197 -   విశ్వామిత్ర గోత్ర ప్రవరాను కీర్తనము॥

మత్యుడు మనువున కిట్లు చెప్పెను: అత్రి నుండియే ఏర్పడిన మరియొక వంశమును తెలి పెదను వినుము; అతి పుత్తడగు_సోముని వంశము నందలి విశ్వామిత్రుడు తపస్సుచే బ్రాహ్మణత్వము నందెను అత నివంశమున జనించిన గోత్రకారులను వారి ప్రవర ఋషులను తెలి పెదను:

మొదటి వర్గము వారు: విశ్వామిత్రుడు దేవరాతుడు వైకృతి గాలవుడు వతండుడు నలంకుడు అభయుడు చాయతాయనుడు శ్యామాయనులు యాజ్ఞవల్క్యులు ఆ బాలులు బాభ్రవ్యులు కరీములు సంశ్రుత్యులు ఉలూపులు ఔపగ హయులు పయోదులు జనులు పాదపులు ఖర వాదులు హలయములు సాధితులు వాస్తు కౌశికులు - ఈ ఋషుల గోత్రముల వారలకు విశ్వామిత్రుడు దేవరాతుడు ఉద్దాలుడు ప్రవర ఋషులు; ఈ గోత్రములవారు పరస్పర వివాహ సంబంధములు చేసికొనరాదు

రెండవ వర్గము వారు; దేవశ్రవులు సుజాతీయులు సొసుకులు కారు కాయనులు వై దేహరాతులు కుళికులు - ఈ ఋషుల (గోత్రముల వారల)కు దేవశ్రవుడు విశ్వామిత్రుడు దేవరాతుడు ఆనువారు ప్రవర ఋషులు; ఈ గోత్రములవారు పరస్పరము వివాహ సంబంధములు చేసికొనరాదు

మూడవ వర్గము వారు: ధనంజయుడు కపర్దేయుడు పరికూటుడు పాణిని ఈ ఋషుల గోత్రములవారలకు విశ్వామిత్రుడు మధుచ్ఛంద సుడు అఘమర్షణుడు అనువారు కాని విశ్వామిత్రుడు ధనంజయుడు మధుచ్ఛందసుడు అనువారు కాని ప్రవర ఋషులు; ధనంజయుడు ఈ వర్గములో ఆద్యుడు - మొదటివాడు - ఈ గోత్రముల వారు పరస్పర వివాహసంబంధములు చేసికొనరాదు

నాలుగవ వర్గము వారు: విశ్వామిత్రుడు - పూరణుడు - అను ఋషుల (గోత్రముల వారల)కు విశ్వామిత్ర పూరణులే ప్రవర ఋషులు ఈ గోత్రముల వారు పరస్పర వివాహ సంబంధము చేసికొనరాదు

ఐదవ వర్గము వారు: కమలాయజినుడు ఆశ్మగధ్యుడు వంజులి-ఈ ఋషుల (గోత్రముల వారల)కు విశ్వా మిత్రుడు ఆశ్మరథ్యుడం వంజులి-ఆను మువ్వురు ప్రవర ఋషులు; ఈ గోత్రముల వారికి పరస్పర వివాహ సంబంధములు పనికిరావు

ఆరవ వర్గమువారు: విశ్వామిత్రుడు లోహితుడు అష్టకుడు పూరణుడు - అను ఈ ఋషుల (గోత్రముల వారల)కు విశ్వామిత్రుడు పూరణుడు ఆను ఇద్దరు ప్రవర ఋషులు; వీరికి పరస్పర వివాహ సంబంధములు పనికిరావు; పూరణ గోత్రములవారు తమలో తాము వివాహ సంబంధములు చేసికొనరాదు

ఏడవ వర్గమువారు: లోహితులు అష్టకులు ఈ ఇద్దర ఋషుల (గోత్రముల వారల)కు విశ్వామిత్రుడు లోహితుడు అష్టకుడు అను మువ్వురు ఋషులు; అష్టకులు లోహితులు-వీరు పరస్పర వివాహ సంబంధము చేసికొనరాదు

 ఎనిమిదవ వర్షముపొరు: ఉద రేణుడు కథకుడు -ఉదోవహి - శోట్యాయనిక రీరాశి - శాలంకాయనుడు - లావకిమౌంజో - యని ఈ ఋషుల (గోత్రముల వారల)కు ఖిలిథీలి విశ్వామిత్రుడు విద్యుడు అను మువ్వురును ప్రవర ఋషులు; ఈ గోత్రములవారు పరస్పరము ఇచ్చి పుచ్చుకొనరాదు

ఈ విశ్వామిత్ర గోత్రజులగు ద్విజ ఋషుల నామములను స్మరించినను నరుడు సకల పాపముక్తుడగును

ఇది శ్రీమత్స్యమహాపురాణమున విశ్వామిత్ర గోత్ర ప్రవరాను కీర్తనమను నూట తొంబది ఏడవ అధ్యాయము