మత్స్య మహా పురాణము
67 - గ్రహణ స్నాన విధి
మనువు మత్స్య నారాయణునిట్లు ప్రార్థించెను. చంద్ర సూర్యగ్రహణములు సంభవించినపుడు స్నానము చేయ వలయునని శాస్త్రము విధించుచున్నది కదా! దాని విధానమును. అందు వినియోగించవలసిన ద్రవ్యములను మంత్రములను మీనుండి వినగోరుచున్నాను. అనగా నారాయణుడతనికి ఇట్లు తేలిపేను:
ఏ రాశియందు గ్రహణము సంభవించునో ఆ రాశి నందు చేయవలసిన స్నానపు విధానమును మంత్రములను ద్రవ్యములను తెలి పెదను; వినుము. చంద్ర సూర్యగ్రహణములు జరుగబోవుచున్నవి అనగా ముందుగానే బ్రాహ్మణులచే స్వ స్త్రీ వాచనమును జరిపించుకొనవలయును. నలుగురు బ్రాహ్మణులను లెస్సగా శుక్ల వస్త్రములతో శుక్ల గంధ ద్రవ్యము లతో సంపూజించవలయును. గ్రహణమునకు ముందుగానే దర్బాధికమగు ఓషధులను సంపాదించుకొనవలయును. రంధములు లేని నాలుగు కడవలను నాలుగు సముద్రములను వలె నాలుగు చోట్ల వేరువేరుగా నిలుపవలెను. రథములు అశ్వములు గజములు గోవులు నిలుచు తావులనుండియు పుట్టలు నదీ ద్వయ సంగమ నదీ సాగర సంగమ ప్రదేశముల నుండియు పెద్ద ప్రదములనుండియు రాజద్వార ప్రదేశములనుండియు మట్టిని తెచ్చి వాటియందు వేయవలెను. పంచ గవ్యములను మంచి ముత్తెములను గోరోచనమును పద్మములను శంఖములను పంచరత్న ములను స్పటికమును తెల్ల చంద నమును తీర్థ జలములను తెల్ల ఆవాలను ఏనుగ దంతమును కలువపూలను వట్టి వేళ్ళను గుగ్గిలమును కూడ వాని యందు వేయవలయును. పిమ్మట ఈ మంత్రము లతో ఆయా దేవతలను ఆ నాలుగు కడవలలోనికి ఆవాహనము చేయ వలయును. (వచ్చి వాటియందు నిలువవలసినదిగా పిలువవలయును.)
అన్ని సముద్రములును నదులును తీర్థములును మేఘములును నదములును ఈ యజమానునకు దురితమును నశింపజేయుట కై ఈ కలశములలోనికి వచ్చు గాక ! వజ్రధరుడు ఆదిత్యులకు ప్రభువు సహస్రనయనుడు అగు ఇంద్రుడు గ్రహపీడను పోగొట్టుగాక ! సర్వదేవతలకు ముఖము వంటివాడు అమిత ప్రకాశము కలవాడు అగు అగ్ని చంద్ర గ్రహణము వలన కలిగిన పీడను పోగొట్టుగాక ! ప్రాణుల కర్మలకు సాక్షి మహిష వాహనుడు ధర్మదేవుడు ఆగు యముడు చంద్రగ్రహణము వలన కలిగిన పీడను తొలగించుగాక ! రాక్షస గణాధిపతియు సాక్షాత్ ప్రళయాగ్ని వంటి వాడు ఖడ్గహస్తుడు అతి భయంకరుడు అగు నిరృతి గ్రహ బాధను తొలగించుగాక! ఖడ్గ పాశధరుడు మకర వాహనుడు జలాధిపతియగు వరుణుడు చంద్రగ్రహణ గ్రహపీడను తొలగించుగాక! ప్రాణరూపుడై యుండి లోకములను రక్షించు వాడు కృష్ణమృగము (నల్లని లేడి)యందు ప్రీతి కలవాడునగు వాయువు చంద్రగ్రహణముచే కలిగిన గ్రహపీడను పోగొట్టు గాక! నిధిపతియు ఖడ్గశూల గదాధరుడునగు కుబేరుడు చంద్రగ్రహణము వలన కలిగిన గ్రహపీడను పోగొట్టుగాక ! చంద్రధరుడు పినాక ధారి వృషభ వాహనుడు అగు శంకరుడు చంద్రగ్రహణ పాపముల నశింపజేయు గాక! త్రిలోకముల యందున్న స్థిరచర భూతములు బ్రహ్మ విష్ణు సూర్యాది దేవతలు అందరును గ్రహణ పాపములమ పోగొట్టుగాక !
ఈ విధముగా పూర్ణముగా మంత్రింపబడిన సర్వగుణ సమన్వితములగు కుంభములలోను ఋగ్యజుస్సామ మంత్రములతోను స్నానము చేయించుకొని యజమానుడు తెల్లని పూవులతోను తెల్లని సుగంధములతోను వస్త్రదాన గోదానములతోను బ్రాహ్మణులను ఇష్ట దేవతలను పూజించవలయును.
తరువాత ఈ మంత్రములనే (వత్రముల పై) వ్రాసి కరక (గరిగ) యందుంచి వాటితోపాటు బంగారును. రత్నములను చేర్చి యజమానుని వస్త్ర ఖండమునందు కానీ పట్టముమీద (జంపకానావంటి దానిమీద) కాని ఆకడవలతో కూడ యజమానుని కూర్చుండ పెట్టుదురు. తరువాత ఆ మంత్రలేఖనములతో కూడిన గరిగను యజమానుని తలమీద ఉంచుదురు.
తరువాత యజమానుడు ప్రాజ్ముఖుడై దేవతలను పూజించి నమస్కరించుచు చంద్రగ్రహణ కాలమునంతటిని గడపును.
చంద్రగ్రహణము విడిచిన తరువాత గోదానము అనేడు శుభమును ( కేశ ఖండనమును) జరిపించుకొనవలెను. స్నానము చేసియున్న బ్రాహ్మణునకు తానంతవరకు కూర్చుండియున్న వస్త్రమును. ఈయవలెను.
ఈ విధానము ననుసరించి గ్రహణ స్నానము చేసిన వానికి గ్రహపీడ కలుగదు. వాని బంధుజనులకును. కీడు కలుగదు. ఉత్తమ శుద్దిని ఉత్తమమగు క్షేమారోగ్యములను పొందును.
సూర్య గ్రహణమునందు ఎల్లప్పుడును మంత్రములతోపాటు సూర్య నామములను కీర్తించవలెను. చంద్ర సూర్యోపరాగ (గ్రహణ)ములందు పద్మ రాగమును ప్రశ స్తమగు కపిలగోవును కూడ విత్త సంపన్నుడై నచో దానము చేయవచ్చును.
దీనిని చదివినను వినినను సర్వపాప విముక్తుడై శివలోక మునందు సుఖించును.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్ర సూర్యగ్రహణ స్నా నవిధి కథనము ఆను అరువది ఏడవ అధ్యాయము.
Summary of chapter 67 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya instructs King Vaivashvata Manu on the Arundhatī-Vrata, a holy vow observed by devout women to honor Arundhatī, the pristine consort of Maharshi Vashishṭha, who exemplifies supreme chastity and domestic virtue. Observed on the third lunar day of the bright fortnight, the practitioner maintains a strict fast, constructs a small altar, and worships Arundhatī along with Maharshi Vashishṭha and the Saptarshis using white flowers, sandalwood paste, and sacred threads. The devotee offers fruits and traditional sweets while praying for the longevity, health, and moral strength of her husband and family. The Lord asserts that performing this vow protects the household from discord, preserves family honor, and grants elevated spiritual realms alongside the celestial Saptarshis.