మత్స్య మహా పురాణము
218 - రాజు అపరీక్షితాన్న మును తినరాదు అనుట-తత్ పరీక్షా విధానము.
దుర్గమునందు ఉంచుకొనవలసిన రాజరక్ష రహస్యములు ఏవి? రోజు ఇట్టివి ఏవి ఏర్పాటు చేయించు కొనవల యును; తెలుపుమనిన మనువుతో మత్సుడిట్లు చెప్పెను; రాజా! శిరీషము ఉదుంబరము.శమి బీజపూరము - వీటిని నేతితో తడిపి పదునై దు దినములుంచి సేవించిన యెడల ఆకలిని తట్టుకోను శ కీకలుగునని పురాతనులు చెప్పిరి. క శేరు ఫలము లును క శేరు మూలములును చేర కువేళ్లు తామరతూడు దూర్వ వీటిని పాలతో నేతితో మండముచేసి మానకాలముంచి సేవించినచో శస్త్రఘాతము తగిలినవాడు చావకుండును; కల్మాష వేణువను వెదురుతో ఆగ్ని ని నిర్మించి దాని జ్వాలలను ఇంటిలో ఆపసవ్యముగా మూడు మారులు తిప్పినచో ఆ ఇంట ఇతరములగు అగ్నులు జ్వలించవు; ఇందు నండియమే లేదు; పాముల ఎముకల పొడిని ప్రత్తితోచేర్చి దాని పొగవేసినచో అచ్చటికి పాములు రావు; ఉన్న పాములు బయటకు పోవును; సముద్ర లవణము యవలు విద్యుద్దగమయిన మృత్తిక - ఇవి కలిపి పూసిన ఇంటికి ఆగ్ని భయముండదు; రాత్రింబవళ్లును . ముఖ్యముగా గాలి వీచునపుడును దుర్గమును అగ్ని నుండి రక్షించ వలయును; రాజును విషమునుండి రక్షించవలయును; దానికి యుక్తిని (ఉపాయమును) చేప్పెద; వినుము.
క్రీడార్థమయి రాజు మృగములను పక్షులను ఉంచుకొన వలెను; రాజు భుజించుటకు ముందుగా వీటియందును అగ్ని యందును ఆహార మును పరీక్షించవలయును; పరీక్షించని వస్త్రపుష్పాలంకార భోజనాచ్చాదనములలో వేనిని కాని తాకనైన తాకరాదు.
విషదిగ్దాన్నాది పరీక్షణోపాయా .
(పరీక్ష విధానము) విషము పెట్టినవాని నోరెండిపోవును; అతడు గాబరాతో చూచుచుండును; విషయుక్త పదార్థమును పరీక్షించుట ఆరంభించగానే దాని ఉత్తరీయము జారిపోవును; మనస్సు వికలమగును; స్తంభముల చాటున వాడు నకును; సిగ్గుపడును; తందర బిందరలాడును; నేలను గీయును; మేడ కదలించును; ముఖము తడవుకొనుచు తల గోకికొనును; వాని సహజ స్వభావమునకు విరుద్ధములుఅగు ఇం కెన్నెన్నో చేష్టలు చేయనారంభించును; ఈ మొదలగు చిహ్న ములను బట్టి పరీక్షించి విషము పెట్టిన వాడెవ్వడో నిర్ణయించవచ్చును; ఇట్లు విష సంసర్గము కలదే మో యని శంకించ బడిన యాహారమును త్వరితుడై మండెడు అగ్నిలో వేయవలెను; అది విషమిశ్రిత మేయైనచో చిటచిట ధ్వనితో మిగుల చిట్లుచు రూక్షమగు దుర్వాసనతో అది మండుచుండ ఇంద్రాయుధ సమాన వర్ణమగు పొగ వెడలును; ఆ పొగను సేవించుట (అనుభవించుట)చే ప్రాణికి శిరోరోగము కలుగును; సవిషాన్న మున ఈగలు వాలవు; వాలినను వెంటనే చనిపోవును; విషాన్న ము దృష్టి కి తగిలినచో చకోరపక్షి చూపు విర కి చెందినదగును; కోకిల స్వరము వికారమందును; హంస నడక తొట్రుపడును; తుమ్మెద రొదచేయును; క్రౌంచ పక్షికి మద మేక్కును; కోడి గట్టిగా కూయును; చిలుక భయ దుఃఖములతో అరచును; గోరువంక వమనము చేసికొనునును; చామీకర పక్షి ఆ స్థలము విడిచిపోవును; నీటి కోడి చనిపోవును; కోతికి మలమూత్రములు వెడలును; జీవ జీవక ము బడును; ముంగీసకు రోమములు నిక్క పొడుచును; జింక ఏడ్చును; నెమిలి సంతోషపడును.
Summary of chapter 219 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya presents the foundational principles of Daṇḍanīti, the science of criminal justice, legal jurisprudence, and proportional punishment. Bhagavān Matsya declares that Daṇḍa or justice, when administered impartially according to law, protects all subjects and preserves Dharma, whereas unchecked tyranny or lawlessness brings destruction. The text outlines judicial procedures, examination of witnesses, evaluation of evidence, and proportional penal measures ranging from verbal admonition and fines to banishment, ensuring that punishment fits the severity of the crime.