మత్స్య మహా పురాణము
21 - కౌశిక పుత్తులకు బ్రహ్మలోకప్రాప్తి
ఋషులు సూతుతో నిట్లు పలికిరి: "భూలోకమునందలి ఇందరిలో ఈ బహ్మదత్తుడు. ఒకడు అపురూపముగా - ఎట్లు ఆయా పారిణుల ధ్వనులను వాటి అర్థములను తెలిసికొనగలవాడయ్యెను? ఈ ఏడు చకవాక పక్షులలో ఈ ముగ్గురును కాక మిగిలిన నలుగురును ఎవరి వంశమునందు జన్మించిరి?”
సూతుడు ఇట్లు చెప్ప నారంభించెను: బహ్మదత్తుడు ఉండెడి ఆ పాంచాల రాజధానీపురమునందే విద్యాచండు డను వృద్ధ బ్రాహ్మణు డుం డెను. అతడు తన పేరునకు తగినట్లు సకల విద్యలయందు చాల సమర్థుడగు విద్వాంసుడు. ఆయా విషయములను తెలిసికొనవలెనను జిజ్ఞానయు కుతూహలమును కల వాడు. చాల దరిదుడు. ఆపదలలోను కలతపడని, గుం డెనిబ్బరము కలవాడు. విద్యల తత్వమును సంపంచ తత్వమును భగవత్త్రత్వమును ఎరిగినవాడు. ఈ వే రాగ్యము గల నాలుగు చకవాక పక్షులును ఆ బ్రాహ్మణునికి కుమారులుగా జన్మించిరి. వీరు పూర్వజన్మ స్మరణము కలిగి ఉండిరి. వారికి నలుగురకును తపస్సు చేసికొనవలెనను సంకల్పము కలిగేను. మేము తపస్సాచరించి ఉత్త్రమసిద్ధిని పొందదలచి ఉన్నాము. అని వారు తమ తండితో పలికిరి. ఆ మాట విని మహా తపస్సంపన్నుడగు ఆ విద్వాంసుడు దీనపచనములతో ఇట్లు పలి కెను: “నాయనలారా! ఇది ఏమి? మీకు కలిగిన ఈ సంకల్పము ధర్మానుకూలమయినది కాదు. వృద్దుడును దరి దుడును అగు తండ్రిని వదలిపోవుటచే మీకు లభించు ధర్మము ఏమున్నది? దీనివలన ఏ మానవునకుగాని ఏ పద్ధతి లభించును?”. కుమారులు తండ్రితో ఇట్లనిరి! “నాయనా! నీకు తగిన జీవనవృత్తి ( భగవంతునిచే ఏర్పరుపబడియే యున్నది కదా! మా ఈ వృత్తాంతమును రాజునకు తెలుపుము. ఆతడు నీకు పుష్కలముగా ఇచ్చును. ఉదయకాలమున వేదాదిక మును పఠించునట్లు ఏర్పాటుచేసి రాజు నీకు వేలకొలది గామములను జీవనమునకై ఈయగలడు. మొదట కురు క్షేతము నందు సప్త బ్రాహ్మణులుగా తరువాత దశపురమునందు వ్యాధులుగా పిమ్మట కాలంజరపర్వతమున లేళ్లుగా అటుపిమ్మట మానస సరస్సునందు చకవాక పక్షులుగా జన్మించిన మేము ఈ జన్మమున ఇట్లు జన్మించి సిద్ధి పొందనున్నా ము."
ఇట్లు తండ్రితో వలికి వారు తమ సంకల్పము ననుసరించి తపస్సు ఆచరించుటకు వనమునకు పోయిరి. వృద్ధ బాహ్మణుడగు విద్యాచండుడును తన కుమారులు చెప్పినట్లు రాజు దగ్గర తన పనిని చూచుకొనుటకు రాజసభకు పోయెను.
(బహ్మదత్తుని జన్మ వృత్తాంతము) : పూర్వము విభాజవంశమున పుట్టిన ఆణుహుడు అను రాజుండెను. అతడు పాంచాల దేశ రాజు. అతడు పుత్రులను కోరి పభుడును విభుడును దేవదేవులను కూడ ఈశుడును అగు నారాయణుని తీవ వృతపరాయణుడై ఆరాధించెను. అట్లు ఆరాధించగా చాల కాలమునకు జనార్దనుడు అతని విషయమున సంతుష్టుడు ఆయ్యెను. నాయనా! రాజా! నీ హృదయమునందు ఈప్పితమయియున్న వరమును కోరుకొనుము. అని విష్ణువు పలుకగా రాజు మిగుల ఉత్త్రమమగు వరమును ఇట్లు కోరుకొనెను. “దేవేశా! నాకు మహా బలపరాకముడగు కుమారుని ఇమ్ము. అతడు సర్వశాస్త్రములు తుదముట్ట చదివి వాని తత్వ మెరిగినవాడును ధార్మికుడును యోగియు యోగి శేష్ఠుడును సర్వ పాణుల ధ్వనులను వాటి యర్థములను నెరిగినవాడునై యుండవలెను.” అని కోరగా పరమేశ్వరుడును సర్వ విశ్వరూపు డును సర్వ విశ్వములకు ఆత్మ భూతుడును అగు విష్ణువు అట్లే యగుగాక!' అని అణుహునకు వరము నిచ్చి సర్వదేవత లును చూచుచుండ అచ్చటనే అంతర్ధానము పొందెను.
తరువాత అతనికి ప్రతాపవంతుడగు బహ్మదత్తుడు కుమారుడుగా కలిగెను. అతడు సర్వపాణులయందు దయ కలవాడు. బలమునందు సర్వపాణులలో అధికుడు. అన్ని ప్రాణుల ధ్వనులను వాటి అర్థమును ఎరుగగలవాడు. సర్వపాణులకు ఆధిపతులగు వారికి అధిపతి. అంతేకాక అతడు యోగముతో సంస్కరింపబడిన ఆత్మకలవాడు. అందుచేతనే చీమలజంట రమించుచున్న చోట తానున్న ప్పుడు అవి అనురాగ వశమున చేసిన సంభాషణమును విని ఆశ్చర్యపడి నవ్వెను.
అంతట అప్పుడు అచ్చటనేయున్న అతని భార్య సన్నతి అతని నవ్వును చూచి చాల ఆశ్చర్యపడెను. కానీ మనస్సులో ఏదో సందేహము కలిగి ఆనరేశ్వరుని ఇట్లు ప్రశ్నించెను: “రాజా! మీరెందులకు నవ్వితిరి ? ఇచట అందు లకు తగిన హేతువు ఏమియు కనబడుటలేదు. ఇది నవ్వుటకు తగిన సమయమును కాదు.”
సన్నతిమాటవిని రాజు చీమలదంపతుల సంభాషణ వృత్తాంతమును తెలిపి అనురాగపూర్వకమయిన చీమల సంభాషణము విని నాకు నవ్వు వచ్చినది. ఇంతకంటే ఈ నవ్వునకు వేరుగ కారణము ఏమియు లేదు. నీవు ఇంతగా ఆశ్చర్యపడవలసిన పనిలేదు. అని సన్నతితో పలికెను.
కాని సన్నతి బ్రహ్మదత్తుని మాటను నమ్మలేదు. ఈ నవ్వు చీమల దంపతుల సంభాషణమువలన కలిగిన దను విశ్వాసము ఆమెకు కలుగలేదు. నీవు నా విషయమునందే నవ్వితివి. నా పై అనురాగము లేని నీతో నేను జీవింపను. రాజా! మానవులకు చీమల మాటలను విని అర్థము చేసికొను శ క్తి ఎట్లుండును? ఏ విధముగా ఆలోచించినను నీవు నా విషయముననే నవ్వితివి. ఇంతకంటే మరి ఏమియు కారణములేదు - అని ఆమె రాజుతో పలికెను. ఆ మాటలకు బ్రహ్మ దత్తుడు ఏమియు సమాధానము ఈయలేక పోయెను. అతడు ఈ విషయమును విష్ణుదేవుని ముందే (విష్ణుదేవునినుండియే) తెలిసికొన గోరెను. అందుల కై అతడు నిష్కల్మషమగు మనస్సుతో ఏడు దినములు నియమమును పూని హరిధ్యానము చే నెను. స్వప్నములో అతనికి విష్ణు దేవుడు సాక్షాత్కరించి ఇట్లు పలికెను: నీవు ప్రభాతకాలమున నగరమున సంచ రించుము. అప్పుడు నీకొక వృద్ధ బ్రాహ్మణుడు కనబడును. అతడు నీ వాక్యమును అంతయు తెలిసికొని తగిన సమా ధానము ఈయగలడు. ఇట్లు పలికి విష్ణువు అంతర్ధానము నందెను.
తెల్లవారిన తరువాత ఉదయమున రాజగు బహ్మదత్తుడు భార్యయగు సంనతితోను ఇద్దరు మంతులతోను కలిసి పురమునుండి వెలుపలికి పోవుచుండగా అతని ఎదుట వృద్ధ బ్రాహ్మణుడు కనబడెను. అతడును తన వైపున కే వచ్చుట ఆరాజు గమనించెను.
అంతలో బ్రాహ్మణుడు తన రాజుకడకు వచ్చి ఇట్లు పలికెను. “కురు క్షేత్రమునందు బ్రాహ్మణులుగా మొదటి జన్మమునందు పుట్టిన వారే తరువాత దశపురమున వ్యాధులుగా జన్మించిరి. వారే తరువాత కాలంజర పర్వతమున లేళ్ళుగా జన్మించిరి. పిమ్మట మానస సరస్సునందు చక్రవాక పక్షులుగా జన్మించిరి. ఆమేమే ఇపుడు ఇక్కడ యోగసిద్దిని పొందుచున్నాము.”
ఈ మాటను వినుచునే రాజు పూర్వ జన్మ స్మృతి కలిగి శోకముతో క్రింద పడెను. మంత్రులు ఇద్దరును అదే విధముగా పూర్వజన్మ స్మరణము కలిగి క్రింద పడి పోయిరి.
ఈ ఇద్దరిలో సువాలకుడు బాభ్రవ్య గోత్రమున పుట్టినవాడు. ‘పంచాలము’ అను జనపదములందు (పాంచాలము అని కాదు.) అనేక శాస్త్రములు పెరిగిన పండితుడుగా ప్రసిద్ధుడు. లోకమున కామశాస్త్రమును లోకమున ప్రవర్తింప జేసినవాడు. నిర్మలచిత్త్రము కలవాడగు కండరీకుడు అను రెండవ మంత్రి లోకమున వైద్యశాస్త్రమును ప్రవర్తింపజే నెను.
ఇట్లు ఈ యోగపారంగతు లగు ముగ్గురును అనేక విధముల విలపించిరి. తాము పూర్వ జన్మమునందు శ్రాద్ధము యొక్క మహిమయే ఇది అని గుర్తించి ఆశ్చర్యపడుచు ఆ మహిమను మాటిమాటికి అభినందించిరి.
అనంతరము వారు ఆ వృద్ధ బ్రాహ్మణునకు సమృద్ధమయి ధనవంతములగు గ్రామములను ధనమును ఇచ్చిరి. ధనము తోను సంతోషముతోను కూడిన వానినిగా చేసి వా రా బ్రాహ్మణునికి వీడ్కోలు చెప్పి పంపివేసిరి.
తరువాత రాజగు బ్రహ్మదత్తుడు సమస్త రాజ లక్షణములతో కూడిన తన కుమారుని రాజ్యమునందు అభి షేకించెను. తరువాత ఆ యోగి శ్రేష్టులగు బ్రహ్మదత్తాదులు అందరును మత్సరము మొదలగు అవగుణములు లేనివారణ తమకు గల పితృభక్తిచే గలిగిన ఈ సత్పలితమును పొంది అందరును పరస్పరము మానస సరస్సునందు కలిసికొనిరి.
అది ఎట్లు జరిగేను అనిన వృద్ధ బ్రాహ్మణుని వచనమును విని బ్రహ్మదత్తుడు క్రింద పడ గానే అది చూచి రాణియగు సన్నతి - రాజా! ఇది యంతయు ఇట్లు జరుగుటకు నేనే హేతువ నైతిని. ఏఏ కోరిక లై నను యోగసిద్ధికి ఫలముగా లభించును.అనెను. “అది నిజమే.” అని రాజనెను. ఇందు నీ దోషము లేదు సరేకదా! నీవు నాకు మేలే చేసితివని రాజా మేను మెచ్చుకొనెను. నీ అనుగ్రహము వలననే నా కీ మహాఫలము లభించే నని అతడామెతో పలికెను.
తరువాత ఆ బ్రహ్మదత్తుడును అతని మంత్రులగు కండరీక సువాలకులును మనోమయమగు యోగమును పూనిరి. బ్రహ్మరంధ్ర మార్గమున ప్రాణములను వదలి. తమ తపోబలమున వారెట్లు పరమపదమును-విష్ణుస్థానమును పొందిరి.
పితృ పితామహ ప్రపితామహాది పితృదేవతలు మానవులకు ఈ విధముగానే ఆయువును విద్యను ధనమును స్వర్గ మును మోక్షమును అన్ని సుఖములను సుతులను రాజ్యమును కూడ ఇత్తురు.
పితృ దేవతా మహిమమును బ్రహ్మదత్తుని చరిత్ర మాహాత్మ్యమును శ్రాద్ధకాలమున బ్రాహ్మణులకు వినిపించినను తాము వినినను చదివినను నూరు కోట్ల కల్పముల కాలము బ్రహ్మలోకమునందు సుఖింతురు.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున మత్స్యమను సువాదమున బ్రహ్మదత్తాదుల బ్రహ్మలోక ప్రాప్తి అను ఇరువది యొకటవ యధ్యాయము.
Summary of chapter 21 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya continues the narrative of King Brahmadatta of Pāñchāla, who possessed the divine power to understand the speech of all living creatures. One day, while walking in his royal garden, the king overheard a humorous conversation between a male ant and a female ant, causing him to smile; his queen, suspecting he was laughing at her, demanded to know the cause and insisted on sharing his secret knowledge even if it cost him his life. Perplexed, King Brahmadatta prayed to Bhagavān Vishṇu and performed a devout Śrāddha ceremony, during which he recited a divine verse composed by his former brothers who were water-fowls. This verse awakened full spiritual recollection in the king, his queen, and his ministers, leading them to renounce their earthly kingdom, bestow all wealth upon worthy Brāhmaṇas, and perform intense yoga on Mount Kāliñjara, thereby achieving final liberation in the realm of Vishṇu.