మత్స్య మహా పురాణము
209 - యముడు సత్యవంతుని సూక్ష్మ దేహము కొనిపోవుట - సావిత్రీయమ-సంవాదము.
మత్యుడు మనువుతో ఇట్లు చెప్పెను: కట్టెలు కొట్టు చుండగా సత్యవంతునకు తలనొప్పి వేయసాగెను; వేద నతో బాధపడుచువచ్చి అతడు భార్యతో ఇట్లు పలి కెను; ఈ (కట్టెలు కొట్టిన ) శ్రమతో నాకు తలనొప్పి కలిగినది; చీక టిలో ప్రవేశించు చున్నానేమో అనిపించుచున్నది; నాకేమియు తెలియుట లేదు; నీ తొడ పై తలనుంచి నిద్రించవలెననిపించు చున్నది; అని రాజ పుత్తితో చెప్పి నిద్రతో కండ్లు కూరుకొని పోవుచు ఆ రాజు కుమారుడు ఆమె ఒడిలో తల పెట్టుకొని నిదురించెను; పతి వ్రతయు మహా భాగయు ఆగు ఆ రాజ పుత్తికి స్వయముగా తానొక్కడు మాత్రమే అచటికి వచ్చిన యముడు కనబడెను; అతడు నల్ల కలువపూరేకువలె నల్లనివాడు; పచ్చని వస్త్రము ధరించిన ప్రభువు; అతడు తన చుట్టును మెరపు తీగలు చుట్టుకొనినదియగు నీటితో నిండిన మేఘమువలె నుండెను. రవి నమాన కాంతిగల కిరీటముతోను కుండలములతోను ప్రకాశించుచుండెను; ఆతని పక్షః స్థలమున బరువగు అనేక హారములును భుజములందు పలువన్నెల భుజకీర్తులునుం డేను. ఆతని వెంట గొప్ప పరివారమును కాలుడును మృత్యువును కూడ నుండిరి.
ఇట్టి ధర్మరాజు ఆ ప్రదేశమునకు వచ్చెను; సత్యవంతుని దేహమునుండి బొటనవ్రేలియంత పరిమాణముగల (సూక్ష్మ దేహాత్మక) పురుషుని తీసి అతనిని (కర్మఫల రూప) పాశముతో బంధించి త్వరితముగ దక్షిణ దిక్కునకు పోయెను; ఉత్తమశ్రియగు సావిత్రియును తన పతి గత జీవితుడగుట చూచి ఏమియు తడవు చేయక సోమరితనము చూపక ఆ ధర్మరాజుననుసరిచి పోవసాగెను; అంతట ఆట్లు పోవుచు దోసిలి పట్టి వణ కుచున్న హృదయముతో ఆమె ఇట్లు పలికెను:
సావిత్రీయమ సంవాదః.
మాతృభ క్తిచే ఈ (భూ)లోక సుఖములను పితృభక్తి చేత మధ్యమ (అంతరిక్ష) లోక సుఖములను గురు శుశ్రూష చేత బ్రహ్మలోక సుఖములను (జీవుడు) పొందును; ఈ మూడు భక్తి (సేవా) నియమములను ఎవరు ఆదరింతు పాటింతురో వారు అన్ని ధర్మములను ఆదరించినవారే; ఎవరు ఇవి పాటించరో ఐరాచరించు సర్వక్రియలును నిష్పలములగును; వీరు మువ్వురును జీవించియున్నంత వరకును ఇతర ధర్మ సేవనమేమియు చేయ పనిలేదు; వారికి ప్రీతిని తనకు హితమును కలిగించుట యందాసక్తుడే ఎడతెగక వారి శుశ్రూష చేయుచుండవలెను; వీరి సేవాదికమునకు ఆటంకము లేకుండునట్లు ఇతర కార్యములేవయిన తాను చేసినను అవి వీరికి తెలుపుచు చేయుచుండవలెను. ఇట్లు పురుషుడు (జీవుడు) చేయు పనులన్నియు ఈ మువ్వురియందే ఇముడుచున్నవి.
అన పని యముడు (ధర్మరాజు) ఇట్లనెను; సావిత్రీ! నీకోరిక నెరవేరినదికదా! (నీవు అనినట్లు పుట్టినింట నీ తలిదండ్రులను ప్రతి ఇంట మగని తల్లిదండ్రులను మగనిని గురువులను సేవించితివి;) ఇపుడిక మరణించినవారికి వెంట వచ్చి వారికి చేయవలసిన సేవ పరలోకమందేదియు లేదు; అనియు ఇటనే ఉండి వారికి పార లౌకిక కర్మలు చేయవలె ననియు శాస్త్రములందు చెప్పబడియున్నది; కనుక మరలుము; నీవిట్లు నావెంట వచ్చుటచే నీకు శ్రమము; నాకు ఆటంకము; అందుచే నీకు ఈమాట చెప్పుచున్నాను; గురువుల (పెద్దల) పూజలందు భక్తి కలదానవు; అదీ కాక నీవు సరళ ప్రవర్తనము కల పతివ్రతవు; ధర్మమెరిగిన దానవుగదా నీవు! మరలుము; నీవిపుడు ఇంకను ముందుకు వచ్చినకొలదిని ఇంకను శ్రమమగుచుండును; అన సావిత్రి అతనితో ఇట్లనెను: స్త్రీలకు పతియే దైవతము; పతియే పరమగతి (కి సాధనము); సాధ్వియగు శ్రీ పతి ననుసరించుటయే ధర్మము; పతియే స్త్రీకి తన ప్రాణమునకును ధనమునకును ఈశ్వరుడు (సొంత దారుడు; ) స్త్రీకి పిత యు సోదరుడును సుతుడును ఇగ్చునది కొంచెము మాత్ర మే; ఆమిత మగు (పుణ్య ధర్మ ఫలములను) ఈయగలిగినది పతియొక్క డే; అట్టి పతినీ ఏస్త్రీ, పూజించకుండును? సుగో త్తమా! నాపతి పరులచే ఎచటికి తీసికొని పోబడునో తాము స్వయముగానై న ఎచటికి పోవునో అచటికి నేనును యథాశ కి (చేతనే నంతవరకు) పోవలసినదే! దేవా! నాపతిని తీసికొనిపోవుచున్న నీవెంట నేను రాలేనపుడు నేను ప్రాణములనే వదలుదును; మనస్విని (అభిమానవతి)యగు ఏ శ్రీయైనను వైధవ్యమను పాపపు అక్షరములకు పాత్రమయి అలంకారములతో సౌభాగ్య లక్షణములతో ఉండవలసిన తాను ఆ అలంకారములకు దూరమై ముహూర్త కాలమయినను జీవించగలదా? అనగా ఆమెతో యముడిట్లనెను: పతివ్రతా! మహాభాగా! శుభరూపా! నీ విషయమున పంతుష్టుడనయితిని; సత్యవంతుని ప్రాణములుకాక మరేదై న కోరుము; శీఘ్రమే ఇత్తును; అనగా సావిత్రి “మహాత్ముడు ధర్మజ్ఞుడు అగు నా మామగారు రాజ్యమును కన్నులును పోయియున్నారు; వారికా రెండును వచ్చునట్లు వరమునిండు;” అన యముడు. “శుభ రూపా! నీవు చాల దూరము వచ్చితివి! వెనుకకు మరలుము; నీవడిగిన ఇదంతయు జరుగును; (ఇంకను వచ్చినచో) నాకు ఆటంక మును నీకు శ్రమమును అగును; అందుచే ఇపుడిట్లు చెప్పుచున్నాను; (నామాట వినుము).” అనెను.
ఇది శ్రీ మత్స్యమహాపురాణమున సావిత్ర్యుపాఖ్యానమున యముడు (ధర్మరాజు) సత్యవంతుని సూక్ష్మ దేహమును కొనిపోవుటయు సావిత్రీ యమసంవాదము సావిత్రికి ప్రథమవరప్రాప్తియుఅను రెండు వందల తొమ్మిదవ అధ్యాయము.
Summary of chapter 210 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya presents an inspiring discourse on the supreme spiritual magnificence of Satya, declaring that truth is the highest Brahman, the ultimate penance, and the immovable foundation upon which the entire universe rests. Bhagavān Matsya asserts that a thousand Ashvamedha sacrifices weighed on a scale do not equal the spiritual weight of a single truthful statement spoken with pure intent. The text emphasizes that those who maintain unyielding truthfulness in thought, word, and deed acquire divine spiritual splendour, command the respect of Devas and Rishis, and achieve immediate liberation from material existence.