మత్స్య మహా పురాణము
259 - అర్ధనారీశ్వరాది ప్రతిమలక్షణములు:
సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: ఇపుడు శ్రేష్టమగు అర్ధనారీశ్వరుని మూర్తిని వివరింతును; దేవ దేవుని ఆర్ద భాగముతో ఏర్పడి మిగుల శోభించు నారీరూపమిది; ఈ మూర్తియందు ఈశునికి చెందిన ఆర్థ భాగమందు బాలేందుకలతో కూడిన జటాభాగముండును; ఉమార్గమునందు సీమంతమును తిలక మును ఉంచవలయును; దక్షిణ కర్ణమందు వాసుకిని వామకర్ణమునందు కుండలమునుగానీ త్రిశూలమునుగాని వామహస్తమందు దర్పణమును ఉంచవలయును; కేయూర ములతో వలయుములతో కూడిన వామబాహువును మణి ముక్తామ్యమగు యజ్ఞోపవీతమును హమార్గమందు పీనమగు స్తనమును అమర్చవలయును; ఆపై ఎడమవైపున ఉజ్వలమగు హారార్ధమును నగము లావగు పిరుదును నిర్మించవలయును; కుడి వై పున ఊర్ద్వముఖమగు లింగార్దమును వ్యాఘజిన వస్త్రమును వామాంశ మందు వ్రేలాడు కట్టువస్త్రమును (చీరను కటి సూత్రత్రయమును చేయవలయును; అందే నానా రత్న సము పేతహార ముండగా దక్షిణమందు భుజగహారముండును; దేవుని దక్షిణపాదము వద్మము పైనుండగా ఎడమపాదము మాత్రము కొంచెము భాగము నూపురముతో భూషితమయియుండును; వామాంగుళులయందు రత్న విభూషితాంగుళీయక ములుండవలయును; వామపాదము లత్తుకరసముతో ఆలంకృతమయి యుండును; ఇది ఆర్ధ నారీశ్వర రూపము.
శివనారాయణ ప్రతిమలక్షణమ్- ఉమా మహేశ్వర ప్రతిమాలక్షణము.
ద్వీజులారా! ఉమా మహేశ్వర ప్రతిమలక్షణమును తెలి పెదను వినుడు; లీలాలలితవిభ్రమయుక్తమగు పార్వతీ పరమేశ్వరుల ఉనికి ఆ మూర్తియందు ఎట్లుండునో చెప్పెదను; ఈ శివుడు చతుర్భుజుడుగాని ద్విబాహుడుగాని కావచ్చును; జటాభారము ఇందుఖండాలంకరణము లోచన తయము ఉండును; ఉమాన్కంధమందుంచిన ఏకపొణియు కుడి చేత శూలమును కలువపూవును ఉండగా ఎడమ చేయి పార్వతీ స్తనమును స్పృశించుచుండును; వ్యాఘ్ర చర్మ వస్త్రము నానారత్నోపవీతము కలిగి మంచినిలుకడయు చక్కని వేషమును అర్థందు సమలంకృత వదనమును ఉండును; అతని ఎడమ తొడ యందు దేవి అతని ఎడమబాహువుతో ఆలింగితురాలై ఉండును; ఆమె శిరోభూషణములతో కూడిన ముంగురు లతో అందమగు ముఖము కలిగి ఎపులందు దావీలీలు లలాటమం దు తిలకము కలిగి ప్రకాశించుచు మణికుండలములును కొన్ని ఎడల మణికర్ణిక లును ధరించి అనేక హార కేయూర ములును కలిగి శివుని ముఖమవలోకించుచుండును; ఆమే దేవ దేవునిఎడమభుజమును విలాసముగా స్పృశించుచు తన దక్షిణ బాహువును కుడి వైపుగా బయటకు వదలిఉండును. కొన్ని విగ్ర హములందు దక్ష్మిణ బాహువును శివుని స్కంధమందుగాని కుక్షి దక్షిణ పార్శ్వమందుగాని ఉంచీ ఎడమచేతియందు దర్పణ మునుగానీ సుశోభనమగు కలువనుగానీ దాల్చియుండును! ముప్పేటక టీ సూత్రము పిరుదుల మీదినుండి వేలాడుచుండును; తోరణమునందు రెండు పొర్శ్వములందును జయవిజయులు కార్తికేయ వినాయకులు గణపతులు గుహ్యకులు పంక్తులుగా విద్యాధరులు వీణాధా రేణులగు అప్సరసలు ప్రదర్శింపబడవలయును; ఇట్లు ఉమా మహేశ్వర మూర్తిని నిర్మించుట శుభ కరము; ఇక సర్వపాప ప్రణాశనమగు శివనారాయణ రూపమును వివరింతును.
మహావరాహ ప్రతిమాలక్షణమ్
నారసింహ ప్రతిమలక్షణమ్.
శివ నారాయణ ప్రతిమాలక్షణము.
ఈమూర్తియందు వామార్ధమందు మాధవుడును దక్షిణార్ధమునందు శూలపాణీయు నుండును; కృష్ణుని బాహు ద్వయమునకు మణి కేయూరములు భూషణములు; శంఖ చక్రములు హస్తద్వయమందుండును; ఆ శ్రమూర్తి; అంగుళులు కొంచెమేర్రనివి; కృష్ణుని (గదాధారి) పాణియందు చక్రమునకు మారుగ గదనైన నుంచవచ్చును: కటివామార్గము భూషణములతో ఉజ్వలమును పీతాంబగయు క్షమునగును; చరణములందు మణిభూషణములు; ఇక దక్షిణార్ధమందు జటా భారమును అర్ధచంద్రాలంకరణమును భుజంగహారవలయమును వరద దక్షిణహస్తమును త్రిశూలహస్తమును సర్పయజ్ఞోప వీతమును కటియందు (దక్షిణార్ధమున) చర్మాంబర మును మణిరత్నములతోను నాగముతోను విభూషితమగు పాదమును నుండును. శివనారాయణమూర్తి ఇట్లుండును.
మహా వరాహ ప్రతిమలక్షణము.
మహా వరాహమూర్తిని వివరింతును: ఇతడు పద్మహస్తుడు.గదాధరుడు; తీక్షములగు కోరలును ఉగ్రమగు ము యైయు ముఖమును కలిగి ఎడమ మోచేయి భూదేవి పైనుంచును; ఆమెను తన కొనకోరతో పైకెత్తుచుండును; ఆమె జితేంద్రియయై చేతులందు కలువలు కలిగి విన్మయములో కన్నులు వికసించి పైభాగమందుండునట్లు నిర్మించవలెను; ఆమె కుడి చేయి తనక టి పైనుండును; అతనిని చుట్టునున్న లోకపాలురు స్తుతించుచుందురు.
నారసింహ ప్రతిమా లక్షణమ్.
నరసింహమూర్తికి ఎనిమిది భుజములు; రౌద్రమూర్తి; సింహముఖము; విప్పారిన ముఖ మును కన్నులును; నిక్క పొడిచి బలిసియున్న జూలును నిక్కపొడిచిన చేవులును; హిరణ్యకశిపుని చీల్చుచుండును; ఆ దానవుని ప్రేవులు బయటికి వచ్చుచుండును; వాడు నెత్తురు కక్కుచు కనుబొమలముడితో కూడిన ముఖమును కన్నులును కలిగియుండును; కొన్ని మూర్తులందు వాడు యుద్ధమునందు కరణ బంధములతో యుద్ధము చేయుచున్న ట్లుండును; ఆ దైత్యుడు ఆలసి మాటి మాటికి నరసింహుని బెదరించుచుండును: వాని చేతులందు ఖడ్గమును ఖేటక మునుండును; ఆ దేవుని అమర శ్రేష్ఠులు పొగడుచుందురు.
త్రివిక్రమ ప్రతిమాలక్షణమ్.
బ్రహ్మ ప్రతిమాలక్షణమ్.
త్రివిక్రమ ప్రతిమలక్షణము.
త్రివిక్రమమూర్తి బ్రహ్మాండములను ఆక్రమించుచు తీవ్ర రూపముతో నుండును; అతడు తన ఎత్తిన పొద మును ఒక బాహువుతో పట్టుకొనియుండును; అందే క్రింది భాగమందు ఎడమచేత కమండలువు ధరించిన వామనుని నిర్మించవలయును; అతనిచేత చిన్న గొడుగుండును; అతడు దీనముఖుడు; ఆతని పార్శ్వమందు జలధృంగారము ధరించి బలి యుండును; ఈదేవుడు ఆబలిని బంధించుచుండును; ఆతని దగ్గర నే గరుడుడుండును.
మత్స్యకూర్మ ప్రతీమాలక్షణములు.
మత్స్యని మత్స్యరూపముతో కూర్ముని కూర్మ రూపముతో నిర్మించవలయును; భగవానుడును నారాయణుడును నగు హరిరూపములిట్లుండును.
బ్రహ్మ ప్రతిమాలక్షణము.
బ్రహ్మ కమండలు ధరుడు; చతుర్ముఖుడు; హంసారూఢుడు: లేదా కమలాసనుడు; తామరపూవు లోపలి కాంతితో నుండు దేహచ్చాయ; చతుర్బాహుడు; ఒప్పిదమగు కన్ను లవాడు; ఎడమ చేతియందు కమండలువు; కుడి చేతియందు సువముండును; మరియొక ఎడమచేత దండమును మరియొక కుడి చేతియందు సుక్కునుండును; అన్ని వైపుల నిలిచి దేవతలు గంధర్వులు మునులు నిత నిని స్తుతించుచుందురు; ఇతడు త్రిలోక ములను సృజించుచుండును; శుక్ల వస్త్రధరుడు; విభుడు; మృగ చర్మధారియైన కావచ్చును; దివ్య యజ్ఞోప వీతి; దగ్గర ఆజ్యస్థాలి.నాలు వేదములు నుండును; ఎడమవై పునందు సావిత్రి కుడివైపున సరస్వతియుందురు; ముందు ఋషులుందురు.
కార్తికేయ ప్రతిమాలక్షణము.
కార్తికేయుడు (కుమారస్వామి) బాల సూర్యునివలె కాంతి కలవాడు; కమలాంతర్భాగమువలె సుకుమార చ్ఛాయ గలవాడు; సుకుమారుడగు కుమారుడు; భుజములందు కేయూరములును హ సమునందు దండమునుండును; మయూర వాహనుడు; తన ఇచ్చానుసారము ఈ దేవుడే నగర (స్థాన) మందు ఉన్న ట్లయిన చూపవచ్చును: ఆపుడతడు ద్వొదశ భుజుడు; గూడేమునందున్నట్లు చూపినచో చతుర్భుజుడు; గ్రామమందో వనమందోయున్నట్లు చూపినచో ద్విబాహుడు; కుడివైపున శ క్తి-పాశము ఖడ్గము శరము శూలము వరదహస్తము కొని అభయ హస్తము కానీయుండును; ఎడమ చేతు లందు ధనువు-పతాక పిడికిలి చాచిన చూపుడు వేలు – ఖేటకము- కోడిపుంజు- ఇవి ద్వాదశ భుజునకు; ద్విభుజునకు దక్షిణ హస్తమునందు శ క్తియు ఎడమచేతియందు కోడిపుంజు నుండును; చతుర్భుజునకు ఎడమ చేతులందు శ క్తియు పాశమును కుడి చేతులందు ఖడమును వరదహస్తముకోని అభయ హస్తముకొని యుండును.
వినాయక ప్రతిమాలగణమ్.
కాత్యాయనీ ప్రతిమాలక్షణమ్.
ఇంద్రదప్రతిమాలక్షణమ్.
వినాయకమూర్తి లక్షణము.
వినాయకుడు గజముఖుడు- త్రిలోచనుడు-లంబోదరుడు.చతుర్భుజుడు సర్పయజ్ఞోపవీతధారి; చేటల వంటి చెవులు పేద్దతుండము ఏకదంతము పెద్దకడుపు కలవాడు; ఒక కుడి చేతియందు తన దంతమును రెండవ చేతియందు కలువ పూవును ధరించును. ఒక ఎడమ చేతియందు లడ్డులు (ఉండ్రాలు) రెండవదానియందు గండ్రగొడ్డటిని ధరించును; శరీరము చాల పెద్దదియగుటచే ముఖము చిన్న దీగా కనబడును; బలిసిన భుజమూలములు పాదములు చేతులు కలవాడు; ఋద్ధి బుద్ధి. అను భార్యలతో కూడినవాడు; క్రింది భాగమున ఎలుక యుండును.
కాత్యాయనీ ప్రతిమాలక్షణము.
ఈమె దశ భుజ; ఈ మెయందు (బ్రహ్మ విష్ణు రుద్ర) దేవతాత్రయ లక్షణములునుండును: ఈమె జటాజూటము ఆర్గ చంద్రుడు లోచనత్రయము పద్మేందు సదృశ ముఖము అవిసిపూవు చాయను పోలినయ చక్కని నిలుకడ చక్కని కన్నులు కలది; నవయౌవన సంపన్న -సర్వాభరణ భూషిత-మిగుల మనోహరములగు దంతములు కలది.పీవోన్నత స్తనయు క. త్రిభంగ స్థాన సంస్థానయుక్త (నితంబ భారముచే వేణీ భారముచే కలిగిన మూడు ఒయ్యారపు వంపులు కలది) మహిషాసుర మర్దినీ; కుడి చేతులందు త్రిశూల ఖడ్గచక్ర తీక్ష బాణ శక్తులును ఎడమ చేతులందు భేటక పూర్ణచాప పాశాంకుశములును ఘంటకాని గండ్రగొడ్డలి కానీ ఉండును! దిగువను రెండు తలలు కల మహిషమును శిర శ్చేదము కలిగిన ఖడ్గపాణియగు దానవుడు నుండును. వాని హృదయమున శూలము గ్రుచ్చబడియుండును. అడ్డముగా రక్తము స్రవించుచుండును. వాని శరీరావయవములన్నియు నెత్తుటితో ఎర్రనై విప్పారిన ఎర్రని కన్నులు కలిగి. నాగపాశ వేష్టితుడై భ్రుకుటి భీషణ ముఖుడై యుండును. రక్తము వెలికి వచ్చుచున్న నోటితో దేవీ వాహన సింహమును నిర్మించవలెను. దేవీ దక్షిణ పాదమా వాహనము పై సరి మట్టముగా నుంచబడియుండును. ఎడమ పొదము కొంచెముగ పైకెత్తి దాని బొటన వేలు. మహిషము పై నుండును. ఆమె రూపమును అమరులు స్తుతించుచుందురు.
ఇంద్ర ప్రతిమాలక్షణము.
ఇంద్రుడు సహస్రనయనుడై మత్త గజము పై నుండును. ఏళల వక్షో వద నయుతుడు. సింహమునకువలే మూపులు కలవాడు. మహాభుజుడు. కిరీట కుండలధరుడు. బలిసిన పెద్ద భుజములును పెద్ద కన్నులును కలవాడు. వజమును కలువపూవును ధరించినవాడు; సొనాభరణ భూషితుడు; దేవగంధర్వ పూజితుడు - అప్సరోగణ సేవితుడు; పార్శ్వములందు ఛత్త చామర ధారిణులగు స్త్రీలుందురు; లేదా సింహాసనగతుడు గంధర్వ గణ సేవితుడుగానైన ఇతని చూప వచ్చును; ఇతని ఎడమవైపున ఉత్పల ధారిణియగు ఇంద్రాణి (శచీదేవి) యుండును.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున అర్ధనారీశ్వరాది ప్రతిమాలక్షణమను రెండు వందల ఏబది తొమ్మిదవ అధ్యాయము.
Summary of chapter 259 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya details the exact iconographic specifications, physical postures, weapons, and divine attributes for sculpting icons of Bhagavān Vishṇu and His various manifestations. Bhagavān Matsya describes eight-armed, four-armed, and two-armed representations of Vishṇu holding the Conch, Discus, Mace, and Lotus, adorned with the Kaustubha gem, Shrīvatsa mark, and Vaijayantī garland, accompanied by Goddess Lakshmī and Goddess Bhūmi. The text provides distinct measurements for sculpted forms of the Avatāras including Varāha lifting Goddess Earth, Narasimha tearing open Hiraṇyakashipu, Vāmana holding the wooden umbrella, and Trivikrama striding across the worlds.