మత్స్య మహా పురాణము
189 - మం (యం) త్రేశ్వరాది తీర్థ మహిమాను వర్ణనము॥
(*రాజ స్కపిలాదాన మాప్నుయాత్)
(*రాజంగోలోకం సమవాప్నుయాత్)
మార్కండేయుడు ఇట్లు చెప్పెను: నర్మదానది ఉత్తరపుటొడ్డున యోజన :స్తారముగల మం (యం) త్రేశ్వర మను సర్వపాప హరమగు గొప్ప తీర్థము గలదు; దానియందు స్నానమాడినవారు ఐదువేల ఏండ్లు కామరూప ధరులై దేవ తలతో కూడి విహరించుచు నుఖింతురు; తరువాత గర్జనమను తీర్థము; దానియందు స్నానమాడిన మేఘ మొకటి దాని ప్రభా వమున ఇంద్రజిత నునామమునంది ఉన్నతి పొందెను॥ తరువాత మేఘ గర్జనమువలె ధ్వనించు మేఘనాద తీర్థ ము; దాని యందు స్నానమాడి మేఘనాదుడను గణ ప్రమథుడు గణాధిపతియయ్యెను; తరువాత ఆమాత కేశ్వర తీర్థ ము; దాని యందు స్నానమాడినచో గోసహస్ర దాన ఫలము కలుగును; తరువాత ధారాతీర్ణము; ఆది నర్వోత్తమము; దానియందు స్నానమాడి పితరులకు తర్పణము చేసినచో సర్వ చింతిత కామసిద్ధి యగును; తరువాత బ్రహ్మ సదాసన్ని హితుడయి॥ యుండు బ్రహ్మావర్త తీర్థము; దానియందు స్నానము బ్రహ్మలోక ప్రాప్తినిచ్చును; తరువాత గాణేశ్వర తీర్థము; ఆట కేగి నియతుడై నియతమగు ఆసనమున కూర్చుండినచో సర్వపాప విశుద్దాత్ము డే రుద్రలోక మేగును; తరువాత ఉత్తమ మగు కపిల తీర్థము; దానియందు స్నానముచే నర్వదాన ఫలము సిద్ధించును; తరువాత దేవర్షి గణ సేవితమగు కరంజ తీర్థము; దానియందు స్నానముచే రుద్రలోక ప్రాప్తి; తరువాత కుండలేశ్వర తీర్థము; అది యుత్తమము; ఆందు రుద్రుడు ఉమతో సదా సన్నిధిచేసి యుండును; ఆందు స్నానమాడినవాడు దేవతలకును ఆవధ్యుడగును; తరువాత సర్వపాప నాశక మగు పిప్పలేశ తీర్థము; దానియందు స్నానము చే రుద్రలోక ప్రాప్తి; తరువాత ఉత్తమమగు విమలేశ్వర తీర్థము; అందు ఈశ్వరుడు నిలిపిన రమ్యమగు దేవశిల యొకటి గలదు; అచట ప్రాణత్యాగము చే రుద్రలోక ప్రాప్తి; తరువాత పుష్కరిణీ తీర్థము; ఆందు స్నానమాడినవాడు ఇంద్రుని ఆర్ధాసనమునకు ఆధికారి యగును॥
నర్మద సాక్షాత్ రుద్ర దేహమునుండి వెలువడిన నదీ, శ్రేష్ట; అది స్థిర చర భూతములనన్నిటినీ తరింపజేయ గలది; ఆని సర్వ దేవాది దేవుడు మహాత్ముడునగు ఈశ్వరుడు ఋషులకును విశ్లేషించి మాకును చెప్పియుండెను; నదీ, శేష యగు ఈ నర్మద మునులచే స్తుతింపబడునది; లోకములకు హితము చేయుట కె రుద్ర దేహమునుండి వెలువడినది; ఇది॥ సర్వపాప హరము; సర్వదేవ నమస్కృతము; దేవతాగంధర్వాపరోనుతులను అందు కొనునది; పుణ్యజలా! ఆద్యా! సాగర గామినీ! పాప నాశనీ! - సుందర ముఖీ! దేవీ! ఋషిగణ సేవితా! శంకర దేహనిరతా! ధర్మపోషకులలో మేలగు దానా! సర్వ పవిత్ర వస్తువులనుకూడ పావనము చేయు దానా! నర్మదా! నీకు నమస్కారము॥ అను ఈ స్తోత్రమును నిత్యమును శుద్ద మనస్కుడే పఠించినచో బ్రాహ్మణులకు వేద విద్యయు క్షత్రియునకు విజయమును వైశ్యునకు ధన లాభ మును శూద్రునకు సద్దతియు కలుగును॥ ధనార్జికి ధనమును లభించును; మ హేశ్వర దేవుడే స్వయముగ దీనిని సదా సేవించునన్న చో ఇది బ్రహ్మహత్యా దోషమునుకూడ పోగొట్టగలదని వేరుగా చెప్ప పని లేదు॥
ఇది శ్రీమత్స్య మహా పురాణమున నర్మదా మాహాత్మ్యమున మం (యం) త్రేశ్వరాది తీర్థ మహిమాను వర్ణనమను నూట ఎనుబది తొమ్మిదవ యధ్యాయము॥
Summary of chapter 190 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya expounds upon the supreme sanctity of Maheshvara-tīrtha and Jamadagni-tīrtha along the Narmadā river course. Maheshvara-tīrtha is celebrated as the site where Mahādeva performed intense meditation, while Jamadagni-tīrtha marks the hermitage where Maharshi Jamadagni achieved spiritual perfection through severe austerities. Performing charity and meditation at these sites grants deep mental peace and spiritual power.