మత్స్య మహా పురాణము
257 - క్రియాయోగవిధి-ప్రతిమాలక్షణము-విష్ణు ప్రతిమా లక్షణము.
విష్ణుప్రతిమాలక్షణమ్.
ఋషులు సూతునిట్లడిగిరి: గృహస్థులు మొదలగువారియందు సర్వదా క్రియాయోగము ఎట్లు సిద్ధించును? ఏల యన-వేయి జ్ఞానయోగములకంటెను కర్మ (క్రియా ) యోగము విశిష్టతరమయినదిక దా! కావున క్రియా యోగసిద్ధి కలుగు మార్గ మెరుగుట ఆవశ్యకము. ఆన సూతుడు వారికిట్లు చెప్పెను. దేవతల ఆర్చామూర్తులను అనుకీర్తించుట (వివరించుట) అను క్రియాయోగ ప్రకారమును మీకు ప్రవచింతును; ఏలయన దానికంటే విశిష్టతరమగు భుక్తి ముక్తిప్రద సాధనము మరియేదియు లేదు. సంసార బంధము క్తి కలిగించునది కావు నను దేవతా ప్రతిష్టలయందును దేవతాయజ్ఞో త్సవములందును ఆవశ్యకము కావునను దేవతల యర్చామూర్తుల స్వరూపవర్ణనము తెలిసికొనదగియున్నది; ఇందు మొదట ప్రశస్తమగు విష్ణు ప్రతిమా రూపమును తేలి పెదను.
అతడు శంఖచక్రధరుడు శాంతుడు పద్మహస్తుడు గదాధరుడు ఛత్తాకార శిర స్కుడు శంఖమువంటి మెడయు శుభనేత్రములును కలవాడు. అతని ముక్కు ఎత్తయి చెవులు ముత్తైపుచిప్పలవలెను భుజక్రమములు గొప్పవై ప్రశాంత ములుగను నుండును; గృహముల యందు పూజకై శాస్త్రజ్ఞుడగు పురోహితుడిది ఆష్ట భుజమూర్తిగనో చతుర్భుజ మూర్తిగనో ద్విభుజమూ ర్తిగన్ చేయించవచ్చును; అష్ట భుజమూర్తికి కుడి చేతులందు ఖడ్గ గదాశర పద్మములును వామహస్తముల యందు ధనుః భేటక శంఖచక్రములు నుండును; చతుర్బుజునకు కుడి చేతులందు గదా పద్మములును ఎడమ చేతులందు శంఖచక్రములు నుండును. (ఇచట ఆయా యాయుధములు ఏ క్రమమందుండవలయునో చెప్పబడలేదను అంశము గమనించవలయును.) కృష్ణ ప్రతిమకు గద ఎడమ క్రింది చేతియందుండుట ప్రశస్తము; శంఖ చక్రములను తమ ఇచ్చానుసారము ఎడమ చేతియందో కుడి చేతియందో పైచేతులయందు నిలుపవలయును; అనగా కుడి క్రింది చేతియందు పద్మముండును; దేవుని పాదద్వయ మధ్యమున క్రింది భాగమున భూదేవియు కుడివైపున నమస్కరించుచున్న గరు త్మంతుడును ఎడమవై పున పద్మహస్తయు శుభముఖియునగు లక్ష్మియు నుండవలయును; గరుత్మంతుని విష్ణునకు ముందు ఉంచుటయు శ్రేయస్కరమే; పద్మము ధరించిన శ్రీదేవీ పుష్టి దేవులు కుడి ఎడమలందుండవలయును; దేవునకు పైభాగమున తోరణముండును; దాని పై విద్యాధరులు దేవదుందుభులు గంధర్వ దంపతులు పత్రములు వల్లులు సింహములు వ్యాఘములు కల్పలతలు స్తుతించు అమరేశ్వరులు నుందురు; విష్ణు రూపము ఇది.
మూర్తి పరిమాణములో మూడవవంతు పీఠ పరిమాణముండును.
దేవదానవ కిన్నర ప్రతిమలు తొమ్మిది తాళముల ప్రమాణముతో నుండును. (తాలము = చాచిన బొటనవేలి కొననుండి చాచిన నడి మీ వేలి కొనవరకుగల దూరము.)
ఇక మీదట ఈ కొలతల తెలివిడి కై నూక్ష్మభేదములతో కూడ మానోన్మానమును తెలి పెదను; (ఉన్మానమనగా తూకపు పరిమాణమని యర్థము; కాని ఇచట దైర్యాది మానములను కొలుచు విధానమని యర్థము): గవాక్షరంధ్రముల నుండి లోనికి రవికిరణములు ప్రవేశించుచుండగా వానియందుండి గాలిలో ఎగురుచున్నట్లు కానవచ్చు స్పష్టర జఃకణముల లోని సూక్ష్మతమకణమును తన రేణు వందురు; అట్టివి ఎనిమిదియైన ఒక వాలాగ్రము; అవి ఎనిమిది ఒక లిక్షయగును; ఆవి ఎనిమిది ఒక యూక; ఆవి ఎనిమిది ఒక యవ; అవి ఎనిమిది (ఒక దాని ప్రక్కనొకటి ఆడ్డముగా పెట్టినయవ లేని మిదిటితో వ్యా ప్తమగు దూరము) ఒక అంగుళ ము; మానవుని బొటన వేలి కణుపుదగ్గర అరచేతివై పునగల దూర మును ఒక యంగుళముగా గ్రహింతురు; శిల్పిదియో యజమానునిడియో కుడిచేతి బొటన వేలికణుపునొద్దగల ఈ దూరము ప్రమాణముగా తీసికొనగా ఆట్టి యంగుళములు పండ్రెండు ప్రతిమాముఖపు నిలువు ఉండవలయును; ముఖమానమును బట్టి మిగిలిన అవయవముల కొలతలుండును; (అనగా ఇందీయబోవు ఆయా అవయవముల కొలతలన్నీ యు ఈ పండెం డంగుళములముఖమానమునుబట్టి యుండును; ఇది మారినచో ఆదియే యనుపోతములో మిగిలిన అవయవముల కొలతలును మారును.)
బంగారము - వెండి - రాగి - రత్నములు - శిల - దారువు - మిశ్ర (పంచ) లోహములు . ఇత్తడి . రాగి కంచు మి, శము - చందనమువంటి శుభదారువులు - ఇట్టివానితో దేవతార్చి మూర్తులు చేయుట ప్రశ స్తము; ఇండ్లయందు ఆర్చించు ప్రతిమలు కుడిచేతిబొటనవేలి కణుపంత మొదలుకొని జేనేడు (పండేండు భార తీయాంగుళముల)వరకుగల నిలువు పెత్తుతో ఉండవలెను. దేవాలయములందలి దేవతా మూర్తులు పదునారు జేనలవరకు నిలువుటెత్తుతో ఉండవచ్చును; అంతకంటే ఎక్కువ ఎత్తుగానుండుట తగదు; విత్తశ క్తిననుసరించి ఈ పరిమితులనడుమ ఉ త్తమాధ మక నష్టమానములలో దేనితోనైన విగ్రహనిర్మాణము చేయవలయును; ఇందను సరించవలసిన పద్దతి ఏమనీన - దేవాలయద్వారపు ఎత్తును ఎనిమిదిగా విభ జించి వానినుండి ఒక భాగమును వదలి మిగిలిన ఏడు భాగముల పరిమాణముతో దేవతా మూర్తిని చేయించవలయును; మొ త్తము పరిమాణమును మరల మూడు భాగములు చేసి అందు త్రిభాగము(1/3)తో పీఠమును అంత ఎక్కువ ఎత్తును అంత తక్కువయును కాకుండ నిర్మించవలయును.
నిలువబడినట్లు ఉండు విగ్రహపు కొలతలు-నిలువు కొలతలు
ప్రతిమకు ముఖమెంత నిలువుటెత్తుండునో అంత పరిమాణములు తొమ్మిదిటిని మనస్సులో కల్పించి ఉంచుకోన వలయును; (లోగడ ముఖపు నిలువు టెత్తు పండ్రెండు అంగుళములు అని చెప్పబడినది కావున అట్టి తొమ్మిది భాగములు 9X12=108 భారతీయాంగుళములు దృష్టియందుంచుకొనవలయును.)
ఇక మూర్తి ప్రథాన ఉమల కొలతలపాళ్లు (Ratio); 1. (ముఖపు నిలువు దెత్తు 12 అంగుళములయి నపుడు) 2. మెడ 4అంగుళములు; 1 భాగమ్లు =12 అం. హృదయము; దానికి దిగువను నాభివరకు 1భాగము = 12ఆం.; డ్డులోత్తు1 ఆరకము; నానికి దిగ్గువ అంచునుండి మేడ్రము (మర్మాంగము) దిగువకొనవరకు 1భాగము = 12 అంగుళములు; 6. తొడలు 2భాగములు =2x12 = 24 అంగుళములు; 7. మోకాళ్లు (మోకాటి చిప్పలు) 4 ఆంగుళములు; 8.*జంఘలు 2 భాగములు=2x12=24 అంగుళములు; 2. పాదముల నిలువు కొలత 4 అంగుళములు; 10 శిరస్సు. 14 అంగుళములు; ముఖపు కొలత శిరపు కొలతలో చేరిపోయినది; ఇట్లు మొత్తము 108 అంగుళము లగును; 9x12 -108; నవభాగ ప్రకల్పన సరిపోయినది; ఇట్లు ఈ 108 అంగుళములకు పీఠ పుఎత్తు 54 ఆంగుళములు చేర్చగా 162 అంగుళములు; ఇది దేవాలయద్వారపు ఔత్తులో 7/8 అగుచో ద్వారపుటెత్తు-162X8=184 అంగుళ ములు;) ఇదీ విగ్రహపు నిలువు కొలతల విషయము; ఇక ఆయా అవయవముల వెడల్పును వాని చుట్టు కొలతలును వానీ చే ఏర్పడు వైశాల్యమును తెలి పెదను; వినుడు.
(* ఈ ప్రతీమాలక్షణాధ్యాయమునందు “జంఘే ద్విభాగే విఖ్యాతే- పాదౌ చ చతురంగుశౌ” కాగానే “ఊర్ధ్వమాన మిదం ప్రోక్తం-వృథుత్వంచ నిబోధత! సర్వావయవమానేషు విస్తారం శణుత ద్విజాః” అని ఉండవలెను. దాని తరువాత “చతు ర్దంగుల సద్వ న్మౌళి రస్య ప్రకీర్తితా చతురంగుళంలలాటం స్యాత్.” ఇత్యాదిగ నుండవలెను. కాని విస్తారమానములో నుండవలసిన ఈ మౌళిమానపు వాక్యములు ముదితపుస్తకములలో ఊర్వమానములో చేరిపోయినవి. శ్రీ వాజపేయం రంగాచార్ గారు దీనినిట్లే గ్రహించి తాత్పర్యము వ్రాసిరి. ఇది కాక వీరు ఈ ఊర్ధ్వమాన విషయములో “నవతాళ మిదం ప్రోక్తమ్” అను దాని ననుసరించి రావలసిన నవ తాళము = 9x12 = 108 అంగుళములు అనునది సరి పెట్టుకొనుటకై యత్నము చేయక యే తాత్పర్యము వ్రాసినారు.)
(*షట్త్రింశదంగుళం చాస్య.)
ఆయా అవయవముల వెడల్పులు-చుట్టుకొలతలు.
మౌళి (శిరము) (రెండు మూపుల నడుమనుండి తల పై వరకు) 14 అం. లలాటపు నిలువుటెత్తు నాల్గంగుళ ములు; ముక్కు నిలువు యెత్తు నాలుగంగుళములు; హనువు ఒక్కొక్కటియు పెదవులును రెండేసి అంగుళముల వెడల్పు ఆడ్డపు కొలత): లలాటపు ఆడ్డపు కొలతలు ఎనిమిదంగుళములు; కనుబొమలు రెండును కలిసి ఎనిమిది అంగుళములు; కనుబొమ రేఖ నడుమ ధనువువలే వంగియుండుచోట దాని వంపుయెత్తు ఆరొంగుళము; కనుబొమ పార్శ్వమునందు కోన ఉన్న తమ సునుపుగను పొడిగను నుండవలయును: ఇట్టి నిర్మాణము ప్రశస్తము: కన్నులు రెండును వేరువేరుగ రెండేసి అంగుళముల అడ్డు పొడవును ఆంగుళము వేడలుపును (ఎత్తును) ఉండవలయును. కనుగుడ్లు నడుమ ఊబ్బుగను కను గోనలు (కుడి కంటి కుడి కొనయు ఎడమకంటి ఎడమకొనయు) ఎరుపుగను ఉండవలయును; ఇట్టివి శుభలక్షణ నేత్రములు; మొత్తము కంటి పొడవులో ఐదవ (1/5) వంతు కొలతతో కంటి గ్రుడ్డులోని అర్ధభాగము ఉండవలయును: (కనుగుడ్డు : కంటి మొ త్తము పొడవు 2:8); రెండు కనుబొమల నడిమి కొలత రెండు అంగుళములు; నాసా మూలము (ముక్కు మొదలు. ముక్కు కనుబొమలతో కలియు చోటు) ఒక ఆంగుళము; నాసాగ్రము కూడ ఇంతే ఒకంగుళము) వెడల్పుండవలయును; రెండు ముకు పుటములును కుడి ఎడమలకు వంగి ఉండవలయును; నాసాపుట బిలము ఆర్గాంగు శము; కర్లమూలమునుండి వెలికి వచ్చునంతవరకు క పోలములు రెండంగుళములు; హనువు (దౌడ) కొన ఒక అంగుళము; హనువు వెడల్పు రెండంగుళములు; కనుబొమల వెంట్రుకల వరున మందము ప్రణాళీ (నీరు పారు గొట్టముతో) సదృశమై నమమయి అర్ధాంగుళము వెడల్పుతో నుండవలయును; పై పెదవి వేడలుపుకూడ ఆర్ధాంగుళము: ముకుడిప్పల బ్రద్ద ఒక్కొక్కటియు ఆనుపగింజల పప్పు బద్దవలే ఉండవలయును: నేలవులు జ్యోతిస్సుల దీపజ్వాల) వలే నుండవలెను; అవి కర్ల మూలమునుండి ఆరంగుళముల దూరమందు ఉండవలెను; కనుబొమల పై అంచునకు తిన్న గా చెవుల పై అంచులు ఉండవలెను; వాటి నిలువు బెత్తు నాలుగంగుళములు; చెవుల అడ్డపు నిడివి రెండంగుళములకు కొంచెము చిల్లర ఎక్కువగ ఉండవలెను; మాత్రా - ఒక ప్రధాన పరిమాణమందలి ఆల్ఫాంశము. దీనిని వాడుకలో పైచిల్లర అందురు;) చేవుల పై అంచునుండి మస్తకపు తల) పైకొనవరకు (నిట్టనిలువుగా లంబ రేఖలో కొలిచినపుడు) ఎత్తుసరి పండ్రెండంగుళములు; లలాటపు (కుడి ఎడమలలో) ఏ అంచునుండియైనను తల వెనుక వైపు నడిమి ప్రదేశమునకు పదునెనిమిదంగుళములు; అనగా లలాటమునకు తిన్న గానుండు తల చుట్టుకొలత ముప్పదీయారంగుళములు; కేశ నిచయము (రాశి) ఉండు శిరో భాగము (లలాటపు పై అంచునుండి తల వెనుక వైపున వెంట్రుకలు ఉండు భాగపు చివరవరకు) నలువది రెండంగుళములు: తల వెనుక వైపునకు నడిమి భాగములో వెంట్రుకలు మొలచుట ఆగిపోవు చోటినుండి దౌడల ఆరంభము వరకు ఉండు దూరము పదునారంగుళములు.
మెడ నిలువుటెత్తులోని నడిమి భాగమున దాని చుట్టుకొలత ఇరువది నాలుగంగుళములు; మెడ ముందువై పు వెడల్పు ఎనిమిదంగుళములు; స్తనముల నడిమి బిందువునుండి మేడ క్రింది నడిమి బిందువు వరకు ఒక తాళ ప్రమా ణము; రెండు స్తనముల నడిమీ బిందువుల నడిమి దూరము పం డేండంగుళములు; ఒక్కొక్క స్తనపు చుట్టుకొలత రెండంగుళములు; ఈ స్తనమండల (వృత్తమునకు నడుమ చూచుకములు (స్తనాగ్రములు చను మొనలు. ఉబ్బెత్తు భాగములు. యవ పరిమాణము-) 1/8 భారతీయాంగుళము; వక్షఃస్థలపు వెడలుపు రెండు తాళములు; బాహ మూలపు క్రింది అంచునుండి స్తనపు నడుమ వరకుగల నడిమీ దూరము {క క్ష..చంక) ఆరంగుళములు! పాదముల నిడివి పదునాలు గంగుళములు: బొటన వేళ్ళ నిడివి మూడంగుళములు; పాదాంగుష్ఠము ఉన్నత భాగమున ఐదంగుళముల నిలువు చుట్టు కొలతతో నుండవలయును; పాదపు రెండవ వ్రేలుకూడ బొటనవేలి యంత పొడవే; పొదపు నడిమి వేలి పొడవు దీని కంటే షోడశాంశము (1/16) తగ్గును; పాదపు అనామిక పాదపు నడిమి వేలి పొడవు (1/8) అష్టాంశమును పొదపు చిటి కెన వ్రేలి పొడవు ఆనామిక పొడవులో అష్టాంశమును తగ్గును; కాలి బొటనవేలికి తప్ప మిగిలిన వేళ్ళకు అన్నిటికిని మూడేసి కణుపులు ఉండవలయును; చీలమండ నిడివి (వ్యాసము) రెండంగుళములు; మడమ ఎత్తు రెండంగుళముల కంటే కలా మాత్రము (1/16) ఎక్కువ; పాదపు బొటనవ్రేలికి కణుపులు రెండే; దాని అడ్డు (పై) చుట్టుకొలత మూడంగు శములు; పాదపు రెండవ వ్రేలి నిలువు చుట్టుకొలత మూడు అంగుళములు; ఇవి క్రమముగ కనిష్ఠిక వరకు ఒక దానికంటే ఒకటి అష్టమాంశము (1/8) తగ్గును; పాదాంగుష్ఠమును ముందునుండి చూచినప్పుడు దాని నిలువు పెత్తు ఒక అంగుళము; మిగిలిన నాలుగు వేళ్ళకును ఈ ముందు ఎత్తు అర్ధాంగుళము; పిక్కల పైభాగపు చుట్టుకొలత పదునాలుగంగుళములు; పిక్కల నడుమ (ఎక్కువ లావుగ ఉండుచోట) చుట్టుకొలత పదునెనిమిది అంగుళములు.
మోకాళ్ళకు నిర్దేశించిన మొత్తము పొడవులో నడిమి భాగమున ఒక్కొక్క మోకాలి చుట్టుకొలత ఇరువది. యొక 5 అంగుళములు; మోకాటి చిప్ప ఎత్తునరి ఒక అంగుళము; అచట దాని (ఒక్కొక్క మోకాటి చిప్ప) చుట్టుకొలత మూడు అంగుళములు; తొడల మొత్తము దైర్యములో నడిమి భాగమున పొనిలో ఒక్కొక్క దాని చుట్టుకొలత ఇరువది ఎనిమిదంగుళములు; తొడ ఒక్కొక్కటియు పై భాగమున ముప్పదియొక్క అంగుళముల చుట్టుకొలతతో నుండును; వృషణముల రెంటి ప్రమాణము మూడంగుళములు; మేడ్రము (రహస్యాంగము) రెండంగుళములు: దాని నిలువు చుట్టు కొలత ఆరంగుళములు; మణి బంధమునకు దిగువలో కేశ రేఖలను చూపవలయును; మణిబంధపు (సగపు?) చుట్టుకొలత నాలుగంగుళములు; కటి ప్రదేశపు (ముందు భాగపు) విస్తారము (వెడలుపు) పదునెనిమిదంగుళములు; స్త్రీల కటి విస్తారము ఇరువది రెండంగుళములు; స్త్రీలకు) స్తనముల చుట్టుకొలత పండ్రెండంగుళములు; (శ్రీలకే) నాభికి తిన్న గా నుండు నడుము చుట్టుకొలత నలువది రెండంగుళములు: పురుషునకయినచో కటి ప్రదేశపు చుట్టుకొలత ఏబదియెదంగుళములు; కక్ష (చంక)లకు పైథాగమందు స్కన భుజమూలములు ఆరంగుళములు; మెడ వెడలుపు (వీపు వైపునకు ఉండు భాగ మును వదలగా) ఎనిమిదంగుళములు: గ్రీవ (మెడ చుట్టుకొలత పండ్రెండు కలలు తాళ ప్రమాణమును పదునారు 12 శ్రీ భాగములు చేసి వానిలోనుండి పండ్రెండు భాగములు గ్రహించవలెనని యర్థము; అనగా (12/16 =3/4 తాళము) భుజ ముల పొడవు నలువది రెండంగుళములు; భుజ శిఖర మొక్కొక్కటి పదునారంగుళ ములు; బాహంపర్యంతము గల పై నిడివి పదునెనిమిదంగుళములు; (మోచేతి సంధినుండి పైభాగము); రెండవ పర్వభాగము (మోచేతినుండి దిగువ భాగము) ఒక ఆంగుళము తక్కువ పదునేడంగుళములు); బాహువులలో ఒక్కొక్కటియు దాని నడిమి భాగమున గల చుట్టుకొలత పదునెనిమిదంగుళములు; మోచేతికి సరిగా దిగువ భాగపు చుట్టుకొలత పదునారంగుళములు; ఆగ్రకరపు ముంజేతి) చుట్టు కొలత ఆరు కలలు (6/16 = 3/8 తాళము).
ఆర చేతి పొడవు ఏడంగుళములు; చేతి నడిమి వేలు ఐదందుళ ములు; అనామిక పొడవు, దానిలో (1/7) ఏడవ వంతు తగ్గును; కనిష్ఠిక పొడవు దానిలో ఏడవవంతు తగ్గును; నడిమి వేలి పొడవులో ఐదవవంతు తగ్గి తర్జని పొడ వుండును; తర్జనీ మూలమునుండి దిగువ భాగమునకు వచ్చిన అంగుష్ట (భాగ)ము దానితో (ఊర్ధ్వ భాగమున ఉండిపోయిన ఆంగుష్టాంశముతో) సమముగా నుండును; అంగుష్ఠపు రెండు కణుపుల వె త్తము పరిమాణము నాలుగంగుళములు; మిగిలిన వేళ్ళ కణుపులు ఒక్కొక్కటియు బొటనవేలి ఒక్కొక్క కణుపుకంటే కొంచెము తగ్గుచుపోవును. మధ్యమా వర్వపు (కణుపు) కొలత రెండంగుళములు; మిగిలిన వేళ్ళ కణుపుల పొడవులు ఒక దానికంటే మరియొక దాని కణుపు యవయవ పరిమాణము తగ్గుచుపోవును; అంగుష్ట పర్వ మధ్యము మాత్రము తర్జనితో సమానముగా నుండును; అంగుష్టపు మొదటి పర్వము (కణుపు) మాత్రము తర్జనీ పర్వ పరిమాణముకంటే రెండుయవలు ఎక్కువ; ప్రతియొక వ్రేలియందును ఆ వేలి చివరి సగములో ఆ వేలి గోరుండును; ఆవి నునుపుగా సొగసుగా చివరలో కొంచెము ఎరుపుగా నుండునట్లు చేయ వలయును; ఆందును పై భాగము కొంచెము పల్లముగా నుండును: ప్రక్కల కంటే నడుమ భాగము కొంచెమేత్తుగ నుండ వలయును; కేశవల్లిక భుజమూలములకు పైగా పది యంగుళములవరకు వ్యాపించియుండవలయును.
స్త్రీల మూర్తులు- స్తనములు తొడలు కటి ప్రదేశము - ఈ భాగములందు ఎత్తుగా నుండునట్లు నిర్మించవలయును; స్త్రీల శరీర ములు అంత స్థూలము కాకుండ ఉండవలయును: వారి ఉదరము పదునాలుగంగుళముల పొడవున ఉండును; వారు సోనాభరణ సంపన్నలై నున్న ని ఇం పైన ముఖములతో నుండవలయును; వారి మొగము కొంచెము పొడవుగా నుండవలయును; ఆలకావళి (ముంగురుల వరుస చాల ఉత్తమముగా ఉండవలయును: నాసిక-గ్రీవ లలాటము. ఇవి మూడున్న రేసి అంగుళములుండవలయును; క్రింది పెదవి చిగురాకువలేను ఒకటిన్నర అంగుళము వెడల్పుతోను (స్త్రీలకు ఉండుట మంచిది; వారి కన్నులును పురుషులనేత్ర దైర్యముకంటే అందులో నాల్గవపాలు ఎక్కువగ ఉండవలయును; వారికి) గ్రీవయును పురుషుల గ్రీవకంటే ఇంచుమించుగ ఆర్ధాంగుళమధికముగ నుండుట ప్రశ స్తము.
(ఈ చేప్పినదంతయు దేవతా ప్రతిమలయందును ఆందును స్త్రీమూర్తులయందును ఉండవలసిన ఆయా అవ యవముల లక్షణములును పరిమాణములును: ఇవి నవరాళ లక్షణము (అనగా పీఠ భాగము కాక కేవలమూర్తి భాగము తొమ్మిది తాళములుండునట్లు చేయునపుడు ఉండవలసిన కొలతలు! మూర్తి మొ త్తపు పరిమాణమునుబట్టి ఆదే అను పాతములో ఆయా అవయవముల కొలతల మార్పులను ఎరుగవలయును.)
ఇది శ్రీమత్స్యమహాపురాణమున ప్రతిమా లక్షణ- విష్ణు ప్రతిమలక్షణ-కథనమను రెండు వందల ఏబది ఏడవ అధ్యాయము.
Summary of chapter 257 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya details the elaborate Vedic consecration rites and housewarming ceremonies known as Gṛha-pravesha performed prior to occupying a newly completed home. Bhagavān Matsya instructs the householder to choose an auspicious astrological day, decorate the entrance with floral garlands, mango leaves, and auspicious pots filled with sanctified water. The officiating priests perform fire oblations to Vāstu Purusha, the Lokapālas, and Navagrahas, sprinkling holy water throughout all rooms while chanting protective Vedic hymns. The ceremony concludes with feeding Brāhmaṇas, honoring artisans and laborers, and distributing charity, filling the house with auspicious vibrations and permanent prosperity.