మత్స్య మహా పురాణము
99 - దేవవ్రతాది ప్రతషష్టి (అరువది వ్రతముల) కథనము
నంది కేశ్వరుడు నారదునితో ఇట్లు చెప్పనారంభించెను: ఇక మీదట సర్వోత్తమములగు అరువది వ్రతములను నీకు తెలి పెదను. ఇవి సాక్షాత్ రుద్రుడు చెప్పినవి. సర్వపాప ప్రణాశనములు:
1. ఏడాదిపాటు నకవ్రతము జరిపి కుటుంబియగు విప్రునకు పొడి గోవును బంగరు త్రిశూల చక్రములను వస్త్రములను 'శివోహమస్మి' ‘రుదోహమస్మి' అను భావనతో దానమీయవలెను. దీని ఫలమున శివలోక మున పూజితుడై సుఖించును. ఇది మహాపాతక నాశనమగు దేవవ్రతము..
2. దినము విడిచి దినము సంవత్సర కాలము నకవ్రతము జరిపి సంవత్సరాంతమున బంగారుకలువ పూవు శర్కరా పాత్రను బంగరు వృషభ ప్రతిమను విప్రునకు ఈయవలయును. ఇట్టివారు విష్ణు సానమందుదురు. ఇది లీలావతము.
3. ఆషాఢది మాన చతుష్టయమున అభ్యంగము చేయక బ్రాహ్మణునకు కాని పాత్రునకు ఎవనికైన కాని భోజన సామగ్రి నిచ్చు చుండవలెను. ఇట్టివాడు విష్ణుభవనము చేరును. ఇది జన ప్రీతికరమగు ప్రీతి వ్రతము:
4. చైత్ర మాసము పొడవున పాలు పెరుగు నేయి చెరకు రసము వదలి విప్రదంపతులను పూజించి 'గౌరీ - మేపీయతామ్' అను - రసపాత్రను (ఈ వధలిన నాలుగిటిలో దేనితో నిండిన దైనను). సన్నని వస్త్రములను దానమీలను వలేను. ఇది అజ్ఞాన నాశమగు గౌరీవ్రతము.
5. వసంత ఋత్వారంభమున (చైత్ర శుక్ల) త్రయోదశి నాడు నక్తముండి బంగరు అశోక పుష్పమును చది. (భారతీయ) అంగుళముల చెరకుగడను నూతన వస్త్ర ద్వయమును గ్రాహ్మణునకు 'ప్రద్యుమ్నః ప్రీతామ్' అను మంత్రముతో దానమీయ వలెను. సదా శోక వినాశనమగు కామవతము ఇది. దీని చరించినవారు ఒకకల్పమంత కాలము. విష్ణు లోకమున సుఖింతురు. ఇహమున శోకరహితులౌదురు.
6. ఆషాఢాది తిథియం దీ వ్రతమును పూని నాటినుండి వరుసగ నాలుగు మాసములు గోళ్లు కత్తిరించుకొనకుండ వలేను. అంత కాలమును -పొరాకము పందిరి వంగకాయ) తేనె నేయి బెల్లము తినకుండవలెను. కార్తిక మాసారంభమున బంగారు పారాకమును బ్రాహ్మణునకు దానమీయవలెను. ఇది యాచరించినవాడు రుద్ర లోకమందును. దీని పేరు శివ వ్రతము.
7. హేమంత శిశిర ఋతువులయందు ఏ పుష్పములను (తనకె) ఉపయోగించకుండ వలెను - ఫాల్గున మాసమున (కడపట) బంగారుతో (ఆ రెండు ఋతువులలో పూ చేడి) మూడు పూపులు చేయించి మూడు వేళలందు మూడిటిని వేరు వేరుగా ‘శివ కేశ వో పీయేతామ్' అనుచు విప్రునకు దానమీయవలెను. దీనిచే పరమపద మందును. దీనిని సౌమ్య వ్రత మందురు.
8. ఫాల్గున శుక్ల తృతీయ మొదలు మాసాంతమువరకు లవణము విడువవలెను. కడప విప్రదంపతులను పూజించి వారికి సర్వోపసరములతో ఇంటిని మంచమును 'భవానీ పీయతామ్' అనుచు దానమీయవలెను. దీని చే కల్ప కాలము గౌరీ లోకవాసము లభించును. ఇది సౌభాగ్య వ్రతము.
9. సంధ్యా కాలములందు (కొంత కాలము) మౌనము పాటించి ప్రతాంతమున నేతిపాత్రను వస్త్రముల జతను నూవులను ఘంటను బ్రాహ్మణునకు దానమీయవలెను. దీనిచే ఇహమున రూప విద్యాలాభమును పరమున పునరావృత్తి రహితమగు సారస్వత లోకమును సిద్ధించును. దీనిని సారస్వత వ్రతమందురు.
10. పంచమినాడుపవసించి ఉపవాసాంతమున షష్టినాడు - బంగారు పాత్రయందు బంగారముంచి విప్రునకు దానమీయవలెను. అతడు జన్మ జన్మమందును సంప్రద్యుక్తు డే విష్ణు లోకమందును, దీనిని సంపద్ర్వతమందురు. ఇది దుఃఖ శోక వినాశకము.
11. సంవత్సర కాలము శివసన్నిధిలోకాని విష్ణు సన్నిధియందుకాని నిలిచి గంధాను లేపనములు (బోటుకాని) ధరించి కడపట పాడియావును ఉదకుంభమును (విప్రునకు) దానమీయవలెను. దీనిచే పదివేల జన్మములందు రాజుగా జన్మించుచుండి కడపట శివలోక ప్రాప్తుడగును. సదా పాప వినాశనమగు ఇది శుద్ది వ్రతము, ..
12. సంవత్సరము పాటు విమత్సరు డై ఆకలుష చిత్తముతో) ఒకే స్థానమునందు అశ్వత్తమునకు భాస్కరునకు. గంగకు ప్రణమిల్లి మౌనవ్రతుడై ఏక భుక్తముతో ఉండవలెను. ప్రతాంతమున విప్రదంపతుల నర్చించి - మూడు పాడి యావులను వృషభమును బంగరుతో చేయించి దానమీయవలెను. దీనిచే అశ్వమేధ మాచరించిన ఫలము లభించును. కీర్త్యై శ్వర్యముల సిద్ధింపజేయు దీనిని కీర్తి వ్రతమందురు.
13. గోమయముతో మండలము. నేర్పరచి అచట శివునకుగాని కేశవునకుగాని నేతితో అభిషేకము జరిపి పిమ్మట ఆ దేవునికి అక్షతలతో పుష్పములతో పూజను జరిపి అది ముగిసిన తరువాత సామగానమున నిపుణుడగు విప్రు నకు తిలలను పాడి ఆవును ఎనిమిది ( భార తీయ) అంగుళముల పొడవు కల స్వర్ణకమలమును దానమీయవలెను. దీనినే శివలోక ప్రాప్తియగును. ఇది కామధుగ్ర్వతము.
14. నవమినాడు ఏక భు కముండి యథాశక్తిగ కన్యనుకూడ భుజింపజేసి ఆమెకు బంగరు జరీగల రవికను చీరను ఈయవలెను. బ్రాహ్మణునకు బంగారు దానమీవలెను. దీనిచే ఇహమున అర్బుద జన్మములందు చక్కని రూపము శత్రువులచే అపరాజితత్వము పరమున శివలోక ప్రాప్తియగును. ఇది వీరవ్రతమనబడును. ఇది స్త్రీలకు పుణ్యమును ఆనంద మును ఇచ్చునది.
15. పూర్ణిమ నాడు పాలు మాత్రము త్రాగి ఉపవాసముండి అది ముగియగానే పాడ్యమినాడు పితరులనుద్దేశించి శ్రాద్దము జరిపి బ్రాహ్మణులకు ఐదు పాడియావులను పిశంగ (ఎరుపు పసుపు వన్నె లు కలిసిన రంగుగల) వస్త్రములనే దింటిని ఉదకుంభముల నెదింటిని దానము ఈయవలెను. దీనినే తానును తన పితరులును తరింతురు. విష్ణులోకమునందు దురు. కల్పాంతా (ప్రళయా) నంతరమున కల్పాదియందు సృష్ట్యారంభమున చక్రవర్తియై జన్మించును. ఇది పితృవ్రతము.
16. చైత్రము మొదలుగ నాలుగు మాసములపాటు ఆయాచితముగ జలదానము చేయవలెను. ప్రతాంతమున మణిక మును (దుత్త అనెడి మట్టిపాత్ర) అన్న వస్త్రములను తిల పాత్రమును బంగారును ఈయవలెను. దీనిచే బ్రహ్మ లోకప్రా ప్రియగును. కల్పాంతము (అయిన తరువాతను సృష్ట్యాదియందు) రా జై జన్మించును. ఇది ఆనంద వ్రతము.
17. ఏడాదిపాటు శివునకు పంచామృత స్నానము జరిపించి ప్రతాంతమున ధేనువును పంచా మృతములను శంఖమును బ్రాహ్మణునకు దానమీయవలెను. దీనిచే శివలోక ప్రాప్తియగును. కల్పాంతమున (మరల సృష్ట్యాదియందు) రాజై జన్మించును. దీనిని రాజ్య వ్రత మందురు.
18. ఏడాదిపాటు (మాంసాహారులగు వారు) మాంసము తినకుండి కడపట పాడియావును బంగారు లేడి ప్రతి మను దానమీయవలెను. దీని నహింసావ్రతమందురు. దీనిచే అశ్వ మేధఫలమంది పునరావృత్తి రహిత బ్రహ్మలోక ప్రాప్తుడై కల్పాంతమున (మరల సృష్ట్యాదియందు) నృపతియై జన్మించును.
19. మాఘ మాసమున ఉషస్సున స్నానము చేసి (మాసాంతమున) వస్త్రమాల్యభూషణములతో దంపతులనర్చించి భుజింప జేయవలెను. దీని చే కలకాలము రవిలోక వాసి యగును. దీనిని సూర్యవత మందురు..
20. ఆషాఢది మాస చతుష్టయమున వరుసగా ప్రాతః స్నానము చేసి కార్తికారంభమున బ్రాహ్మణులకు భోజనము చేయించి ధేను దానము చేయవలెను. దీనిచే విష్ణులోక ప్రాప్తుడగును. ఇది విష్ణు వ్రతము.
21. ఒక అయనమున పూవులను మరియొక ఆయనమున నేతిని విడువవలయును. ఇట్లు సంవత్సరమయిన తరువాత పూలదండలను (లోగడ చెప్పిన) ఘృత ధేనువును దానము చేయవలెను. విప్రునకు నేతిపాయసముతో భోజనము పెట్టవలెను. దీనిచే శివలోక ప్రాప్తుడగును. ఇది ఇహమున శీల:రోగ్య ఫలప్రదము. దీనిని శీలవ్రతమందురు.
22. సంవత్సర కాలము తైలమును (ఆహారమున గ్రహింపక) విడువవలెను. (ఇంత కాలము సంధ్యా కాల మున దేవునికడ) దీపము వెలిగించవలెను. సంవత్సరాంతమున బ్రాహ్మణునకు బంగారు చక్ర శూలములను వస్త్ర యుగ్మ మును దానమీయవలెను. దీనిచే తేజస్వియగును. రుద్రలోక ప్రాప్తుడగును. ఇది దీప వ్రతము.
23. కార్తిక మున కృత్తికానక్ష త దినము మొదలు సంవత్సరము వరకు! గోమూత్రమును గోధుమ రవ్వను పాలతో వండిన అన్న మును తినుచు ఏడాదిపాటు నకము ఆచరించవలెను. కడపట గోదానము చేయవలెను. కల్పకాలము గౌరీలోక వాసియై పిమ్మట సృష్టియందు రా జై పుట్టును. ఇది కల్యాణకరమగు గౌరీ వ్రతము.
24. చైత్ర మాసమంతయు గంధానులేపనములు విడిచి మాసాంతమున విపునకు గంధముతో నిండిన ముతైపు ఒప్పను తెల్లని వస్త్రములను దానమీయవలెను. దీనిచే వరుణలోక ప్రాప్తుడగును. దీనిని దీప్య వ్రతమందురు.
(*దద్యాద్వింశత్పలాదూర్ద్వమగ్నింకృత్వాథకాఞ్చానం)
25. వెశాఖ మాసమంతయు పూవులను ఉప్పును విడువవలేను. మాసాంతమున లవణ ఘటములనుగాని లవణ ధేనువునుగాని దానమీయవలెను. దీనిచే ఇహమున కాంతికీర్తులు పొందును. పరమున కల్పకాలము విష్ణులోకమనుభవించును. కల్పాంతము తరువాత సృష్టిలో రా జై పుట్టును. ఇది కీ వ్రతము,
26. మూడు పలములకు తక్కువకాని తూకపు బంగారుతో బ్రహ్మాండమును చేయించవలెను. తిలరాశినేర్పరచ వలెను. మూడు దినములు ఆతిలలతో వహ్నియందు హోమము చేసి కడపట విప్రులకు భోజనములో సంతర్పణము చేసి ఒక పుణ్య దినమున విప్రదంపతులను వస్త్రమాల్యభూషణములతో పూజించి 'విశ్వాత్మా ప్రియతామ్' అనుచు ఆ బ్రహ్మాండమును వారికి దానమీయవలెను. దీనిచే పునర్జన్మ మేలేక పరబ్రహ్మమును పొందును. ఇది మోక్షప్రదమగు బ్రహ్మ వ్రతము.
27. చాల బంగారుతోకూడ ఉభయముఖే గోదానము (అప్పుడే ఈనుచున్న గోదానము చేసిన ఆదినమంతయు పాలు ఆహారముగా నుండవలెను. దీనిచే పునరావృత్తి రహిత పరమపదము లభించును. ఇది సువ్రతమను వ్రతము.
28. మూడు దినములు పాలుఆహారముగా పయోవ్రతముతో)ఉండి నాల్గవనాడు పలమునకు తక్కువని బంగా రుతో కల్పవృక్షము చేయించి దానిని బియ్యముతో కూడ దానము చేయవలెను. దీనిచే బ్రహ్మలోకము ప్రాప్తించును. ఇది కల్పవ్రతము.
29. నెలపాటు (ఏక భుక్తముతో కాని సక్తవతముతో కాని) ఉపవసించి మాసాంతమున వీపునకు పాడియావు నీవలెను. దీనిచే విష్ణులోకప్రా ఫుడగును. ఇది భీమవ్రతము.
30. ఇరువది పలములకు తక్కువకాని బంగారుతో చేయించిన భూప్రతిమ విప్రునకు దాన మిచ్చి ఒక దిన మంతయు పయోవ్రతముతో (పాలు ఆహారముగా) ఉండవలెను. దీనిచే రుద్రలోకప్రాప్తు డగును. దీనివలని పుణ్యము సప్తకల్పములపాటు వెంటవచ్చును: ఇది ధరావ్రతము.
31. మాఘమునకాని చేత్రమునకాని శుక్ల తృతీయనాడు గుడాన్న మహారముగా ఉండి గుడ ధేనుదానము చేయ వలెను. దీనిచే గౌరీలోకప్రాప్తు డగును. ఇది సరసమును ఆనందప్రదమునగు మహావ్రతము..
32. పక్షము దినములు (ఏక భుక్తముతోనో సక్రముతోనో) ఉపవసించి కడపట రెండు కపిల గోవులను దాన మీయవలెను. దీని దే దేవాసుర పూజితుడగుచు బ్రహ్మలోకమున సుఖించును. కల్పాంతము తరువాత సృష్టిలో రాజై పుట్టును. ఇది ప్రభావ్రతము.
33. ఏడాదిపాటు ఏకభ (భు) క్షము చేయుచు ఉపవసించి కడపట భక్ష్యములతోను జలముతోను నిండిన కడవ లను దాన మీవ లెను. దీనిచే కల్పకాలము శివలోక ప్రాప్తు డగును. ఇది ప్రాప్తి వ్రతము.
34. ఏడాదిపాటు ఆష్టములయందు నకవ్రతము చేయుచు కడపట గోదానము చేసినచో ఇంద్రపద మందును. ఇది సుగతీతము.
35. వర్షాకాలపు సొలుగు నెలలు విప్రునకు వంటక లైల నిచ్చుచు కడపట ఘృతధేను దానము చేయవలెను. ఇది సర్వపాప ప్రణాశనమగు వైశ్వానర వ్రతము. దీనిచే పరబ్రహ్మ ప్రాప్తు డగును.
36. ఏడాదిపాటు ఏకాదశులందు నకవ్రతము చేసి కడవట బంగారు విష్ణుచక్రము దాన మీవలేను. దీనినే విష్ణులోకప్రాప్తు డగును. కల్పాంతము తరువాత సృష్టిలో రాజై పుట్టును. ఇది కృష్ణ వ్రతము.
37. ఏడాదిపాటు పాలఅన్న ము మాత్రమే తిని కడపట విప్రునకు రెండు పాడి ఆవుల నీవలెను. కల్పకాలము లక్ష్మీలోకప్రాప్తి నిచ్చు ఇది దేవీవ్రతము.
38. ఏడాదిపాటు సప్తములయందు న కముండి కడపట పాడియావును దాన మీవలెను. దీనిచే రవిలోకప్రాప్తు డగును. ఇది భానువ్రతము..
39. ఏడాదిపాటు చవితులయందు నక్తముండి కడపట బంగారు ఏనుగు ప్రతిమ దాన మీవలేను. ఇది శివలోక ఫలదమగు వై నాయకవ్రతము.
40. ఆషాఢాది మాస చతుష్టయమునందు మహా (ఆ ఋతువునందు లభించు) ఫలములను విడిచి కార్తికమున ఆ ఫలముల బంగారు ప్రతిమలు చేయించి వాటిని రెండు పాడి ఆవులను విప్రులకు దానమీయవలెను. ఇది విష్ణులోకఫల ప్రదమగు కాలవ్రతము.
41. హేమంత ఋతువు మొదలుగ సంవత్సర కాలము స పములందు ఉపవసించుచు తమున హేమంతమునందు యథాశక్తిగ బంగారు కమలమును గోవును ఉదకుంభమును దాన మీవలెను. ఇది. సూర్యలోక ఫల ప్రదమగు సౌరవ్రతము.
42. పండ్రెండు ద్వాదశులయం దుపవసించి కడపట గోవస్త్ర కాంచనములతో విపుల నర్చించవలెను. ఇది పర మపదప్రదమగు విష్ణువతము..
43. కార్తిక మాసమున వృషోత్సర్గము చేసి నకవ్రతము పాటించవలెను. దీనిచే శివసానప్రాప్తు డగును. ఇది వృషవ్రతము.
44. చాంద్రాయణమువంటి కృచ్చవ్రతము పాటించి కడపట గోదానము చేసి యథాశక్తిగా విప్రులకు భోజనము పెట్టించి తానును భుజించవలయును. ఇది ప్రాజాపత్యవ్రతము.
45. చతుర్దశులందు ఏడాదిపాటు న కవ్రతము పాటించి కడపట గోవులను ధనమును దాన మిచ్చినచో శివ పదప్రాప్తు డగును. ఇది త్రియంబక వ్రతము.
46. ఏడు దినములపాటు ఉపవాసముండి కడపట విప్రునకు ఘృతకుంభమును దానమీయవలెను. ఇది బ్రహ్మలోక ఫలప్రదమగు ఘృతవ్రతము.
47. ఏడాదిపాటు దర్బలపై శయనించుచు కడపట సువర్ణమును పాడియావును దానమీయవలెను. దీనినే కల్పకాలము ఇంద్రలోకమున సుఖించును. ఇది ఇంద్రవ్రతము.
48. (ఏడాదిపాటు) తదియందు అగ్ని పై ఉడుకని ఆహారము తినుచు కడపట గోదానము చేసినచో పునరా, వృత్తి రహిత శివలోక ప్రాప్తు డగును. ఇది మహానందకరమగు శివవ్రతము.
49. రెండు పలములకు తగ్గని బంగారుతో రథమును రెండు గుర మ లను చేయించి దాన మిచ్చీ. ఆనాడుప వసించినచో నూరు కల్పములు స్వర్గమున వసించి కల్పాంతమున సృష్ట్యాదియందు చక్రవర్తియై పుట్టును. ఇది అశ్వ వ్రతము.
50. బంగారు రథమును రెండు ఏనుగులను రెండు పలములకు తక్కువ కాసి బంగారముతో చేయించి దాన మిచ్చి ఆనాడు ఉపవాస ముండవలెను. దీనిచే సత్యలోక ప్రాప్తుడై కల్పాంతము తరువాత సృష్టికి మొదట రాజై పుట్టును, ఇది కరివ్రతము.
సంవత్సర ముపాటు (ఏక భక్తముతోగాని నక్తముతో కాని) ఉపవసించి సంవత్సరాంతమున గోదానము చేయవలెను. దీనినే యక్షాధిపతిత్వము లభించును. ఇది నిర్దుఃఖ వ్రతము. సంవత్సరము పాటు చేయు వ్రతముల విష యమున ఆ ఏడాది నడుమ అధిక మాసము వచ్చినచో దానిని పండ్రెండు మాసములలోని దానినిగా లెక్కించరాదు.
52. ఒక రేయియంతయు నీటియందు గడపి ఆ రాత్రి గడచిన తరువాత ఉదయమున గోదానము చేయవలెను. దీనిచే వరుణలోక ప్రాప్తుడగును. ఇది వరుణ వ్రతము..
53. (నెలపాటు) చాంద్రాయణ వ్రతము జరిపి ప్రతాంతమున బంగారు చంద్రుని దానమీయవలెను. చంద్రలోక ప్రా ప్రిఫలమునిచ్చు ఇది చంద్రవ్రతము.
54. జ్యేష్ట శుక్లమున అష్టమీ చతుర్ధ శులందు పగలు పంచతపస్కుడె (నాలుగు వైపుల అగ్ని యు పైని రవియు వెలుగుచుండ నడుమ నీలిచి సాయంకాలమున గోదానము చేయవలెను. ఇది రుద్రవత ము; దీనిచే స్వర్గప్రాప్తియగును.
55. ఏడాదిపాటు ప్రతి తదియనాడు చాందినీ నిర్మింప జేసి ప్రతాంతమున గోదానము చేయవలెను. భవానీ లోక ప్రాప్తి కలిగించు ఇది భవానీ వ్రతము.
56. మాఘ శుక్ల సప్తమి రాత్రి అంతయు తడిబట్టలతో ఉండి గడపి మరునాడు గోదానము చేయవలెను. స్వర్గమున కల్పముపాటుండి కల్పాంతము తరువాత సృష్టికి మొదట రాజై పుట్టును. ఇది స్నా పక వ్రతము.
57. ఒక నాడు ఉపవసించి ఆనాటి మూడు సంధ్యలయందును భూషణములతో దంపతులనర్చించవలెను. దీనినే ముక్తి లభించును. ఇది ఇంద్రవ్రతము.
58. ప్రతి శుక్ల ద్వితీయనాడు చంద్రునుద్దేశించి ఏడాదిపాటు లవణ పాత్రను దానమిచ్చుచు కడపట విప్రునకు గోదానము చేసినచో శివలోక ప్రాప్తుడగును. కల్పాంతము తరువాత సృష్టికి మొదట రాజై పుట్టును. ఇది సోమవ్రతము.
59. ఏడాదిపాటు పాడ్యములయందు ఏక భ క్తము చేయుచు కడపట కపిల గోదానము చేసినచో అగ్ని లోక ప్రాప్తు డగును. ఇది వైశ్వానర వ్రతము.
60. ఏడాదిపాటు ప్రతి దశ మినాడును ఏక భకము చేయుచు కడపట పది గోవులను బంగారుతో చేసిన దశ దిశ లను దానము చేయవలెను. బ్రహ్మ విష్ణు రుద్రులను ద్విజోత్తములను అర్చించవలెను. ఇది మహా పాతక నాశనమగు. విప్ల. వ్రతము.
సర్వోత్తమమగు ఈ షష్టి వ్రతకల్పమును వినినను చదివినను నూరు మన్వంతరముల కాలము గంధర్వాధి పతియగును. నారదా! ఇది పుణ్యకరము; విశ్వజన వంద్యము; వినగోరిన బ్రాహ్మణులకు (ను ఇతరులకును కూడ) దీనిని వినిపింపుము. నీకు ఈ విషయము చెప్పవలసిన పని ఏమున్నది?
ఇది శ్రీమత్స్య మహాపురాణమున షష్టి వ్రత మాహాత్మ్య కథనమను తొంబది తొమ్మిదవ అధ్యాయము.
Summary of chapter 100 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya concludes this section by glorifying the supreme efficacy of all devotional vows dedicated to Bhagavān Vishṇu. The Lord summarizes the spiritual underlying truth of Vrata-pālana, explaining that external rituals, fasts, and gifts serve to anchor the human mind in continuous contemplation of the Divine. Whoever observes these sacred vows with unyielding faith, devotion, and moral purity attains freedom from the three types of worldly suffering, protects their entire family lineage, and enjoys imperial prosperity on earth. Ultimately, upon casting off the mortal body, such a devout practitioner transcends the mortal world of birth and death, ascending to the supreme, eternal abode of Vaikuṇṭha, where they abide in perpetual divine bliss in the presence of Lord Janārdana.