మత్స్య మహా పురాణము
283 - ధరాధాన విధానము.
శ్రీమత్యుడు మనువునకు ఇట్లు చెప్పెను : ఇపుడిక అను(అత్యు) త్తమమును మానవులకు ఆమంగల్య (అశుభ)మును నశింపజేయునదియు పాపక్షయకరమునగు ధరాదానవిధానమును తెలి పెదను. బంగరుతో జంబూ ద్వీపమును అనుకరించు (పోలిన) పృథివీ ప్రతిమను చేయించవలెను. దానియందు మర్యాదా (నాలుగు దిక్కులయందలి అవధి) పర్వతములును నడుమ మేరువును అష్టలోకపాలురును నవవర్షములును నదీ నదములును అంతమందు (చివరి హద్దుగా చుట్టును) సాగరమును నుండవలయును. ఈ పృథివీ ప్రతిమ మహారత్న సమాకీర్ణ (వ్యాప్త)మై అష్టవసు ద్వాదశాదిత్యై కాదశ రుద్ర సేవితమయి యుండవలెను. ఇది వేయియో ఐదువందలో మూడువందలో రెండువందలో ఒకవదయో పలముల బంగరుతోగాని ఐదు పలములకు పైగా ఎంత తూకపు బంగారుతోనే నను ఆశక్తుడయినను విచక్షణుడే చేయించవలయును; ఇదియెరిగీ తులాపురుషదానమందువలేనే లోకపాలావాహనమును ఋత్విజులను మండపమును సంభారములను భూషణములు వస్త్రములు మొదలగువానిని సమకూర్చుకొనవలయును; ఈ పృథ్వీప్రతిమను వేదియందు పరచిన కృష్ణాజినము పై తిలలయందుంచవలెను; దగ్గరలో ఆష్టాదశ ధాన్యములను లవణాది రస ద్రవ్యములను అష్టపూర్ణకలశములను పట్టు వితానకము (మేలుకట్టు)ను వివిధ ఫలములను రమ్యములగు ఆంశుకము (సన్నని మేలగు వస్త్రము)లను శ్రీఖండ శకలము మంచిగందపు కర్రముక్కలను ఉంచవలయును; ఇట్లన్ని యు అమర్చి ఈ ప్రతిమకు అధివాసనమును జరిపి తెల్లని వస్త్రములను పూవులనుదాల్చి సర్వాభరణభూషితుడై పుణ్యసమయమురాగానే దోసిటపూవులు తీసికొని ఈ ప్రతిమాదికమును ప్రదక్షిణించి ఈ మంత్రములనుచ్చరించవలయును :
“వసుంధరా! నమస్తే! సర్వదేవులకును నీవే భవనమవు. సర్వ భూతములకును ధాత్రి ధరించునది యు - తల్లియు పోషించునదియు)వి. కావున ఇట్టి నీవు మమ్ము రక్షించుము; వసువును. అనగా బంగారును.ధనమును - ఆందును. ఆతి నిర్మలమగు దానిని ధరింతువు గావున “వసుంధర' అనబడుచున్నావు; కావున మమ్ము నీవు భయముల నుండి మిక్కిలిగా కాపాడుము; అచలా! (కదలనిదానవగు ఓ భూమీ!)చతుర్ముఖుడు కూడ నీఅంతమును ఆందుకొనజాలడు; కొవుస అనంతయనబడు నీకు నమః; ఇట్టి దానవు కావున నీవు దయతో మమ్ము సంసారపు బురద నుండి కాపాడుము; గోవిందునీ యొద లక్ష్మియు శివునియొద్ద గౌరియు బ్రహ్మయొద్ద గాయత్రియు చంద్రుని యందలి వెన్నె లయు రవియందలి ప్రభ యు బృహస్పతియందలి బుద్దియు మునుల యందలి మేధయు నీవేయయి యున్నావు; విశ్వమంతటిని వ్యాపించియున్నావు కావున నీవు “విశ్వంభర' (విశ్వమంతట నిండి దానిని మోయునది-బిభర్తి) అనబడుచున్నావు; ధృతి-శాంతి క్షమ-క్షోణి పృథ్వి-వసుమతి-రన. ఈ మూర్తులతోనున్న దేవీ; సంసార సాగరమునుండి నన్ను కాపాడుము.”
Summary of chapter 283 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya expounds upon Dhānyaparvata-dāna, the ninth Mahādāna featuring a massive symbolic mountain constructed from thousands of maunds of various food grains like rice, wheat, barley, and sesame. Bhagavān Matsya describes arranging the grain mountain upon a clean platform, decorating its peaks with golden trees, silver streams, fruit baskets, and silk draperies. The donor worships the grain mountain as the embodiment of Goddess Annapūrṇā and Bhagavān Vishṇu, distributing the entire grain hoard to needy communities and scholars, earning freedom from hunger and poverty across all future lives.