మత్స్య మహా పురాణము
196 - అత్రి గోత్ర ప్రవరాను కీర్తనము॥
మత్స్యరూప జనార్దనుడు వైవస్వత మనువుతో ఇంకను ఈ విధముగా చెప్పెను: అతి వంశోత్పన్నులయిన గోత్రకారులను తెలిపెదను వినుము॥ (వీరు మూడు వర్గములుగా నున్నారు॥) మొదటి వర్గమువారు; కర్గమాయనులు శారాయణులు ఉద్దాలకులు శాణులు కర్జీరథులు శాక్రతువులు గౌరగ్రీవులు గౌరజినులు చైత్రాయణులు ఆర్గపణ్యులు వామరథ్యులు గోపనులు ఆసకులు బిందువులు కణజిహ్వుడు హర ప్రీతి నైద్రాణి శాకలాయని తైలపుడు వై లేయుడు ఆత్రి గోణీపతి జలదుడు భగదుడు మహాతపస్కుడు సౌపుష్పి ఛందోగేయుడు॥ ఈ ఋషుల (గోత్రముల వారలకు) శ్యావాశ్వుడు అత్రి అర్చనానశుడు ఆనువారు ప్రవర ఋషులు; ఈ ఋషుల (గోత్రముల వార)లు పరస్పరము వివాహ సంబంధములు చేసికొనరాదు॥
రెండవ వర్గమువాడు; దాక్షి బలి పర్ణవి ఊర్ణనాభి శిలార్డని॥ బీజవాపీన్ ॥ శిరీషుడు మౌంజు కేశుడు గవిష్ఠిరుడు భలందనుడు - ఈ ఋషుల (గోత్రముల వారల)కు అత్రి గవిష్ఠిరుడు పూర్వాతిథి అనువారు ప్రవర ఋషులు; వీరు పరస్పరము వివాహ సంబంధములు చేసికొనరాదు॥
మూడవ వర్గము వారు॥ ఆత్రేయ పుత్రికాపుత్తూల వర్గము వారిని తేలి పెదవినుము;, కాలేయులు వాలేయులు వానర ధ్యులు - ధాత్రేయులు మైత్రేయులు - ఈ ఋషుల గోత్రముల వారలకు ఆత్రి వామర భ్యుడు॥ పైత్రి అనువారు ప్రవర ఋషులు; వీరుపరస్పరము వివాహ సంబంధములు జరుపుకొనరాదు॥
ఈ ఆత్రి వంశోత్పన్నులగు గోత్రప్రతిష్టాపక ఋషుల నామస్మరణ మాత్రమున నరుడు పాపవిముక్తుడగును॥
ఇది శ్రీ మత్స్య మహాపురాణమున అత్రి గోత్ర ప్రవరాను కీర్తనమను నూట తొంబది యారవ అధ్యాయము ॥
Summary of chapter 197 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya details the noble Gotra branches and Pravaras originating from Maharshi Atri, from whose eye Chandra Deva emerged. The chapter outlines key sub-lineages including Mudgala, Dattātreya, and Gaurivīti, describing their ancestral Pravara combinations and contributions to Vedic hymn compilation and sacrificial traditions.