మత్స్య మహా పురాణము
217 - విష నిర్హరణోపాయము.
(*మహదంతశఠం తద్వత్ప్రోక్షణం విషనాశనం)
ధర్మ విద్వరుడవగు మత్స్య ప్రభూ రాక్షస-విషనాశకములగు వేనిని రాజు తన దుర్గమున నిలుపుకోన వలయునో తెలుపుమనిన మనువుతో మత్సుడిట్లనెను: బిల్వాటకీ.యవక్షారము-పాటలా-బాహ్లికము-ఊషణము-శ్రీపర్ణి-సల్లకి- ఈ ఆన్ని టితో కాచీన కషాయమును సవిష పదార్థముల పై చిలుకరించినచో అవి నిర్విషములగును; యవలు సైంధ వము పానీయములు వస్త్రములు శయన సామగ్రి ఆసన సామగి. ఉదకము -కవచములు ఆభరణములు ఛతములు వింజామరములు నివాస గృహములు ఇట్టివి విష సంయు క్షములయ్యేననిపించినచో వాటి పై ఈ కషాయమును చల్ల వలయును. శేలువు-పాటలీ-అతివిష శిగువు-మూర్వా-పునర్నవ-సమంగా-వృషమూలము-కపిత్తము-వృషము శోషితము- సహదేవ-హరిద్ర- ఇవియు విష నాశకములు; లాక్ష –ప్రియంగువు-మంజిష్ట ఏలా-హ రేణుకా- అతి మధురము-ఇవి ముంగిస పిత్తముతో కలిపి భావనచేసి ఎద్దుకొమ్ములో ఈ మిశ్రమును పోసి దానినేడు అహోరాత్రములు నేలలో పాతిఉంచి తీసి దానిని పూసలుగా చేయవలెను; వానిని బంగరు దానములో గ్రుచ్చి చేతికి కట్టుకొనిన విష యుక్త పదార్థములను తాకినను అవి వెంటనే నిర్విషములగును; మనోహ్వయా శమీ పత్రము తుంబీకా - శ్వేత సరపములు కపిత్తము కుష్ఠము మంజిష్ణా. ఇవి కుక్క పిత్తముతోగాని కపిల గోపి తముతో గాని నున్న గా అరగదీసి పూసిన చో ఇదియు ఒక విధమగు విషనాశక మగు ఔషధమగును; మూషికా-జతు ఈ రెండు ఓషధులతో కూడ పెవలెనే పూసలనుచేసి హస్తమందు ధరించినను విషహరౌషధముగా పని చేయును; హరేణువు.మాంసి మంజిష్ట మధుకొమధువు- అక్షత్వక్ - సుర సము-వీనిని శ్వ(కుక్క) ఏ త్తములతో వేనుక టివలే గోశృంగములో నింపి భూమియందుంచి తీసి సిద్దపరచిన పిష్టము పూసిన వాద్యముల (ధ్వనుల)ను వినినను పతాక లను చూచినను వాసన చూచినను నవిష పదార్థములు నిర్విషములగును.
పిప్పలి మిరియాలు శొంఠి అను ఊషణత్రయము సాముద్ర లవణ సైంధవ లవణ బిడాల లవణ సౌవర్చల లవణములనెడు పంచలవణములు మంజిష్ఠ పసుపు - మానిపసుపు సూక్ష్మేలా - త్రివృతా పత్రము - వాయు విడంగములు ఇందవారుణీ - మధుకము – వేతనము- తేనే-ఇవి అన్నియు కలిపి కొమ్మునందుంచవలెను; దానినుండి తీసిన మాత్రలను వేడి నీటితో కలిపి సేవించినచో నవిషాహారము జీర్ణమగును; విషములేని దానిని తినినపుడు ఇది సేవించినచో పైత్య దోషము చేయును; శుక్లము వర్ణరసము ఉశీరము సర్వపములు ఏలావాలుకములు సువేగ - తస్కరము - సురము. అర్జునకుసుమములు - వీనిపొగ వేసినచో ఇంటియందలి స్థావర (పదార్థముల) విషమును జంగమ (చరప్రాణుల) విషమును కూడ విరిగిపోవును; ఈ పొగ వ్యాపించుచోట కీటకములు కాని విషములుకొని కప్పలు కానీ సరీసృపములుకాని ఆభిచారిక కృత్యముల ప్రభావములు కాని శ క్తిహీనములగును; నేమిలిపింఛము కొంగ ఎముకలు సర్ప పములు చందనము-నేయి. వీటి పొగ శయనాసన వస్త్ర గృహములందు వ్యాపించినచో విషమును విరుచును; చందనము పొల చెట్టు మోదుగు చెట్టుల బెరడు చూర్వొ - ఏలవాలుకము సురసము - నాకులి . తండులీయకము - పినీతో కాచీన కషాయము అన్ని విధములగు (స్నాన పానాది) ఉదక కార్యములందును కాక మాచి రసముతో కలిపి వినియోగించినచో విషహరమును హితకరమునగును; గోరోచనము తాళీసపత్రి . నేపాళి - కుంకుమపూవు - వీని చూర్ణములో తిలకము ధరించినచో అతడు విష బాధలనందడు; నరులకును నారులకును నృపులకును ప్రీతిపాత్రుడునగును; హరిద్ర-మంజిష్ణ కిణిహి పిప్పలి వేప చెక్క - వీని చూర్ణముతో పూసిన పదార్థములు విషములయినను నిర్వషములగును; సర్వ విషముల స్పర్శనందిన శరీరము కూడ విషదోష రహితమగును.
శిరీషవృక్షపు ఫలము పత్రము పుష్పము బెరడు వేరు.ఇన్ని యు గోమూత్రముతో ఆరగదీసినచో సర్వవిషహర మగు ఔషధమగును; ఏక వీరుడవగు మనూ! ఇక మీదట మహౌషధులు (అనేక వ్యాధుల పై పనిచేయ ప్రసిద్ద మూలికలు) చెప్పెదను; వినుము; వంధ్య - కర్కోటకి - విష్ణు కాంత - ఉతట - శత మూలి - ఒత – నంద-బల – మోచా- పటోలిక - సోమ - పిండా - పసపు - దగ్గరుహ - మెట్టతామర - విశాలి - శంఖమూలిక - చాండాలీ - హ సీమగధ - గోజాపర్లీ - కరంభికా - రక్తా - మహార క్తా - బడ్జి శివా - కోశాతకీ - నక్తమాలము (కానుగ) - ప్రియాలము - సులోచని - వారుణీ - వసు గంధా - గంధనాకు - ఈశ్వరీ - శివగంధా - శ్యామలా - వంశ నాశిక - జతు కాళీ - మహా శ్వేతా - శ్వేతా - మధుయష్టికా - వజకము - పారిథ్య దము - సిందువారము - జీవానందా - వసు-చ్చి దా - నతము - నాగరకంటక - కాలము - జాలీ - జాతీ వటపత్రికా - కార్తస్వరము - మహానీలా - కుందురు - హంసపాది - మండూక పర్లి - వారాహీ , రెండు విధములకు తండు లీయకములు (చిర్రి) సర్పాక్షి -లవలి (రాచ ఉసిరిగ) బ్రాహ్మి (సర స్వతి) విశ్వరూపా - సుఖాకరా - రజాపహా - వృద్దిక రీ శల్యదా . పత్రికా రోహిణి - నక్తమాల - శోంఠీ - ఆమలకము - వందాకము - నల్లఉమ్మెత్త చిత్రఫల - కాకోలీ-క్షీర కా కోలీ - పీలువల్లి - కేశినీ - వృశ్చి కాలీ - మహానాగ - శతావరీ - గరుడి - వేగా - నీటికలువ - మెట్టకలువ - మహాభూమిలతా ఉన్మాదినీ - సోమరాజీ - సర్వరత్నములు - విశేషించి గరుడపచ్చ మొదలగునవి - కీటపక్షములు పురుగుల రెక్కలు) జీవజాతములు ( వేరువేరు క్రిమికీటకాదులు) మణులు. ఇవన్నియు ప్రయత్నముతో సేకరించి నిలువయుంచు కొనవలయును. రక్షస్సులను విషములను కృత్యలను బేతాళులను నశింపజేయు సామగ్రిని విశ్లేషించి నరగజ హయ గోఖర సర్పతి త్తిరి గోమాయు - వస్త్ర - మండూకముల నుండి లభించునవియు సింహవ్యాఘ్ర ఋక్ష మార్జాల ద్వీపి వానర కపింజల మహిష ముల నుండియు ఇర్రినుండియు లభించునవియు అగు ఈ పదార్థముల సేకరించవలెను; ఇట్టి ద్రవ్యములతో కూడినదై సురక్షితమును అతి శుభమును సర్వగుణయుక్తమును సర్వలక్షణ సహితమునగు గృహమందు రాజు నివసించవలయును.
ఇది శ్రీ మత్స్యమహాపురాణమున రాజధర్మములందు విషనిర్హరణోపాయకథన మను రెండు వందల పదునేడవ అధ్యాయము.
Summary of chapter 218 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya expounds upon the principles of fiscal management, taxation, and protection of the royal treasury known as Rājakosha. Bhagavān Matsya instructs that a king must collect taxes justly and gradually, like a bee gathering honey from flowers without harming the petals, avoiding oppressive taxation that impoverishes the populace. The text outlines revenue generation from agriculture, trade, mining, and forestry, emphasizing that a robust, well-guarded treasury guarantees state security, enables public welfare projects, and sustains the military during emergencies.