మత్స్య మహా పురాణము
242 - శుభాశుభ శకున విచారము.
రాజయాత్రాగమన సమయమున ఏవి ఎదురుగవచ్చినచో శుభమగునో ప్రశ స్తములగునవి ఏవో చెప్పుకొనదగనివి ఏవో చెప్పుకొనదగినవి ఏవో ఇవి అన్ని యు పేర్కొనుము. అనిన మనువునకు మత్యుడిట్లు చెప్పెను: ఆయు క్తములగు ఔషధములు నల్లని ధాన్యములు దూది-ఎండుగడ్డి.ఎండు పేడ క రైలు బోగ్గులు నూనె బెల్లము నూనె అంటుకొనినది మలి నమునగు బోడితల.నగ్నుడు ముక్త కేశుడు రోగార్తుడు కాషాయ వస్త్రధారి ఉన్మత్తుడు బలహీనుడు దీనుడు నపుంసకుడు ఇనుము బురద చర్మముల మోపు కేశముల కట్ట తెలికపిండి మొదలగు సారము తీసివేసిన పదార్థములు - చండాలురు శ్వపచులు కారాగార రక్షకులు కసాయివాండ్రు పాపకారులు గర్భిణులు ధాన్యపు పొట్టు భస్మము కపాలములు ఎముకలు పగిలిన పాత్రలు కుండలు ఎర్రని పాత్రలు కుండలు మృతమయిన కొమ్ములుగల ప్రాణులు అప్రళ స్త వాద్యధ్వనులు చెవులు బద్దలు చేయు భయంకర ధ్వనులు ఆశుభశకునములు; 'దమ్ము' అనుమాట ముందునుండియు పొమ్ము' ఆను మాట వెనుక నుండియు వినబడుటమంచిది; ఎక్కడకు పోవుచున్నావు? నిలువుము; పోవలదు; అక్కడకు పోవుటచే నీ కేమి ప్రయోజనము? ఈ మొదలగు శబ్దములు విప త్రికరములు; ధ్వజాదుల పై మాంసాహార పక్షులు వాలుట వాహనములు తడ బడుట వస్త్రములు జారుట వేలికిపోవునపుడు ద్వారాదులు తలకు డీకొనుట కాళ్ళకు ఎదురు దెబ్బలు తగులుట ఛత్త ధ్వజ వస్త్రాదుల పతనము - ఇవి అశుభములు; ఇటివి మొదటిసారి జరిగినపుడు కేశవునర్చించుటయు స్తుతించుటయు చేయ వలెను. రెండవమారు కూడ జరిగినచో ప్రయాణము మాని ఇంటిలో ప్రవేశించవలెను; ఇపుడిక శుభశకునములు తెలిపెదను వినుము.
తెల్లని పూవులు పూర్ణకుంభములు జలపక్షులు మాంసము మత్స్యములు గోవులు ఆశ్వములు గజములు ఒంటి బౌద్ద సంన్యాసి సాధు ప్రాణి మేక దేవతలు మిత్రులు విప్రులు మండుచున్న అగ్ని వేశ్య దూర్వ పచ్చిగోమయము వెండి బంగారము రాగి సర్వరత్నములు ప్రశ సౌషధములు యవలు తెల్ల ఆవలు మనుష్యులు మోయు యానము (పాలకీ - మేనా) శుభ పీఠము - ఖడ్గచ్చత పతాక లు మృత్తిక ఆయుధములు -ఇంకను సర్వరాజలాంఛనములు. ఏడుపు (లవారు వెంట లేని శవములు నేయి పెరుగు పాలు వివిధ ఫలములు స్వస్తికవర్గమాన నంద్యావర్త-కౌస్తుభ గృహభేదములునుఖకరము. గంభీరము మనోహరమునగు పాద్యధ్వని గాంధార షడ్జఋషభాది ప్రశస్త (సంగీత) స్వరములు- ఇట్టివి శుభకరములు.
ఇసుక తో కూడి రూక్షమయి అంతటను చెల రేగిన పెనుగాలి ఎదురుగాలి నీచమగు వాయువు భయకారణములు; అనుకూల వాయువు (వాలునకు వీచుగాలి) మృదువై నునుపై సుఖ స్పర్శమయి హాయి గొలుపుగాలి రూక్షములు రూక్ష స్పర్శములు ఐనను భద్ర (శుభకరములు అగు మాంసాహార ప్రాణులు కనబడుట దట్టములయి నున్న నయి గజ బృంహి తమువలె ధ్వనించు మేఘములు మెరపులతో నిండినవి మంచివి; ఇంద్ర ధనువును మంచిది; పరివేషములును ప్రవర ణములు (పెనువానలు)ను మంచివికావు; గ్రహములును. అందును వి శేషించి బృహస్పతి.రాజు తాను పోవు దిక్కునకు ఎదు రుగా కాక వెనుక వైపున నుండుట మంచిది; ఆ స్తిక్య శ్రద్దలు పూజ్యులను పూజించుట-ఇట్టివే; మనస్సునకు హాయి గొలుపున వన్నియు ప్రయాణ కాలమున శు భావహములు; మనసు షీయే ప్రయాణకాలమున ప్రథమ జయ లక్షణము; సర్వశకునము లును ఒక ఎత్తు.మనస్సంతోషము ఒక ఎత్తు; యాత్రకు పోవలయునను ఉత్సుకత మనఃప్రహర్షము శుభ శశునలాభము విజయకరవచనములు - వినబడుట మంగళకర స్వస్తివాచరికమంతాదికము వినుట.ఇవి రాజుల కెల్లప్పుడును విజయావహములు.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజధర్మమున యాత్రా నిమిత్త శుభాశుభ శకున విచారమను రెండు వందల నలువది రెండవ అధ్యాయము.
Summary of chapter 243 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya presents a detailed guide on veterinary science and healthcare for cattle, bulls, goats, sheep, and other domestic animals. Bhagavān Matsya details herbal formulations and treatments for common animal diseases, epidemic prevention, horn and hoof care, and dietary supplements to boost milk production and physical strength. Protecting domestic animals is highlighted as a sacred duty that ensures agricultural prosperity, economic stability, and environmental harmony.