మత్స్య మహా పురాణము
32 - శర్మిష్ఠా దేవయానుల సంభాషణము యయాతికి శుకశాపము
ఎప్పుడును పవిత్రమగు చిరునవ్వుతో ఉం డెడి దేవయాని శర్మిష్ఠకు కుమారుడు కలిగెనని విని దుఃఖముతో ఆర్తురాలయి శర్మిష్ణ విషయము ఏమేమో ఆలోచించెను. తరువాత ఆమె శర్మిష్ట ఉన్న చోటికి పోయి ఆమెతో ఇట్లు పలి కేను. “చక్కని కనుబొమలుకల సుందరీ! నీవు కామ సుఖమునకు ఆసపడి ఎటువంటి పాపము చేసితివి!” శర్మిష్ణ: “ధర్మాత్ముడును వేదపారంగతుడును కోరిన వరము లేవయిన ఈయగలవాడును అగు ఋషియొకడు ఇక్కడకు వచ్చేను. నేనతనిని ధర్మమునకు విరుద్ధము కాని కోరికను వేడితిని. శుచిస్మితా! నేను న్యాయవిరుద్దమగు ఏకామపర మగు పనిని చేయుదానను కాను. ఆ ఋషివలననే నాకీ సంతానము కలిగినది. నేను నీకు సత్యమునే చెప్పుచున్నాను. నీవు నా ఈ మాటలనమ్మి నిర్మలమగు చిరునవ్వు నవ్వుము. )" దేవయాని: “చాల మంచిదే. నీవు భయపడకుము! ఇదే నిజ మయినచో ఆ బ్రాహ్మణుని విషయము నీకు బాగుగ తెలిసియున్న చో అతని గోత్రము నామము వంశము అంతయు వినగోరుచున్నాను.” శర్మిష: “సూర్యునివలెఓజస్సు- తేజస్సు కలిగి ప్రకాశించుచుండుటచే ఆతనిని చూడగానే నేనతని నవి ఏవియు అడుగజాలకపోయితిని.” దేవయానీ: “ఇది ఇంతేయైనచో శర్మిష్ణా! నీ మొదటి సంతానము వర్ణమున ! శ్రేష్టుడగు బ్రాహ్మణుని వలననే కలిగినది అనుచున్నావు కనుక నాకు కోపము ఉండదు.”
శర్మిష్ణా దేవయానులు ఇట్లు మాటలాడుకొని ఒక రిని చూచి మరొకరు నవ్వుకొనిరి. శర్మిష్ఠ మాటలు నిజమే యను నమ్మిక తో దేవయానియును తన గృహమునకు పోయేను.
ఇట్లు యయాతికి దేవయానియందు ఇంద్రుడు విష్ణువువంటి యదుతుర్వసు లను ఇరువురు కుమారులు కలిగిరి. శర్మిష్టకు యయాతివలన ద్రుహ్యువు అసువు పూరుడు అను ముగ్గురు కుమారులు కలిగిరి.
తరువాత ఒకానొక కాలమున శుచిస్మిత యగు దేవయాని యయాతితో కలిసి ఏకాంతోద్యాసమునకు పోయెను. ఆమెకు అచ్చట దేవరూపులగు కుమారులు ముగ్గురు కనబడిరి. వారు శుచులును శుదులునై యుండిరి. ఆడు కొనుచుండిరి. వారిని చూచి ఆశ్చర్యపడుచు దేవయాని (యాతీతో ఇట్లనెను. "రాజా! ఈ కుమారు లెవ్వరివారు? వీరు దేవకుమారులవలె చక్కగా ప్రకాశించుచున్నారు. వర్చస్సులోను రూపమునందును నిన్ను పోలియున్నారు.” ఇట్లు రాజు నడిగినపిమ్మట దేవ యాని ఆ కుమారులనే ఇట్లడిగేను: “మీ పేరులేమి? గో "ము ఏమి? ఎవరి కుమారులు? మీరు పండితులు అన్ని విష యములు బాగుగా ఎరిగినవారు. నేనిది యంతయు వినగోరుచున్నారు. ఉన్నది ఉన్నట్లు వివరించి చెప్పుడు.”
ఆ బాలురు తమ చూపుడు వేలితో ఆ రాజస త్తమునే చూపిరి. శర్మిష్ఠ మా అమ్మ అనియు వారా దేవయానితో చెప్పిరి.
ఇట్లు పలికి వారందరును రాజు కడకు పోయిరి. కాని తాను దేవయాని ఎదుట ఉండుటచే అతడు వారిని ప్రీతితో అభినందించలేదు. ముద్దు చేయలేదు.) ఆందుచే అపుడా బాలురు ఏడ్చుచు శర్మిష్ఠ కడకు పోయిరి. బాలుర మాటలు విని ఏడుపు విని రాజు సిగ్గుపడిన వాడువలె అయ్యెను. ఆ బాలురకు రాజు విషయమున గల ప్రత్యయము (విశ్వాసము-తి) చూచి పొ స్తవ స్థితిని గుర్తించి దేవయాని శర్మిష్ఠతో ఇట్లు పలికెను: “నీవు నా అధీనమందుండుదాన వయి కూడ నాకు ప్రీతికరము కాని పనిని చేసితి వేల? నీవు నీ స్వాభావికమగు ఆసుర ధర్మమునే ఆశ్రయించియున్నావు. . కాని నాకు భయపడుచున్నా వు కావు.” శర్మిష్ఠ: "చారుహాసినీ! 'ఋషి' అని నీతో నేను చెప్పినది నిజమే. న్యాయమును ధర్మ మును అనుసరించి నడుచుచున్నాను కావున నేను నీకు భయపడుటలేదు. నీవు భర్తను వరించినపుడే నేనును వరించి తిని. స్త్రీకి తన సఖీ భర్త తనకును భర్తయగును. నీవు నాకు పూజ్యవు-మానవు-జ్యేష్ఠురాలవు -బ్రాహ్మణివి. ఈ రాజర్షి నీకం టెను నాకు పూజ్యతముడు. నీకీ మాత్రము తెలియదా?”
శర్మిష్ఠ చెప్పినది విని దేవయాని ఇట్లు పలి కెను: ”రాజా! నీవు నాకు ప్రీతికరము కాని పని చేసితివి. నేను ఇక ఇక్కడ ఉండను.” అని చటున లేచి ఆ సుందరి కన్నీరు కార్చుచు శుక్రుని దగ్గరకు పోవుటకై బయలుదేరెను. అది చూచి యయాతి మనస్సులో వ్యథనొందెను. వెంటనే అతడును కళవళ పడుచు ఆమెను బ్రతిమాలుచు. ఆమె వెంటనే పోవసాగెను. దేవయాని వెనుకకు మరలలేదు. క్రోధముతో ఎర్రనే న కన్నులతో కన్నీరు కార్చుచు త్రోవలో రాజుతో ఏమియు మారుపలుకక త్వరితముగా కావ్యుడగు ఉశనసుని (శుక్రుని కడకు చేరెను. ఆమె తండ్రిని దర్శించుచునే అతనికి అభివాద నము చేసి అతని ఎదుట నిలువబడెను. తరువాత వెంటనే యయాతియును భార్గవుని నమస్కరించెను. దేవయాని: “అధర్మము ధర్మమును జయించినది. క్రిందు మీదు-మీదు క్రిందు ఐనది. వృషపర్వుని కూతురు శర్మిష్ఠ నన్ను వెనుకకు నెట్టివేసినది. ఈ యయాతిరాజువలన ఆమెకు ముగ్గురు కుమారులు కలిగినారు. దుర్భగను ( పెనిమిటి అనురాగమునకు నోచుకోననిదానను) అగు నాకు ఇద్దరు కొడుకులు మాత్రమే కలిగినారు. తండ్రీ! నామాట నిజము. భృగు వంశ శ్రేష్ఠుడవు నీవు. ఈ రోజు కూడ ధర్మజ్ఞుడు అని ప్రసిద్ధి పొందినవాడేక దా! తాను ఆట్టివాడయ్యు ఇంతటి నీకు అల్లుడయ్యును. ఇతడు మర్యాదను అతిక్రమించినాడు. అని నీకు చెప్పవలసివచ్చు చున్నది."
శుక్రుడు: “మహారాజా! నీవు ధర్మజ్ఞుడవు అయి ఉండియు అధర్మము పై ప్రీతి చూపినావు. కావున త్వరలో నిన్ను ముసలితనము బాధించును. నీవు అభిమానవంతుడవు కదా! దీని కిదే దండనము.” యయాతీ: “భగవన్! నేను సత్యమునందే మనస్సు నిలిపియుండువాడను. నిజము నే చెప్పుచున్నాను. దానవేంద్రుని కూతురు ఋతుఫలమును కోరగా నేను చేసిన ఈ పని ధర్మమే కాని అధర్మము కాదు. 'ఋతు ఫలము ఇమ్మని కోరుచు తానై వచ్చి వరించగా దానిని ఈయని పురుషునకు భ్రూణహత్యా దోషము అంటును.' అని వేదతత్వ వేత్తలు (మీవంటి వారే చెప్పుదురుక దా! (భ్రూణుడు - షడంగములతో కూడ వేదమును అధ్యయనము చేసిన వాడు). “ఋతుఫలమును కోరినదియును ప్రీతికరముగ ప్రవర్తించు నదియు పొందదగినదియు అగు శ్రీ ఏకాంతమున తను కోరగా ఆమెను పొందనివాడు భ్రూణహత్యా దోషము పొందు' నని ధర్మశాస్త్రములలో పండితులు చెప్పియున్నారు. భృగువంశ శేషా! ఈ మొదలగు హేతువులను బాగుగా పరిశీలించి ఆలోచించి అధర్మమునకు భయపడి నేను శర్మిష్ణతో కూడితిని.” శుకుడు: “రాజా! నీవు నా అధీనములోనివాడవు కదా! నా విషయము నీవు ఆలోచించనక్కర లేదా? ధర్మ లోపము చేసినవాడు. పతితు డగును. అను మాట నిజమే. కాని నీవు మిథ్యా ధర్మమును అనుష్ఠించువాడవు. నీకు ప్రియమయిన పని చేసి దానిని ధర్మమనీ పైకి చూపుచున్నావు.) మనస్సులో ఒకటి పెట్టుకొని చేసిన పనిని పైకి మరి ఒకటిగా చూపుచున్నావు. కనుక నీవు దొంగతనము చేసినవాడ వై నావు.”
నహుష పుత్రుడు యయాతి క్రుద్దుడైన శుక్రుని వలన ఈవిధముగా శాపము పొందినాడు. వెంటనే అతనికి మొదటి వయస్సుపోయి ముసలితనము కమ్మినది. యయాతి! “భృగూద్వహా! నేను ఈ దేవయాని విషయములో యావన సుఖములను పొందుటలో నాకు ఇంకను తృప్తి కలుగలేదు. నన్ను అనుగ్రహించుడు. ఈ ముసలితనము నన్ను క్రమ్మ కుండునట్లు దయ చూపుడు.” శుకై కుడు: “నేను పలికిన మాట వ్యర్థము కాదు. రాజా! ఈ జర నిన్ను కమ్మనే కమ్మినది. ఇష్టపడిన మరొక నికి ఇది నీవు సంక్రమింపచేయవచ్చును.” యయాతి: “బ్రాహ్మణోత్తమా! నాకు తన యౌవనమును ఇచ్చిన కుమారుడు నా రాజ్యమునకును పుణ్యమునకును కీర్తికిని పాత్రుడు అగునట్లు తాము అనుమతించ వేడుచున్నాను.”
శుక్రుడు: “నహుషాత్మజా! నీ ఇష్టము వచ్చినవానికి ఎవ్వనికై నను నీవార్ధకమును సంక్రమింపజేయవచ్చును. భావములో నన్ను నిలుపుకొని నీవు ఈ పని చేసినచో నీకు ఏపాపమును అంటదు. నీకు యౌవనము ఇచ్చిన కుమారుడే రాజ్యమునకు అధికారియును అయుష్మంతుడును కీర్తిమంతుడును బహుసంతతిమంతుడును అగును."
ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశానువర్ణనమున యయాతి చరితమున శర్మిష్ఠా దేవయానీ సంవాదము యయాతికి శుక్ర శాపము అను ముప్పది రెండవ అధ్యాయము.
Summary of chapter 32 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya details Devayānī's intense anger upon discovering King Yayāti's secret fatherhood of Śarmishṭhā's sons. Feeling betrayed, she immediately fled to her father Śukrāchārya's hermitage and reported the violation of his solemn pledge. Enraged by the dishonor done to his daughter, Śukrāchārya cursed King Yayāti to be instantly afflicted with decrepit old age, loss of physical beauty, and bodily weakness. Shocked by the sudden decay of his youthful form, King Yayāti begged for forgiveness, explaining that he had acted out of fear of committing a sin by refusing a woman's plea for motherhood during her fertile period. Softening slightly, Śukrāchārya modified his curse, granting King Yayāti the power to transfer his old age to any of his sons willing to exchange their youth with him.