మత్స్య మహా పురాణము
224 - దండోపాయ విచారము.
శ్రీమత్స్య నారాయణుడు మనువుతో ఇట్లు చెప్పెను: ఈ చెప్పిన మూడుపాయములతోను వశీక ఎంచుకోన శక్యులు కాని వారిని దండోపాయముతో వశీక రించుకోనవలయును. ఏలయన దండము నరులను వశీక రించుకొని తీరును మహీపతి తగిన సహాయుల తోడ్పాటుతోను తాను తన బుద్ధితో విచారణ చేసియు ధర్మ శాస్త్రానుసారముగ దండమును చక్కగా ఆచరణలో నుంచవలెను. దానిని రాజు ఎట్లు లెస్సగా ఆచరణలో పెట్టవలయుననిన వానప్రస్థులు ధర్మజులు నిర్మములు నిష్పరిగ్రహులు (ఎవరినుండియు ఏమియు తీసికొననివారు) స్వదేశముదుగాని పర దేశమందు గాని ఉండు ధర్మశాస్త్ర విశారదులు. ఇట్టివారిని పిలిపించి వారిచే విషయమును సమీక్షింప (బాగుగా పరిశీలింప) జేసి వారి యభిప్రాయము ననుసరించి దండ మును ఆచరణమందుంచవలెను. ఏలయన రాజ్య సమ్యక్పరిపాలనమంతయు దండమునందే నిలిచియున్నది; బ్రహ్మ చర్యాద్యాశ్రమములందున్న వాడుగాని సంన్యాసిగాని పూజ్యుడు అగు మహా వ్యక్తిగానీ గురువుగాని స్వధర్మమునందు నిలువని వాడయిన చో రాజునకు దండ్యుడు కాని వాడెవడును ఉండడు; రాజు దండ్యులను దండింపకున్నను ఆదండ్యులను దండించినను అతడు ఇహమందు రాజ్య పరిభ్రష్టుడును పరమందు నరక ప్రాప్తుడును నగును. కావున రాజు లోకానుగ్రహ కాంక్షతో తాను వినీతుడై (సమ్యగ్వర్తనము గలవాడై) ధర్మ శాస్త్రానుసారముగ దండోపాయమునాచరణమందుంచవలెను. ప్రజానేత (రాజు) సరిగా చూచువాడయినచో.ఎచట నల్లని దేహచ్చాయయు ఎర్రని కన్నులు గలవాడునని శాస్త్రములందు చెప్పబడిన దండాధిష్టాన దేవత నిర్భయయై సంచరించునో. అచ్చట ప్రజలు మోహము ధర్మాధర్మ విషయములందు పొర బాటు పొందరు. ఏలయన రాజు దండ్యుల విషయమున దండమును ప్రవ గ్రిల్లజేయనిచో బాలురు వృద్ధులు యతలు ద్విజులు స్త్రీలు విధవలు. ఇట్టివారు మాత్స్యన్యాయముతో (బలవంతులచే బలహీనులు హింసించబడుటయు.తినబడుటయును అను విధానముతో) నుందురు. దేవదై త్యోరగ గణములును సర్వభూత ములును పశులును మర్యాదాతిక్రమణమును చేయుదురు (హద్దుమీరి వర్తింతురు).
ఈ దండ దేవత బ్రాహ్మణులిచ్చు శాపములందును నర్వాయుధములందును నర్వ విక్రమములందును నర్వ కోపములందును దృఢ ప్రయత్నమునందును ప్రతిష్టితమయియున్నది. దండించువారినే దేవతలును పూజింతురు. దండించని వారినెవ్వరును పూజించరు. మానవులలో కొందరు ప్రశాంతులగు బ్రహ్మ-విధాత.పూషన్. ఆర్యమన్. మొదలగు దేవతలను సర్వకర్మలందును పూజించకున్నారు. దండించువారగు రుద్రాగ్నీంద్ర సూర్యచంద్ర విష్ణులను ఇట్టి ఇతర దేవతలను పూజించుచున్నారు. ప్రజలనందరను దండమే శాసించుచున్నది. రక్షించుచున్నది. అందరును నిద్రించు చున్నను అది తాను మాత్రము మేలుక నియుండును. కావుననే దండమే ధర్మ స్వరూపమని పండితులందురు. రాజదండ భయమువలన కొందరును యమదండ భయము వలన మరికొందరును పరస్పర భయమువలన ఇంకను కొందరును పాపమునాచరించకున్నారు. ఇట్లు లోక వ్యవహార సిద్దియంతయు దండమునందే నిలిచియున్న దీ; రాజాదులు ఆప రాధులయందు దండమును ప్రవర్తిల్లజేయకున్న చో జనులు అంధతమస్సునందు మునిగిపోవుదురు. దుర్మదులను అణచి అదుపులో నుంచును. దండించును. అను ఈరెండు హేతువులచే దండ మునకు ఆ వ్యవహారము ప్రసిద్ధమయినది. శూల ధరుడగు శివుడు దండించునను భయమువలననే దేవతలందరును కూడి ఏకాభిప్రాయముతో ఆతనికి యజ్ఞమునందు భాగము నిచ్చిరి. శిశువులలో శ్రేష్ఠుడు (చాల పసివాడు) అయినను బలశాలియగు కుమారుని దేవతల దండ భయమువలననే సేనాపతినీగా చేసిరి.
ఇది శ్రీ మత్స్యమహాపురాణమున రాజ ధర్మమున దండోపాయ కథనమను రెండు వందల ఇరువది నాలుగవ అధ్యాయము.
Summary of chapter 225 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya expounds upon specialized neutralization rituals known as Utpāta-shānti, performed when extraordinary natural disasters or celestial portents occur. Bhagavān Matsya classifies portents into terrestrial, atmospheric, and celestial anomalies, such as unexpected earthquakes, meteors, unnatural weather, solar halos, or animal behavior shifts. Conducting elaborate fire sacrifices, feeding learned scholars, and distributing charity during such occurrences neutralizes impending calamities and shields the realm from destruction.