మత్స్య మహా పురాణము
91 - శర్కరా పర్వత దానము - ధర్మమూర్త్యుపాఖ్యానము
ఈశ్వరుడు నార దునకు ఇట్లు చెప్పెను: ఇక మీదట శర్కరా పర్వతదాన విషయము తెలి పెదను. అది ఉత్తమము. దాని దానమున విష్ణు రవి రుద్రులు శాశ్వత తృప్తి నందుదురు. దీని కై ఎనిమిదికాని నాలుగుకొని రెండు కాని బారువల చక్కెర కావలెను. శ క్తిలేనివారు ఒక బారువతోనో అర బారువతోనైన చేయవచ్చును. మొత్తము చక్కెర తూకములో నాలుగవ వంతుతో విష్కంభ పర్వతముల చేయవలెను. ధాన్య పర్వతమునందువలెనే ఆయా పర్వతములను వాని పై దేవతలను నిలుపవలయును. అందునను మేరు పర్వతము పైని మిగిలిన వానిమీదను మందార పారిజాత కల్స వృక్షములనెడు మూడు (జాతుల కల్ప) వృక్షములను బంగారుతో చేయించి అమర్చవలేను. వాని శిరోభాగములందు హరి చందనము -మందారము (అను కల్ప వృక్ష జాతులను ఆ పర్వతముల తూర్పు పడమరలందమర్చవలేను. ఇవి (లోగడ చెప్పిన అన్ని పర్వతములందును విశ్లేషించి శర్కరాచలమునందును చేయవలెను. విష్కంభ పర్వతము లందును - మందరమున పడమటి మొగముగా మన్మథుడుండవలెను. గంధమాదనమున కుబేరుడు ఉత్తరపు మొగమై ఉండవలెను. విపుల పర్వతమున హంస ప్రతిమ తూర్పు మొగమై ఉండవలెను. సుపార్శ్వమున కామధేనువు దక్షిణపు మొగమై ఉండవలెను. ఆవాహన హోమాదిక మంతయు ధాన్య పర్వతమునందువలెనే. పైవలెనే నడిమి పర్వతమును ఆచార్యునకును విష్కంభ పర్వతములను ఋత్విక్కులకును ఈయవలెను. దానమంత్రము: శర్కరాచలము ఉత్తమమును సౌభాగ్యామృతసారమును; ఇట్టి నీవు మాకు సదా ఆనందము కలుగజేయుము. దేవతలు అమృతము తావునపుడు నేల పై చిందిపడిన అమృత బిందువులే చక్కెర అయ్యేను. దానితో ఏర్పడిన శర్కరాచలమా! నన్ను రక్షించుము. మన్మథుని ధనువునడుమనుండి ఉత్పన్న మీ శర్కరాచలము. అట్టి నీవు శర్కరాచలమా! మమ్ము సంసార సాగరమునుండి రక్షించుము.
ఈ విధానముతో శర్కరా శైలదానము చేసినవారు వెంటనే విష్ణుని కాంతివంటి కాంతి కలవారై తనఅనుజీవులతో కూడ చంద్రతారా సూర్యులవలె ప్రకాశించు విమానము నెక్కి సర్వపాప వినిర్ముకులై శివ భవనమున కేగుదురు. ఇట్లు నూరు కల్పములచట సుఖించి గల కల్పాది సృష్టియందు వరుసగా ముప్పది వేల జన్మముల వరకు ఆయురారోగ్య సంపన్నుడగు సప్త ద్వీపాధిపతిగా జన్మించుచుండును.
సములందును ఇతరులతో పోటీపడక తన శక్తి కొలది భోజన దానము చేయవలెను. అన్ని వ్రతములయందును ఆ పెద్దల యనుమతితో ఉప్పు కొర ము (పులుపు) లేని ఆహారము తినవలెను.
పిమ్మట పర్వతోపస్కరములగు సానుగులన్నియు ఆయా బ్రాహ్మణుల యిండ్లకు పంపవలయును.
పూర్వము బృహకల్పమునందు ధర్మమూ రి యను రాజుండెడి వాడు. . అతడు ఇంద్రునకు , మీతుడు; వేల కొలదిగా రాక్షసుల జంపినవాడు; సోమ సూర్యాది జ్యోతిస్సులకంటెను తేజశ్శాలి. వందలకొలది. శత్రువుల నోడించిన వాడు; ఎవరి చేతను ఓటమి నేరుగనివాడు; కామరూపము ధరించగలవాడు. అతని పట్టపురాణి భానుమతీయనునా మే తె లోక్య సుందరి; అమర సుందరులను కూడ అందమున జయించినదియును లక్ష్మీ దేవివలే రూపము కలదియుసు; ఆమె ఆ రాజునకు ప్రాణముల కంటెను మిన్న గా ప్రీతిపాత్రురాలు కూడ సు; రాజునకు గల పదివేల మంది సీజనములో ఆమె సాక్షాత్ లక్ష్మీవలే శోభించుచుం డేడిది. వారిని వారి అధీనస్థులగు వేల కోటుల రాజులును ఎప్పుడును విడిచియుండెడి వారు కారు.
ఒక నా డా రాజు తన సభలో నున్న తన పురోహితుడగు వసిష్టుని జూచి మిగుల ఆశ్చర్యము తో నిట్లు ప్రశ్నించేను : "భగవన్! ఏ (సత్) కర్మకు ఫలముగా నాకు ఇంత ఉత్తమమగు. లక్ష్మీయు నాశ రీరమున సదా ఇంత ఉత్తమమగు విపుల తేజమును సిద్ధించినది?”
వసిష్ఠుడు రాజునకిట్లు సమాధానము ఇచ్చెను: పూర్వము శివుడే తనకు పరమాశ్రయముగా భావించు లీలావతి యను వేశ్య యుండెను. ఆమె ఒక ) చతుర్దశి నాడు తన ఆచార్యునకు లవణ పర్వతమును యథావత్ గా విధానానుసారము సువర్ణ వృక్ష దేవతా ప్రతిమలతో కూడ దానమిచ్చెను. ఆ లీలావశ్యింట భృత్యుడుగా ఆశ్రితుడుగా 'సాండుడు' అను పేరుగల శూద్రుడు సువర్ణ కారుడుండెను. అతడు ( ఈవ్రతమున కై) శ్రదాయుకుడై బంగారు , చెట్లను దేవతా ప్రతిమలను చేసి ఇచ్చేను. ఇది దేవ కార్యము గదాయను మంచి తలంపుతో వాటిని మిగుల రూప సంపన్న ములుగా నిర్మించియు వేతనము ఏమియు తీసికొనలేదు. అతని భార్యయును ఆ వృక్ష ప్రతిమలకును దేవతా ప్రతిమలకును మెరుగు పెట్టెను. ఇంతేకాక ఆ శూద్ర దంపతులిద్దరును లీలావతి దానము చేయ సిద్దపరచి, లవణ పర్వత సమీపమున బ్రాహ్మణ సేవాది రూపమున ఏమాత్రమును కపటము లేని సేవ ఎంతయో చేసిరి. ఆ లీలావతి యను వేశ్యయును. చాల కాలము (అట్లు జీవి చిన్న తరువాత సర్వపాప వినిర్ముక్తురాలయి శివలోక ము చేరెను. తాను దరిద్రుడగు బంగారు పని వాడై యుండియు అతి సత్యవంతుడై { ఈ పని కై) భృతి తీసికొనని ఆతడే నీవు ధర్మమూర్తియను రాజు) గా ఇపు డున్నా వు. సప్త ద్వీపాధిపతివి-పది వేల సూర్యుల తేజస్సువంటి తేజస్సు కలవాడవు అయినావు. తన భర్త చేసిన బంగారు చెట్లకు భక్తితో మెరుగు పెట్టిన అలనాటి సువర్ణ కారు ఏ భార్య నీయీ భానుమతి; ఆ మెరుగు పెట్టిన పుణ్యముననే ఈమెకు నేడి మేర మీరిన రూపమును ఇంతులందరలో మేలిదనము కలుగుటయునై నది. ఏమియు పొగరులేక లవణాచలదాన వ్రత కాలమున బ్రాహ్మణాదుల పరిచర్యలు చేసినందున అపరాజితుడవై ఆరోగ్య లక్ష్మీ సౌభాగ్యములనందగలిగితివి.
కావున నీవు ఇపుడును విధాన పూర్వకముగా ధాన్యాచలాది దశ విధ పర్వత దానములను ఆచరించుము.
అనిన వసిష్ణుని పాదములను ధర్మమూర్తి సంపూజించి ధాన్యా చలాదీకములు అన్ని యు అట్లే దానమిచ్చెను. తత్పలముగా సుర పూజ్యమానుడగుచు శివలోక ప్రాప్తుడయ్యెను.
ఇంతేకాదు. దరిద్రులేయైనను ఈ పర్వతదాన వ్రతములు జరుగుచుండగా చూచినను వాటిని తాకినను ఈ విషయములు వినినను ఇతరులకు తెలిపినను అట్టివాడును పాపవిముక్తుడై స్వర్గము చేరును. ఈ పర్వత దానములన్నియు సంసారభయ నాశకములు; దేవ పూజ్యమానములు. దీని ప్రభావమున మానవుడు దుఃఖశాంతి నొందును. వీని నన్నిటిని భక్తితో నాచరించినవాడు ఆత్మశాంతి నందుననుటలో సంశయమేలేదు.
ఇట్లని ఈశ్వరుడు నారదునకు తెలిపెను.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున ఈశ్వర నారద సంవాదమున శర్కరా చలదాన మాహాత్మ్య కథనమను తొంబదియొకటవ అధ్యాయము.
Summary of chapter 91 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya details the procedures for Rajatāchala-Dāna, the sacred donation of a symbolic mountain made of pure silver. The practitioner fashions a silver mountain weighing from one hundred to ten thousand Palas of silver, complete with carved silver trees, streams, and shrines representing Mount Kailāsa. The devotee invokes Lord Śiva and Goddess Pārvatī at the mountain summit, performing worship with bilva leaves, white lotuses, milk, and aromatic resins. Gifting this silver mountain to a pious Brāhmaṇa cleanses all sins of greed and deceit, grants captivating personal beauty, bestows peace of mind, and grants long residence in the divine realm of Lord Śiva.