మత్స్య మహా పురాణము
103 - ప్రయాగమాహాత్మ్యా నువర్ణనమ్
మార్కండేయుడు యుధిష్ఠిరునకు ఇట్లు చెప్పెను: రాజా! ప్రయాగ మాహాత్మ్యము నింకను చెప్పెదను వినుము; దానిని విన్న చో నిస్సంశయముగ సర్వపాప వినిర్ముక్తు డగును. ఆ తీర్థ క్షేత్రము ఆర్తులు దరిద్రులు కార్యసిద్ధికై నిశ్చిత మగు సంకల్పము కలవారు మాత్రమే సేవింపదగునదియని చెప్పరాదు. వ్యాధితుడును దీనుడును వృద్ధుడును నైనను గంగాయమునల నడుమ ప్రయాగమందు ప్రాణ త్యాగ మొనర్చినచో అట్టివాడు దీపించు కాంచనమువలె ప్రకాశించుచు సర్వ రత్నమ య ములును నానా విధములగు జెండాలతో నిండినవియు ఉత్తమ శ్రీ పరివారితములు శుభలక్షణ యు క్షములు నగు సూర్య సదృశ తేజస్సంపన్న విమానముల పై సంచరించుచు స్వర్గమునగల గంధర్వాప్సరోజనము నడుమ క్రీడించుచుండు అనియు ఇహమున సక లేప్పితములను పొందుననియు ఋషిపుంగవులు చెప్పుచున్నారు. అట్టివాడు గీత వాద్య మధుర ధ్వనులు వినుచు నిద్ర మేల్కాంచును. మరల జన్మించవలయునను స్మృతి రానంతవరకు (తన మహాపుణ్య మున్నంత పరకు స్వర్గమున దేవపూజితుడై సుఖించును. ఆ పుణ్యము క్షీణించగనే స్వర్గమునుండి పరిభ్రష్టుడై సువర్ణ రత్న సమృద్ధమగు వంశమున జన్మించి అపుడును ఆ ప్రయాగ క్షేత్రమును స్మరించుచునే యుండును. దానిచే మరల నద్దానిని సేవించును. స్వదేశ మందో విదేశ మందో అడవియందో గృహమందో ఎచట నున్న ను ప్రయాగ స్మర •ముతో మృతినందు వాడు బ్రహ్మలోక ప్రాప్తుడగునని ఋషిపుంగవుల వచనము; సర్వకామములు పండువృక్షములును సువర్ణమయభూమియు కలిగి ఋషులునుమునులును సిద్దులును నుండు లోకమున వసించును. స్త్రీ సహస్ర పరివారిత మయి రమ్యమగు (స్వర్గ మందలి) శుభ మందాకినీ తటమున ఋషులతో కూడ నానందించును. సిద్దచారణ గంధర్వాది దేవతలచే పూజితు డగును. అనంత రము పుణ్య క్షయమున స్వర్గ పరిభ్రష్టుడయ్యును జంబూ ద్వీపాధిపతి యగును. తరువాతను మరల మరల పుణ్యకర్మము లనే స్మరించుచు ఆచరించుచు గుణవంతుడును విత్త సంపన్నుడును నగును; ఇది నిస్సంశయము.
మనోవాక్కాయ కర్మములను ధర్మమునందే నిలిపి గంగా యమునా నదీ ద్వయ మధ్యమున గోదాన మొనర్చిన వాడును స్వ(కామ్య) కర్మలందో దేవ పితృకార్యములందో ప్రయాగ స్మరణముతో స్వర్ణ మో మణులో ము తైములో ఇచ్చు వాడును ఆ తీర్థ ప్రభావమున తత్కర్మ సాఫల్యము నంది పుణ్యము నందును.
కావున ద్విజుడు దానములను ప్రతిగ్రహించుటలోను ఏమరుపాటు లేకుండవలెను. ప్రతియొక తీర్థమునందును పుణ్య క్షేత్రమునందును సర్వ నిమి త్తములందును ప్రతిగ్రహించరాదు. ప్రతి గ్రహించినను దానిని ప్రయాగ క్షేత్రమని భావించవలయును.
ప్రయాగలో శ్రోత్రియుడగు శుక్లవస్త్రధరుడును శాంతుడును ధర్మజుడును వేదపారంగతుడును నగు బ్రాహ్మ ణునకు బంగారు కొమ్ములు వెండి గిట్టలు పాలు పిదుకుటకు కంచుపాత కలిగి. సంధ్యాకాంతిగల పాడి కపిల గోవును. బహు మూల్యములగు వస్త్రములను వివిధ రత్న ములను యథావిధిగ దాన మొనర్చినవాడు - 'ఆ గో శరీరమున నున్న రోమములన్ని వేల సంవత్సరములు స్వర్గమున పూజితుడయి సుఖించును. అతడు మరల జన్మించిన చోటనే ఆ గోవును జన్మించును. తత్పుణ్యవశమున నాతడు ఎన్నడును నరక మును చూడనైన చూడడు. ఉత్తర కురుదేశములందు అనంత కాలముండి మోదము నందును.
సాధారణములగు వేలకొలది. గోవులను ఇచ్చుటకంటె పాడియావు నొక దానిని ప్రచూగలో ఇచ్చుట మేలు. అయొకటియే పు తందార భృత్యుల నందరను తరింపజేయును. కావున సర్వదానములను, పయస్వినీ పాడి)గోదానము ఉత్తమము. దుర్గమములును విషయములును ఘోరములును నగు మహాపాతకములు సంభవించినపుడును పాడియావే రక్షించును. కావున ద్విజోత్తమునకు పాడి కపిల గోవును (ప్రయాగలో) దానమీయవలెను.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున ప్రయాగ మాహాత్మ్య వర్ణ సమను నూట మూడవ అధ్యాయము.
Summary of chapter 104 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya glorifies the sublime spiritual essence of the Saṅgama, the divine confluence where Goddess Gaṅgā and Goddess Yamunā unite under the subtle presence of Goddess Sarasvatī. Bhagavān Matsya describes how bathing at this sacred tri-junction during auspicious astronomical conjunctions such as Makarasaṁkrānti wipes away even the most severe karmic transgressions. The text reveals that the divine water of the Saṅgama acts as the direct nectar of immortality, granting the bather supreme mental clarity, physical purity, and spiritual illumination. Those who offer devout prayers and perform daily rituals at the Saṅgama attain imperishable merit that remains intact even through periods of cosmic dissolution.