మత్స్య మహా పురాణము
44 - అర్జునం ప్రతి ద్విజరూపసూర్యాగమనమ్ - కార్తవీర్యార్జున కథా శేషము- క్రోష్టువంశ కథనము
ఋషులు సూతునిట్లు ప్రశ్నించిరి: కార్తవీర్యుడు ప్రజారక్షకుడని వినియుంటిమి. అటువంటివాడు విక్రమము చూపి మహాత్ముడగు భార్గవముని వనము నేల దహించెను?
సూతుడు ఋషులతో నిట్లు చెప్పనారంభించెను: ఆదిత్యుడు విప్రరూపమున కార్తవీర్యుని కడకువచ్చి “నేనాదిత్యు డను. నాకు తు పి కలిగించుము.' అని కోరెను. నీకు దేనిచేత పి కలుగును? నీ కెటి బోజనము కావలెనో తెలిసిన నది ఏర్పరతునని కార్తవీర్యుడన నాకు స్థావర రూపమగు ఆహారమునేదైన నిమ్ము. దానిచే తృప్తి కలుగునని ఆదిత్యుడు పలికెను. వేడిమినిచ్చు వారిలో శ్రేష్టుడవగు నీకు నమస్కారము. నా తపస్సుచే కాని బలముచే కాని స్థావర ములన్నిటిని కాల్చుట నాకు శక్యముకాదు. అని కార్తవీర్యుడన ఆదిత్యుడును నీ భ క్తికి నీ మాటకు సంతోషించితిని. అక్షయములును సర్వతో ముఖములును (ఎటయిన ప్రసరించునవి) అగు బాణములు నీకిత్తును. అవి నీవు యోగించినపుడు వానియందు నా తేజస్సు ప్రవేశించి అవి మండి వృషాదిక స్థావరముల నేండించును. వాటిని నేను భస్మముచేసి తృప్తి పొందుదు ననెను. తరువాత నాతడు తానన్న ట్లర్జునునకు శరములనిచ్చి వాటిమూలమున ఎండిన స్థావరములను కాల్చి వాటితోపాటు గ్రామములు ఆశ్రమములు పల్లేలు నగరములు రమ్యములగు తపోవనములు వనములు ఉపవనములు ఆయా తావులందలి పక్షులు మొదలగు అన్నింటిని కాల్చేను. సూర్యుని భయంకర తేజస్సుచే భూమి పై అతడు కాల్చినంత మేర) వృక్షములు కాని గడికాని లేకుండ నయ్యెను. ఈ కాలమునందే భార్గవుడను మహాఋషి ఆ ప్రదేశమునందలి నీటిలో నుండి తపస్సాచ రించుచుండెను. అతడు పదివేల యేండ్లు వ్రతము పూని తపస్సు చేసి అది ముగియగానే పైకి వచ్చి చూచెను. తన ఆశ్రమ మంతయు కార్తవీర్యుడు కాల్చెనని ఎరిగి క్రోధముపూని లోగడ చెప్పినట్లు ఆతనిని శపించెను.
ఇక క్రోష్టువంశము తెలి పెదను. దానియందన్ని తరములవారు ను త్తములు. ఆ వంశమందే వృష్టివంశ శ్రేష్ఠుడగు కృష్ణుడు జన్మించెను.
కోష్టునికి మహారథుడగు వృజినీవాన్. అతనికి మహాబలుడగు స్వాహుడు. అతనికి పురుష శ్రేష్టుడగు ఉషంగుడు అతనికి సార్థక నాముడగు చిత్రరధుడు -అతనికి వీరు డై వీపుల దక్షిణలతో యజ్ఞములు చేసిన శశిబిందుడును కలిగిరి. అతడు గొప్ప చక్రవర్తి. ఆతనిగూర్చి అనునది శ్లోకము ఈ యర్థమును ఇచ్చునది కలదు. 'శశిబిందునకు నూరునూరుమంది (10000) కుమారులు కలరు. వారందరు చెల 11.గాంసులు సుందరులు. అధికమగు ధనమును తేజస్సును కలవారు. అతి ప్రధానులగు ఆ శశిబిందు పుత్రులలో ముఖ్యులు.మహాబలుడగు పృథు సత్వుడు.పృథుశ్రవుడు - పృథుయశుడు - పృథు ధర్ముడు పృథుంజయుడు -పృథుకీ ర్తి-పృథుమనసుడు అనువారు. పృథుసత్వునకు ప్రజ్ఞుడు. అతనికి సుయజ్ఞుడు - అతనికి ఉశనుడు కలిగిరి. ఉశనుడు ఉత్తమ ధార్మికుడగు చక్రవర్తియై నూరశ్వమేధము లొనరించెను. అతనికి తితిక్షువు. అతనికి రాజర్షి శేష్టుడగు మరుంతుడు అతనికి కంబళ బర్హిషుడు-అతనికి రుక్మకవచుడు కలిగిరి. ఈతడు యుద్ధమున కవచధారు లగు శత్రులను ధనుర్ధరులను వివిధ బాణములతో చంపి భూమినంతటిని స్వాధీనము చేసికొని అదియంతయు ఒక యజ్ఞ ములో బ్రాహ్మణులకు దక్షిణగా ఇచ్చెను. అతనికి మహావీర్యులు మహాధనుర్ధ రులునగు రు క్మేషువు-పృథురుక్ముడు.జ్యామే ముడు-పరిఘుడు-హరి అను ఐదు మంది కుమారులు. వీరిలో పరిఘుని హరిని తండ్రి విదేశములకు పాలకులుగా పం పెను. రుక్మేషువు తండ్రి రాజ్యమునం దుండెను. పృథురుక్ముడు రు క్మేష నాశ్రయించి యుండెను. వారిచే రాజ్యము నుండి వెడల గొట్టబడి జ్యా మేఘుడు ప్రశాంతుడై ఒక యాశ్రమమందుండెను. ఒక బ్రాహ్మణుడు చేసిన బోధనము చే ఆతడు కేవలము జీవన వృత్తికై యుద్ధము చేయదలచి రథమునెక్కి ధనువును ధ్వజమును దాల్చి ఏకాకి నర్మదాతీర దేశమునకుపోయేను. అచ్చట ఋక్షవంతమను పర్వతము ఇతరుల అనుభవములో లేకుండుట చూచి అచ్చట నివాసము నేర్పరచుకొనెను. అతనికి గొడ్రాలగు శైబ్య అను పతివ్రత భార్య. ఐనను అతడు మరియొక పెండ్లి చేసికొనకుండెను. అతడు ఒక మారు యుద్ధములో ఒక సుందరియగు కన్యను గెలిచి తెచ్చెను. ఆమెను చూచీ శైబ్య ‘ఈ సులోచనయగు కన్య ఎవరు? భార్యగా చేసికొనదలచి తెచ్చితివా? నాకు కుమారులు లేరు కాచన ఈమే మనకు కోడలుగాజాలదు. నీకు మరియొక భార్యయు ఆమెకు కుమారులునులేరు. ఈమె మన కెట్లు కోడలగును? అనగా ఆతడు నీకు పుట్టబోవు కొడుకునకీ మే భార్యయగుననెను. అపుడామే ఉగ్రతపము చేసి జ్యో మేఘుని వలన విదర్బుడను కుమారునిక నేను. ఈ కన్య అతనికి భార్యయయ్యెను. విదర్భునకు ఈమెయందు క్రథుడు కైశికుడురోమపాదుడు అను ముగ్గురు కొడుకులు కలిగిరి. వీరిలో రోమపాదునకు మనువు అతనికి జ్ఞాతి కుమారులు. కైశికునకు బది అను వాడు కుమారుడు. అతని వంశము వారికి వైద్యులని పేరు. కథడను వానికి కుంతి అతనికి వృషుడు. అతనికి ధృష్ణుడు. అతనికి నివృత్తి. అతనికి విదూరథుడు. అతనికి విమలుడు. అతనికి భీమ రథుడు. అతనికి నవరథుడు. అతనికి దృఢరథుడు. అతనికి శకుని అతనికి కరంభుడు-అతనికి దేవరాతుడు. అతనికి దేవ క్షత్తుడు. అతనికి మధుడు అతనికి పురువసుడు - అతనికి పురుదాన్. అతనికి విదర్భరాజ పుత్తియగు భద్ర సేనియందు జంతుడు. అతనికి ఇక్ష్వాకురాజపుత్తియందు సాత్వతుడు కలిగిరి.
జ్యామేముని ఈ వంశవృద్ధిని వినినవాడు సంతానవృద్ధి కలిగి సోమునితో సాయుజ్యము పొందును.
సాత్వతునకు ఇగి-భజమానుడు.దిప్యుడు దేవావృధుడు-అంధకుడు.వృష్టి-మహాభోజుడు అను ఏడుగురు కుమారులు కలిరి. వారిలో నలుగురి వంశములు విస్తరిల్లినవి. సృంజయుడను రాజునకు ఇద్దరు కుమార్తెలుండిరి. వారిద్దరుసు భజ మానునకు భార్యలే రి. వారికి అనేకులు కుమారులు కలిగిరి. ఆ అక్కా చెల్లెండ్రలో ‘బాహ్యక' అను ఆమెకు జన్మించిన కుమారుల వంశము వారిని బాహ్యకులందురు. బాహ్యక కుమారులలో ముఖ్యులు నిమి-కృమిలుడు.వృష్టి - అనువారు. దేవావృదుడను రాజు బంధుమిత్రుల కానందము కలిగించువాడు. అతనికి సంతతి కలుగ కుండెను. సర్వగుణో పేతుడగు కుమారునిగోరి అతడు తమ తపస్సాచరించెను. అతడు ఆద్యమగు మంత్ర (ప్రణవమును అనుసంధానము చేయుచు పర్ణా నదీజలమును స్పృశించేను. (నదీ దేవతను అనుసంధానము చేయుచు జపించెను.) ఇట్లు నిరంతరమును ఉప స్పర్శనము చేయుచుండుట చేతను ఆరాజు శుభగుణములు కలవాడగుట చేతను ఆ నదీదేవత ప్రసన్నురాలై అతనికి ప్రియము ను సమకూర్చగో రెను. ఆ దేఐవృధుడును తన వలన అట్టి ఉత్తమ పుత్తుని కనగల శ్రీ యెవ్వరును లభించుట లేదే యని చింతిల్లుచుండుటచే అది ఎరిగి వర్ణాశా నదీ దేవత తానే అతని వలన సంతానవతి కాగోరెను. ఆమె సుందరియగు కన్యగాఅయి రా జునకు తను తాను తెలుపుకొనెను. రోజా మెయందు అనురాగము కలవాడయ్యెను. ఆ దంపతులను సర్వగుణ సంపన్నుడగు బభ్రుడను కుమారుడు కలిగేను.
మహాత్ములగు ఈ దేవావృధ బభ్రులనెడి తండ్రి కొడుకులగూర్చి పురాణములయందు అనువంశ గీతము ఇట్లు వినబడుచున్నది: 'దూరమునుండి వినుచున్న బ్లీ సమీపమునుండి చూచుచున్నాము. ఏమనినబభ్రువు మనుష్యులలో శ్రేష్టుడు. దేవావృధుడు దేవతలతో సమానుడు ఈ మహాత్ములుపదేశించిన యోగము సనుష్టించి పదునాలుగువేల అరువదియైదుమంది మోక్షము పొందిరి.' బభ్రుడు యజ్ఞములు దానములు చేసినవాడు. వీరుడు-తత్వజుడు-దృఢవ్రతుడు - రూపవంతుడు-మహాతేజశ్శాలి. శాస్త్రజ్ఞానము-వీరత్వము కలవాడు. అతనికి సురనాభుని కుమా ర్తెయందు కుకురుడు భజ మానుడు అగ్ని కంబళ బరీషుడు అను నలుగురు కుమారులు కలిగిరి. కుకురునకు వృష్టి. అతనికి ధృతి.అతనికి కపోత రోముడు. అతనికి తైత్తిరి. అతని దౌహిత్రుడే ఇంద్రునికి మిత్రుడు విద్వాంసుడునగు నలుడు. నందనోద్యానమునందలి దుందుభి అతని పేరుతోనే ఓ నలము' అను పేర ప్రసిద్దమయియున్నది. తైత్తి రి చేసిన యజ్ఞఫలముగా అభిజాతుడు అతని కొడుక య్యెను. అభిజాతుడు పుత్రార్థమే అశ్వమేధము చేసెను. ఆ యజ్ఞపు అతిరాత్ర దీక్షయందు సభ్యాగ్నిహోత్రుని నుండి విద్వాంసుడు కర్మజ్ఞుడు యజ్వయగు పునర్వసుడు జన్మించెను. అతనికి ఆహుకుడు ఆహుకి అను కవలు పుట్టిరి. వారిద్దరును బుద్ధిమంతులలో కెల్ల గొప్పవారు. ఆహుకుని గూర్చి వైదిక పురాణములందు పెద్దలు ఈ శ్లోకములు చెప్పుదురు. “అమ్ములపొదులు ధనువులు మొదలైన పరికరములు ధ్వజములు కవచములు మొదలగు సాధనములతో నిండినరథములు-ఘంటలు మొదలగువాని మనోహర ధ్వనులతో కూడినవి ఆహుకునకు పదివేలు గలవు. ఆహుకుని చేత పోషితులగు ఆయా విద్యావంతులు శిల్పులు మొదలగు వారిలో అసత్య వాది అ తేజస్కుడు యజ్వ కానివాడు వేలకొలది ధన మును ఇతరులకు దానము చేయనివాడు అశుచి అవిద్వాంసుడు ఎవడును. భోజ జనపదములందుం డెడివాడు కాడు.” ఈ ఆహుకుడు తన సోదరియగు ఆహుకిని అవంతి దేశ రాజునకు ఇచ్చి పెండ్లి చేసేను. ఆహుకునకు కాశ్యుని కూతువలన దేవకుమారులను పోలిన దేవుడు ఉగ్రసేనుడు అను కుమారులు కలిగిరి. వీరిలో దేవకునకు దేవులతో సమానులగు వీరు లగు కుమారులు దేవజాన్ ఉపదేవుడు సుదేవుడు దేవర క్షితుడు అను వారలును దేవకి శ్రుతదేవి యశోద యశోధర శ్రీ దేవి సత్యదేవి సుతాపి అను ఏడుగురు కుమార్తెలును కలిగిరి. అతడు ఈ కుమార్తెలను వసుదేవున కిచ్చి పెండ్లి చేసెను. ఉగ్రసేనునకు తొమ్మిదిమంది కుమారులు. వారు కంసుడు_న గోధుడు - సునాముడు కంకుడు - శంకుడు. సుతంతు.రాష్ట్రపాలుడు-శుద్ధముష్టి-నముష్టిదుడు. అనువారు. ఐదుగురు కుమార్తెలు: కంసుకునవతి సుతంతు-రాష్ట్రపాలి. కంకా-అనుపొరు. ఇది కుకురు వంశమునకు చెందిన ఉగ్రసేనుడును అతని సంతతీయును.
భజమానునకు విదూరథుడు. అతనికి రాజ్యాధిదేవుడు అతనికి దేవసమానులు నియమవత ప్రధానులు అగు శోణాశ్వ శ్వేతవాహనులనువారు కలిగిరి. శోణాశ్వునకు శూరులు రణ విశారదులునగు శమి.గదశర్మ నీకృతుడు శక్రజిత్ శత్రుజిత్ అను ఐదుగురు కుమారులు. శమికి కుమారుడు ప్రతిషత్తుడు -అతనికి పరీక్ష త్తుడు. అతనికి భోజుడు. అతనికి హృదికుడు కలిగిరి. హృదికునకు భీమ పరాక్రములగు పదిమంది కుమారులు కలిగిరి. వారిలో కృతవర్మ పెద్ద వాడు. శతధన్వుడు నడిమివాడు. మిగిలినవారు-దేవాల్లుడు... నాభుడు భీషణుడు-మహాబలుడు. అజాతుడు.వనజాతుడు.కనీయకుడు - కరంభకుడు అనువారు. దేనార్జునకు కంబళ బరి షుడు - అతనికి అసమంజుడు-అతనికి తమో జుడు అతనికి సుదంష్టుడు సునాభుడు కృష్ణుడు అను ముగ్గురు కుమారులును కలిగిరి. ఇది ఆంధకవంశ క్రమము. దీనిని నిత్యము కీర్తించుచుండు వాడు వంశవృద్ధి కలిగి విస్తరిల్లును.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశానువర్ణనమున సహస్రజిత్ క్రోష్టు వంశ కథనమను నలువది నాలుగవ అధ్యాయము.
Summary of chapter 44 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya narrates how Kārtavīryārjuna, despite his righteous reign, eventually succumbed to royal pride. While hunting in the forest, he visited the hermitage of Maharshi Jamadagni, who hospitably entertained the king and his entire army using the divine wish-fulfilling cow Kāmadhenu. Overcome by greed, Kārtavīryārjuna's sons forcibly seized the divine cow and calf, taking them to Māhishmatī. When Maharshi Jamadagni's youngest son, Bhagavān Parashurāma, who was an empowered incarnation of Bhagavān Vishṇu, returned and learned of this outrage, he pursued Kārtavīryārjuna, severed his thousand arms with his divine axe, and eliminated him in battle. In retaliation, Kārtavīryārjuna's sons killed Maharshi Jamadagni while he was in deep meditation, prompting Bhagavān Parashurāma to pledge the annihilation of the unrighteous Kshatriya clans twenty-one times across the earth.