మత్స్య మహా పురాణము
43 - యదువంశాను వర్ణనము
సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: ఇట్లు శౌనకుడు చెప్పిన యయాతి చరితమును విని శతానీకుడు ఆధి కానందముతోపాటు ఆశ్చర్యమును పొంది పూర్ణచంద్రుడువలె ప్రకాశించేను. మరియు అనంతరము శౌనకుని శాస్త్రవిధానాను సారము గోవులతో సువర్ణములతో రత్నములతో వివిధ వస్త్రములతో పూజిం(ఆదరించెను. రాజు తనకు పంపిన ధన మంతయు స్వీకరించి శౌనకుడు దానిని బ్రాహ్మణులకిచ్చి అంతర్థానమునందెను.
అనగా విని ఋషులు సూతునితో ఇట్లనిరి: “అయ్యా ! యయాతి వంశము యదువు మొదలగు ఆతని పుత్రులతో లోకమున ఎట్లు ప్రతిష్టితమయ్యెనో తెలుపవేడుచున్నాము.”
సూతుడిట్లనెను: ఉత్తమ తేజశ్శాలియు యయాతికి జ్యేష్ఠపుత్రుడునునగు యదుని వంశమును ఆను పూర్వితో విస్తరముగా చెప్పెదను. వినుడు. యదువునకు దేవ కుమారులను పోలిన ఐదుగురు కుమారులు కలిగిరి. వారు మహా ధనుషులు; మహారథులు. వారి పేరులు: సహస్రజిత్-క్రోష్టుడు నీలుడు -బకుడు-లఘువు-అనునవి. సహస్రజితుని కుమారుడు శతజిత్. అతనికి హైహయ హయ-వేణుహయులు ముగ్గురు కుమారులు. వీరిలో హైహయునికి ధర్మనే తుడు-అతనికి కుంతి. అతనికి సంహతుడు. అతనికి మహిముడు - అతనికి భద్ర శేణ్యుడు . కుమారులు. ఈ భద్ర శేణ్యుడు పూర్వమే వారాణసియందు రాజుగా ప్రసిద్దుడై యుండెను. భద్ర! శ్రేణ్యుని కుమారుడు దుర్గముడు. అతని కుమారుడు కనకుడు. అతని కుమారులు లోకని శ్రుతులగు కృత వీర్యుడు గృతాగ్ని కృతధర్ముడు కృతౌజుడు అను నలుగురు. కృతవీర్యుని కుమారుడు అర్జునుడు. అతడు వేయి చేతులు కలవాడుగా . సప్తద్వీపములకు అధిపతియగు రాజుగానయ్యెను. ఆ రాజు పదివేల సంవత్సరములపాటు ఇతరులు ఆచరించజాలని తపస్సును ఆచరించెను. కార్తవీర్యుడు అత్రి కుమారుడగు దత్తుని ఆరాధిం చెను. అతడు అతనిని సొలుగు వరములు కోరుకొమ్మనేను. ఆ రాజస త్తముడు సహస బాహువులను తొ నధర్మము నాచరించుచున్న చో సత్పురుషులు దానినుండి తను నివారించుట.యుద్దముతో పృథివిని జయించి ధర్మముననుసరించి దానిని పాలించుట సంగ్రామమునందు తనకంటె అధికుని చేతిలో మరణము అను నాలుగు వర ములను కోరెను.
అతడు సప్తద్వీపములు పర్వతములు కలిగి సప్తసముద్రములనడుమ నున్న పృథివిని తన విక్ర మముతో జయించెను. అతడు కోరుకొనినట్లు యుద్ధములయందు రథములుగా ధ్వజములుగా భుజసహసము ఉత్పన్న మయ్యేడిదనీ పరంపర లో వినుచుందుము అతడాయా రాజుల ద్వీపములందు నిరాటంకముగా పదివేల యజ్ఞములను నిర్వర్తించెనని వినుచున్నాము. అతని సర్వ యజ్ఞములకు అవభృథములు (యజ్ఞ దీంతస్నానములు) జరిగెను. భూరిదక్షిణలతో కాంచన యూవము యజ్ఞపశువును బంధించు స్తంభము)లతో కాంచన వేదిక లతో ఆ యజ్ఞములు జరిగేను.
కార్యవీర్యార్జునునియజ్ఞములకు నారదుడను గంధర్వుడు వచ్చెడివాడు. అతడు తాను విమానములో రాగా అతని వెంట అనేక విమానములలో సర్వదేవతలు గంధర్వులు అప్సరసలును వచ్చెడివారు. ఆ విమానములలో ఆ దేవ జాతులతో ఉపశోభితుడగు నారద గంధర్వుడు కార్యవీర్యార్జునుని మహిమమును ఇట్లు కొనియాడుచు గాథను గానము చేసెడివాడు: ‘తమ యజ్ఞములచేగాని దానములచేగాని తపస్సుల చేగాని విక్రమముచేగాని శాస్త్రాధ్యయనము చేగాని క్షత్రియు లేవ్వరును కార్తవీర్యార్జునుడు పొందుగతిని పొందరు.' అని ఈ గాథకు ఆర్థము.
ఆ రాజు సప్తద్వీపములయందును రథమునా రోహించి ఖడ్గము చక్రము ధనువు ధరించి యోగి తస్కరులను కని పెట్టెడివాడు. అతడు ఎనుబదియైదు వేల సంవత్సరములపాటు సర్వరత్న సంపూర్ణుడగు చక్రవర్తిగా ఉం డేను. ఆతడే పశుపాలుడుగా క్షేత్రపాలుడుగా వర్షము కురియించుటతో పర్జన్యుడుగా యోగియై అర్జునుడుగా అయ్యెను. వింటి నారిని కఠోరముగా వ్రాయించుచు వేయి బాహువులు కలిగి శరత్కాలము నందలి వేయికిరణములతో భాస్కరుడు వెలిగి నట్లు వెలిగెడివాడు. మహా విజేతయగు ఆ అర్జునుడు మనుష్యుల నడుమనున్న నాగుడను కర్కోటక సుతుని జయించి అతని మాహిష్మతీ నగరమును తన రాజధానిగా చేసికొనెను. మహి + అహిమత్ = మహాహిష్మతీ - మాహిష్మతీ) అతడు తన యోగశ క్తిచే నోటితోనే సముద్రపు పోటులను వెనుకకునెట్టియు చెదర గొట్టియు వర్షా కాలములో సముద్ర వేగమును తగ్గించెడివాడు. అతని కనుబొమముడికి భయపడి నర్మదా నది అతని కడకురాగా దానియందు విశిష్టములగు పూలమాలలను ధరించిన తన స్త్రీలను క్రీడింపజేసెడి వాడు. తన వేయి చేతులతో సముద్రమును పట్టివేసెడివాడు. వరా కాలమున పొంగిన నర్మదకు వేగమును పొంగును తగ్గించేడీవాడు. అతడు తన భుజ సహస్రముతో సముద్రమును కలత పరచుచుండగా పాతాళమున సముద్రమునకు అడుగున ఉన్న మహాసురులు భయముతో ముడుచుకొని కదలక మెదలక యుండెడివారు. అతడు సముద్రమును తన భుజ సహస్రముతో పళ్లెరమును పట్టినట్లు పట్టుకొని అటు ఇటు ఊపుచుండెడివాడు. ఆపుడు డొనీయందలి పెద్ద అలలును వానిలోని నక్రములును మీనములును తిమింగిలములును కలవరపాటు చిందే గివి. గాలియొ త్తిడిచే నురుగు పైకి లేచెడిది. సుడులు మరింత భయంకరముగా రేగి దుఃనహములయ్యెడివి. అమృతమునుత్పత్తి చేయుటకై మందర పర్వతముతో సముద్రమును మథించుచున్నా రేమో అను భ్రాంతి భయములతో మహాసర్పములు కాలమున గాలిలేని చోట కదలక యుండు అరటి గుబురులవలే కదలక నిలిచి యుండెడివి.
బలశాలియగు అతడు లంకకుపోయి రావణుని మోహపరచి తన బలము చే ఐదు బాణములతో దానిని జయించి తన వింటినారితో బంధించి మాహిష్మతికి తెచ్చి చేర లో నుం చెను. తరువాత పులస్త్యుడు పోయి బ్రతిమాలగా నతడు రావణుని విడిచెను. అతడు తన భుజసహసముతో చేసేడి జ్యోధ్వనులు ప్రళయకాలపు వేయిమంది సూర్యుల నుండి పడెడి పిడుగుల మోతలవలె వినబడెడివి. కాని విధిశ కి ఎంత బలవత్తరమును విచితమును నే నది! ఆ బాహు సహస్రమును భార్గవుడగు పరశురాముడు బంగారు తాటితోపును నరకినట్లు నర కెనుగదా! .మహా సమర్థుడగు భార్గవుడను మహాముని క్రుద్ధుడే అర్జునుని ఇట్లు శపించెను: “ఓ హైహయా! లోక ప్రసిద్దమగు నా వనమును నీవు దహించితివి కావున నీవు చేసిన దుష్కరమగు సుకృతపు ఫలమునంతటిని మరి యొక మానవుడు హరించును. అట్లు నీ సుకృతమును పొంది కౌంతేయుడగు ఆర్జునుడు నీ పేరుగలవాడు) రాజగును. నా వంశమునందు పుట్టిన తపస్వి బ్రాహ్మణుడొకడు తన శ క్తిచే నీ బాహుసహస్ర మును ఖండించి నిన్ను వధించును.” అని శపించెను. దానికి ఫలముగా ముందుకాలమున పరశురాముడతనికి. మృత్యు వయ్యెను. ఆర్జునుడు పూర్వము దత్తాత్రేయుని వలన కోరిన వరము కూడ ఇదియే.
ఈ కార్తవీర్యార్జునునకు నూరు మంది కుమారులు.వారందరును మహారథులును అస్త్ర విశారదులును ధర్మా త్ములును మహాబలులునునై యుండిరి. శూర సేనుడు శూరుడు వృష్టి-కృష్ణుడు జయధ్వజుడు మొదలగువారు వీరిలో ముఖ్యులు. జయధ్వజుడు అవని నగరమును నిర్మించెను. అతని కుమారుడు తాలజంఘుడు. అతనికి నూరుమంది కుమారులు కలిగిరి. వారికి తాలజంఘులని వ్యవహారము. వీరిలో ఐదుగురి వంశములు ప్రసిద్ధములు: వారు-శర్యాతికోవలోని వీతిహోత్రులు.భోజులు. ఆవంతులు-తుండి కేరులు. తాలజంఘులు అనువారు. వీతిహోత్రుని కొడుకు ఆనర్హుడు. అతని కొడుకు దుర్జయుడు. అతడు శత్రు విజేతయై మహారాజై సద్భావముతో ధర్మముతో ప్రజలను పాలించెను.
యదువంశములో కృతవీర్యుని కొడుకగు అర్జునుడు ఇట్లు ప్రసిద్దుడగు రాజు. అతడు సహస్ర బాహుడు. సాగర పర్య నమగు భూమిని అతడు తన ధనువుతో జయించేను. వేకువలో మేల్కొనగానే అతని పేరు తలచిన వానికి ధన నాశము కలుగదు. పోయినదియు తిరిగి దొరకును. అతని కథను చెప్పిన వాడును యజ్ఞము లాచరించినవాడువలే పవిత్రుడై స్వర్గలోకమున పూజింపబడును.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున చంద్రవంశాను వర్ణనమున యదువంశాను కీర్తనమున కార్తవీర్యార్జున మహిమాను వర్ణనమను నలువది మూడవ అధ్యాయము .
Summary of chapter 43 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya details the glorious lineage of Yadu, the eldest son of King Yayāti. From Yadu descended the powerful Haihaya branch, within which was born the mighty universal emperor Kārtavīryārjuna. Having satisfied Maharshi Dattātreya, who was an incarnation of Bhagavān Vishṇu, through intense devotion, Kārtavīryārjuna received four divine boons of a thousand arms in battle, an unshakeable rule rooted in Dharma, the ability to perceive any injustice in his kingdom instantly, and death only at the hands of a superior warrior. With these boons, he ruled the earth for eighty-five thousand years, stopped the flow of the Narmadā river with his hands, and defeated and captured the arrogant Asura king Rāvaṇa at Māhishmatī, holding him captive until freed at the request of Sage Pulastya.