మత్స్య మహా పురాణము
135 - దేవపరాజితులగు మయాది దానవుల దీనస్థితి
సూతుడు ఋషులతో ఇట్లు చెప్ప నారంభించెను: ప్రమథుల చేతిలో యుద్ధమున భంగము నంది: మయాది త్రిపుర దుర్గ దానవులు భయమంది ప్రమథుల చేతిలో విరిగిన గోపురాదులు గల త్రిపురమును ప్రవేశించిరి. వారెల్లరును కోరలు చిదికిన సర్పములవలెను కొమ్ములు విరిగిన వృషభములవలెను. బెక్కలు పోయిన పక్షులవలేను నీరు లేకుండ పోయిన మేఘములవలెను అయిరి. దైన్యముతో వారి ముఖములు వికృతము లయ్యెను. వారు మృతప్రాయు లయిరి. ఇక మీదట తాము ఏమి చేయవలయునో తోచని వారయిరి. ఇట్లు వాడిన మనస్సులతో నున్న దానవులను చూచీ పద్మము వలే వికసితమగు ముఖముగలవాడయి దే న్యములేక దైత్యో తముడగు మయుడు ఇట్లు పలికెను: దైత్య దానవులారా! మీరు ప్రమధులతోను దేవతలతోను ఘోర యుద్ధములు చేసితిరి. వానియందు దేవతలను ప్రమథులను భయ పెట్టితిరి. మొదట మీరే వారిని గెలిచితిరి. కాని తరువాత వారి చేతిలో ఓడిపోతిరి. ఇపుడు ప్రమథుల చేతిలోనే దెబ్బలు తిని మిగుల దుఃఖ మంది భయపడుచు నగరమును ప్రవేశించితిరి. దేవతల చేతిలో మీకు ఎంతయో దుఃఖము ప్రాప్తించినది. ఇందు ఏ మాత్ర మును సందేహము లేదు. మనకు కలిగిన ఈ అవమానము వృషభములకు జరిగిన శృంగభంగము వంటిది. ఈనాడు ఇటువంటి త్రిపుర దుర్గమునకే ఇటువంటి ముట్టడి తటస్థించిన దనిన అహో: కాలమహిమ ఎంత యాశ్చర్యకరమయినది కాలము ఎట్టి (మనవంటి) వారికిని జయింపరానిదనుట ఆశ్చర్యకర మే కదా
మహాబుద్ధిశాలియగు మయుడు ఇట్లు పలుకుచుండ అది వినుచున్న దైత్యదానవ శేషులు సూర్యోదయము కాగానే ; గ్రహములవలే కాంతిహీనులయిరి. అదే సమయమున వర్షాకాల మేఘములవంటి నీలకాయులై స వాపీపాలురు వచ్చి వినయము కలవారై దోసిలి యొగ్గి యమునివంటి మయునితో ఇట్లు పలికిరి:
ఎవరికిని ఎరుగరానట్లు అమృతరసపూర్ణమయిన 'అమృతరసా' అను వాడిని. నీవు నిర్మించితివి గదా దేవ దానవు లెల్లర లో ఉత్తముడవగు మయా దాని నెవరో రహస్యముగా తావీ వేసిరి. అనగా మరికొందరు దానవులు వచ్చి ఇట్లనిరి. మృత సంజీవనశక్తిగల వాపిని నీవు సృజించితివి గదా దైత్యనాయకా! దాని నెవడో వృషభ రూపమున వచ్చి తావెను. ఎడములేక కలువలగుంపులతో మత్స్యములతో పనులతో పద్మములతో కూడియుండు దానియందే మయు నీరే లేకుండ పోయినది.
అనగా వాపీపాలురు పలికిన మాటలు విని దైత్యవరుడును ప్రభువును నగు మయుడు 'ఇది ఎంత జరుగరాని బాధాకరమగు విషయము జరిగినది' అని ఒకమారు పలికీ దానవులతో ఇట్లు పలికేను: అసురులారా! నేను నా మాయా బలముతో నిర్మించిన 'అమృతరస' వాపినే ఎవరో తెవిపోయినారనినదానవులారా! మన త్రిపుర దుర్గము కూడ లేకుండ పోయినదనియే నిస్సందేహముగా చెప్పవచ్చును. దేవతల చేతిలో ఎన్ని మారులు చచ్చినవారినే నను దైత్య దానవులను మరల మరల ఆజీవింపజేయుచుండిన అమృతరస వాహిని ఎవరో త్రివిర నిన అది ఎవరో కాదు పీతాంబరుడగు విష్ణువే తావియుండును. నేను నా మాయతో గుప్తపరచి నిర్మించిన అమృత జలదాయినియగు 'వాపి'ని ఆజరుడును గదాధరుడును నగు విష్ణువు తప్ప మరి ఎవ్వరు పానము చేయగలరు? ఏలయన మిగుల గూఢముగా నుంచినదై నను దైత్యుల ప్రతియొక విషయమును మరి ఎవ్వరికిని తెలియకున్నను అతనికి తప్పక తెలియును. దేవతలు సహజముగా సర్వతోముఖులు కారు; ఐనను వారు సర్వతోముఖులయి ఇది ఎరిగి రనిన అది విష్ణువు పనియే.
ఇదిగో! మన దుర్గము ఇపుడున్న ప్రదేశము చూడుడు.చదునే న బయలు; దీనియందు వృక్షములు లేవు; పర్వతములు లేవు. అందుచేత మనము రథాది చతురంగ బలముండియు లేనివారమయితిమి. అందుచేతనే మనలను ప్రమథులును దేవతలును బాధించగలుగుచున్నారు. కనుక ఇది ఎరిగి మీరు ఇష్టపడినచో మనము సముద్రోపరితలమును మన ఆశయముగా ఏర్పరచుకొందము. అట్లయినచో ప్రమథులు ఎంతగా మనోవేగము గలవారే అయినను వారి వేగమును మనము ఓర్చుకొనగలము. వారు చేయు సంరంభములును ప్రయత్నములును అన్ని యు సాగర జల మధ్యమున శ క్తిహీనములగును. అమరులును అచటికి వచ్చుటకు మార్గముండదు. కావున పోరును నిరుత్సాహులగు దురు. ఏలయన సాగరము ఆకాశ మువంటిదే. మనము శత్రువులతో యుద్ధము చేసినను వారిని కొట్టినను తరిమినను సాగరము మనకు ఆశ్రయముగా నుండగా వారు మనలను ఏమియు చేయజాలరు.
త్రిపురై స్సహ దానవానాం సాగర ప్రవేశః
దైత్యాధిపుడగు మయుడు దానవులతో ఈ విధముగా పలికి త్రిపుర దుర్గముతో కూడ సర్వనదీనాధుడగు సముద్రునికడకు పోయెను. సాగ రేశ్వర సమీపమునకు ఆ త్రిపురము ఎగిరిపోయెను. త్రిపురములును వాని ఆయా గోపురములును ఇతరాలంకారములును ఆ దుర్ల మెగురుటలో "ఏమియు చేద బొక అట్లే ఉండెను. త్రిపుర దుర్గమట్లు తన స్థానమునుండి తొలగిపోవుటచూచి తిపురారియు త్రిలోచనుడునునగు శివుడు వేదవాదమునందు నిపుణుడగు బ్రహ్మ దేవునితో నిట్లు పలికెను. భగవన్! పీతామహా! దానవులందరును చాల ఎక్కువగా భయమందిరి. అందుచే త్రిపుర వాసులగు దానవులెల్లరు విపులమగు మహాసముద్రములోనికి వెళ్ళినారు. కావున నీవు శీఘ్రమే మనరథమునక్కడకు చేర్చుము. అనగా వెంటనే మహాదేవ రథమును చుట్టుముట్టి దేవతలందరును సాయుధులై హర్షముతో పశ్చిమ సముద్రమునకు పోయిరి. (దీనినిబట్టి దానవులు తమ త్రిపుర దుర్గముతో కూడ పశ్చిమ సముద్రము లోనికి పోయిరని తెలియును. ఇది ఈనాటి అరేబియా సముద్రమే.) అంతట అసురులందరును అమరులకు గురుడు (తండ్రిరక్షకుడు) అగు శుభకరుడగు హరుని పరివారించి అతనిని అనుసరించి త్వరితముగా దానవులకు ఆశ్రయమగు సొగర ప్రదేశమునకు పోయిరి. మనోహరములగు పతాక లతో అలంకృతములయి పటహముల ఆడంబరములతో నిండినదియు, శంఖముల ధ్వనులతో పూరితమునును త్రిపుర దుర్గము కనబడగానే దేవతలును దేవతా సైనిక జనులును మేఘములవలె గర్జన ధ్వనులు చేయసాగిరి. వెలుపల దేవతల విషయము ఇట్లుండ త్రిపుర దుర్గ మునందును దారుణములగు మృదంగ ధ్వనులు గంభీరమయి మేఘధ్వనులవలే వినబడుచుండ ఆవి దానవుల ధ్వనులతో మిశ్రితమయి సముద్ర ధ్వనితో సమానమయి వినబడుచు ఆ త్రిపుర దుర్గము సముద్రమునకు ప్రతినిధియేమో యనిపించుచుండెను.
అంతట సకల భువనాధిపతియు సురలకు గతియునగు హరుడు శత్రువులనేడు మృగములను వేటాడ వలయునను లోభముగల లుబ్ధకుని (వేటగానీ) వంటి బుద్ధి కలిగినవాడై దేవశత్రువులగు తై పుర దానవులు బలవంతు లయి జల మధ్యగతమయిన త్రిపుర దుర్గమునందుండుట చూచి దేవగణాధిపతియగు ఇంద్రునితో ఇట్లు పలికెను: దేవేంద్రా! ఇటు చూడుము; త్రిపుర దుర్గమను ఈ దానవపుర మెంత ఉత్తమముగా నున్న దో చూడుము. ఏమయిన నా కేమి లెక్క? యమ వరుణ కుబేర షణ్ముఖులును ప్రమథగణాధిపతులును నాకు తోడు పడగా అంతటి దానిని గూడ నాశము చేయుదును. పరబలముల నభిహతము చేయు ఏప్రదేశమున ఈ త్రిపురదుర్గమున్నదో అట్టి సముద్ర దేశము నకు పోవుదము పదండు-- భవుడగు శివుడు త్రైలోక్యమను రథమును ఆరోహించి తాను కడు సమర్థుడు గావున త్రిపుర దుర్గమును మరల ముట్టడించదలచి సముద్రముకడకు వచ్చును'.
అని ఇట్లు జరుగునని ఊహించి దైత్యులు లవణ సముద్రపు పైభాగమునందు దుర్గమును నిలుపుకొని యున్నారు. కనుక మీరు వారిని లెక్క పెట్టక దానవేంద్ర సహితముగా త్రిపుర దురమును శరవర్షములతో ముసల వజ్రాఘాతములతో ముట్టడి చేయుడు. నేనును నారథవరము నారోహించి సురేంద్రా! మీ వెనుకనే వచ్చు చుందును. అసురవరులను వధించుటకు ఉద్యమించిన వారికి ఏమేమి చేయవలయునో ఆ సహాయమంతయు చేయుదును.
ఇట్లు అనిన శివుని మాటల పేరణతో ఇంద్రుడు సన్నద్ధుడై త్రిపుర దుర్గమును నాశ మొందించు తలంపుతో కడు వికసించిన లోచన పద్మములతో ముందునకు సాగిపోయేను.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున త్రిపురోపాఖ్యానమున హరి అమృతవాపీపానము చేయుట-త్రిపుర దానవులు సముద్రము ప్రవేశించుట.హరుడు అటకు పోవుట అను నూట ముప్పది యేదవ అధ్యాయము.
Summary of chapter 136 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya describes the severe austerities performed by Goddess Pārvatī on Mount Gaurī-śikhara. She discarded fine garments for bark robes, abandoned cooked food to subsist on fallen leaves, earning the name Aparṇā, and stood amidst freezing waters in winter and blazing fires in summer. Her intense tapasya radiated such spiritual heat that the entire mountain range glowed, compelling the Saptarshis and celestial beings to marvel at her unshakeable devotion to Mahādeva.