మత్స్య మహా పురాణము
146 - తారకాసుర ఉత్పత్తి
బ్రహ్మ పలికిన ఈ మాటలు విని వజ్రాంగుడు దైత్యు డయ్యు తపోవంతుడు కావున బ్రహ్మ తన నోటితో పలికిన మాట (అర్థము)ను హృదయమున ఆలోచించుచు ప్రాంజలియై ఇట్లనేసు: మీ ఆజ్ఞచే సమాధినుండి లేచిన నాకు నా భార్య బెదరించబడి దీనురాలయి చెట్టు క్రింద ఏడ్చుచు కనబడెను॥ నేను బాధనొందుచున్న చిత్తముతో ఆమెతో ఇట్లంటినిః “పిరికిదానా! ఇట్లు ఏలయున్నావు? ఏదియో (చేయరానిది) చేయదలచియున్నావు॥ అది ఏ మో చెప్పుము॥" దేవా! వాచస్పతీ! నేనిట్లడుగగా భీతురాలయి యున్న ఆ సుందరి మనోహరాక్షరములతో హేతుయుక్తముగా ఈ వాక్యమును పలికెను: రౌద్రుడగు దేవరాజు నాభర్త కనబడుట లేదు గదాయని నన్ను భయ పెట్టెను; అలక్ష్యముగా చూచెను; కొట్టెను; ఎన్నో విధముల పీడించేను॥ దుఃఖమునకు ఆంతు కనబడక ప్రాణములు వదల పూనియున్నాను॥ ఈ దుఃఖశోక మహాసముద్రము నుండి తరింపజేయు (తారకుడగు) కుమారుని ఇమ్ము॥ ఇట్లామె పలుక గా సంక్షోభము చేంది స్వర్గ వాసుల జయమునకు సమర్థుడగు కుమారుని ఆమెకు ఇచ్చుటకై ఘోర తపస్సాచరింతును॥
తారకాసురోత్పత్తిః॥
పద్మగర్భోద్భవుడు చతుర్ముఖుడునగు ఆదేవుడు ప్రసన్నుడై ఆదైత్యరాజవచనమునకు సమాధాన ముగా ఇట్లు పలికెను: నాయనా! నీవు తపస్సు చేయుట మానుము॥ దుస్తరమగు క్లేశమునందు ప్రవేశించకుము॥ దేవతా సువాసినుల ఆందములగు కొప్పులు వీడిపోవునట్లు చేయగల తారకుడను పుతుడు నీకు కలుగును॥ బ్రహ్మ ఇట్లు పలుకగా దైత్యనాథుడా వజ్రాంగుడు బ్రహ్మకు నమస్కరించి హరపూర్ణముఖుడై తన భార్యకడకు వచ్చి ఆమెనానంద పరచెను॥ ఆ దంపతులు కృతార్థులయి మోదముతో తమ యాశ్రమముసకు ఏగిరి; మహాసుందరియగు ఆవరాంగి వజ్రాంగుడు తన యందు నిలిపిన గర్భమును తాను నీటియందు తడియుచు నిండుగా వేయేండ్లు మో నేను॥ తరువాత వరాంగి కుమారుని కనెను॥ లోక భయంకరుడగు దైత్యేంద్రుడు (తారకుడు) జన్మించునపుడు సకల పృథ్వియు చలించెను॥ సముద్రములు కంపిల్లేను॥ పర్వతములు కదలెను॥ భయంకర వాయువులు వీచెను॥ మునీంద్రులు శాంతికై జప్యమంత్రములు జపించిరి; క్రూర మృగములును భయముతో కూతలు పెట్టెను॥ చంద్రసూర్యుల కాంతిత గ్లెను॥ దిశ లందు మంచు కమ్మెను॥ సర్వులగు అసురులును ఆసురాంగనలును ఆ బాలుడు జన్మించిన చోటికి సంతోషముతోవచ్చి హరా వేశ ముతో దానవాంగనలు నాట్యము చేసిరి॥ దానవులు మహోత్సవములు జరుపుకొనిరి॥ మహేంద్రాది దేవతల మనములు విషాదముతో నిండెను॥ వరాంగి తన సుతుని చూచి హరపూర్ణురాలయ్యెను॥ దేవేంద్రుని జయించుట పెద్దపనిగా॥ ఆమెకు అనిపించ లేదు॥ ఇదెంత పనిలేమ్మను కొనెను॥ పుట్టిన వెంటనే చండ విక్రముడగు ఆతార కుడు పృథి వినే ఎత్తి ఊప గలిగిన కుజంభ మహిషాదులగు అసురులచేత సర్వాసురమహారాజుగా అభి షేకింపబడెను॥ మునిసత్తములారా! ఆ తారకుడు తనకు మహారాజత్వము లభించగానే దానవ శేషుడు కావున అందులకు తగినయు క్తియుక్తమగు వచనమునిట్లు పలికెను:
ఇది శ్రీ మత్స్యమహాపురాణమున తార కోత్పత్తి కథనమను నూటనలువది యారవ అధ్యాయము॥
Summary of chapter 147 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya describes the climactic conclusion of the cosmic war. Raising His indestructible divine Śakti spear, glowing with the concentrated energy of Mahādeva and the universe, Bhagavān Kārttikeya hurled it at Tārakāsura. The Śakti spear pierced the chest of the demon king, destroying his invincibility and severing his life breath, causing his giant body to collapse like a shattered mountain.