145 - తారకాసుర వధ కథారంభము - మరుత్తులు వజ్రాంగుడు మొదలగువారు జన్మించుట॥

 ఋషులు సూతుని ఇట్లడిగిరి : సూత కుమారా! తారకాసుర వధము ఎప్పుడు జరిగెను? ఈ మహావిషయమును మత్స్యరూపుడగు నారాయణుడు తెలిపిన విధమున మాకు నీవు తెలుపుము నీనోరు క్షీరసాగరము దానినుండి వెలువడు ఈకథ అమృతరూపమయినది మీరు చెప్పుచున్న కథలు ఎంత విను చున్న ను తృప్తి కలుగుటలేదు (చాలుననిపించుట లేదు) మహాబుద్ధిశాలియగు సూతమునీ! మామనోగతమగు కుతూహలము తీర్చుము

అనగా సూతుడు ఋషులతో ఇట్లు పలికెను : మనువు మత్స్యరూపుడగు నారాయణుని 'సర్వజగద్వ్యాపియు సర్వ సమర్థుడును (విభుః) అగు షణ్ముఖుడు (కుమారస్వామి) శరవణమున (జెల్లుగుబురులలో) ఎట్లు జన్మించెను?' అని అడిగెను అమితమగు ఓజస్సు (చిత్త దృఢత్వము) కల మను రాజడిగిన ప్రశ్న విని (సర్వ వేద మూర్తియగు బ్రహ్మ దేవునికి తండ్రియగు నారాయణుడు ప్రీతుడై తాను చెప్పినదాని తత్వమెరుగగల) మహామతియగు మనువుతో ఇట్లు పలికెను :

పూర్వము వజ్రాంగుడను అసురుడుండెను అతని కుమారుడు తారకుడు ఆ మహాబలుడు దేవతలను వారి పొరీ పురములనుండి వెడలగొటెను వారు భయ నిపీడితులయి బహ్మకడకు పోయిరి భీతులగు దేవతలనుచూచి బ్రహ్మ వారితో ఇట్లనెను : దేవత లారా! భయము విడువుడు శంకరునకు ఆత్మజుడును హిమవంతునకు దోహితుడును నగు శిశువు , ఆ దానవుని చంపును అనెను

తరువాత కొంతకాలమునకు శివుడు శైలజసుతను వివాహమాడెను అతడు కారణాంతరమున తన వీర్య మును అగ్ని నోటియందు వద లేను అగ్ని తన నోటపడిన ఆ రేతస్సు దేవతలకు అర్పించేను (వారది మ్రింగగా) అది వారి ఉదరము లందు జీర్ణము కాక వారి పాటలు చీల్చివచ్చి రెల్లుదుబ్బుల నడుమ పడెను, దానినుండి రవి తేజస్కు డగు గుహుడు (కుమారస్వామి) జనించెను ఏడు దినముల బాలుడుగా ఉండియే అతడు తారకాసుని చం పేను

అనగా సూతుని వచనమును విని ఋషులిట్లనిరి : ఈ కథ మిగుల ఆశ్చర్యకరమును రమ్యమును అగుటతోపాటు పాపనాశిని అని తోచుచున్నది (దీనియందు ఉపాసనాంశము కలదని సూచన) నీవు ఉన్న ది యున్నట్లు మాకు సవి స్త రముగ వినిపింపుము పూర్వమందుండిన వజ్రాంగుడను డై త్యేం దుడెవరి వంశముదుద్భవించెను ? దేవతలను నలుగ గొట్టినవాడును బలశాలియునగు తారకుడు అతని కుమారుడయ్యేననిన ఆ పజ్రాంగుడెంతటివాడో ఇట్టి పై దైత్యేశ్వరుని వధించువాడెవడయ్యెను స్కందుని జన్మమును మహనీయా! మాకు సమగ్రముగా వినిపింపుము

దిత్యా మేకోనపఞ్చాశన్మరుదుత్పత్తిః॥

అనగా విని సూతుడు ఋషులకు ఇట్లు చెప్పనారంభించెను : బ్రహ్మమానస పుత్తుడగు దముడను ప్రజాపతికి వై ర్ణియను పత్ని యందు అనువదిమంది కుమార్తెలు కలిగిరి అతడు వారిలో పదిమందిని ధర్మునకును పదు ముగ్గురను కశ్యపునకును ఇరువది ఏడు మందిని సోమునకును నలుగురను అరిష్టనేమికినీ ఇద్దరను భృగువుత్తునకును ఇద్దరను అంగి రసునకును ఇద్దరను కృశాశ్వునకును ఇచ్చెను

అదితి దితి దనువు విశ్వా అరిషాసురసా సురభి వినతా తామ్రా క్రోధవశా ఇరాకద్రూముని అను ఈ పదుముగ్గు రును కశ్యపుని పత్నులు; వీరు లోక మాతలు అని ప్రసిద్దలు గో(పశు , జాతియు స్థావర జంగమాత్మక మగు ఇతర ప్రాణి సమూహమును ఇతరములగు నానా ప్రకారములగు ప్రాణులును ఈ పదుముగ్గురనుండియే జనించేను దేవేంద్రుడు ఉపేంద్రుడు (వామన విష్ణువు) పూష ( మొదలగు ఆదిత్యులు) మొదలగు వారికి అందరకును అదితి తల్లియయ్యెను దితివలన హిరణ్యకశిపుడు మొదలగు దైత్యులు జన్మించిరి దనువు అనునా మె గర్భమున దానవులు జన్మించిరి సురభి ఆనునా మేకు గోవులు జన్మించెను వినతకు గరుడుడు మొదలగు పక్షులు కలిగేను కద్రువకు నాగులు కలిగెను మిగిలిన కశ్యప పత్నులకు మిగిలిన ప్రాణులు జనించెను

 మహాబలుడగు హిరణ్యకశిపుడు త్రైలోక్యనాథుడగు ఇంద్రుని గెలిచి ఆ రాజ్యమును తానే ఏలసాగెను తరు వాత కొంత కాలమునకు హిరణ్యకశిపుడు మొదలగువారు విష్ణుని చేతిలోను మిగిలిన దైత్యదానవులు ఇందుని చేతిలోను మరణించిరి తరువాత హతపుత్తయగు దితి తన భర్తయు దేవుడునగు కశ్యపుని మహాబలుడును శకుని చంపు వాడునునగు మరియొక కుమారుని వరముగా నిమ్మనెను సర్వసమర్థుడగు ఆ కశ్యపుడామెతో ఇట్లనెను :

కశ్యపంప్రతి దితేః పుత్రా న్తరప్రార్థనా॥

దేవి! వేయేండ్లు శుచి మనస్కవై నియమముతో నుండుము కుమారుని పొందుదువు అనగా ఆమె అట్లే చేయనారంభించెను ఆ కాలమున ఇంద్రుడు నమాహతచిత్తుడై ఆమెను సేవింపసాగేను ఆమేయు ఆ సేవ అంగీక రించెను వేయిటికి పది ఏండ్లు కొరత ఉండగా తపస్సునందున్న దితి మీగుల ప్రీతురాలయి వరమునీయదలచి ఇంద్రునితో ఇట్లు పలికెను: పాకశాసనా! నావ్రతము దాదాపు ముగిసినదని ఎరుగుము నీకు భాత కలుగును అత నితో కలిసి వత్సా : తైలోక్యమును నిష్కంటకముగా యథేచ్చగా అనుభవించుము

ఇట్లు పలికి ఇన్నాళ్ళు నియమములతో ఉండిన దితి కానున్న విషయము బలవత్తరమగుటచే (కాబోలు) నిద్రా వేశమున తన జుట్టు ముడి వీడి వెంట్రుకల పై తన కాళ్ళు పడి తగులు చున్నను ఎరుగక గాఢ నిద్రపోయెను ఈ అశుచి త్వపు అవకాశము దొరుకగనే ఇంద్రుడు వేగముగా మాయతోవ జముతో దితిగర్భమును ప్రవేశించి గర్భమును ఏడుగా చేసెను అతడు కోపముకొలది వాటిలో ఒక్కొక్క దానిని మరల ఏడేసి ముక్కలు చేసెను

అంతలో దితికి మెలకువ వచ్చి 'ఇంద్రా నా సంతానమును చంపవలదు' అనెను అది విని ఇంద్రుడు బయటకు వచ్చి ప్రాంజలి ఎదుట నిలిచి భయపడుచు తల్లితో మెల్లగా ఈ వాక్యమును పలికేను : తల్లీ! నీవు కేశము లను పొదాలతో ఆక్రమించి పగలు నిద్రించుచుంటివి (రెండు దోషములు) ఈ ఆవకాశముతో నేను నీ గర్బమును ఈ వజముతో ఏడు ఏడులు నలువది తొమ్మిది ముక్కలుగా చేసితిని వారు శుభులు దేవతా పూజితమగు ద్యులోక మున వారికి స్థానముల నిచ్చెదను ఇంద్రుడిట్లు పలుకగా దితి ఏమియు మారు పలుకలేదు ఆమే మరల దేవుడగు తన భర్తతో దుఃఖముతో ఇట్లు పలికెను ప్రజాపతీ : ఇంద్రుని జయించగలవాడు స్వర్గ వాసుల శస్త్రాస్త్రముల కవధ్యుడు బలశాలియగు కుమారు (నింకొకని) నిమ్ము అది విని అతి దుఃఖితయగు పత్ని తో అతడిట్లనేను : పుత్తవత్సలా! నీవు పదివేలయేండ్లు నిష్టాపరురాలవయినచో అట్టి పుత్రుని పొందేద పు వజ్రసారమయములగు దృడావయవములతో వజ్రాంగుడను పుత్రుడు నీకు కలుగును

వజ్రాజ్గోత్పత్తిః॥

వరము పొంది అదేవి తపమునకై వనమునకు పోయెను పదివేలయేండ్లు ఘోర తపమాచరించెను అది ముగిసిన పిమ్మట ఆ భగవతికి దుర్జయుడును ఎవరికి ఏమి చేయుటకు అలవికానివాడు వజ్రముతో ఛేదింప శక్యము కానివాడు అజేయుడునగు కుమారుడు కలిగెను అతడు పుట్టినంతనే సర్వశస్త్రాస్త్ర పారంగతుడయ్యెను వాడు భక్తితో తల్లితో తల్లీ: నీకై ఏమి చేయుదుననెను దితి హర్షముతో ఆ దై త్యాధిపతితో ఇట్లనెను : సహస్రాడు ఇంద్రుని వర్చస్సుతో నా బహుపుత్రులు హతులయిరి నీవు దానికి ప్రతీకారముగా పోయి ఇంద్రుని చంపిరమ్ము అనగా సరేయని ఆమెతో పలికి ఆ బలశాలి స్వర్గమునకు పోయేను అమోఘ శ క్తిగల పాశముతో ఇంద్రుని వ్యాధుడు కుద మృగమునువలే బంధించి తల్లి కడకు తెచ్చెను ఇంతలో ఆ తల్లి కొడుకులున్న చోటికి బ్రహ్మయు మహాతపస్వి కశ్యపుడును వచ్చిరి వారిద్దరును అతనితో నాయనో వీనితో ప్రయోజనమేమున్నది ఈ దేవేంద్రుని విడువుము లోకమున సంభావితుడగు వానికి అవమానము వధము వంటిది చెడుమాట అనిపించుకొని శత్రువునుండి విడిపించుకొనినవాడు చచ్చినవాడే; మహా యుద్ధమున శతుని చేజిక్కి వానినుండి ఆదర ముతో విడువబడినవాడు దిన దిన క్రమమున జీవన్మృతుడగుచుండును తనకంటే గొప్పవారగు శత్రువులకు వశీభూతుడైన శత్రువు విషయమున శత్రుత్వమింకేమున్నదీ ? ఆనిన బ్రహ్మకశ్యపుల మాట విని ప్రణతుడై వజ్రాంగుడు ఇట్లనెను: నాకు వీనితో పనిలేదు తల్లి ఆన నెరవేర్చితినంతే నీవు సురాసుర నాథుడవు నాకు ప్రపితామహుడవు; దేవా! నేను నీ మాట పాటింతును ఇదిగో ఇంద్రుని వదలుచున్నాను నాకు తపస్సునం దాస కీ కలదు నొకు అందు నిర్ని ఘ్నత కొవలయును భగవన్ ! ఇదియే నేను కోరు నీయనుగ్రహము అనగా బ్రహ్మ ఇట్లనెను : కూరత్వమును పొందియు నీవు నా శాసనమందు నిలిచితివి కావున నీ జన్మము ఈ చిత్తశుద్దిచే సఫల మయినది ఆని బ్రహ్మ మనోహర విశాల లోచనమగు ఒక కన్యను సృజించి ఆమే నతనికి భార్యగా ఇచ్చెను

వజ్రాగోసహితవజ్రాజ్ఞస్య తపోవనగమనమ్॥

 నానారూపేణ ఇంద్రకృతవరాజ్గీ విభీషణమ్॥

ఆమె పేరు వరాంగి అని పలికి పద్మసంభవుడా బ్రహ్మ వెడలిపోయెను వజ్రాంగుడును ఆమెతో తపమున కైవనమేగేను కమల పత్రాక్షుడగు ఆదై త్యేంద్రుడు ఎనిమిది వేలఏండ్లు శుద్ధబుద్దియే మహా తపమాచరించెను మరి ఆంత కాలము తలవంచియు మరియు అంత కాలము పంచాగ్ని మధ్యగుడయ్యు నిరాహారుడే ఘోర తప్ప చరించీ తపోరాశీయయ్యెను పిమ్మట వేయేండ్లు వాడు నీటిలోపలనుండి తపమాచరించెను అతడు నీట ప్రవేశించగనే ఆతని పత్ని యు మహావ్రతయే ఆ సర సీర మున మౌనమవలంబించి నిరాహార యు మహా తేజోవంతురాలునై ఘోర తపమాచరించెను ఆమె తపమందున్న కాలమున ఇంద్రుడు ఆమెను భయ పెట్టు పనులు చే నేను; అతడు కోతియే ఆ మహావనమందలి ఆమె ఆశ్రమమున పనిముట్లుగా ఉన్న సొర బుర్ర నీటికడవ బరిణలు