మత్స్య మహా పురాణము
255 - గృహ నివేశాది కథనము.
సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: వాస్తుశాస్త్రము బాగుగ నెరిగినవాడు నివేశన స్థలమును బాగుగ పరీక్షించ వలయును; స్థలమునందు పడినసీరు ఉత్తరదిశకుగాని ఈశాన్యదీక్కునకుగాని ప్రవహించుచుండవలయును; నడుమ నుండు పై భాగమంతయు ఒకే మట్టముగా నుండవలెను; ఇట్లు ఉండునట్లు పరీక్షించి చూచిన తరువాత ఆ నివేశ నస్థలము నందు స్తంభమును నిలువబెట్టవలయును.
ప్రాజ్ఞుడు దేవతాద్యూతకార సచివాదుల గృహములకును నాలుగు వీథులుక లీయు ప్రదేశ ములకును దగ్గరలో గృహనిర్మాణము చేసికొనరాదు; దానిచే దుఃఖశోక భయములు కలుగును; గృహసన్ని వేశమును గృహమునుండి నీరు బయ టకు పోవుటలో దానికిగల యవకాశ మునుబట్టి సొలుగు విధములుగ విభజించవచ్చును; 1. ఉత్సర్గము. ఇంటి ముందునుండి నీరు బయటికి పోవునది - ఇది శుభకరము; 2. నవ్యావర్తము.ఇంటి వెనుక నుండి నీరు బయటకు పోవునది; ఇది మరియు శుభతరము; 3. అపసవ్యము - ఇంటికి దక్షిణముగా నీరు బయటకు పోవునది -వినాళ ప్రదము; 4. సంపూర్ణము - ఇంటికి ఉత్తర దిశ నుండి నీరు బయటికి పోవునది. ఇది చాలమంచిది; ఇట్టి అనుకూలతలుగల ప్రదేశమును చూచికొని యత్న పూర్వక ముగ యథాశక్తిగ గృహమారంభించవలయును.
ఇదీ ఎట్లన -దైవజ్ఞుడు చెప్పిన శుభలక్షణయుత ముహూర్తమునందు (స్తంభమును ప్రతిష్టించుటకై త్రవ్విన గోతి యందు) రత్నములుంచి వాని పైదృఢమును సమతలమునగు) శిలనుంచవలెను; అచట సర్వబీజములునుకూడ చల్లవలెను; శిల్పి శుక్ల వస్త్రధరుడై వేదపారగులగు నలుగురు విప్రులు వేదములు పఠించుచుండ స్తంభమును స్నానము చేయించి వస్త్రా లంకారాదులచే భూషించి వేదధ్వనులతోను మంగళ వాద్య గీతధ్వనులతోను దాని నాశిలపై నిలుపవలయును; సర్వోషధు లను నానాక్షత ఫల వస్త్ర తాంబూలాదులను దానీకర్పించవలయును; వాస్తుయజ్ఞమునుకూడ జరుపవలేను; 1. సూత్రపాతము గృహము నిర్మించుటలో కావలసిన ఆయా కొలతతలనుబట్టి ఆయా గృహభాగములను నిర్ణయించుటకై ‘శంకు’స్థాన నిర్ణయ ము చేసి ఆశంకువు ఆధారముగా రజ్జువుతో కొలతల నారంభించుట) 2. స్తంభోద్ఘ్ఛాయము (స్తంభము ఎత్తుట) 3. ద్వారోబ్రా యము (ద్వారము ఎత్తుట) 4. గృహప్రవేశము 6. పాస్తూపశమనము (వాస్తుశాంతి) ఈ ఐదు సందర్భములందు ఐదు విధము లుగా వాస్తుయజ్ఞము జరుపవలసియుండును; గృహనిర్మాణమునకు ఉద్దేశించిన ప్రదేశమంతటికిని సరియగు ఈశాన్యమునందు సూత్రపౌతమును.సరియగు ఆగ్నేయమునందు స్తంభోచ్చాయమును జరుపవలయును; ఈ సమయములందు జరుపు వాస్తు యజ్ఞములందు ‘వాస్తోష్పతే ప్రతి జానీహి' అను మంత్రముతో తేనెతోను నేతితోను హోమమును జరుపవలయును; బ్రాహ్మణు లకు పాయసము భుజింప జేయవలయును.
(లోగడ ఏకాశీతి పదాత్మకమగు వాస్తు చక్రము చెప్పబడినది.) ఈ వాస్తు చక్రమును గృహ నిర్మాణమునకు ముందుగా (సూతపాతమునను కూడ ముందుగా ఆ స్థలమునందు లిఖించి యుంచుకొనవలయును; దీనిని వాస్తు గృహ నిర్మాణార్థమగు) ఏకాశీతి పదవిలేఖనమందురు; దీనికే రేఖాదులను లిఖించుటయు, ఆయా పదము (అంకణము) లందు ఆయా స్టాన దేవాతోనామములును లిఖించుటలో ప్రదక్షిణ క్రమమును పొటించవలయును; వ్రాయుటలో కుడి చేతి తర్జనీ మాధ్యమాంగుళులను బొటన వేలిని ఉపయోగించవలయును, వ్రాత కై పవడములు రత్నములు బంగారు ఫలపుష్పాక్షతోద కము ఉపయోగించవలయును! బూడిద-బొగ్గులుక పై ముక్కలు -గోళ్లు. ఆయుధములు వంట ఇంటిపనిముట్లు.చర్మము-వేదురు కర్ర.ఎముకలు-కపాలపు ముక్కలు. ఈ లేఖన కార్యములో ఉపయోగించరాదు; దీనిచే దుఃఖరోగభయాదికము గలుగును.
ఆయా వాస్తు కర్మల ఆరంభమున శకునాదికము.
గృహ నిర్మాణమునకై సూత్ర పాతము. స్తంభోచ్ఛ్రాయము ( స్తంభ ప్రతిష్ట) గృహ ప్రవేశము మొదలగు నంద ర్భములందు శిల్పి శకునాదికమునుబట్టి శుభాశుభ ఫలోదయమును గురుతించవలయును. ఎట్లనగా- 1. పక్షి ఏదయిన సూర్యాభిముఖముగ పరుషముగా కూయుటయు గృహస్వామికి అవయవమేదయిన ఆదరుటయు ఒకే మారు జరిగినచో వాస్తు పురుషుని ఆ అవయవ భాగమునకు నరిపడు ఆ గృహ నిర్మాణ ప్రదేశమున భయ ప్రదమగు నరాస్థి యున్నదని తెలియ వలేను. 2. వాస్తు చక్రము లిఖించి ఆయా గురుతులు గురుతించిన వెంటనే ఆ స్థలమందు ఏనుగు గుర్రము.మరే దైన క్రూరప్రాణివచ్చి నిలిచినచో ఆ తావున శల్యముండును; 3. సూత్రమును మొదటి సారిగా కోలత కై ప్రసారించు నపుడు కుక్కయో నక్క యో ఆ స్థలమునందలి ఏతావునకుదుమికి నిలుచునో.ఎచట ఆది భయంకరముగ ఆరచునో అచ్చట శల్యముండును. 4. ఆ స్థలపు ఈశాన్యదిశ యందు కాకి మధురముగా కూసినచో ఆ స్థలమందును-ఆది మరెచ్చట నైన కూర్చుండి మధురముగా కూసినచో ఆ ప్రదేశమునందును ధనము లభించును.
సూత్రపాత సమయమున సూత్రము తెగినచో గృహ స్వామికి మృత్యువు కలుగును; సూత్రము కట్టుటకుద్దేశిం చిన కీలము తలక్రిందులయినచో వ్యాధి కలుగును; ఆ భూమియందు బొగ్గులు వచ్చినచో ఉన్మాదము కపాలములు వచ్చి నచో సంశయము శంఖములుకొని ఎముకలుకానీ వచ్చినచో ఆ ఇంటి స్త్రీలలో జారిణీత్వము కలుగును; శిల్పితడబడి నచో గృహస్వామియు గృహమును నాశమందుట జరుగును. .
స్తంభమునకు మొదట రాతి పైనుంచిన జల కుంభము తన తావునుండి జారినచో శిరో వ్యాధి.కుంభము దొంగి లింపబడినను (తన తాపునుండి తొలగినను) వంశ నాశము. ఆది తన తావునుండి జోరినచో మృత్యువును.పగిలినచో బంధ మును కలుగును; కర (నూరల) నంఖ్యలను తెలుపు గురుతులు చెడిపోయినచో గృహ స్వామికి నాశము; అచట చల్లిన బీజములు ఓషధులు చెడినచో భూతములనుండి భయము కలుగును; ఈ స్తంభము పై ఆగ్నేయమున గొడుగుంచవలయును; ఇట్లు ప్రథమ స్తంభ ప్రతిష్ట ఆగ్నేయమున జరిగిన తరువాత వివేకియగు శిల్పి ప్రదక్షిణ క్రమమున ఆయా ఇతర స్తంభము లను కూడ నిలుపుచు పోవలయును; ఆప్రదక్షిణముగ ఇతర స్తంభములుంచుట భయ ప్రదము; కావున స్తంభపు ప్రతిష్టచే కలుగదగు ఏ ఉపద్రవములును కలుగకుండ రక్షణలు (జాగ్రత్తలు ) పూనవలయును; ఈ ప్రథమ స్తంభము పై పండ్లతో కూడిన చెట్ల కొమ్మలు ఏవయిన కట్టవలయును; గృహ నిర్మాణ విషయమున అన్నియును తూర్పునకో ఉత్తరమునకో వాలుగ నుండునట్లు నిర్మించవలయును; అంతేకాని దిక్కుల విషయము పట్టించు కొనకుండ (దిజ్మూఢముగ) తోచినట్లుగా స్తంభ ప్రతిష్ట కాని భవన నిర్మాణము కాని ద్వార ముకాని నివాస గృహము కాని ఏదియు చేయరాదు; దానిచే వంశ నాశ మగును .
గృహమును వృద్ధి చేయుట ( పెంచుట).
మొదట ఒక అమరికలో గృహ నిర్మాణము చేసిన తరువాత దానిని మరల పెంచుట మంచిది కాదు; ఒక వేళ పెంచుచో అన్ని దిక్కులకును పెంచవలయును; తూర్పునకు మాత్రము పెంచినచో వైర వృద్ధి; దక్మిణమునకు పెంచి నచో మృత్యువు; పడమటకు పెంచినచో ధననాశ ము; ఉత్తరమునకు పెంచినచో నంతాపము; ఆగ్నే యవృద్ధి ఆగ్ని భయదము; నైరృత వృద్ధి శిశు నాశకరము; వాయవ్యవృద్ది వ్యాధి ప్రకోపకరము; ఈ శాన్యవృద్ధి సంతాన హానికరము.
ప్రధాన గృహమునకు వెలుపల ఉప గృహములు.
ప్రధాన గృహమునకు ఈశాన్యమున దేవతా గృహమును శాంతి గృహమును ఆగ్నేయమున వంట ఇంటిని ఈ వంట ఇంటికి ఉత్తర ముగా ఈ ఆగ్నేయ మూలయందే జరి గృహమును గృహ పరికర గృహమును నైరృతము నందును దానికి వెలుపలగా ఆ నేరృతమునందే ఆన్ని ఇతర సామగ్రుల గృహమఖను ఆందే దానికి వెలుపలగా కర్మశాల (వడ్లు దంచుట పిండి వినరుట మొదలగు పనులశాలను నిర్మించ వలయును; (ఇట్లు నాలుగు మూలలందును ఎనిమిది ఉప గృహములు చెప్పబడినవి.) ఇట్టి వాస్తునివేళ ము గృహ భర్తకు (గృహ స్వామికి) సుఖకరము.
ఇది శ్రీ మత్స్య మహాపురాణమున వాస్తు శాస్త్రమున గృహ నివేశమను రెండు వందల ఏబది యైదవ అధ్యాయము,
Summary of chapter 255 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya outlines the architectural proportions, structural measurements, and spatial classifications for residential buildings, royal palaces, and civic structures. Bhagavān Matsya details four-winged courtyard dwellings known as Chatuhśāla homes, categorizing them into distinguished types such as Sarvatobhadra, Nandyāvarta, Vardhamāna, Svastika, and Rūchaka based on the arrangement of verandas, doors, and interior pillars. The text provides precise dimensional ratios for door heights, wall thicknesses, and ceiling heights tailored to different social classes and official ranks, ensuring that spatial harmony promotes physical comfort and spiritual elevation.