మత్స్య మహా పురాణము
157 - కుమారోత్పత్తికథనం
కాంతి ఇచ్చెను॥• దైత్యుడు (ఆడి) చేసిన మాయ తెలియనప్పుడు నేను నిన్ను శపించితిని॥ శంకరుడు రహస్య ప్రదేశమందుండగా ఆన్యశ్రీ ప్రవేశము జరిగినది నాకు తెలియలేదు॥ శాపము మరల్చుట శక్యము కాదుకాని ఒకమాట చెప్పుచున్నాను॥ వీర కా! త్వరలో నీవు సర్వసంకల్ప పూర్ణుడవు అయ్యెదవు॥ ఆనగా వీర కుడు పూర్ణమానసుడై తల్లిని శిరసా నమస్కరించి ఆపుడే ఉదయించిన పూర్ణ చంద్రుని వలె కాంతితో నున్న హిమ శైల పుత్రితో ఇట్లనెను॥
(*మత్స్యమహపురాణము - 157 అధ్యాయమున ఎనిమిదవ శ్లోకపు ఉత్తరార్ధమున గౌరీ వచనమున వీరకునుద్దేశించి- "మయాశక్తోన్యవిదితే వృత్తాంతే దైత్య నిర్మితే" అని యున్నది॥ దీని తరువాత "జ్ఞాత్వా నారీ ప్రవేశంతు శంకరే రహసిస్థితే" అని 9వ శ్లోకపు ఉత్తరార్ధము; "శంకరే రహసిస్థితేసతి తస్మిన్ ప్రదేశే నారీప్రవేశం దైత్య మాయాకృతం త్వయా అజ్ఞాత్వా-కృతం అవిజ్ఞాయా-దైత్య నిర్మితే వృత్తాంతే అవిదిచే నతి త్వం మయా(అకారణం)"శప్తోసి॥ ఇతి అన్వయః॥ ఇచ్చట ఈ రెండు శ్లోకార్ధములును ఒకే శ్లోకమనియు కావుననే ఒకే వాక్యమనియు భావించునను 'అవిదితే' అనుదానితో 'అజ్ఞత్వా' అను దానికి సంధి నంగీక్కరించనిచో అన్వయము కుదరదు॥ అనగా శ్లోక పూర్వార్థములోనికి ఉత్తరార్థద్యాంశము ప్రవేశించినది॥ ఇట్లీ శ్లోక పుర్వార్థాంతాంశము ఉత్తరార్థాదియందు ప్రవేశించుటయు ఉండవచ్చును॥ ఇవి ఆర్ష రచనలలోని కొన్ని విశేషములు, ప్రథమ ద్వితీయ పాదములకు- తృతీయ చతుర్థ పాదములకును ఈ విధమగు కలయిక 'వాసాం సిజిర్ణానీ సపల్వలోత్తీర్ణా (రఘు-2 స॥) మొదలైన వానియందు 'హర్త్యుర్యాతీ మొదలైన వానియందును మయూర శతకమందును ఎన్నియో కలవు॥)
వీరకకృత గౌరీస్తుతిః - వీరకుడు చేసిన గౌరీ స్తవము॥
నమ్రులై న సురాసురుల శిరస్సులందమరి కలిసిన మణి సమూహ కాంతితో నిమ్నో స్నతములగు గోళ్ళు గురుగా కల దేవీ! నమస్కరించిన వారి ఆర్తిని నశింపజేయు తల్లీ! శరణాగతవత్సలా! నగపుత్రీ! నీకు నమస్సు॥ 'రవి మండలములతో (వలే) మండిత (అలంకృతమయిన కంఠము కల తల్లీ! బంగారువలే మంచి వన్నె కల దేహకాంతి గలదానా! విష భుజంగ రాశితో అలంకరింపబడిన దానా! గొప్పవారికి ఆశ్రయ మగు లదానా! (నిన్నాశ్రయించిన వారే గొప్పవారు॥) నీకు నమస్కరింతును॥ నిన్నాశ్రయింతును॥ సిద్దుల నతులందుకోను నీవలే ప్రణతులగు వారికి శీఘముగ అభిమతములు ఇచ్చినవారు లోకమందిం కేవరున్నారు ? ధరణీధర పర్వత) పుత్తీ! నిన్ను వలే శంకరుడును మరి ఏ స్త్రీని కాని కోరడుకదా! నీవు విమలమగు యోగముచే మ హేశ్వరుని వలెనే దుర్జయమగు స్వదేహకాంతిని సంపా దించితివి॥ అంధక బాంధవులను చీల్చిన దానవునీవు; సురవరులును మొదట నిన్నే స్తుతింతురు॥ తెల్లని జూలు రాశి కలిగి గర్వముతో ఠీవిగానున్న దృఢమగు మేడ గల మృగరాజనేడు రథమారోహించుదానవు; నిర్మల శక్తి కలిగిన శ క్తి మొదలగు ఆయుధములు ధరించీ ఆగ్ని వలే పచ్చని జ్వలించు కాంతిగల భుజ సమూహములతో మహాసురులను పిండి చేసినదానవు: ఇందుచేతనే జగమున చండిక యని చెప్పబడిన దానవు; శుంభ నిశుంభుల చంపుదానవు నీవే; ప్రణతులగు వారి చింతితము లీడేర్చుదానవు; క్రొత్త శక్తిగల దానవుల నలుగగొట్టుటకై లోకమున శీఘముగా తీవ్రాస క్తితో ప్రవ రిల్లు దానవు; అగ్ని వలే ప్రకాశించుచు అంతరిక్షమునందును వాయు పథమునందును భూతలమునందును వ్యాపించియుండు నీదేహము ఏది కలదో॥దానితో నీవు దేవీ! అజితురాలవు (ఎవరికి జయింపనలవి కాని దానవు); భువన భావనీ! (లోక సృష్టి స్థితి కర్తా!) భవుని వల్లభా! నిన్ను నమస్కరించుచున్నాను॥ లలిత (సుందర )ములు ఆయియు చెల రేగు ఆలలుగల సముద్రములును అగ్ని జ్వాలలును వేలకొలది పడగలు గల సర్పములును॥నీ నామ స్మరణము చేయుచుండు నాకు ఈ చరాచర జగమందెల్ల అభయము కలిగించునవే ఆగును॥ భగవతీ! స్థిర భ క్తి గల జనులకు ఆశ్రయమగుదానా! నీ చరణములను నాకు ఆశ్రయముగా చేరుచున్నాను॥ నిన్ను నుతించు ఈ అల్ప పూజవలన కలుగు ఫలము పొందుట కనుకూలమయి నా ఇంద్రియములన్నియు పవిత్రములగుగాక ! పుత్తవత్సలవగు దేవీ! జగ తయాశ్రయా! నా విషయమున శాంతినొందుము; నీకు నమస్కారము॥
పార్వతీశ్వరయో స్సంబోగకాలే శుక రూపిణోగ్నేర నఃపురప్రవేశ॥
ఇట్లు వీరకుడు చేసిన స్తుతినందుకొని దేవియగు భూధర పుత్రి శుభ స్వరూపమగు భర్త గృహము ప్రవే శించేను॥ వీరకుడును ద్వారమందున్న వాడగుచు హర దర్శన కాంతులగు దేవతలను ఆదరపూర్వకముగానే వారి ఇండ్లకు పం పెను॥ దేవతలారా! ఇది సమయము కాదు; ధర్మరక్షకుడగు హరుడు॥ దేవితో కూడి రహస్య విహారమందున్నా డు; అనగానే వారు తాము వచ్చిన త్రోవను (తమ తమ స్థానములకు వెళ్ళిరి॥
ఇట్లు వేయి సంవత్సరములు గడచెను॥ దేవతల మనస్సున త్వర కలిగెను॥ శంకరుడేమి చేయుచున్నాడో తెలిసికొనిరమ్మని వారగ్నిని కోరిరి॥ హుతాశనుడు చిలుక రూపమున గవాక్ష రంధ్రము నుండి లోన ప్రవేశించి - శివుడు గిరిజతో కూడి శయనమందుండుట కాంచెను॥ దేవేశుడగు మహాదేవుడును శుక రూపుడగు అగ్ని ని చూచెను॥ కొంచెము కోపముతో అతడతనితో నిట్లనెను: శుక రూపుడవగు అగ్నీ ! దేవియందు నేను ని షేకించిన శుక్రమున ఆరము 'ఈవలనే ఉన్నది॥ ఆమె (నిన్ను ఇచట చూచి) సిగ్గుపడుటచే ప్రతి (శుక్రము గ్రహించుటను మానుకొను స్థితి) యందున్నది; కావున!పావకా! ఆ శుక్రమునందలి సగమును నీవు త్రాగుము॥ ఈ విషయమున విఘ్న మాచరించిన వాడవు నీవే కనుక నీవే ఇది త్రాగుట తగును॥ అనగా వహ్ని దోసిలియొగ్గి శివుడు ఉంచిన వీర్యమును తాను త్రోవేను॥ తరువాత అగ్ని ఆ॥ వీర్యముతో ఆయా దేవతల వేరువేరు శరీరముల (ఉదరముల) ను నిం పెను॥ మహేశ్వరుని' ఆ వీర్యము ఇముడక వారి ఉదరములను బ్రద్దలు చేసికొని వచ్చెను॥ కాచిన బంగారు వన్నె తో ప్రకాశించు ఆవీర్యము రెల్లు ఆడవీయందు వ్యా ప్రమయ్యెను॥ అది అచ్చట॥ బహుయోజన విస్తారము కలదై బాగుగ విప్పారిన నానా కమలములు కలిగి నానా పక్షి నినాద- సహితమై విమలమగు మహా సరస్సుగా అయ్యేను॥
దేవియు సువర్ణ మహా వృక్షములు మహా జలమును గల ఆ కొలని విషయము విని కుతూహలము కలిగి కనక పద్మములు కల ఆ సరస్సునకు పోయేను ॥ దానియందొమే స్నానమాడెను॥ దానియందలి పద్మములను కొప్పున ముడిచికొనెను॥ తరువాత దేవి సఖులతో కూడినదై నిర్మల పద్మములు కల (కొలనియందలి) రుచిమంతమగు నీరు త్రావదలచి ఆ కొలని యొడ్డున కూర్చుండెను॥ అంతలో రవి సమాన తేజోయతలగు షట్ (ఆరుమంది) కృత్తికా నక్షత్రాధి) దేవతలును వచ్చి ఆ కొలకునందు స్నానము చేసిరి॥ పిమ్మట *వారానీరు తామరాకునందు పట్టికోని తమ గృహమునకు పోవ బయలు దేరిరి॥ ఇదియంతయు పార్వతి చూచెను॥ ఆమె దప్పిగొని యున్నందున ఈ తామ రాకునందున్న నీరు నేను త్రోవేదను॥' [ఈ తామరాకునందలి నీరు నాకు త్రాగుటకు ఇండు॥'] అని వారితో పలికెను॥
అంతట ఆ కృత్తికలందరును పార్వతితో ఇట్లు పలికిరి: దేవీ! నీకు గర్భమయి ఎవరు కలుగునో అతడు (నీకు వలేనే) మాకును కుమారుడగు (టకు నీవు ఒప్పుకోను) చో॥మా పేరుతో సర్వలోకములందు విఖ్యాతుడయి కి రిమంతు డగుటకు నీవంగీక రించు)చో॥ శుభముల్కీ నీకు మేము ఈ నీరెత్తుము॥ అనిరి॥ అందులకు పార్వతి ఇట్లనెను: నాగాత్ర శరీరము నుండి జనించిన సర్వావయవములును కల ఆ బాలు డేట్లు మీ కుమారుడగుట సమంజసము ? ఆనేను॥ అంతట కృత్తికలును॥ ఇట్లగుచో మేము ఆ బాలునకు ఉత్తమములగు ఉత్తమాంగ(శిర)ములను (మానుండి) ఏర్పర తుము॥ (విధాస్యామః ఏర్పరచుము॥వి శేషించి పాలను మేమే త్రాగింతుము అని రెండర్థములు) అనిరి॥ వారిచే ఇట్లు చెప్పబడిన మీదట శైలజయును॥ అనిందిత (ప్రశంసనీయ) లారా! ఇట్లే అగుగాక! (కానిండు) అనెను॥ అంతట వారు హర సంపూర్ణలై పద్మ పత్రమందున్న (తమ చేతియందలి) జలమును పార్వతికిచ్చిరి॥ ఆమె క్రమమునను॥ భగవన్నిర్ణయాను సారమును ఆనీరు త్రావెను॥ ఆ సరోవర ప్రదేశమందుండి గ్రహింపబడిన ఆ నీరు త్రావిన ఆనంతర మే+ఏమాత్రమును వ్యవధానము లేక ఉత్తర క్షణముననే దేవీ దక్షిణ కుక్షిని చీల్చుకొని పైకి లేచుచు (ఊర్ధ్వముఖుడై) ఆశ్చర్యకరుడును లోక శోక వినాశకుడును రవి కిరణాకారుడును ప్రత ప్త కనక ప్రభుడు (బాగుగ కాచిన మేలు వన్నెకల బంగారు కాంతి గలవాడు)ను నిర్మలమును ఉదగ్రమును (వాడి యంచులు మొనలు గలది) అగు శ క్తి (కాసూ అను ఆయుధము) ధరించిన వాడును (కృత్తికానక్షత్ర దేవతల నుండి ఏర్పడి ఆ సంఖ్యగల) ఆరు మోములుగల వాడును దర్పించిన(కు) దైత్యులను మారణమొందించుట కే ఉదయించినవాడును (ఆగ్ని జ్వాలల వలె) కనక కాంతి కలవాడునగు బాలుడు వెలికివచ్చేను॥ (కుతులను మారణ మొందించును) ఈ హేతువుననే ఆతడు కుమారుడు (కు+మార) అని ప్రసిద్ధుడయ్యెను॥
ఇది శ్రీమత్స్యమహాపురాణమున దేవాసుర సంగ్రామమున కుమారోత్పత్తి కథనమను, ఏబది ఎనిమిదవ అధ్యాయము॥
(*మత్స్యమహపురాణము-157 అ; శ్లో 34-35 విచిత్రముగా అన్ని ప్రతులయందును సమానముగా మారియున్న పాఠము:
అగ్ని గ్రహించి దేవతలయందు ప్రవేశపెట్టిన శివ వీర్యము అచట ఇముడక వారి పొట్టలు చిల్చుకొని బయటకి వచ్చి గంగా తీరమున రెల్లుడవిలో విశాల మనృత్తిఓహర నిర్మలోదక కనక పంకజ సరస్సుగా నయ్యెను॥ అది విని కుతూహలముతో ఆటకు చెలులతో వచ్చి పార్వతి అందు స్నానమాడెను॥ దానియందలి తామర పూవులు కొప్పున ముడుచుకొనెను॥ తరువాత:
33॥ ఉపనిష్టా తత స్తన్య తీరే దేవీ నఖీయతా।
పాతుకామాతు తత్తోయం స్పార నిర్మల పంకాం॥
34॥ అవశ్యత్కృత్తికాః స్నాతాష్షడర్కద్యుతి సన్నిభం।
పద్మ పత్రేతు తద్వారి గృహత్వోప స్థితాగృహం॥
35॥ హర్షదువాచ పశ్యావః పద్మ స్థితం పయః।
తతస్తా ఊచురఖిలాః కృత్తికా హిమశైలజాం॥
'గృహీత్వా ప్రస్థితా గృహం'-'అనియు 'తర్షాదువాచ పాస్యామి పద్మపత్ర స్థితం పయః' అనియు ఉండవలెను॥
పురాణములో అసంబద్ధా-అసంభావ్యతలు ఉన్నవి॥ కావుననే వానియందంతటను అతీతయమగు అర్థమేదో యున్నదను భావనతో ఆ యర్థము గ్రహించుటకు యత్నించవలెను॥ అదియే ఉపాసనము॥)
Summary of chapter 158 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya details the commencement of direct warfare between Mahādeva and Andhakāsura, who marched toward Mount Kailāsa filled with lustful desire to capture Goddess Pārvatī. The mountain valleys shook as the armies of Pramathaganas, led by Nandi, Veerabhadra, and Gaṇesha, met the demon battalions in battle. Mahādeva mounted His divine bull Nandi, holding His trident and divine bow Pināka, radiating a fiery effulgence that terrified the demon ranks and signaled the downfall of unrighteousness.