మత్స్య మహా పురాణము
278 - కనక కామధేను దాన విధానము.
శ్రీమత్యుడు మనువునకు ఇట్లు చెప్పెను: భూపాలా ఇపుడిక షోడశ మహాదాన క్రమమునందలి కనక కామ ధేను దాన విధానమును వినుము; ఇది పరమమయినది-మానవులకు సర్వకామములను ఇచ్చునది-మహాపాతక నాశనమయి నది; తులాపురుష దానమందువలేనే ఇందును కుండములు మండపము వేదికలు లో కేజా వాహనము హోమము ఆధివాసనము జరుపవలయును; అల్ప ప్రక్రియయే నచో ఎక్కువమంది ఋత్విజులతో పనిలేక ఏకాగ్ని విధానమున ఆచార్యుడు ఒక్కడే సమాహితుడై ఆయా కార్యములు జరుపవలేను; మేలిమి బంగారుతో ఆవును దూడను చేయించవలయును; వేయి ఐదు వందలు. రెండు వందల ఏబది-పలముల బంగార ము దీనికే ఉపయోగించుట ఉత్తమ మధ్యమాధమ విధానములు; ఎంతో ఆశ క్తుడై నచో మూడు పలములకు తక్కువ కాని ఎంత బంగారుతోనే న ఇవి చేయించవచ్చును; వేదికయందు కృష్ణాజిన మును పరచి ప్రస్థ పరిమాణక గుడమును దాని పై నుంచి నూతన వస్త్రము దాని పై పరచి దానిపై మహార త్నా లంకృత మగు ఆ ధేను వత్సముల నుంచవలయును; ఆ దగ్గరలో ఎనిమిది పూర్ణ కుంభములు నానా ఫలములు అష్టాదశ ధాన్యములు ఎనిమిది చెరకు గడలు ఆసనము పాత్రలు పాలు పితుకుటకు రాగి పాత్రము రెండు పట్టు వస్త్రములు దీపములు ఛత్త ములు ఆభరణములు చామరములు కుండలములు ఘంటలు బంగరు కొమ్ముల సొమ్ములు వెండికాలి గిట్టలు సర్వ విధ రసములు పసుపు-అనేక పుష్ప ఫలములు నుంచవలయును; జీలకర్ర ధనియాలు చక్కెర (కలిపి చేసిన పొడి) ఉంచ వలేను; ఐదు వన్నెల వితాసక మును (మేలుకట్టును) అమర్చవలయును.
తరువాత మంగళ వేదధ్వనులతో యజమానుడు స్నానమాడి అగ్న్యాదికమును బ్రాహ్మణులను ధేనువత్సములను ప్రదక్షిణించి పూవులు దోసిట పట్టుకొని దర్భపాణియే గురువు చెప్పు మంత్రములతో ధేనువు నామంత్రించి తరువాత అవి విప్రునకు ఈయవలేను.
‘‘విశ్వేశ్వరివగు కామధేనూ! నీవు సర్వదేవ గణములకును గృహ భూతురాలవు; (నీయందు సకల దేవతలు నివసింతురు) గంగానదికిని సముద్రములకును పర్వతములకును నీవు అంగ (శరీర) భూతురాలవు; నిన్ను దానముచేయుట ఆయుధముగానే నాపాతక రాసులు ఖండితములు కాగా అత్యంతము ఉత్తమమగు ఆనందమును పొందుచున్నాను; ఇట్టి నిన్ను నమస్కరించుచున్నాను; యథేష్ట ఫల ప్రదాయినివి నీవుండగా ఈ భూలోకమునందలి ఏ మానవుడు దుఃఖములను పొందును? నీవు మా సంసార దుఃఖములను శమింపజేయుటకై మిక్కిలిగ ప్రయత్నింపుము; అట్లు ప్రయత్నింతువు; కామము లను తీర్తువు; కొవుననే నిన్ను దేవతలు కూడ కామధేనువు అనుచున్నారు.”
ఇట్లు ధేనువును ఆమంత్రించిన తరువాత యజమానుడు తాను ఆమంత్రించి ఆహ్వానించి) తెచ్చుకొన్న గుణశీల సమన్వితుడగు వి పునకు ఈ కనక కామధేనువును దానమీయ వలయును; దాని ఫలముగా నతడు దేవకన్యా గణములతో కూడి నవాడయి ఇంద్రాది దేవతలు కూడ ఆశ్రయింపగోరు శివ స్థానమును పొంది సుఖించును.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున షోడశ మహాదానాను కీర్తనమున కనక కామధేను ప్రదానీకమను రెండు వందల డెబ్బది ఎనిమిదవ అధ్యాయము.
Summary of chapter 278 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya expounds upon Hiraṇyakāmadhenu-dāna, the fourth Mahādāna featuring the donation of a symbolic mother cow and calf fashioned entirely from pure gold. Bhagavān Matsya specifies crafting the golden cow with horn tips plated in silver, hooves in bronze, udders adorned with pearls, and body draped in fine silk fabrics. The donor worships the golden Kāmadhenu as the physical embodiment of all celestial Deities and Goddess Earth, presenting the gift to a virtuous Vedic scholar, earning imperishable spiritual merit that liberates twenty-one generations of ancestors.