్పడిన వితానము (చాందనీ॥ అంబారీ)తో అలంకృతుడును వ్యాప్రమయిన భుజకీర్తులుగల భుజాగ్రమండలము కలవాడును సహస్రనేత్రుడును వేలకొలదిగా స్తుతిపాతకులచే సంస్తుతింప బడువాడును అగు పాకశాసనుడు ఇంద్రుడు స్వర్గమునందలి ఎల్లరకంటే మిక్కిలిగా ప్రకాశించేను॥
గజతురగ బలరాశితో సంకులమయి శ్వేతచ్చత ధ్వజ పంక్తితో ప్రకాశించుచు జయింపనలవికాని పదాతులు కలిగి నానాయుధులగు యోధులతో దుస్తరమయి ఆ దేవ సేన ప్రకాశించుచుండెను॥
ఇది శ్రీమత్స్యమహాపురాణమున తారకాసుర వధమున దేవాసుర సంగ్రామమున బలయోజనమను నూట నలువది ఏడవ అధ్యాయము॥
Summary of chapter 148 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya details the cosmic celebrations following Tārakāsura's demise. The Devas, Led by Indra, regained control of Svarga, while Maharshis resumed their Vedic sacrifices without fear. Bhagavān Brahmā, Bhagavān Vishṇu, and all celestial beings gathered around the victorious child Kārttikeya, showering Him with divine flowers and chanting sublime hymns praising Him as the eternal protector of Dharma.